ఆనంద నందనుడు
నిరుడు ఖర ను ఆహ్వానిస్తే
ఈడ్చి ఎడా పెడా తన్ని ఒదిలాడు
కోలుకోలేని దైన్యాన్ని నింపి
అవమానాన్ని అధిక తరం చేశాడు
చీకటి కుంభ కణాలను చీల్చే ప్రయత్నం
లేశం గా మాత్రమే ఫలించింది .
ఇంకా పెద్ద తిమింగిలాలు ఉచ్చులో
పడ కుండా తప్పుకుంటున్నాయి
ఉప ఫలితాలు ఉగాదికి ముందే వచ్చి
షడ్రుచులను చూపింది
మీసం మేలేసిన వాళ్లకు మిరపదెబ్బ
గో.పీ.(గోడమీది పిల్లి )లకు చెంపదెబ్బ గా చేదు
మేమే ఇచ్చేది అన్న వారి పోగరుకు వగరు
మేమొస్తే ఇస్తామన్న వారికి కిన్చిదాశాగా పులుపు
పదేళ్ళ కష్టానికి ఊరటగా కొంత తీపి
ఒంటెత్తు పోకడకు మొట్టి కాయ లా
నషాళం అంటే ఘాటూ అంటించింది
అసలు దేశం లో ప్రభుత్వాలున్నాయా
అనే అనుమానం పెనుభూతమై కూచుంది
ప్రభుత్వాలు నడవటం లేదు కుంటుతూ దేకుతున్నాయి .
ఇది నా ప్రభుత్వం అని ఆమ్ ఆద్మీ
మీసం మెలేసి చెప్ప లేకున్నాడు
లోకూ లేదు పాలూ లేదు అంతా చీప్ లిక్కరే
ఉత్తర దేశం ఒక పెద్ద హెచ్చరికే జారీ చేసింది
మేలుకోకుంటే గర్వం ఖర్వం చేస్తాడు ఓటరు ఘనుడు
ఏదో ఒక కార్డు తో లబ్ది పొందాలంటే సాగే రోజులు పోయాయ్
నీతికి ,సచ్చీలతకు విలువ లు హెచ్చాయ్
యువ రాజు ఖంగుతిన్నాడు -యువ కిశోరం చక్రం తిప్పాడు
అయినా ఇప్పుడు వచ్చ్చేది ”ఖరుడి నందనుడు ”(గాడిద కొడుకు )
తండ్రి లక్షణాలను పుణికి పుచ్చుకోకుండా
హిరణ్యకశిపుని నందనుడైన ప్రహ్లాదునిలా
ఆనంద నందనుడై ,అమృత రస చందురుడై
అందించాలని మనసారా ఆహ్వానిస్తున్నాను .
ఉగాది శుభా కాంక్షలతో
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -23 -03 -12
శ్రీ నందన వత్సర చైత్ర శుద్ధ పాడ్యమి -శుక్ర వారం .
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com