ఉగాది సందడి
ఆదరా బాదరా గా బ్రహ్మం పరిగెత్తు కొచ్చాడు .ఒగరుస్తున్నాడు .కూర్చోరా అంటే మాట విన కుండా నుంచొనే వున్నాడు .ఏమిట్రా హడా విడి ?అని అడిగా .నీకీం నువ్వు తమాషా చూసే వాడివే కాని తల దూర్చే వాడివి కాదుగా బావా ?అని దెబ్బ కొట్టాడు .దేన్నీ గురించి వాడు బాధ పడుతున్నాడో తెలీలేదు .అసలు విషయం లోకి రాకుండా ఈ డొంక తిరుగుడు నాకు నచ్చాడు .అదే చెప్పా .అప్పుడు లైన్ లోకి వచ్చాడు .అదికాదు బావా మోనా మధ్య పంచ పతాకా అంతు యదు రాష్ట్రాల ఎన్నికలు ,నినా ఉగాది ముందు ఏడు సీట్ల ఎన్నికలు గురించి నీకేమీ పట్ట నట్టు కూచున్నావెం ?అన్నాడు .చట్టం తన పని తాను చూసుకున్నట్లే ఎలక్షన్లు సమయం ప్రకారం జరిగి పోతూంటాయి .అందులో మన ప్రమేయం ఏముంది అన్నా..ఓపిక వుంటే ఒతేస్స్తాం లేక పొతే ముడుచుకొని ఇంట్లో కూచుంటాం .దానికి ఇంత హైరానా ఎందుకన్నాను .వాడికి అరికాలు మంట నెత్తికి ఎక్కింది ..ప్రజా పక్షంఅనేది ఉందా ?అని అడిగాడు .వుంటుంది .దానికి దీనికి ఏం సంబంధం ?అన్నా .
పదేళ్ళు కష్టపడి పార్టీ నడిపి గెలిచినా ప్రతి సారీ రాజీ నామా చేస్తూ ,మళ్ళీ గెలుస్తూ వున్న వాళ్లకు చెంప దెబ్బ కొట్టారు కదా బావా ?అన్నాడు .అవున్రా .ప్రజల మనోభీష్టం తో ఆట లాడుకుంటే అంటే చేస్తారు .ఎలక్షన్లు మన ఇష్టం వచ్చినట్లు జరిపే ప్రక్రియ పోవాలనే కొంత సంకేతం ఇచ్చారు ఓటర్లు అన్నా .తెలంగాణా సెంటిమెంట్ పండింది బావా బాగా అన్నాడు .నీ తెలివి తెల్లా రినట్లే వుంది .అన్నా .సెంటి మెంట్ వుంటే ఆ పార్టీ కి కనీసం పోలయిన ఓట్లలో తొంభై శాతానికి పైగా రావాలి కదా ఎక్కడైనా వచ్చాయా ?అని అడిగా /.అదిగో అందుకే ఆకు కాల్తుంది ..గెలిచారా లేదా ?అన్నాడు .గెలిచారు లేవయ్యా మహా గొప్పగా .జనం పూర్తిగావాళ్ళను నమ్మితే మిగతా వారికి ఒత్లేందుకు వేశారు ?ఏక పక్షం గా ఫలితాలున్డాలి కదా అన్నాను .ఏమో బాబు నాకేమీ తెలీదు .అందరి ఓట్లు చీలాయి .అందుకే మెజారిటి తగ్గింది .అన్నాడు .అంటే ప్రజలు అందరి మాటకు విలువ నిస్తున్నారని భావం కాదా ?అని ప్రశ్నించాను .అవుననుకో అన్నాడు .ఆ ప్రాంతం మా జాగీరు కాలు పెడిత నరికేస్తాం అన్న డి పోయింది .కాళ్ళు VIRQAKKUNDAANE నెత్తురు కార కుండానే ప్రచారం జరిగిందని గుర్తుంచుకో .ప్రజలు చాలా విచక్షణ ప్రదర్శించారు అని అర్ధం చేసుకో అన్నాను ..నీ రీడింగ్ నీది .నేను వాదించలేను మహా ప్రభో అన్నాడు .ఉగాదికి ఈ ఫలితాలకు లంకె ఏమైనా ఉందా /అన్నాడు .పెట్టు కోవాలె కాని లంకెల కేం కొదవ న్నాను మోదం ఖేదం విషాదం ఆశ్చర్యం వినోదం విపరీతం అనేఎ కలిపి అందించారు ఎవరి కర్మను బట్టి వారికి ఇవే ఉగాది పచ్చడి లోని రుచులనుకో .ఎవ్వరు పోఫ్=దిచేసిన్దేమీ లేదని నిరూపించారు .
బావా యు.పీ.ఎన్నికల సంగ్స్తేమిటి మరీ చేదుగా వుంది ?అని అడిగాడు .అవున్న్రా చేసుకొన్నా వారికి చేసుకోన్నంతా .అధికారం అణకువ ను ఇవ్వాలి కాని గర్వాన్ని కాదు .వున్న నాలుగు రోజులు సేవ లో తరించాలి ఆని సేవించుకొనే పరిస్తితి లో వుంటే ఇలానే ఉల్టా పల్టా అవుతుంది విగ్రహాలు ఏనుగు బలంతో తొక్కేశాయి .ప్రజాబలం ముఖ్యం .విగ్రహాలు లేక పొతే గాంధీ గారికే మైనా లోపం వస్తుందా .నువ్వు చేసిన ప్రజా హితమే. రక్ష ..నీకు నువ్వు సుప్రీం అనుకొంటే పాతాలానికే నీ దారి .గుర్తుంచుకో .ఏమిటి బావోయ్ ఎవరి మీదో పెట్టి నన్ను వాయిన్చేస్తున్నావుఅన్నాడు .లోక రీతి చెప్పాను అన్నాను .సరే కాని ఎనిమిదేళ్ళు గా యువ రాజు మందీ మార్బలం తో ఇల్లుల్లు తిరిగి ప్రచారం చేస్తే కన్నెత్తి చూడను కూడా లేదేం బావా ?అని అడిగాడు .యువ రాజు అనే మాటే అక్కడ వెగటు పుట్టించింది .అందుకే ఇంట్లో మహా రాజు గా వుండు చాలు అని చెప్పి పంపారు జనం మరి సింగ్ గారి సంగతో అన్నాడు .చేసిన తప్పులు చెంపలేసుకొని ఇల్లు ముందు చక పెట్టు కొన్నాడు .అనారోగ్యం ఆయనకు వారమే అయింది .బుద్ధ్హి మంతుడైన కొడుకు చేతికి అంది వచ్చాడు .జనం యువ కిరణాలు కావాలను కొన్నారు అందుకే యువ పట్టాభిషేకం అభిలాష నీయం గా చేశారు .జనం మనసు తెలిసి వృద్ధ సింహము గుహలో కి చేరింది .క్యన్నాను .
యువ కిరాణా లంటే గుర్తుకొచ్చింది బావా >ఇక్కడా యువకిరనాలనే ధంకా బజాయిస్తున్నారుగా .మరి ఫలితం తారు మారైన్దేమిటి ?అని అడిగాడు .నాయనా .ఇక్కడ నాయకులు పైనించి పైరవీ చేసి దిగుమతి అవుతారు .మూటలను కుదువ బెట్టి అధికారం సంపాదిస్తారు .వాళ్లకు ప్రజా బలం యందు కుంటుంది ?అన్నాను .
బడ్జెట్ విషయం ఏమిటి ఆవా మరీ గందర గోళం గా వుంది ?అని ప్రశ్న .ఒకే ఒక్కడు దేశం మొత్తం మీద పూర్తి అవగాహన ఉన్న నాయకుడు అతడే ప్రణబ్ .అతన్ని మించి ఏ నాయకుడు ఎదగ లేదు ఎదగ లేదు కూడా .ఆ మహాను భావుడికి అన్నీ తెలుసు .దేశం లోని అత్యున్నత పదవి అందుకొనే అర్హత ఆయనకు మాత్రమే వుంది .కాని ఆయన్ను సమశ్యలను పరిష్కరించాతానికే తప్ప ఆయన సామర్ధ్యాన్ని ఉపయొగిన్చుఒఎక పోతున్నారు .మన జేబులో చెయ్యి గారి మాటేమిటి బావా ?అన్నాడు .పాపం ఆయన పెద్ద మనిషే .అయితె రాంగ్ టైం లో అధికారం లో వుండటం ఆయన దురదృష్టం .అవతలి వాడి తప్పులన్నితికి ప్రేక్షక పాత్ర వహిస్తున్డటం తో ఆయన అతి బలహీన వాడిగా నిరూపించుకొన్నాడు .యువ రాజు పస టెలి పోయింది .అందుకని ఆయన్ను సాగనంపే ధైర్యం ఎవరికి లేదు ..ఆయన అంత కన్నా ఏమీ చేయను లేదు .తాతల కాలమ్ లో నేతులు తాగిన సామెత ఆయనది .జాలేస్తుంది ఆయన్ను చూస్తె .
బావా ఈ సారి పంచాంగం యేమని చెబుతోంది ?మళ్ళీ ప్రశ్న .అయిదుగు స్థానాలలో శుక్రుడు వున్నాడు .పాప గ్రహాల చూపు తక్కువ .అందుకని నందన పేరు సార్ధకమాయి ఆనందాన్నిచ్చే సూచనలున్నాయి అన్నాను .సరే బావా వెళ్ళొస్తా .ఇంట్లో ఏవైనా కయ్య స్వీట్లు చేస్తే తిని వెళ్తా అన్నాడు .అంత శీను లేదు మీ అక్కయ్య గుండిగేడు ఉగాది పచ్చడి మాత్రమే చేసి ,కాలనీ వాళ్ళందరికీ శర ఫరా చేస్తోంది గుది లోకి కూడా మాకు ఎట్లాగో గుది లో ప్రసాదాలుంటాయి .కనుక ఇంట్లో స్పెశాల్సేమీ వండడు .నువ్వు వెళ్లి రావటం మంచిది అన్నాను .పాపం ఆముదం ముఖం వేసుకొని వెళ్ళాడు బామ్మర్ది బ్రహ్మం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —23 -03 -12
శ్రీ నందన నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి శుక్ర వారం -అందరికి ఉగాది శుభా కాంక్షలు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
Till the end of the page the naration and the story is funny, i got yes this is new year of ugadi