అందరి నేస్తం డికెన్స్ -5
డికెన్స్ అద్భుత కామిక్ రచయిత .ప్రపంచ జ్ఞానాన్ని పెంచుతాడు .అతి నిజాలను జర్న లిస్టు దృక్పధం లో ఆవిష్కరిస్తాడు .లండన్ మహానగర మహా రచయిత .లండన్ ను పవిత్ర నాగరక దృక్పధం గల సిటీ గా మార్చాడు .చాలా ప్రామాదకర పరిస్తితితులకుఅన్వేషణకు కామెడీని చక్కగా వాడుకొన్నాడు .
డికెన్స్ రాసిన క్రిస్మస్ కరోల్ లో చావు నుంచి పునర్జన్మ వరకు ఉన్న యాత్రను గొప్పగా ఆవిష్కరించాడు .హృదయాన్ని పట్టి లాగేసే సంజ్ఞానాత్మక నవల .నేరం వ్యాధి దుఖం సమాంతరం గా నడిపాడు .అందులో అమాయకత్వం తప్పక మేలవిస్తాడని మనకు తెలుసు .దీన్ని దాన ధర్మాల కోసం కొందరికి ,దానా పేక్ష తో కొందరికి చదివి వినిపించాడు .క్రిస్మస్ లోని మిస్టరి డికెన్స్ లోని మిస్టరి ని పోలి వుంటుంది .
”దామ్బే అండ్ సన్” నవల చిన్నతనం దాటి చాలా ప్రాముఖ్యత సంత రించుకొన్న సిఖరాయ మాన మైన నవల .తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న బాంధవ్యాన్ని గొప్పగా ఆవిష్కరించాడు .తండ్రిని పొందాలన్న ఆరాటం తో సాగే యువతి కదా ఇది .దీన్నే ‘ఫాదర్ హంగర్ ”అన్నారు .కొడుకుల కన్నా కూతుళ్ళను అభిమానించాడు డికెన్స్ .”ఎన్నిక చసి పార్లమెంట్ కు పంపబడిన బ్రిటన్ రాజ నీతిజ్నుల కంటే ,పేద ప్రజల జీవితాల ఉన్నతికి దికేంసే చాలా ఎక్కువ సేవ చేశాడని ”వెబ్స్టర్ అన్నాడు .”ఆయన స్వేచ్చ గల దికేంసీనియాన్ ,వేదాంతి కాని అతి వాది (UN PHILOSOPHICAL RADICAL )అన్నాడు బెర్నార్డ్ షా.విక్టోరియా రాణి పాలన వివాహ విజయం గా నిలిచింది .ఆమె జీవితాన్నే మార్చేసిన బంధం .వివాహం పై అనవసర కంగారు ,నెమ్మది మనస్తత్వం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది .అందులో ఇల్లు గొప్ప పాత్ర ను పోషించింది .సతీ -ఔన్నత్య సారం గా నిలిచింది .
డికెన్స్ మరో నవల డేవిడ్ కాపర్ ఫీల్డ్ .యువక పాత్ర తో తీర్చి దిద్దాడు .నైతిక సామర్ధ్యం తో ,షీలా నిర్మాణానికి వీలు కల్పించాడు .ఆ బాధ్యతా మీద పడ్డాక చురుగ్గా కదిలే యువకుడు సంక్లిష్ట సమయాల్లో అంతరంగం మాట వినే మనస్తత్వం .ఇదే ఫ్రాయిడ్ సిద్ధాంతం . ఈ నవల చదివితే ఫ్రాయిడ్ ను చదివి నట్లే అని తీర్మానించారు విశ్లేషకులు .”స్వీయ జ్ఞానానికి జ్ఞాపక శక్తి కీలకం ”అని ఫ్రాయిడ్ చెప్పింది నిజం జరిగిన సంఘటన లను విశ్లేషించుకొని న,భావ పరిపక్వత పొంద వచ్చు .అది ఒక స్వీయ చరిత్ర .జరిగిన నష్టానికి ,ఆందోళనకు స్వస్తి చెప్పే స్వీయ విశ్లేషణ వాళ్ళ విజయం సాధించ వచ్చు .కపటం లేని వాడు ,సులభం గా ఇతరుల చేత వంచింప బడే వాడు పరిస్తితుల ప్రభావం వాళ్ళ బలమైన శక్తి యుక్తులున్న యువకుడు గా మారటం ఇందులో చూస్తాం .తను చెప్పిన దంతా అత్యంత నిగ్రహం గా డికెన్స్ చెప్పాడు .శుక్ర వారం పుట్టిన వాడు దురదృష్ట వంతుడు అనే నమ్మకం ఆ రోజుల్లో బాగా వుండేది .ఇందులోని హెలెన్ ,క్లారా లు రెండు విభిన్న పాత్రలే అయినా ఒకే స్త్రీ యొక్క రెండు పార్శ్వాలుగా మనకు కనిపిస్తాయి .తల్లి పాత్ర తో కలిపి త్రయాన్గులర్ ఈడిపస్ కాంప్లెక్స్ నడిపించాడు .డేవిడ్ మనసు లోని భావాలను చెప్పే అవకాశం వాళ్ళిద్దరూ ఇవ్వనే ఇవ్వరు .ఆటను ఏ తండ్రి కొడుకూ కూడా కాదు .ఎవరికీ సోదరుడు కాదు .ఏ ఒక్కడికీ స్నేహితుడు కూడా కాదు .గారాల పట్టి గా ఉన్న వాడు తిట్లు తినే మారుతి కోడుకై ,బడి పిల్లాడి ,బాల కార్మికుడి ,అనాధ అయాడు .అతని స్తితి చివరికి ఎలా అయిందంటే ,తను ఎవరో తనకే తెలీని వింత స్తితి .స్నేహితులు దరికి రాణి జీవి .అంటా ఉత్తమ పురుష లో రాయటం తో విపరీతం గా అందర్నీ ఆ కట్టు కొన్నాడు .చివరికి ఉనికిని ,వ్యక్తిత్వాన్ని అస్తిత్వాన్ని సాధించాడు .ఇదిడికెన్స్ ఆల్టర్ ఈగో అని అంటారు .ఇందులోని పాత్రల గురించి చెబుతూ యి.ఏం.ఫార్స్తర్ అవి ఫ్లాట్ గా రౌండ్ గా రెండు రకాలుగా వున్నాయని చెప్పాడు .ఫ్లాట్ కారెక్టర్ మధ్య యుగం లోని మిసేరి ప్లే లలో నిరాశా ,నిష్ప్రుహా వుండే వారుగా వుంటారు .ఈ పాత్రలు యాంత్రికం గా బొమ్మల్లాగా కనిపించినపుదల్లా అదే భావాలను స్ప్రింగ్ కదలికల్లో బొమ్మల్లా గా ప్రవర్తిస్తారు .”డికెన్స్ మనుషులు జీవిస్తారు .దర్జీ కుట్టిన బట్టలతో,లేక దేనికో చిహ్నాలు గానో వుండరు ”అన్నాడు నేభారోవ్ అనే విమర్శకుడు .
డికెన్స్ నిఘంటువులు వచ్చాయి .ప్రతి పాత్ర ను విశ్లేషిస్తూ EVERY ONE IN DICKENS వచ్చాయి .ఆటను సృష్టించిన పాత్రలు 13 ,143
గా లెక్క వేశారు .14 నవలలు రాశాడు .కొన్ని చిన్న కధలు రాశాడు .పాత్రల పేర్లు పెట్టటం లో డికెన్స్ దిట్ట .ఆయన తర్వాతే ఇంకెవరైనా .ఆ పాత్రల స్వభావాలను బట్టి పేర్లు పెట్టాడు .ఆ పేర్లు మార్చ టానికి ఇక కుదరదు అంతే .పేరే ఆ పాత్ర అన్నట్లు తీర్చి దిద్దాడు .రచనాసృష్టి లో స్వభావానికి తగిన పాత్ర పేరు పెట్టటం డికెన్స్ కే సాధ్యమైంది .ఉదాహరణకు MAGWITCH –MAAGAS+WITCH .ఆటను ఒక మంత్ర గాడు గా కనిపిస్తాడు .కుమ్మరి కొలిమి లో సహాయకుడు గా ఉన్న వాణ్ని పక్కా జన్టిల్మాన్ గా మార్చాడు డికెన్స్ అతని స్వభావం ఏమిటో ఆ పేరే మనకు తెలియ జేస్తుంది .అంతటి లోకజ్నత తో డికెన్స్ రాశాడు కనుకే ఆ నవల అంత అద్భుతం గా జనాన్ని ఆకర్షించింది .ప్రతి యువకుడు అది తన జీవిత చరిత్రే అన్న అభిప్రాయం కలుగు తుంది .దటీస్ డికెన్స్ .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24 -03 -12 .