వేలూరి వారి రెండు కధలు
1 సిపాయి
శతావధాని వేలూరి శివ రామ శాస్త్రి గారు వెద వేదంగా శాస్త్ర పారమార్ధిక ఖగోళ ,జ్యోతిష విజ్ఞా శాస్త్రాలలో అపారమైన పాండిత్యం వున్న వారు .కధకులుగా విశ్వ సాహిత్యం లో చోటున్న వారు .వారికి తెలియని త్రేలియ రాని విషయం లేదంటే అతిశయోక్తి లేదు .తక్కువ కధలే రాసినా వన్నె వాసి వున్న కంద గల కధలు .తన కాలమ్ కంటే ముందు ఆలోచన వున్న మహా రచయిత .సంఘం లో మార్పు రావాలి ,మహిళాభ్యుదయం జర గాలి అని నిర్ణయించిన సంస్కారి .బాల్య వివాహాలు కూడదనే అభిప్రాయం ,వితంతు వుల దయనీయ జీవితం పై అవగాహన కల వారు .వారి జీవితాలలో వెలుగు రేఖలు ప్రసరించాలని మనసారా కోరుకొన్నారు .వారి కధల్లో సరదా గా రాసిన కధే ”సిపాయి ”
అప్పటికింకా safety రేజర్ రాలేదు .కధకుడికి ”తలంటి ”అంటే విరోధం .”ఉపమాలంకారం లో చెబితే విరక్తుడికి సంసార వాతు రూపకం లో చెబితే అభయాంజన యుద్ధం .అతిశయోక్తి లో చెబితే నరకం .తల మీద నూనె అన్టడం అంటే జుట్టు పీకేయతమే .వేన్నీళ్ళు పోయటం అంటే చర్మం ఒలిచేయటమే .”అని ఒక కుర్ర కారు మనోగతం .కాలేజి స్టూడెంట్ కనుక మెల్లగా గడ్డం ,మీసం మ్లుస్తున్నాయి .”బులుసు ముళ్ళు లాగా వున్నాయట”అవి .”రావి చెట్టు -పైకి యెంత ఉంటుందో లోపల అంత వుంటుంది .మీరు పర్వతం భూమిలోపల ౧౬ యోజనాలు ఉంటుందిట .కాని ఈ వెంట్రుకలు మాత్రం వాటి కంటే లోతు ”అని చమత్కరిస్తారు .వెంట్రుకలు పీక టానికి ప్రయత్నిస్తే గడ్డం వాచీ పోయింది .రేజర్ కొనాలని బయల్దేరాడు రచయిత .
ఒక షాపుకు కు వెళ్ళాడు .ఆ షాపు ”విశ్వ రూపాభ్యాం ”లాగా ఉందట .షాపులో ఆడ వాళ్ళున్నారు .ఒక అమ్మాయిని పిలిచి ”నాకో మంచి కత్తి కావాలి ”అన్నాడు .”నీవు మంగలి వా ?”అందొక వెంగలి .”ఈ తెన్గాలి ఏమిటి ,మంగాలి ఏమిటి ?”అనుకొన్నాడు లోపల .భయ పడి పారి పోబోయాడు .ఆ సేల్స్ గాళ్ ”ఓకొత్త మంగలీ ఇదిగో రేజ్క్యర్ ”అంది అతనికి ఏమి కావాలో తెలిసి .”వేల ఎంత సుమంగళీ ?”అన్నాడు ప్రాస తో విరుపు తో తానేమీ తక్కువ తిన లేదని తెలియ జెప్పటానికి .అయిదు రూపాయలు అంది .”చాలా ఎక్కువ ”అన్నాడు రచయిత .”నువ్వు కొత్త మంగలివి కా బట్టి గాటు పెట్టు కొంటె దీని ఖరీదు ఇంకా పెరుగు తుంది .నెత్తుటి బొట్టు ఒక్కొక్క టికి పావలా అవుతుంది .”అని నవ్వింది .కధకుడు ఆమె తో ”ఆరణాలు పెడితే స్వదేశీ కత్తి వస్తుంది కమ్మరి దేవతా “‘అన్నాడు మర్యాదగా .ఇంక ఆగ లేక పరిగెత్తాడు .
విదేశీ వ్యామోహం ,స్వదేశీ వస్తువుల వాడకంకోసం చెప్పిన సరదా కధ ఇది .వెంట్రుకల తో యుద్ధం చేయటం కనుక ”సిపాయి ‘అనితమాషా గా మంచి పేరే పెట్టారు శాస్త్రి గారు .హాశ్యం మ్,వ్యంగ్యం కలగలుపు గా పండించారు .విదేశీ వ్యామోహంలో దేశీయ మైన తలంటి యెంత బాధా కర్కమ్ గా కన్పించిందో కళ్ళకు కట్టించారు ఇప్పుడు త్కలన్తె లేదు .అంతా శాంపు మహాత్యమే .మంగలి మర్దనాలు లేవు .వేడి తగ్గేది తలంటితే .కుంకుడు రసం కళ్ళలోకి వెళ్ళితే తాత్కాలికం గా కళ్ళు మండినా ,కళ్ళ లోని మాలిన్యం హరించి పోతుంది .ఇక నెలకోసారి మంగలి షాపుకు జుట్టు కట్టిరించుకోతానికే వెళ్ళేది రోజూ రేజర్ మనకు శ్రీ రామ రక్ష .దిన చర్యలో నిత్య క్షుర కర్మ ఒక భాగ మైంది .అందరామ్ క్షురకులమే . .అంత మార్పు వచ్చింది .అది అవసరము ,కాలమ్ ఆదా కూడా .అందులో ఇంకో ప్రమాదం కూడా వుంది .మంగలి కత్తి తో వరసగా అందరికి గడ్డం గీకితే ఎయిడ్స్ వచ్చే ప్రమాదం కూడా వుందని అంటున్నారు .కనుక ఆ కాలానికి సంబంధించిన కధ గా దీన్ని మనం భావించాలి .అందుకే లైటర్వీన్ తో రాశారు .ఏమైనా విశ్వ కధకుల జాబితా లో చేరిన శివ రామ శాస్త్రి గారు ఇంత సరదా కధ రాయటం కూడా అబ్బురమే .శతావధాని కనుక శత కోటి ప్రక్రియలు వారికి కరతలా మల కాలే .
రెండో కధ గురించి ఇంకో సారి ముచ్చ తిన్చుకొందాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25 -03 -12 .