వేలూరి వారి కధ -గన్నేరు
శివ రామ శాస్త్రి గారి కధల్లో ”గన్నేరు ”కు ప్రత్యేకత వుంది .బాల వితంతువులకు పునర్వివాహం నిషిద్ధం గా వున్న రోజులవి .సాంప్రదాయ కుటుంబాలలో ఆంక్షలు మరీ ఎక్కువ .ఆచారాలు శృతి మించేవి .ఎమాత్రేం బెసిగినా సహించే వారు కాదు .వితంతువులకు పసుపు ,కుంకుమ త్యాజ్య వస్తువులు .పూల సంగతి మాట్లాడే పనే లేదు .అతి బాల్యం లో భర్త చని పోతే ,ఆ పిల్ల మానసిక స్థితి ఏమిటి ?ఆ లేత గులాబి అలానే మోడి జీవిన్చాలా ?ఆమె కోరికలకు అర్ధం ,విలువా ఉండవా ?వాటిని మన్నించాల్సిన తలిదండ్రుల మూర్ఖత్వం కు ఆమె బలి అవాలా ?అలాంటి అభాగ్య రాలి కధే ”గన్నేరు ”ఇక్కడ ఆ పిల్ల పేరే వుండదు .”ఆ అమ్మాయి ”అని మాత్రమే అంటారు .అవును ,ఎపరైతే నేమి అలాంటి ఏ పిల్ల జీవిత మైనా అంతే కదా ?అందుకే ఆపిల్లకు పేరు పెట్ట లేదు శాస్త్రి గారు .
ఆ ఇంటి వాతావరణం తో కధ ప్రారంభిస్తారు .”అదుగో అడుగదుగో ,ఆ ఎదుట సందు మొదట ఇటుకలు బయట పడ్డ ఆ పాథ ఇల్లున్నదే !ఆ ఇంట్లోనే ఆ అమ్మాయి వుంది .”ఈ వాక్యం లోనే ఆ అమ్మాయి కడు పేదరిక కుటుంబానికి చెందిందని ,ఇల్లు బాగు చేయించుకొనే స్తోమత కూడా తండ్రికి లేదని అర్ధమవుతుంది .తండ్రి నిష్టా పరుడు .నిత్య పూజారి .ఇంట్లో ”భోనేశ్వరం ”వుంది .శివ పూజా దురంధరుదన్న మాట .ఆది భిక్షువు వాడి నేది అడిగేది ?వాడు ఏది ఇచ్చేది రకం .ఆ పిల్ల తండ్రి కోసం రోజూ దొడ్లోని పూలు కొస్తుంది .”ఆమెది చంపకం లాంటి రంగు .ఒంటి మీది బట్ట పాల తెలుపు .బొట్టు పెట్టు కోదు .చెక్కిళ్ళు పాలు కారుతున్నాయి .తెల్ల నంది వర్ధనం లాంటి అమ్మాయి .పాలు కారే వయసులో పసుపు కుంకాలు నీరు కారి పోయాయి ”.విధి వంచిత ఆమె .
దొడ్లో పచ్చ గన్నీర్లు విరివిగా పూస్తున్నాయి .”చెట్ల కింద మోకాలి ఎత్తున భూదేవిని స్వయం గా పూజిస్తాయి ”అని అవి అలా పూసి రాలి పోవాల్సిందే నని తెలియ జెప్పారు .అవి దేవుడికి పనికి రాని పూలు .ధూళి పాలైన పూలు పనికి రావని తండ్రి రోజూ జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు .ఎందుకు పనికి రావో ,ఆ పిల్లకు తెలియదు .ప్రశ్నించే సాహసమూ లేదు .
ఆ ప్రక్క ఇంట్లో ఈ మధ్యే ఒక కొత్త కుటుంబం వచ్చింది .వారికి ఇద్దరాడ పిల్లలు ఈ అమ్మాయి ఈడు వాళ్ళే .వాళ్ళిద్దరూ వీరింటికి పూలు యేరు కోవటానికి వచ్చారు .వాళ్ళింట్లో దేవ తార్చన లేదుగా ,పూలెందుకు /అని ఈ పిల్ల ప్రశ్నించింది .వాటిని న్రంగుల తొట్టె లో ఎండ బెట్టి ,ఆ రంగును బట్టలకు అడ్డు తామని వాళ్ళిద్దరి సమాధానం .ఈమె కూడా రాలిన పూలను ఏరి చెంగు లోకి ఎత్తు కొంది .తండ్రి చూసి కోప్పడ్డాడు .”నేనూ బట్టలకు రంగు అద్దిన్చుకొంటాను ”అంది అమాయకం గా .రంగు బట్టలు కట్టే అదృష్టం ఆమెకిక లేదని తెలీని అమాయకత్వం ఆమెది .’ఆ పిల్లల ఇల్లు పంచ రంగు ”తన ఒళ్లంతా తెలుపు ”వాళ్ళలో పచ్చదనం గుబాలిస్తుంటే ,ఈమెకు తెల్లదనమే ,అంతా విన్నదనమే .తండ్రి మాటలకు ఆ పిల్ల లిద్దరూ భయ పడి పారి పోయారు .వాళ్ళు పారిపోతుంటే గన్నేరు పూలన్నీ నేల పాలైనాయి .అంటే ,ఆ పిల్ల జీవితం నేల పాలౌతుందనే సూచన ఇక్కడ మనకు అనిపిస్తుంది .
పక్కింటి ఇద్దరు పిల్లలకు ఒక రోజూ రాత్రి ఒకే ముహూర్తం లో పెళ్ళిళ్ళు జరగ బోతున్నాయి .వాళ్ల తండ్రి అనువైన సంబంధాలను వెతికి కుదిర్చాడు .ఈ పిల్ల తల్లి ఆ పెళ్ళికి వెళ్ళింది పిలిస్తే .ఈ అమ్మాయి వెళ్ళ లేదు సుమంగళి కాదు కదా !’పెళ్ళికి ముత్తైదువులు వెళ్తారు కాని ,ఈ వెధవంమాయి రాక్షసో ,దాకినో కాదూ !పైగా అమంగళం ”అంటారు శతావధాని శాస్త్రి గారు .ఆ పిల్ల పై వీరి సానుభూతి అంత గొప్పది .ఆయన విశాల హృదయానికి జోహార్లు అర్పించాలని పిస్తుంది .కొత్త విధానాలు రావాలని శాస్త్రి గారి భావన మనకు అర్ధమవుతుంది .
పెళ్లి వారు దిగారు .రాజా కుమారుల్లా వున్నారు జంట పెళ్లి కొడుకులు .ఈ పిల్ల కిటికీ లోంచి తొంగి చూసింది .తన ఇంటికి దగ్గర లో వైభోగం .ఇక్కడ అంతా చీకటి ,కారు చీకటి .ఏదో తళుక్కున ఆమె మదిలో మెదిలింది .రాత్రి చాలా పొద్దు బోయింది . పెళ్లి అయిపోయి తల్లి తిరిగి వచ్చింది పెళ్లి నుంచి .
”ప్రమిద లో ఆముదం తగ్గడం వల్ల దీపం నక నక లాడుతోంది .ఆ అమ్మాయి కింద పడి వుంది ”తల్లి ఆ అమ్మాయి ముఖం కేసి చూసింది .ఆమె గుడ్లు అలాగే నిలబడి పోయాయి .ఆమె చేతిలో గన్నేరు పప్పు వుంది .”అని కధను కంచికి చేర్చారు కధక చక్ర వర్తి శాస్త్రి గారు .
ఆముదం తగ్గటం కాదు .”ఆముదమూ”తగ్గి పోయింది .ఆశ మినుకు మినుకు మని ,నిరాశ” దీపం పెద్ద దైనది” .ఇలా ఆమె బతుకును గన్నేరు పప్పుతో అంతం చేసుకోంది .రంగు గన్నేరు పూలు పనికి రాలేదు కాని వాటి కాయలు మాత్రం జీవితం ముగించ టానికి తోడ్పడ్డాయి .శాస్త్రి గారు ఏమీ చెప్పరు .అంతా మన ఊహకే వదిలేస్తారు .తలిదండ్రులు ఆమె ఆశలకు రూప కల్పన చేయ లేక పోయారు .ఆమె తప్పూ ఏమీ లేక పోయినా సంఘ బహిష్కృత అయింది .మార్పు రావాలని ఉన్నా ,దరిద్రం ,కట్టు బాట్లు వారిని కట్టి పడేసిన కాలమ్ అది .ఎంతో మంది బాల వితంతువుల జీవితాలు ఇలా బుగ్గి అయాయి .ఎదిరించే సాహసం ఆనాడు లేదు .కుళ్ళి కృశించి ,నశించి పోవడమే .లేక పొతే చీకటి తప్పులు చేసి బలి అయి పోయే వారు .”వీరేశ లింగ మొకడు ”ఎదురు గా నిల్చి ,వారి జీవితాలలో వసంతాలు పూయించాడు .గురజాడ తన నాటకం ద్వారా మార్పు తెచ్చే ప్రయత్నం చేశాడు .ఈ సంధి కాలమ్ లో వచ్చిన కధ ఇది .నాటి పరిస్థితులకు అద్భుత దర్పణం ”గన్నేరు ”కధ. గన్నేరు పూలు యెంత ఉపయోగమో ,దాని పప్పు అంత విషం.ఆ రోజుల్లో అదే చావుకు మందు .శ్రీ శివ రామ శాస్త్రి గారి హృదయ వైశాద్యానికి శత కోటి జోహార్లు .
సంపూర్ణం
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –25 -03 -12 .
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
గొప్ప లక్ష్యంతో రాసిన అద్భుతమైన కథ.కథనం కూడా రక్తి కట్టించారు శాస్త్రి గారు.వీరేశలింగం,గురజాడ,
చలం వంటి వారు ఇలాంటి బాల వితంతువుల దయనీయమైన స్థితిగతులు మారాలనే అహరహం తహతహలాడారు.దుర్గాప్రసాద్ గారి వివరణ కూడా రచనకు తగ్గట్టుగానే ఉంది.ముద్రణా దోషాలు పరిహరిస్తే మరింత బాగు.
గొప్ప లక్ష్యంతో రాసిన అద్భుతమైన కథ.కథనం కూడా రక్తి కట్టించారు శాస్త్రి గారు.వీరేశలింగం,గురజాడ,
చలం వంటి వారు ఇలాంటి బాల వితంతువుల దయనీయమైన స్థితిగతులు మారాలనే అహరహం తహతహలాడారు.దుర్గాప్రసాద్ గారి వివరణ కూడా రచనకు తగ్గట్టుగానే ఉంది.ముద్రణా దోషాలు పరిహరిస్తే మరింత బాగు.
ముత్తేవి రవీంద్రనాథ్.
గన్నేరు చెట్టుకు గన్నేరు పప్పు రాడుకద్దండి?