వేలూరి వారి కధ –నమశ్శివాయ
నమశ్శివాయ ఒక శివార్చకుడు .,వైద్యుడు కూడా .హస్త వాసి చాలా మంచిది .వైద్యం వల్ల బాగా లాభించింది .సాయం కోసం అల్లున్ని ఇల్లరికం ఉంచుకొన్నాడు .తర్వాత కొడుకు కూడా పుట్టాడు .పేరు మల్లయ్య .మంచి సేద్య గాడు .వాడి బావ మరిది లింగయ్య కూడా అంటే .అంది వచ్చిన కొడుక్కి భారం అంతా అప్పా గించి ”మనసే దేవలంబు అయిన వాడికి గుడి ,బడి ఒకటే ”అని భావించి ,”ఆత్మ లింగం తెలుసు కో లేని వాణికి శివ లింగం రుబ్బు రోలు పత్రమే ”అని భావించి ,రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కాలమ్ గడుపుతున్నాడు .పిచ్చి పట్టిందని కొందరానుకోన్నారట .”మంచి వాడేవాడు మల్లయ్య కంటెను -కుక్క యందు రేవు గుర్రమందు దిటవు నిల్చి ,మాకు దేహాభి మానంబుమాపు వాడ యా నమశ్శివాయ”అని పాడుకున్తుందే వాడు .అవి మహా వాక్యాలని కొందరు భావించే వారు .ఇంటి భారం పూర్తిగా కొడుక్కి ఎత్తి శ్రీ శైలం వెళ్ళాడు .కొడుకు ,అల్లుడు పంట పొలాలన్నీ సాగు బాగా చేసి బాగా ఆర్జించారు .
ఇంతలో ” ఎండో మెంట్ ‘బోర్డ్ ”దృష్టి మల్లయ్య ఆలయం మీద పడింది .ట్రస్ట్ బోర్డ్ ను ఏర్పాటు చేయ టానికి అధికారిని పంపింది .ఉల్లో వున్న పార్టీ ల వాళ్ళను పిలి పించి ,ఆదాయం లేక పోయినా ,ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేశారు .కరణం ట్రస్టీ .ఆలయం మీదా ,అర్చకుని మీదా ,ఆదాయం మీద అందరికి హక్కు వుందని ”అది కారి సందేశం ఇచ్చి వెళ్ళాడు ”.యురేకా ”అనిపించింది అందరికి .రెండేళ్ళు బానే గడిచి పోయింది .ఇంతలో గొడవ సాగింది .ట్రస్ట్ బోర్డ్ వాళ్ళంతా ఆలయ సంపదను తినేస్తున్నట్లు అర్జీలు పైకి వెళ్ళాయి .వీరాస్వామి ,వెంకు నాయుడు ,సారధి లను ట్రస్టీ లుగా నియమించారు .తాను మేనేజింగ్ ట్రస్టీ కనుక మల్లెశుని ఆస్తులన్నీ తనకు స్వాధీనం చేయమని వీరా చారి కోర్ట్ లో దావా వేశాడు .ఇది ఇలా వుండగా ,కోతల సమయం లో దేవుడి మాన్యం రాబడిని అంతా కోర్టు లో కట్టించమని ఇంకో పిటీషన్ వెళ్ళింది .రిసీవర్ ను వేసి పంట డబ్బు ను కోర్ట్ లో కట్టించారు .వీరా చారి చాక చక్యం తో కోర్టు లో కట్టిన డబ్బు తీసుకొని ఆస్తులన్నీ హాయిగా అనుభ విస్తున్నాడు .
ఒక రోజూ శ్రీ శైలం నుంచి నమశ్శివాయ తిరిగి వచ్చాడు .విషయం అంతా తెలుసు కొన్నాడు .వీరా చారి దేవుడు మాన్యాన్ని నాయుడికి ,సారధికి కౌలుకు ఇచ్చి ఫలసాయం పొందుతున్నాడు .దేవుడికి నైవేద్యం లేదు,పూజా లేదు ,ఉత్సవాల సలె లేవు .మల్లయ్య ,లింగయ్య దైవ పూజ కోసం కరణం ,మునసబు దగ్గరకు చేరి పాలేళ్ళు గా ఉంటామన్నారు .నమశ్శివాయ ఆ మాటలు విన్నాడు .పాత కాగితాన్ని తీసి ఎండో మెంట్ కు శిస్తు గా వచ్చే 102 రూపాయలు మీదే అధికారం పొలం మీద కాదు అని అని కరణం ,మునసబు చెప్పి వ్యాజ్యం వెయ్య మన్నారు .తాము పెట్టు బడి పెడ తామని కూడా చెప్పారు .ఊళ్ళో పెద్దలు కత్తులు నూరు తున్నారు .రచ్చ దగ్గర కర్రలు ఎగుర్తున్నాయి .నమశ్శివాయ వచ్చాడు .”లోకుల వంకలు ఎవరు దిద్ద గలరు ?మల్లయ్య దేవుడే తన నెత్తి న వున్న చంద్ర వంకనే దిద్దు కో లేక పోయాడు .ఇంత మంది అన్న పూర్నలు ఉంటె నా స్వామి మల్లయ్య కు ఉపవాసం ఉండదు .”అని అల్లుడు ,కొడుకును పిల్చి తన ఉత్త రీయం చింపి ,,వాళ్ళిద్దరికీ చెరో ముక్క ఇచ్చి జోలేలుగా మార్చి భిక్షాటనకు బయల్దేరాడు .
దేవుడి సొమ్ముకు అంతా పెత్తన్దార్లె ,అన్న సామెత ను రుజువు చేసే కధ .స్వామి సొమ్ము బొక్కే కుహనా భక్తుల వేష భాషలను వివరించే కధ.ప్రతి ఊళ్లోనూ ఇదే కధ .పోట్లాడు కోవటానికి ,అధికారం అనుభవించ టానికే దేవుడి పేరు తప్ప ఆ దేవుడి పూజ విషయం లో వారికేవ్వరికి శ్రద్ధ భక్తీ ఆలోచనా ఉండవని తెలిపే గ్రామ సింహాల కధే ఇది .దేవుడికే ఎసరు పెట్టె ఆషాఢ భూతుల అంత రంగాన్ని వివరించే కధే ”నమశ్శివాయ”కధ .దేవుడి మాన్యం చక్కగా పండిస్తూ దైవ సేవ చేస్తుంటే కళ్ళు కుట్టిన వారి కపటనాటకాలను ఎండ గట్టారు శాస్త్రి గారు .ఇది ఆ ఊరి ఈ ఊరి కధ కాదు.అన్ని ఊర్లలోని యదార్ధ కధ . బహుశా శాస్త్రి గారి స్వగ్రామం లోను ఇలానే జరిగి వుంటుంది .దాన్ని విసకదీకరించి వుంటారు .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com