వేలూరి వారి కధ -ఒకటే చీర

  వేలూరి వారి కధ -ఒకటే చీర
                ఈ కధ ఎత్తు బడి లోను ,ముగింపు లోను ప్రత్యేకత వుంది .అది కధా బలాన్ని పెంచు తుంది .”నీవు తిని వచ్చిన తరువాతనే నే బోయి తిని ,వత్తును గాని ,ముందు నీవేగి ,తిని రా.చీకటి పది నను నాకు భయము లేదు ”అని అత్త కొత్త కోడలితో అనటం తో కధ ప్రారంభమవు తుంది .అయితె కోడలు ఎలా వుంది అంటే ”అచ్చర నైనను పిశాచము గా జేసి వైచు కొక ”కట్టు కున్నది పాపం .ముందు అత్త గారినే వెళ్లి ,నాగ రాజు పోసే గంజి తిని రమ్మని కోరింది కోడలు .అత్త ,కోడలి భావం గ్రహించి మానం ,మర్యాదా ఎక్కువ వారికి కానీ ,తమ బోటి పేదలకు కాదని ,కోడలు మధ్యాహ్నం కూడా ఏమీ తిన లేదని గ్రహించి ,చీకటి లో వెళ్ళటం చిన్న దైన ఆమె కు ఇబ్బంది కనుక -వెలుగు ఉండ గానే వెళ్లి రమ్మని అత్త గట్టి గానే చెప్పింది .అత్త మనోభావం అర్ధం చేసుకొన్న కోడలు మాన మర్యాదలు ,గాలి ,నీరు వంటివని ,అత్త గారు మధ్యాహ్నం కూడా ఏమీఎంగిలి పడలేదని గుర్తు చేసింది .ఇంట్లో ఉన్నదేదో భర్త ,కొడుకు తిని నాగ రాజింటికి మధ్యాహ్నమే పనికి వెళ్ళారు .చీకటి ,గుంపు అనే దెయ్యాలు తననేమీ చేయ లేవు .తన్ను చూస్తె అవి పారి పోతాయని నమ్మకం గా చెప్పి ,ముందు గా వెళ్ళాల్సింది అత్తే అని గట్టి గా చెప్పింది కోడలు .అత్త  కోడలితో ”నీవు పసుపు పోసినటుల ,మెరుపులు ముద్ద చేసి నటుల ,ఉందువు .నీకు దృష్టి తగులు నమ్మా -ఇక నేనేమీ చెప్ప లేను ”అన్నది .ఇలా చెప్పితే నన్నా కోడలు ముందు వెళ్లి తిని వస్తుందని ఆమె ఆరాటం .కోడలేమీ తీసి పోలేదు ”మెరుపులు తగిల్తే  దెబ్బలు తగుల్తాయి .కనుక తనకు ఎవరి వల్లా భయం లేదని ధైర్యం చెప్పి అత్తనే ముందు  పంపించిది ఆ ఉత్తము రాలైన కోడలు .ఆమె సంగతి చెబుతూ శివ రామ శాస్త్రి గారు ”అత్త మాట కెన్నడు ఎదు రాడదని ,ఆడితే వింధ్య పర్వతమే ”నని అంటారు .అంటే ఆమె మాటకు తిరుగు లేదని అర్ధం .అవతలి వారిని ఒప్పించే నేర్పు కోడలిది .ఇక తప్పదని ,అటక మీద ఉన్న చీర తీసి కట్టు కోని ఉచిత గంజి కేంద్రానికి బయల్దేరింది అత్త ”మాత రమ్మ”.
 ఇంతకీ దీని నేపధ్యం ఏమిటి ?ఆ ఊరంతా నాగ రాజుదే .అన్ని వ్యాపారాలు ఆయనవే .ప్రతి రోజూ సాయం కాలమ్ ఆరు గంటలకు ఒక సత్రం లో ఉచితం గా గంజి పోయిస్తాడు .ఆరు గంటలకు ”నాంది” .పది గంటలకు ”భరత వాక్యం ”.కష్ట పడ కుండా తేరగా వస్తే తిన టానికి వచ్చి సోమరు లౌతారని నాగ రాజు భయం .అందుకే నూకల జావ పోసే ఏర్పాటు చేశాడు .అందరికి ఉచితం గా భోజనం పెట్టె సమర్ధత ఉన్నా ,కష్ట పడి సంపాదించు కొనే వారికి నూకల జావ ఆవ మానం గా భావించి రారు అని నాగ రాజు నమ్మకం .”సోమరి తనం ,అవమానం అన్నదమ్ములు ”అనే విషయం అతనికి తెలియదు అంటాడు కధకుడు .
                     జనం అందరు వరుస క్రమం లో సత్రం ముందు చేరారు .నాగ రాజు ,కొడుకు పర్య వేక్షణ చేస్తున్నారు .సేవకులంతా విస్తళ్ళు వేసి ,జారే ముద్ద గా ఉన్న నూకల జావ వడ్డిస్తున్నారు .”దారిద్ర నారాయణులు అంతా దంత యంత్రాలు విప్పారు ”.ఇక ఒక ఏడాది వరకు తిండి లేక పోయినా ఫరవా లేదని ధైర్యం  వచ్చింది వాళ్ళందరికీ .ఈ జీవాచ్చవాలను చూస్తూ నాగ రాజు కు ‘సృష్టి చేసిన   బ్రహ్మకు ఈ విశ్వం నిండా శవాలు కని పిస్తే ఎలా వుంటుందో అలా ఉందట ”అలా అలా బంతులు దాటు కుంటు పోతుంటే తన మిల్లు లో పని చేసే వాళ్ళు కూడా తేర తిండికి వచ్చారని తెలుసు కొన్నాడు .అంతా ఆడ వాళ్ళే .ఎందుకోచ్చారని అడుగు దా మను కొన్నాడు కాని నోట మాట నోట్లోనే ఉండి పోయింది .అతని దృష్టి మాతరమ్మ మీద పడింది .ఆమె తమకు రోజూ పాలు తెస్తుంది .మిల్లు కూలీ కూడా .ఆమె జావ తింటూ ,తన హక్కు ను తాను ఉప యోగించు కొన్నట్లుగా తింటోంది ”మనసు లో నాగ రాజు కు మొక్కు కుంది దారిద్ర నారాయణ సేవ చేస్తున్నందుకు ”.నాగ రాజు ఇంట్లోకి వెళ్ళాడు .భార్య అతనితో ”దారిద్ర నారాయణ సేవ అయి పోయి వచ్చేశారా ?”అని అడి గింది .ఆమె పేరు ”యోగ మాయ”.సేవ కాదు -పరీక్ష అన్నాడు భర్త .ఆమె ఆశ్చర్యం తో ”నారాయణునికి పరీక్షా ?”అంది .మిల్లు లో పని చేసే వాళ్ళు చాలా మంది వచ్చారని ,మాతరమ్మ కూడా సిగ్గు లేకుండా వచ్చిందని ,ఆమె కట్టిన చీర తన  భార్య కూడా ఎప్పుడు కట్ట లేదని ,అక్కసు వెళ్ళ గక్కాడు .ఆమె కు పరిస్థితి అర్ధమైంది .ఒక రోజూ మాతరమ్మ కోడలు ”జయ ”పాలు తెస్తే ,ఆమె చీర చూసి ,ఆమె ”గుడ్డ లమ్మ ”గా కని పిస్తే బీరు వా లోంచి తన చీర తీసి కట్టించి ,మిల్లుకు పంపానని భర్త కు చెప్పింది .అత్త ,కోడళ్ళు ఉత్తములు అని కూడా మెచ్చింది .మిల్లు లో పని చేస్తూ కూడా వీళ్ళు గంజికి రావట మేమిటని అడిగాడు .”యెంత జీత మిస్తున్నారేమిటి ?”అని ఆమె అడిగితె ”తెలీదు గుమాస్తాని అడ గాలి ”అని నాగ రాజు తప్పించుకొన్నాడు .”ఇక్కడ కూలి సరి పొతే మాత రమ్మ సత్రానికి రాదు ”అని గట్టి గా చెప్పింది .అంతే కాదు ఇంకో అడుగు ముందుకేసి ”మీ సత్రం లో ఆ దారిద్ర నారాయణుల తో పాటు నేను కూడా కూర్చుని తినాలని ప్స్తోంది ”అని తన మనసు లోని మాట నిష్కర్ష గా తెలియ జేసింది యోగ మాయ.
                       ఈసారి మళ్ళీ ఆశ్చర్య పోయాడు భర్త .దేశ పరిస్థితులను పేపరు చదివి తెలుసు కొంటుంది భార్య యోగ మాయ .దారిద్ర నారాయణ సేవ చేసే మహాత్మా గాంధీ జి గురించి ఆమెకు సమగ్ర ఆవ గాహన ఉంది .ఆయన పద్ధతులు తెలుసు .అందుకే ఆమె ”ఈ దేశ దరిద్రులకు ప్రతి నిధి గా మోకాలు దిగని కొల్లాయ గట్టు కొను చుండగా ,నేనొక ఏడాది దరిద్రుల  దుఃఖ మెంతయో కను గొనుటకు నూకల కూడు తిన రాదా ?”అన్నది .అంతే కాదు కాయ కష్టం చేసి తమ సంపద పెంచుతున్న ఆ కూలి వాళ్ళందరికీ అన్నం పెట్టిన తరువాతే మిగిలిన దరిద్రుల సంగతి అంది ”తమ దగ్గర పని చేసే గుమాస్తాల తర్వాతే మిగతా దరిద్రుల సేవ అని ఖచ్చితం గా చెప్పే సింది .ఇంతకంటే ఏ పరిష్కారం ఏ పార్టీ కూడా చెప్పలేదు .జనాన్నిఉద్ధ రిస్తున్నామన్న ఇజా ల కన్న నిజాలనే మాట్లాడి ఆమె ఏ ఇజాని కన్నా గొప్ప గా చెప్పింది .ఉత్తమా ఇల్లాలు అని పించుకొంది యోగ మాయ .యోగ మాయ కు తెలీని  విషయాలేముంటాయి లోతుగా ఆలోచిస్తే ఆమే తో మాట్లాడించిన అతి కొద్ది మాటల తోనే ఆమె ఆంతర్యం ఎంత ఉన్నత మైనదో తెలిపారు శాస్త్రి గారు .ఆమె వాక్ ప్రవాహానికి నాగరాజు మనస్సు చాలా దూరం కొట్టుకు పోయింది ,నాగారాజంటేనే ఆది శేషుడు .ఆది శేషుడంటే వాక్ కు అధిదేవత .అలాంటి వాడినే నిరుత్తరున్ని చేసింది .
  ఇంతలో మాతరమ్మ వచ్చి సిగ్గు తో తలుపు చాటున నిల్చుని వుంది .ఈ సారి నాగ రాజే బాగా సిగ్గు పడి ,మేడ మీదకు జారుకొన్నాడు .నిజాయితీ ,ఆత్మ బలం ముందు అహంకారం సిగ్గు పడదా మరి ?కోడలి తో పాటు రాకుండా ఒక్కతే ఎందుకొచ్చిందో అడిగింది యోగ మాయ .”చీర –”అంది ఆమే .వెంటనే నాలుక కరచుకొని ”ఇద్దరూ వస్తే ఇంటి దగ్గర ఎవరు ఉండరని అందుకే తాను వెళ్లి కోడలిని పంపిస్తానని సందర్భోచితం గా పలికి .పనికి వెళ్ళ బోతుంటే కోడల్ని తనకు కన బడి వెళ్ళ మని చెప్ప మంది నాగ రాజు భార్య .తన కోడలికి తాను చెప్పాల్సిన పని లేదని ఆమె తప్పక వచ్చి కన పడి వెళ్తుందని  కోడలి మనసు తెలిసిన అత్త అన్నది .
   అత్త ఇంటికి చేరిన తర్వాత కోడలు వచ్చి పంక్తి లో కూర్చుంది .గంజి తిని ,యోగ మాయ కు కన్పించి దండం పెట్టింది .”ముందు మీ బాబు గారికి దండం పెట్టు ”అందామె .నాగ రాజు పరీక్ష గా చూశాడు .అత్త కట్టిన చీరే కోడలూ కట్టింది .అలాంటి చీరలు వాళ్ళింట్లో ఎన్ని ఉన్నాయని అడిగాడు .జయ భయ పడింది .తన అత్త గారు చావ నైనా చస్తుంది కాని ,దొంగ తనం చేయదని ఆమె మనసుకు తెలుసు .చివరికి నిజం చెప్పింది .పది రోజుల క్రితం అమ్మ గారు ”ఆ కోక ను ఇచ్చారని ,దాన్నే ,అక్షయం గా ,వాడు కొంటున్నామని ,అసలు విషయం చెప్పే సింది .ఇంకా అను మానం తీరక  అత్తా కోడళ్ళు కలిసి ఎందుకు రాకుండా వెనకా ,ముందు రావటానికి కారణమేమిటని అడిగాడు .జయకు నవ్వు ,ఏడుపు కలిసి వచ్చాయి .”అందుకే తమ మిల్లు లో పనికి ఇద్దరం కలిసి రాలేక పోతున్నాం .ఆమె ఒక రోజూ ,నేను ఒక రోజూ పనికి వస్తున్నాం ”అన్నది .ఆమె మాట విని ”రిచ్చ పడ్డాడు నాగ రాజు ”.అంత తరిచి అడిగితె కాని నిజాన్ని చెప్పని మహా సాధ్వి ఆ కోడలు .
దరిద్రం ఉండ వచ్చు .కడుపులు మాడి పోవచ్చు .మంచి నీళ్ళే పుట్టక పోవచ్చు .కాని ,ఆత్మాభి మానం వీటన్నిటి కంటే గొప్పది .అది స్త్రీ పురుషులలో ఎవరికి లేక పోయినా దరిద్రమే .ముఖ్యం గా స్త్రీ కి గల అమూల్యాభరణం అది .అందుకే అత్తా  కోడళ్ళు ఇలా సువర్ణ ప్రతి మల్లా వెలిగి పోయారు .శాస్త్రి గారి కధా కధనం అంత పరి పుష్ట్సం గా వుంది .చాలా చిన్న కధ ను ,పెద్ద కాన్వాసు పై అనిర్వచ నీయం గా ,ముగ్ధ మనోహరం గా చిత్రించారు .కధ లోని పేర్లు కూడా ,వారి మనస్తత్వాలకు ప్రతీకలు గా వున్నాయి .యోగ మాయ మాటలతో భర్త మూర్ఖత్వపు మాయ తొలగి పోయింది .మాత రమ్మ అమ్మల గన్న యమ్మ అని పించు కొంది .జయ ,దరిద్రాన్ని జయించి ,మంచితనం తో ,మనో నైర్మల్యం తో విజయం సాధించింది .జీవిత పోరాటం లో ఆమెకు నిత్యమూ జయమే .భేషైన కధకు మహా భేషైన సంవిధాన చాతుర్యం .శాస్త్రి గారి మాన వత్వ దర్శనానికి శిఖా రాయ మైంది ఈ కధ .
   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -03 -1

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged , . Bookmark the permalink.

1 Response to వేలూరి వారి కధ -ఒకటే చీర

  1. ఈ చిన్న కథలో యోగమాయ పాత్రను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు శాస్త్రిగారు.’సరిపడా కూలి ఇస్తే ఎవరూ ఆత్మాభిమానం చంపుకుని సత్రానికి రారు; గాంధీజీ సైతం దరిద్ర నారాయణ సేవ నిమిత్తం కొల్లాయి కట్టుకుంటూ ఉంటే నేను ఒక ఏడాదిపాటు జావో, గంజో తాగితే తప్పేముంది?’ అని భర్తను ప్రశ్నిస్తుంది యోగమాయ.అలాగే భర్త నాగరాజుతో ‘ముందుగా మన మిల్లులో పనిచేసే దరిద్ర జనం ఉద్ధరణ తరువాతే బయటి దరిద్రుల సేవ’ అంటుంది కూడా. కాబట్టి ఆమె సోమరిపోతుల పక్షం కాదు.కష్టజీవుల పక్షమని అర్థమవుతూనే ఉంది.అలాగే కష్టజీవులకు వారి కష్టానికితగ్గ ప్రతిఫలం రావాలేకానీ ఎవరి దయాభిక్షో కాదని ఆమె భావం.అందుకే ‘మాతరమకు ఎంత కూలీ ఇస్తున్నారేమిటి?’అంటూ భర్తను ప్రశ్నించింది. కష్టానికి తగిన కూలిఇవ్వడం లేదు కనుకనే నాగరాజు’ నాకు తెలియదు;గుమాస్తాని అడగాలి’ అని నీళ్ళు నమిలాడు.యోగామాయ ఆలోచనలు అన్నీ అచ్చమైన కమ్యూనిస్టు భావాలే.అవి శివరామ శాస్త్రి గారి మనోభావాలే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇంత చక్కటి కథను పరిచయం చేసినందుకు దుర్గా ప్రసాద్ గారికి ధన్యవాదాలు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.