వేలూరి వారి కధ -వర ప్రసాది

 వేలూరి వారి కధ -వర ప్రసాది
”సంతానం లేక హిదాయ తుల్లా అల్లకే కాదు ,శివుడికీ ,చేట్టుకీ పుట్టకు మొక్కు కొన్నాడు .”అని కధ ప్రారంభించారు .ఇందులో హిదాయ తుల్లా విశాల దృక్పధం కన్పిస్తుంది .ఆతని ఆంతర్యం తెలుస్తుంది .చివరికి అల్లా కనికరించి” వర ప్రసాది ”ని ప్రసాదిస్తున్నట్లు కలలో కన్పించి చెప్పాడు .”పుత్రోత్సాహం ఉల్లాకే కాదు ,జనానికే కాదు ,ప్రజలందరికీ ”కల్గింది ”రహమత్ ”జన్మించటం తో .దైవ కృప వాళ్ళ కలిగాడు కనుక ఆ పేరు పెట్టాడు .కొడుకు విషయం లో తురక ,హిందూ జ్యోతిష్యులు విడి విడిగా రాసిన జాతకాలు అన్నీ ఏకీభ విన్చాయట .”ఆయువు నూరేళ్ళు .రాజ్య లాభం రెట్టింపు .కళత్ర స్థానం ఇరుకు .పట్టినది బంగారం .మట్టి నది మక్కా ”అని అందరు తేల్చారు .హిదాయ తుల్లా ,హసీనా ల ఆనందం వర్ణనా తీతం .రహమత్ ను తానా పక్కనే ఉంచుకొని నమాజు చేయిస్తూ ,కురాన్ చదివిస్తూ రాచ కార్యాలు నేర్పుతున్నాడు .చదువు కోసం ”నెల పల్లి పలకలు.కొండ పల్లి కాకితాలు కు ఖర్చు హెచ్చెను ”అంటారు శాస్త్రి గారు .తండ్రికి కొడుకు ను చూసి రెండో బాల్యమే వచ్చిందట .వాడితో నవ్వాడు,చదరంగం ఆడాడు .విందులార గించాడు .అక్షరాలూ దిద్ది పుస్తకం పట్టాడు .వాడితో ఆలోచించాడు.సాము చేశాడు .గుర్రా మెక్కి ,వాడినీ ఎక్కించాడు .తానా ఖర్చు మాని ,ఏటా లక్ష రూపాయలు వాడి కిస్తున్నాడు .తానా సర్వస్వం వాడే అని నమ్మాడు .అలానే ప్రవర్తించాడు .కొడుకు పక్కన ఉంటేనే తినే వాడు .పక్కన పడుకున్తేనే నిద్ర వచ్చేది .అలా పెంపకం సాగింది .
 రహ్మత్ ఉల్లా కు యవ్వన ప్రాదుర్భావం జరిగింది .జులపాలు పెంచి ,వంకీ జుట్టుజుట్టు ఏర్పాటు చేసుకొన్నాడు .”తండ్రి కిస్తమును ,తానా కడ్డము నాగు గడ్డమును గోరిగించుకొన్నాడు ”మీసములు నిక్క బొడుచుకొని ,ఇలాంటి విషయాలలో నువ్వేం చెప్పా రాదు ”అన్నట్లు తండ్రికి వేలెత్తి చూపి నట్లున్నాయత .అతని లోని మార్పుకు అడ్డం పట్టే రచన చేశారు వేలూరి వారు .మంచి అందం తో ,సింగారం తో మగ వారికే మరులు గోల్పుతున్నాదట .నెమ్మదిగా చదువు గుంత కొట్టి గంట వాయించింది .చదువు తుంటే పక్కగా వెళ్ళే ”తాంబూల వల్లి ”నిచూట్టం ప్రారంభించాడు .ముఖంఎర్ర బడి కోరిక పెరిగింది .ఇంతలో తండ్రి వస్తే ఖురాన్ చదువు తున్నట్లు నటించేశాడు .నటనా బానే వంట బట్టింది కుర్రాడికి .కుమారుడికి రాచ కార్యాలలో తర్ఫీదు ఇద్దా మని తండ్రి వస్తే వాడు ”వల రాచ పనులలో ఓనమాలు దిద్దు తున్నాడు ”అన్నారు అతి సహజం గా కధకులు శాస్త్రి గారు .పన్నీరు బుడ్డి తెచ్చే ”ఖలేజా ;”ను చుస్తే అతని ”హృదయ పు గుహ లోని,చీకటి కోనా లన్నీ తలుక్కు మన్నాయి  ” వింతలకు  ,వంతలకు పునాది ,చల పాది అయిన యవ్వనం రాజయి అతని లో కూర్చున్నది ”అంటారు .అంతటి తీవ్ర మార్పు వాడిలో ప్రవేశించింది .ఎకానమీ ఆఫ్ వర్డ్స్ తో మహా గొప్పగా వాడి ని ఆవిష్కరించారు .
ఈ మార్పు యెంత దాకా వచ్చిందంటే రహమా తుల్లా కు ”మగ వారి మూతులు కోతులుగా ,మగ పురుగు రోత గా ,వాళ్ళ మొగాలు పాములుగా ,మేను మ్రాను ”గా కన్పించి అసహ్యం వేసేది వాడికి .చివరికి తండ్రి వచ్చినా ”తూ పొడిచెను ”అంటారు .అతనికి మగాడు ”ముదార్ ”అయ్యాడు .కొడుకు లో వచ్చిన మార్పు ను తండ్రి గమనిస్తూనే వున్నాడు .లోపల బాధ పడుతూనే వున్నాడు .హెచ్చరికలు చేస్తూనే వున్నాడు .ఇప్పుడు తండ్రి ఒక చోట ,కొడుకు ఇంకో చోట వుంటున్నారు .పాత మెడ తండ్రికి -కొత్తది కొడుక్కి .నౌకర్లు ,చాకర్లు వేరు వేరే .కొడుకు తమ వద్ద ఉండక పోవటం ఏంటో ఆశతో పెంచిన ఆ తలిదండ్రులు భరించ లేక పోయారు .నిద్ర రాదు ఏమీ తోచదు .హిదాయ తుల్లా కు ”సాకినా ” రెండో భార్య .ఒక రోజు హసీనా ”మగ వానిని కాన రాదు ”అని సాకినా తో అంది .ఆమె ”అందుకే నేను మాను కున్నాను ”అంది నవ్వుతు .పుత్రోత్సాహం చివరికి ఇలాంటి పరిస్థితి తెస్తుందని వారు ఊహించలేదు .హసీనా ఆ రాత్రి కొడుకు దగ్గరకు పుత్రోత్సాహం తో  వెళ్ళింది .అక్కడ ”గులాప్ బేగం ”అనే ఇరాక్ దేశపు పహారా అమ్మాయి లోనికి రానివ్వా లేదు .వికల మనస్స్సు తో తిరిగి వచ్చేసింది . ”రేపు మీ సీలు ,ఉంగరం ,కొత్త హుజురు కు దాఖలు చేసుకొని ,చేతులు కడుగు కొనుడు ”అని భర్తకు తేల్చి చెప్పింది .
కొడుకు లో  మార్పు వచ్చి మళ్ళీ తమను ఆదరిస్తాడని తండ్రికి  ఆశ వుంది .తనకున్న మహా రాష్ట్ర జాగీర్లో ఉన్న ”ముని పల్లె ”కు జామా బందీ కోసం తండ్రి కొడుకులు వెళ్ళారు .అదంతా సశ్య శ్యామల ప్రదేశం .”దొడ్ల నిండా తల్లి యొర దాకా నీరు దాకు బావులు ,పచ్చని పుంతలు ”ఉన్నాయి .హిదాయ తుల్లా నమాజు చేస్తుంటే ,యవ్వన మదం తో కదం తొక్కే రహమా తుల్లా గుర్రా మెక్కి శికారుకేల్లాడు .వెనుక ఒక రోహిలా కూడా .గుర్రం చెరువు గట్టు ఎక్కింది .దాని క్రింద ఒక పెద్ద గృహా రామం ,,ఒక బావి ,డబ్బా పండ్లతో వంగిన చెట్లు ,డబ్బా పండు ఛాయా లో కలిసి పోయిన పద్దెనిమిదేళ్ళ పడుచు వాడి కంట బడ్డాయి .ఆమెను ”’పాతాళ కన్య ”అను కొన్నాడు .ఆమె నీళ్ళు తోడుతూ ,పమిట సర్డుకొంతోంది .”ఆమె చెక్కిలి మీద చెమరు ముతియముల నారు ”లా అప్సర లా వుండట .”నాకంటే నీవేం పచ్చ గా ఉన్నావో చూస్తానంటూ ఆమె ,పసుపు ను అర చేత్తో ఆరగ దీసి మొఖానికి పూసు కుంది” ట .
               ఆమె సౌన్దర్యాతిశాయమేన్తటిదో చక్క గా ఎస్టిమేట్ చేశారు .ఆమె ఆ బావి దగ్గర జలకాలాడింది .ఇదంతా ఓడలేరుగా కుండా రహమతుల్లా చూస్తున్నాడు .రోహిల్లా గుర్రం యెక్క లేక ఆరవ ప్రయత్నం లో చతికిల బడింది .ఆ చప్పుడు తో హిదాయ తుల్లా నమాజ్ భగ్నమైంది .గ్రామ నాయకుడి సహాయంతో వివ రాలు సేకరించాడు .కొడుకు చూసింది కరణం గారి భార్య అని తెలిసింది .కరణం గారు చాలా ధర్మాత్ములని ,దాన ధర్మాలు చేయటమే పని అని ,ఈమె ఆయన మూడో భార్య అని ,సంతతి లేదని ,ఆయన ఉండేది పాక అయినా కోట దాని ముందు బాలా దూర్ ”అనీ గ్రామ నాయకులు చెప్పారు .బహుశా ఇద్దరికీ ఎంత వ్యత్యాసం ఉందొ తెలిపే సంఘటన ఇది .కొడుకు తండ్రి దగ్గరకు తిరిగి వచ్చేశాడు .యేవో జామా బందీ కాగితాలు చూశాడు .కాగితాల ఈద జమలున్నాయి కని డబ్బు కని పించలేదు .చీకటి పడింది .తండ్రి నమాజ్ లో మునిగాడు .కొడుకు కారణాన్ని నాయకుడిని గ్రామ నౌకర్లని బండ కొయ్యలు వేయించి నిద్ర పోయాడు .
కామాగ్ని లో దహించుకు పోతున్నా రహం తుల్లా కు నిద్ర రావటం లేదు .తాంబూల వల్లి వచ్చి అతని ముందు వెల వెల బోయిందట .అంటే ఆమె పై మొహం తీరి పోయిందన్న మాట ,కొత్త పిట్ట కై మనస్సు పరుగులు తీస్తోంది .ఆమె అమాయకం గా ”కరణం గారి భార్య అల్లాబదీను కన్న మిన్న.సంధులు విరుగ వలయుచోన్ సంధి ,ప్రాణ దానము చేయుచో దానము -శరీర భేదము తో భేదము ఇటుల మనకు కాని ,తనకు కాని దందోపాయమునే ఈమె మిగిల్చేను ”చాలా స్పష్టం గా ఆమె ఆంతర్య పు లోతును తెలియ జెప్పింది .ఒళ్ళు జాగ్రత్త ,ప్రానకం జాగ్రత్త ,పాముతో చెలగాటం అని హెచ్చరిక జారీ చేసింది .మూర్ఖుడికి ఇవేమీ ఆనలేదు .”వట్టి తమల పాకు ”అన్నాడు వాడు .ఏమైనా కరణం గారి భార్యను కలవాలని తొందర పడ్డాడు .ఏర్పాట్లు చేసింది తాంబూల వల్లి .”ఈ రహశ్యం ఎవరికి తెలియ రాదు ”అన్నాడు కీచక యువ రాజు .”ముసలి పులి కునికిన తర్వాత వెళ్ళు ”అందామె .”దానికేపుడు కోరలు లేవు .దాని భయమే లేదు ”అన్నాడు తండ్రి ని గురించి .ఆమె ఎదురేమీ చెప్ప  లేదు .

   అర్ధ రాత్రి దాటింది .తాంబూల వల్లి సహాయంతో గుర్రా మెక్కి ,కోర్కెల గుర్రాన్ని అదిలించాడు .గుర్రం గొప్ప సకిలింత చేస్తూ కోలాహలం గా తోట వైపు పరిగెత్తింది .గజ్జెల గుర్రం లా తాంబూల వల్లి నడిచింది .ఈ హడావిడి లో హిదాయ తుల్లా కు మెలకువ వచ్చి ”అల్లా అల్లా ”అనుకుంటూ కంగారు గా లేచాడు .జరగ రానిదేదో జరగ బోతోందని ఆందోళన పడ్డాడు .నౌకర్లను పేరు పేరునా పిలిచాడు .ఎవరూ పలక లేదు .సైన్కుడేవాడు లేదు .కొత్త డేరా లో కొడుకు లేదు .పటకా   కత్తి తీసుకొని గుర్రా మెక్కి దౌడు తీశాడు .ఈ గుర్రం సకిలింత విని కొడుకు గుఱ్ఱము సకిలించింది .నిమిషాల మీద కరణం గారిల్లు చేరాడు .ఇంటి చుట్టూ వున్న రోహిలాలు ముసలాయన్ను చూసి పారిపోయారు .గుర్రం దిగి లోపలి వెళ్ళాడు లోపలి దృశ్యాన్ని కాదు రమణీయం గా వర్ణించారు శాస్త్రి గారు .
                  ”నడుము నుండి దూసిన ఒడ్డానపు బాకుతో ఆ పడుచు ,దాని తాకును తప్పించు కొనే ప్రయత్నం లో తామ్బూలీ ,గులాపీ ,జులేఖాలు .దాన్ని లాగు కోవటానికి పొంచి ఉన్న కొడుకు ”.పెద్దాయనను చూడ గానే దాసీలు పరారు .తెగ బడిన కొడుకు కట్టి తో తండ్రి పై దూకాడు .”బోసి పులి చిరుత పులిని కింద బడ అద్రోసేను .పిదప మోకాలు మండే వెట్టి తండ్రి -కొడుకు గుండెల మీద కూర్చుండెను .”అని వర్ణించారు ”అమ్మా !ఇక రమ్ము .ఖూనీ సెలవు పోగొట్టు కొంటిని .వీనికి నీ కట్టి తోనే శిక్ష విద్శిమ్పుము ”అన్నాడు .ఆమె వచ్చి ,ఇద్దరి చేతుల్లోని కత్తులు లాగేసి ”ఇతనిని క్షమించితిని ”అన్నది .క్షమకు మారు పేరు భారత స్త్రీ అన్నట్లుగా .ఏమీ జరగా లేదన్నట్లుగా .అంతటి కారుణ్య మూర్తి గా ఆమె ను చూపిస్తారు .”అమ్మా !నీవు దయామయివి .ఈ ముసలి కథినుడు .”అని కొడుకు గుండెలలో ఒక పోతూ పొడిచి బయటకు గేన్తెస్తాడు .వీర బాదుడు బాదేస్తాడు వాణ్ని అంటే వర ప్రసాదిని .”నాకింకా కొడుకు లేదు ఫో ”అని తరిమేస్తాడు ప్రాణ భీతి తో కొడుకు పారి పోతాడు .వికల మైన మనసు తో ఆ తండ్రి విల విల లాడుతూ ”వో ఫ్సకీర్ ,వో నా తండ్రీ వోరి నాయనా వోరి నాయనా !నీ కొరకు ఎంత తపస్సు ధారా పోశానో అల్లాకే ఎరుక .తుదకు ఆ అల్లా ఇచ్చిన వరమా ఇది ?వో ఫకీర ,వో ఫకీర్ ”అని గుండెలు బాడుకొంటు గుడారం చేరాడు ముసలి తండ్రి .తండ్రి గా కర్తవ్యాన్ని బాగా నిర్వర్తించాడు .
              కంట తడి బెట్టించె సన్నీ వేశామిది .వర ప్రసాదం గా పొందిన కొడుకు ఇలా అధోగతి పాలైతే ఏ తండ్రి అయినా ఇంతే కదా ?ఆశల శిఖరాలు కూలితే తట్టు కాలెం.క్రమ శిక్షణ తో పెంచబడిన వాడే విశ్రుమ్ఖలం గా విహరిస్తుంటే ,ఆ తండ్రి మనో వేదనను పరమాద్భుతం గా ప్రదర్శింప జేశారు శాస్త్రి గారు .శిల్పి లా ప్రతి మాటను చెక్కారు .ప్రతి సన్నీ వేషాన్ని పండించారు .పుత్రా వ్యామోహం యెంత ప్రమాదకరమో తెలియ జేసే ,కను విప్పు కలిగించే కదా .తగిన సమయం లో తండ్రి కొడుక్కి బుద్ధి చెప్పాల్సినదే నని నిష్కర్ష గా సూచించే కదా కూడా .అలా చేయ పోక బట్టే ద్రుత రాష్ట్రుడు  నాశనం తెచ్చుకొన్నాడు

            ఈ సారి ఇంకో కధ

 మీ–గబ్బిట దుర్గా ప్రసాద్–26 -03 -12 .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.