వేలూరి వారి కధ –దేవుడు
పార్వతి పల్లె టూరి పడుచు .ఆమె” తాత తండ్రు లెడమ చేత లౌకిక సంపత్తి ని ,కుడి చేత వైదిక సంపత్తి ని పెట్టు కోని ”పుట్టారట..అంటే వాళ్ళలో రెండింటికి సమతా స్థితి వుంది .ఆమె మేన మామలు మేస్టార్లు లాయర్లు .ఆమె౩ లో ఈ జీన్ లక్షణాలు పుష్కలం గా చేరాయి .వీధి బడి లో చదివి నాలుగో క్లాస్ పాసైంది .వీధి నాట కాలు ,పగటి వేషాలు చూసి ,”మానవ లీలలు ”గ్రహించింది .పురాణాలను విని ఐహికాముష్మిక విలువలు తెలుసు కొన్నది .భర్త శివ రావు వక్కీలు .పట్నం లో కాపురం .జామే జీవితం అమాయకపు పల్లె నుంచి ,మహా మాయ గాళ్ళు వుండే చేరింది .వస్తుతః ఆమె ఒక ఆలోచనా సరళి లో నుంచి వచ్చ్చింది .కనుక మనస్తత్వం లో మార్పు రాలేదు .గర్భస్తూ డైన కోడు కు ”రాముడు ”కడుపు లోనే ”సీతా రామంజనేయం ”విన్నాడు భక్త ప్రహ్లాదుని లాగా .ప్రహ్లాదుని పై ఎలాంటి ప్రభావం వుందో ఇతని పైనా అలాంటి ప్రభావమే కల్గింది .తత్వాలు వింటూ బాల్యం గది పాడు .”రామ నామం ”తో అన్న ప్రాసన జరిగింది .ఆమె తన రామున్ని ”రామ లీలల తో ,కృష్ణ లీలల తో ”తీర్చి దిద్దింది .
అన్నం తింటూ కూడా రాముడికి దైవ ధ్యాసే .రాత్రి గజేంద్ర మోక్షం కధ తల్లి చెప్పగా విన్నాడు .వాడి చిన్న మనసు లో చిన్న సందేహం .గజేంద్రుడు అడవి లో మడుగు లో దిగి మొసలి పాలు కాకుండా ,తమ ఇంటి దగ్గర కుళాయి నీళ్ళు తాగితే కష్టాలు తప్పేవి కదా ?అని తల్లిని అడిగాడు .ఆ రోజుల్లో పంపులు లేవని ఆమె చెప్పింది .వాడు ”రామ రక్ష ”చదివి ”రామ కవచం ”చదువు కుంటు బడికి వెళ్ళాడు .బడి లో మేష్టారు నిన్నటి పాఠం మీద ప్రశ్నలడి గాడు .”మన నెత్తి మీద ఏమి ఉంది “ఇది ప్రశ్న .ఒకడు జుట్టు అని ఇంకోడు ఆకాశం అని చెప్పారు .రామున్ని అడిగితె ”దేవుడు ”అన్నాడు .మేస్తారికి కోపం నషాళానికి అంటి ”దేవుణ్ణి చూపిస్తాను ”అని ”దెబ్బలో దేవుడు కని పిస్తాడని చెప్పి బెత్తం తో వాడి అరచేతి లో వాతలు తేల్చాడు .విల విల l లాడి రామ రామ అనుకుంటూ అరిచాడు రాముడు .
ఇంటికి వచ్చి ,మధ్యాహ్న భోజన మేదో కతికి ఒకటే ఏడుపు .తల్లి ”గువ్వా కుత్తుక ”తో వాణ్నిyemi కావాలి అడిగింది .”నాకు దేవుడు కని పించ లేదు ”అని బావురు మన్నాడు .ఆమె తాత గారి ఊరు వెళ్లి చూద్దాం లెమ్మని చెప్పింది .వాడు ఇది వరకు వెళ్ళిన దే ఆ గుడి .వివరం గా అడిగితె ”పంతులు గారు దెబ్బలో దేవుడున్నాడు అని కొట్టారు దెబ్బలు తగిలినా దేవుడు కనిపించ లేదు ”అన్నాడు అమాయకం గా .తల్లికి ఏం చెప్పాలో తోచలేదు .”కన పడతాడు కన పడతాడు ”అని మాత్రమే చెప్పింది వాడు ”ఏడీ .ఏడీ ”అని కలవరిస్తూ నిద్ర పోయాడు .భర్త శివ రావు కు ఎప్పుడు కేసుల గొడవే .ఇంటి గోల తక్కువ .చివరికి చెవి నిల్లు కట్టు కోని విషయం అంతా చెప్పింది .”మిషన్ బడికి వెళ్తే ఈ దేబ్బలున్దేవి కావు ”అని యాదా లాపం గా అని దాస్తా వేజుల్లో దూరి పోయాడు .”పార్వతికప్పుడు రాముని కన్న నెక్కువ దెబ్బ తగిలెను ”అంటారు శాస్త్రి గారు .మర్నాడు ఉదయం కూడా మళ్ళీ భర్త కు జ్ఞాపకం చేసింది .”మేస్త్రీట్ కోర్ట్ లో దావా వెయ్యి ”అన్నాడు ఆ కోర్టు పక్షి .ఆమెకు విపరీత మైన కోపం వచ్చి ,దులిపేసింది .అప్పుడు దారికొచ్చి ,వాణ్ని అడిగితె వాడు పాత p రికార్డే పెట్టాడు .తండ్రి తో ”నాన్నా !కోర్టు లో దేవుణ్ణి చూపిస్తావా ?అని అడిగాడు .”కోర్ట్ లో దేవుడున్డును .అందుకే ఈ రోజూ కోర్టుకు వెళ్తున్నాను ”అన్నాడు .కుర్రాడికి ముందుగా మందు రాయమని చెప్పి ,తన ద్యుతి అయి పోయిందని భావించి కోర్టుకు వెళ్ళాడు శివ రావు .
కోర్టు లో దేవుడి ఈనాం భూముల మీద దావా నడుస్తోంది .”హక్కు దేవుడిదే.ధర్మ కర్త దేవుని ప్రతినిధి .దేవుని సర్వా దికారం ధర్మ కర్త దే .”అని కోతి లింగం వాదిస్తున్నాడు .శివ రావు మాత్రం రైతుల పక్షం వాదిస్తున్నాడు .”శిస్తు హక్కు మాత్రమే ధర్మ కర్త లది ”అంటాడు .”ఆచారం మారు తోందని ,ధర్మ కర్త లాడే అనటం ఇంత వరకు వున్న ఆచారం .అది ఇక చెల్లదు .నేడు దేవుడు కూడా శాసన సభ మాట వినాలి .రాతి దేవుడి కేల తెలుసు ?ధర్మ కర్త దేవుణ్ణి అడ్డు పెట్టు కోని నాటకం ఆడు తున్నాడు .అయినా నా క్లెయింట్ దేవుడు లేదు అని అంటాడు ””దేవుడు ఉన్నాడని శివ రావు ఒప్పు కుంటాడా ?”అని జడ్జి ప్రశ్న .గడుసు పిండం ,లౌక్యుడు అయిన వకీలు శివ రావు తన తెలివి తెతల్లి బయ ట పెడుతూ ”నాకు పైన ఏడు తరాల వాళ్ళు ,దేవుని చూళ్ళేదు .నా క్లయింటు చూడ లేదు .వాళ్ళు దేవుడు లేడు అంటారు ” ”.అని తన వాదనను ముగిస్తుంటే ,కొడుకు రాముడు ఆత్రం గా పరి గెత్తు కోని కోర్టు లోకి వచ్చాడు .తండ్రి ని చేరి ”నాన్నా !కోర్టు లో దేవుడు కన పడు నని చెప్పితిరి .ఇపుడు దేవుడు లేడు అంటిరి .దేవుడు లేడా /లేడా ?”అంటూ స్మ్రుతి తప్పి పడి పోయాడు అమాయక రాముడు .
ఈ విధం గా బయటి కో మాటా ,లోపల ఒక మాతా ఆడే ప్రబుద్ధుల మనః ప్రవ్రుత్తి కి ఈ కధ మచ్చు తునక .దేవుడు లేదట కాని ,ఆయన ఆస్తుల మీద అధికారం ,పెత్తనం మాత్రం కావాలి .దేవుని ప్రతి నిధులు గా వ్యవహరించాల్సిన మనుషులు ఇలా అన్యాయం గా ప్రవర్తిస్తుంటే ఆ దేవుడు మాత్రం ఏం చేస్తాడు ?పిల్లల మనస్తత్వాన్ని గొప్ప గా చిత్రించారు .లేత మనస్సులో పడిన భావం ను తుది ఛి వెయ లేరని అది అంత గాదం గా ముద్రితం ఆవు తుందని తెలియ జేశారు .శాస్త్రి గారి లాంటి మహా పండితుడు తర్క శాస్త్రాది మహా శాస్త్రజ్ఞుడు ,ఇంత చిన్న కధలో గొప్ప మనస్తత్వ పరి శీలన చేశారు .గొప్ప కధ కులకు బరువైన కధ అవసరం లేదని ,చిన్న విషయాన్ని గొప్ప గా చెప్పి మెప్పించ వచ్చు నని నిరూపించారు .సత్యా సత్యాలను వకీళ్ళు ఎలా తారు మారు చేయ గలరో ,వాద ప్రతి వాదాల్లో సత్యం అనేది ఏ స్తాయికి పడి పోతుందో శివ రావు ద్వారా నిరూపించారు .దేవుడున్నాడు కనుకనే కోర్టుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ,ఆ దేవుడే లేడని కోర్టు లో చెప్పిన శివ రావు ను ఆ కొడుకు క్షమించ గలడా ?అతన్ని గౌరవించా గలడా ?పిల్లల తో మాట్లాడే టప్పుడు యెంత జాగ్రత్త గా ఉండాలో తెలియ జేశారు .వకీలుగా సూపర్ అయినా తండ్రి గా శివ రావు ఫెయిల్ అయాడు .వివిధ వ్యక్తుల వ్యక్తిత్వాలకు అద్దం పట్టిన రచన ఇది .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -03 -12 .
వీక్షకులు
- 1,009,662 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.4 వ భాగం.4.6.23.
- గ్రంథాలయోగ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్య0 కి వెంకట రమణయ్య గారు.4 వ భాగం.4.6.23..ద్యమ పితామహ శ్రీ అయ్య0 కి వెంకట రమణయ్య గారు.4 వ భాగం.4.6.23..
- మురారి అన ర్ఘ రాఘవం 7 వ భాగం.4.6.23.
- తొలి ముస్లిం మహిళా మంత్రి ,జాతీయ మహిళా సంస్థ అధ్యక్షురాలు,రెడ్ క్రాస్ సేవకురాలు శ్రీమతి మసూమా బేగం(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జూన్
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.3 వ భాగం.3.6.23
- అనేక మలుపులు తిరిగి గమ్యస్థానం చేరిన ‘’అనుకోని ప్రయాణం ‘’.
- గ్రంథాలయోద్యమ పితా మహ శ్రీ అయ్యంకీ వెంకట రమణయ్య గారు.3 వ భాగం.3.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.6 వ భాగం.3.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.2 వ భాగం.2.6.23.
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (508)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,078)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (376)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు