దశోప నిషత్ సారం –2

దశోప నిషత్ సారం –2

                                                                         ౦౩-kathopanishath –కధోప నిషత్ 
               ఇది కృష్ణ యజుర్వేదానికి చెందింది .ఇందు లో ఆరు భాగాలు .వాటికి వల్లి అని పేరు .నచి కేతునికి యమ ధర్మ రాజు బ్రహ్మ విద్య ను బోధించటం దీని లోని విషయం .మొదటి వల్లి లో బ్రహ్మ విద్యను అధికారిత్వం వున్న వాడికే నేర్పాలి .యమ ధర్మ రాజు నచి కేతున్ని పరీక్షించి ,నేర్ప టానికి అంగీక రించాడు .అన్నదాన కీర్తి  పొందాలని ,”వాజస్ర వసుడు ”అనే బ్రాహ్మణుడు ”సర్వ స్వ దక్షినాక యాగం ”చేశాడు .యాగ సమయం లో యజ మాని తన సర్వస్వాన్ని దానం చేయాలి .ఆయన ,పనికి రాని గోవుల్ని దానం చేశాడు .కొడుకు నచి కేతుడు చూసి తండ్రికి నరకం వస్తుందేమో నని భయ పడ్డాడు .అతనికి గొప్ప ”శ్రద్ధ ”ఆవహించింది .తండ్రి తో ”నన్ను ఎవరికి దానం ఇస్తావు ?”అని అడిగాడు .కోపం తో ఊగి పోయిన తండ్రి ”యముడికి ”అన్నాడు .అన్న మాట ప్రకారం కొడుకు యమ పురికి చేరాడు .అప్పుడు యముడు అక్కడ లేడు .మూడు రోజులు పడి గాపులు కాశాడు .ఆహారం కూడా లేదు .యముడు వచ్చి విషయం గ్రహించాడు .యజ మాని పుణ్యమంతా నశిస్తుంది అన్న విషయం తెలిసి ,క్షమా పణ కోరాడు యముడు .మూడు వరాలిస్తానన్నాడు .తండ్రికి తన మీద కోపం లేకుండా చేయమని ,అగ్ని విద్య ను నేర్పమని కోరాడు .యముడు అలాగే నేర్పి ”నచికేత చయనం ”అని పేరు పెట్టాడు .మూడవ వరం గా ”ఆత్మ విద్య ”ను బోధించ మని కోరాడు .”ఇహ లోకానికి చెందిన ”పితృ సౌమనశ్యం ”,పర లోకానికి చెందిన అగ్ని విద్య ,పునరావృత్తి రహితా మైన మోక్ష విద్య కోరు కొన్నందుకు యముడు సంతో షించాడు .మూడవ దాని నుంచి దృష్టి మరల్చ టానికి లోభ పెట్టాడు .కాని బాలుడు లొంగ లేదు .బ్రహ్మ విద్య ను తెలుసు కోవ టానికి కావలసిన వైరాగ్యం ,ముముక్షుత్వం మొద లైన సాధన సంపత్తి నచి కేతుని లో ఉన్నాయని తెలుసు కోని నేర్ప టానికి యముడు సిద్ధ  పడ్డాడు .
రెండవ వల్లి లో మానవుడు కోరదగినవి ప్రేయస్సు ,శ్రేయస్సు .అన్న వివరణ చేశారు .ప్రేయో మార్గం ఇహం లో సుఖం ,పరం లో స్వర్గం ఇస్తుంది .శ్రేయో మార్గం మొక్షాన్నిస్తుంది .బాలు డైనా శ్రేయో మార్గాన్నే కోరు కొన్నాడు నచి కేతుడు .”బ్రహ్మ విద్య వినే వాళ్ళే అరుదు .విని ,తెలిసి కొనే వారు మరీ అరుదు .తెలిసి సాధన చేసే వారు ఇంకా అరుదు .శ్రవణ ,మనన ,అది ధ్యాస చేసిన వారు అప రోక్ష సాక్షాత్కారం పొందు తారు .ముక్తు లౌతారు ”అని వివరించాడు .పంచ కోశాలకు అతీత మైన ఆత్మ సాక్షాత్కారమే మోక్షం .హృదయమే ఉప లబ్ది స్థానం .బ్రహ్మం ”హృదయ గుహ అనే చిదా కాశం లో వ్యక్త మౌతాడు .ఓంకారం వల్ల బ్రహ్మ సాక్షాత్కారం కలుగు తుంది దీని ఉపాసన వల్లే సగుణ ,నిర్గుణ బ్రహ్మ ప్రాప్తి కలుగు తుంది .వారే జీవన్ముక్తులు .జీవన్ముక్తుని దూషించే వారికి అతని పాపాలేమైనా ఉంటె సంక్ర మిస్తాయి .స్తుతించే వారికి పుణ్యంకలుగు తుంది .ప్రతి వాడు జీవన్ముక్తి సాధించాలి .
మూడవ వల్లి లో దేహ ,ఇంద్రియ ,మనో ,బుద్ధి మొదలైన వాటిలో వ్యక్తం గా ఆత్మ కర్త గా ,భోక్త గా ,జ్ఞాత గా కని పిస్తాడు .ఈశ్వ రార్పణ బుద్ధి తో నిష్కామ కర్మ చేసిన వారి మనస్సు శుద్ధం గా ఉంటుంది .వాళ్లకు ఆత్మ జ్ఞానం తేలిగ్గా కల్గుతుంది .శరీరమే రధం .జీవుడు రధికుడు .సారధి -బుద్ధి .గుర్రాలు ఇంద్రియాలు .కళ్ళెం మనస్సు .ఈ రధం తోనే మోక్షం పొందాలి .ఇంద్రియాల కంటే శబ్దాదులు ,వాటికంటే మనస్సు సూక్షమైనవి .మనసు కంటే బుద్ధి ,దాని కంటే మహత్వం ,దానికంటే అవ్యక్తం ,దాని కంటే పురుషుడు సూక్షం .శరీరం లో ఉన్నాడు కనుక పురుషుడు .శబ్డాడు లను ఇంద్రియాల్లో ,ఇంద్రియాలను మనసు లో ,మనసును బుద్ధి లో .బుద్ధిని మహత్వం లో ,దాన్ని అవ్యక్తం లో ,దానిని పురుషుని లో లయింప జేస్తే ఆత్మ సాక్షాత్కారమై మోక్షం లభిస్తుంది .గురు సేవ తో దీన్ని సాధించాలి .ఇదంతా విన్న వారికి బ్రహ్మ లోక ప్రాప్తి లభిస్తుంది .కతోపనిశాత్ పారాయణం అనంత ఫలం అని యముడు నచి కేతునికి బోధించాడు .
నాల్గవ వల్లి లో బ్రహ్మ శ్రుస్తి చేసే టప్పుడు ఇంద్రియాలను ”బహిర్ముఖ ప్రవ్రుత్తి కల వాణిని ”గా శ్రుస్తించాడు .అందుకే శబ్దం మొద లైన వాటి పై వాటికి ఆకర్ద్షణ ఎక్కువ .అంతర్ముఖం కాలేవు .వీటికి అతీతం గా ఉన్న వాడు మోక్షం పొందుతాడు .మనసు శుద్ధం కాక పొతే ప్రపంచమే నిజం అని నమ్ముతాడు .సు సంస్కృత మైన ఆత్మ సజాతీయ ,విజాతీయ ,స్వ ,పర ,భేద శూన్యమై న పర మాత్మే అవుతుంది   .
అయిదవ వల్లి లో దేహం లో 11 ద్వారాలున్నాయని ,శరీరం అద్దె ఇల్లు అనుకోవాలని ,అన్నిటా పర మాత్మ వ్యాపించి ఉన్నాడని ,ఆత్మకు ఆకారం లేదని ,ఏ ఆకారమూ లేని పరమాత్మ  ,అన్ని ఆకారాలు పొందుతాడని చెప్పారు .సూర్య ప్రకాశం అన్ని వస్తు వు లపై పడినా ,దానికి దోషం లేనట్లే పరమాత్మకు కూడా ప్రపంచం లోని గుణ ,దోషాలు అంటవు .
ఆరవ వల్లి లో సంసార వృక్షానికి మూలం -పైనా ,శాఖలు కిందా వున్నాయి .అంటే లోకం అంతా పర మాత్మ యందు ఆధార పడి ఉంది .ఇంద్రియాదులు పర మాత్మ కంటే వేరైనవి అని ,పరమాత్మ తన స్వరూపమే నని తెలిసిన వాడే ముక్తుడు .కనపడ లేదు కనుక లేడు అన రాదు .మనసు ,ఇంద్రియ నిగ్రహమే యోగం .యోగి మొక్షార్హుడు .సాగునా రాదన తో ప్రార్సంభించి ,నిర్గుణ పర బ్రహ్మ ను చేరాలి .కోరిక నశిస్తే హృదయ గ్రంధులు వివ్వ్హిన్న మౌతాయి .అదే ముక్తి .హృదయం లో 101 నాడుల్లో ”సుషుమ్న ”ముఖ్య మైంది .అది బ్రహ్మ రంధ్రం వరకు వ్యాపించి వుంటుంది .దాని ద్వారా ,ప్రాణం ఉత్క్రమాణం చెందితే ముక్తి .హృదయాకాశం లో ”అంగుష్ఠ  మాత్రం ”గా ఆత్మ ప్రకాశిస్తుంది .అన్న ,ప్రాణ ,మన ,విజ్ఞాన ,ఆనంద మయ మైన పంచ కోశాలను వేరు పరచి ఆత్మ సాక్షాత్కారం పొందాలి .
    4–ప్రశ్నోపనిషత్
                ఇది అధర్వణ వేదానికి చెందింది .ప్రశ్నే జవాబుగా ఉండటం చేత ,ఆ పేరు వచ్చింది .ముండకోపనిషత్ లోని విషయాలు కూడా ఇందులో కొన్ని ఉన్నాయి .వేద విదు లైన సుకేషుడు ,సత్య కాముడు ,సౌర్యాయని ,కౌశల్యుడు ,కాత్యాయనుడు ,భార్గవ వై దర్భి అనే ఆరుగురు మహర్షులు పిప్పలాదుని ఆచార్యుని గా స్వీ కరించి ప్రశ్నలు అడిగితె ఆయన చెప్పిన సమాధానమే ఈ ఉపనిషత్ .
  కాత్యాయనుడు ”దేని వల్ల ప్రజలు పుదు తున్నారు “”?అని అడిగాడు .పిప్పల మహర్షి ”హిరణ్య గర్భుడు అనే ప్రజా పతి తపస్సు చేసి ”రయి ”(ధనం )శబ్ద బోధితుడై న చంద్రుని ,ప్రాణ శబ్ద బోధితుడైన సూర్యుని ,సృజించారు .వీరిద్దరూ కలిసి సకల ప్రపంచాన్ని సృష్టించారు .సూర్యా చంద్రుల స్వరూపమే సంవత్సరం .దక్షణా యన ,ఉత్త రాయనాలు .చంద్ర లోకం చేరి మళ్ళీ భూమికి చేరే వారి మార్గం దక్షిణాయనం .జితేంద్రియత్వం బ్రహ్మ చర్యం ,ఆస్తిక్యం ,జ్ఞానం కల వారు సూర్య లోకానికి ఉత్తరాయణ మార్గం ద్వారా పోతారు .ఇక్కడ బ్రహ్మ తో పాటు మోక్షం పొందు తారు .దక్షిణాయన మార్గం వారికి పునర్జన్మ ఉంటుంది . .సూర్య సంచారం వల్ల అహోరాత్రాలు ,చంద్రుని వల్ల తిధులు యేర్పడ తాయి .ఋతువులు ,మాసాలు సూర్యుని వల్లనే కనుక ”ప్రజా పతి ”అయాడు .అన్నం వల్ల ప్రజలు పుడు తున్నారు కనుక ”అన్నమూ ”ప్రజా పతి స్వరూపమే .ఋతు కాలమ్ లో స్వ భార్య తో సంగ మించాటమే ప్రాజా పత్యం .
  భార్గవ మహర్షి ”ఎందరు దేవతలు ఈ దేహాన్ని ధరిస్తున్నారు -ఎవరు ఇందులో గొప్ప వారు ?”అని ప్రశ్నించాడు .దానికి సమాధానం గా పిప్పల మహర్షి చెప్పిన సమాధానం తెలుసు కొందాం .”పంచ భూతాల మ్కర్మెంద్రియ,జ్ఞానేంద్రియాల మనో బుద్ధుల అభిమాన దేవస్థ లంతా దేహాన్ని ధరిస్తారు .వీరిలో ఎవరికి వారే గొప్ప గా భావించారు .అయితె ప్రాణం లేక పొతే శరీరం లేదు కనుక ప్రాణమే అన్నిటి కంటే గొప్పదని తీర్మానించారు .దేవతలంతా ప్రాణాన్ని ”నీవే అగ్నివి ,సూర్య ,మేఘ ,పృధివీ చంద్రుడివి .అమృత రూపుడివి ,సమస్తం నీ లో ఉన్నాయి .నీవే ప్రజా పతివి .భోగ్య భోక్తలు నీవే .దేవతలకు హవిస్సు లందించేది ,పితృదేవతలకు ”స్వద ”అందించేది నీవే .సత్యం ,రుద్రం జ్యోతి నీవే .ప్రధమ శరీరివి నీవే .తల్లి ,తండ్రి నీవే .సర్వ సంపదలకు కారణం నువ్వే .ప్రజ్ఞా ను మాకు ప్రసాదించు ”అని ప్రార్ధించారు .
  కౌశల్యుడు -”ప్రానోత్పత్తి ఎలా జరుగు తుంది ?”అని అడిగాడు .పిప్పలుని సమాధానం –”ఆత్మ వల్ల ప్రాణం కల్గుతుంది .చాయ లాగ ఆత్మకు ప్రాణం అంటే వుంటుంది .ప్రాణం ఆత్మ లోనే లయమవుతుంది .నాసిక ద్వారా ప్రవర్తిస్తుంది .మల మూత్రాలకు అపాన వాయువు లా ఉంది .తిన్నస ఆహారం నాభి లో పచనమై సమానంగా వ్యాపించ టానికి ”సమాన వాయువు ”గా ,హృదయం లో ఆత్మ తో కలిసి ఉంది .నాడులలో ”వ్యాన వాయువు ”ఉంది .ఉదాన వాయువు ఊర్ధ్వ ముఖ ప్రయాణానికి దారి .సూర్యుడు ముఖ్య ప్రాణాన్ని ”నేత్రం ”లో ఉంచాడు .దాని వల్ల రూపం తెలుస్తుంది .శరీరం పడి పోకుండా అపాన వాయువు కాపాడుతుంది .శరీరాంతర్గత మైంది సమాన వాయివు .వ్యాన వాయువు శరీరం అంతా వ్యాపించి ఉంటుంది .ఉదాన వాయువు ”ప్రాణ ఉత్క్రమనకు ”కారణం అవుతుంది .మిగతా నాలుగు శరీరం నిలవ టానికి కారణం .ప్రాణాన్ని తెలిసి కోని ప్రాణో పాసన చేస్తే పుత్ర పౌత్రాది సంతానం నశించదు .అమరత్వం  చెందు తాడు .
 నాల్గవ ప్రశ్నను సౌర్యాయన రుషి వేశాడు .”ఏ ఇంద్రియాలు నిద్రా స్థితి లో ఉంటాయి?”జాగ్రదవాస్త లోనివి ఏవి ?స్వప్నం ఎవరు చూస్తారు ?దేనిలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి?”సమాధానం గా పిప్పల మహర్షి ”స్వప్నం లో ఇంద్రియాలన్నీ మనసు లో లయం అవుతాయి .జాగ్రత్ స్తితి లో మళ్ళీ బహిర్గాతమావు తాయి .స్వప్నం లో చూపు ,వినికిడి ,వాసన ,రుచి స్పృహ ఉండదు .నడవటం మాట్లాడటం ,విసర్జన ,ఆనంద్సం అనుభవించ లేదు .ఇంద్రియాలు నిద్రిస్తున్నా ,పంచ ప్రాణాలు మేల్కొనే ఉంటాయి .అపానం ;;గార్హ పత్యం ”గా ,ప్రాణ వాయువు ”ఆహ్వ నీయం ”గా ,వ్యాన వాయువు ”దక్షిణాగ్ని ”గా ,సమాన వాయువు ”హోత ”గా ,ఉదాన వాయువు ”యాగ ఫలం  ”గా ,మనస్సు ”యజ మాని ”గా ఉంటాయి .ఉదాన వాయువు ఆనంద రాసైక స్వరూపమై బ్రహ్మాన్ని సుషుప్తి లో పొందుతుంది .స్వప్నం లో ఆత్మ తన మహిమలను అనుభ వీస్తుంది .జాగ్రత స్తితి లో పొందిన అనుభవాన్ని వాసనా రూపం గా అనుభ వీస్తుంది .వెనుకటి జన్మ లోని విశాలను కూడా ”మనసు ”చేత స్వప్నం లో చూస్తుంది .
                       మనో రూప మైన జీవుడు తేజస్సు తో ఎప్పుడు అభి భుతూ దౌతాడో అప్పుడు స్వప్నాలను చూడ లేక ,స్వ స్వరూప మైన సుఖాన్ని నిద్ర లో అనుభ విస్తాడు .సర్వం పరమాత్మను ఆశ్రయించే ఉంటుంది .అంటే ఆత్మాశ్రయమే .ఆత్మ చూసేది వినేది ,తెలిపేది ,తెలుసుకొనేది .కర్త ,జ్ఞానం కూడా ఆత్మే .ధర్మా లన్ని ఆత్మ లోనే ఉన్నాయి .ఈ ధర్మా లన్ని అవిద్య చే ఆత్మ లో ఆలోచించ బడుతాయి .ఇదే ఆత్మ జీవిత్వ దశ .ఉపాధి తొలగి ,పోగానే ,జీవత్వం పయి ,స్వస్వరూపం మిగుల్తుంది .జలం లోని ప్రతి బింబం ,,జలం ఎలా ఎండి పొతే బింబం తో కలిసి పోయి నట్లు ,జీవుడు పరమాత్మ లో ఐక్యం అవుతాడు .ఎవరు నామ ,రూప కల్పిత మైన ఉపాధి లేని వాడు ,రాజసాది గుణాలు లేని వాడు శుద్ధుడు .అక్షరుడు అయిన పరమాత్మను తెలుసు కొంతాడో ,అతడే సర్వజ్ఞుడు .సర్వ స్వరూపుడు .సర్వాత్మ భావుడు .అంటే పరమాత్మ స్వరూపుడు అవుతాడు .ఈ విధం గా స్వప్నం సుషుప్తి ,విచారణ తో జీవాత్మ .పర మాత్మ ల అనన్యత్వం నిరుపించ్బడింది .
   అయిదవ ప్రశ్న ను సత్య కామ రుషి వేశాడు /”ఓంకారం జపిస్తే ఫల మేమిటి ?”అని అడిగితె ”ఓంకారం పర ,అపర బ్రహ్మ సాక్షాత్కారన్నిస్తుంది .అ వు అం అనే మూడు మాత్ర లతో ఏర్పడింది .అ కారాన్ని ఉపాశిస్తే సంపన్న మైన మనిషి జన్మిస్తాడు .తపస్సు ,బ్రహ్మ చర్యం శార్ద్ధ కలిగి మానుశానందాన్ని పొందు తాడు .ఉకారాన్ని ఉపాశిఅస్తే యజురాభి మాన దేవతక్ల చే సోమ లోకం పొంది ఐశ్వర్యాన్ని అనుభవించి ,మళ్లి మనుష్యులు గా జన్మిస్తారు .ఓం ను జపించిన వాడు సూర్య లోకం చేరతాడు .సామ వేదాభి మాన దేవతలు బ్రహ్మ లోకాన్ని ,(హిరణ్య గర్భం )ఇస్తారు .ఆయనే జ్ఞానం పొంది ,బ్రహ్మత్వం పొందుతారు .అంటే ఓంకారం ఉపాశిఅస్తే హిరణ్య గర్భుని కంటే ఉత్కృష్ట మైన పర బ్రహ్మ సాక్షాత్కారం పొందు తాడు .
ఆరవ ప్రశ్న సుకేశ మహర్షి అడిగాడు .”షోడశ కళా పూర్ణుడైన పురుషు డెవరు ?”దానికి సమాధానం -”శాదశ కలా పురుషుడు మన శరీరం లోనే హృదయా కాశం లో ఉన్నాడు .అతని వల్లనే ఆ కళలు పుడుతున్నాయి .ఆత్మ నిష్కలుడు ,అవయవ హీనుడు కదా .మరి ఎలా పుదు తున్నాయి /అవిద్య వల్ల అతనిలో వున్నట్లు అని పిస్తాయి .విద్య వల్ల ఉపాధులు నశించి ,నిర్వి శేషుదౌతాడు .సృష్టి విధానం ఇలా జరిగింది –పరమ పురుషుని ఆలోచనా ఫలితం గా సృష్టి  ఏర్పడింది .మొదట హిరణ్య గర్భం ,ఆ తరువాత వరుసగా శ్రద్ధ ,ఆకాశం ,వాయువు ,తేజస్సు ,జలం ,పృథ్వి ,,,జ్ఞాన కర్మేంద్రియాలు మనసు ,అన్నం ,వీర్యం ,తపస్సు మంత్రాలు ,కర్మా ,లోకాలు పేర్లు వరుసగా సృష్టింప బడి నాయి .అవిద్య వల్ల ఇవి ఏర్పడి విద్య లో నశిస్తున్నాయి .పిప్పలుని ఉప దేశానికి మహర్షులు చాలా సంతోషించి కృతజ్ఞత తెలిపారు .

     దీని తర్వాత ”మున్డకోప నిషత్ ”గురించి తెలుసు కొందాం

 సశేషం —మీ–గబ్బిట దుర్గా ప్రసాద్–30 -03 -12 .


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.