దశోప నిషత్ సారం –3
ముండక ఉపనిషత్
ఇది అధర్వణ వేదానికి చెందింది .మూడు అధ్యాయాలు ,రెండేసి ఖండాలున్నాయి .బ్రహ్మ విద్యను గురించి చెప్పినది .ముండక అంటే శిరస్సు .శబ్ద ,శైలీ ,ఛందస్సు విషయ గాంభీర్యం వల్ల ఇది శిరో భూషణ మైంది .అందుకే ఆ పేరు .చివరి మంత్రం లో ”శిరో వ్రతం ”చెప్ప బడటం తో అన్వార్ధ మైంది .”సంపూర్ణం గా క్షుర కర్మ చేసిన శిరస్సు మీద అగ్ని ధరించి వ్రతం ఆచా రించే వారికే ఈ ఉపనిషత్ లోని బ్రహ్మ విద్య ఉపదేశం చేస్తారు ”కానుకను మున్దకోపనిశాతయింది .ఇందు లోని కొన్ని భాగాలు ”బ్రహ్మ సూత్రాలు ”లో విని యోగింప బడినవే .
సృష్టి కర్త అయిన హిరణ్య గర్భుడు దేవతలలో ప్రధముడై ,అభివ్యక్తి ని పొంది ,బ్రహ్మ విద్య ను నేర్చి ,తన పుత్రుడైన ”అధర్వుని ”కి ఉప దేశించాడు .ఇందు పరాపర విద్య బోధింప బడింది .నిర్గుణ బ్రహ్మాన్ని బోధించేది పర విద్య .సగుణ బ్రహ్మాన్ని తెలిపేది అపర విద్య .ధర్మా ధర్మాలు ,సాధనా,ఫలాలు ,ను చెప్పేది అపారం .ఇది పర విద్యకు మార్గం చూపిస్తుంది .శౌనకుడు అనే మహర్షి అంగీరసుడు అనే గురువు వద్ద కు కానుక ను తీసుకొని వెళ్లి ”ఏ వస్తువు ను గురించి తెలుసు కొంటె ,సర్వం తెలియ బడు తుందో దాన్ని నేర్పండి ”అని అడిగాడు .అందుకే దీన్ని ”ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞాన ప్రసంగం ”అంటారు .తత్వాలు మూడు .జగత్తు ,జీవుడు ,ఈశ్వరుడు .దీనిలో దేని తత్వాన్ని తెలుసు కోన్నా మిగిలిన రెండు తెలుస్తాయి .నాలుగు వేదాలు ,శాస్త్రాలు ,మొదలైన వన్నీ అపర విద్యలు .దేనితో పర బ్రహ్మాన్ని పొంద గలమో దాన్ని చెప్పేది పర విద్య . అక్షర బ్రహ్మాన్ని చెప్పేది ఉపనిషత్ .ఇవీ అపర విద్యలే .దీని వల్ల పర బ్రహ్మ ప్రాప్తి లభిస్తుంది కనుక ఆ విజ్ఞానం పర విద్యే .పర విద్య అదృశ్యం ,అగ్రాహ్యం .అగోత్రం ,అవర్నం ,నిత్యం ,విభువు ,సర్వత్వం ,సూక్ష్మం ,సర్వ వ్యాపకం ,అవ్యయం ,సర్వ భూత కారణం .సాలె పురుగు తన లో నుంచే దారాన్ని తీసి గూడు కట్టి నట్లు ,ఓషధులు తమంత తాము జన్మించి నట్లు ,మానవుని కేశాలు ,రోమాలు సహజ మైనట్లు అక్షర పర బ్రహ్మం నుంచి సృష్టి ఏర్పడుతుంది .
సాలె పురుగు ఉదాహరణం వల్ల బ్రహ్మం ,జగత్తుకు నిమిత్త ఉపాదాన కారణం .ఒశాధులకు పృథ్వి ఆధార భూతం .మూడవ దాని వల పురుష ప్రయత్నం లేకుండా నే జగత్ సృష్టి జరిగింది .చైతన్యం తో పాటు ,జడమైన కేశాలు ,గోళ్ళు సహజం గా ఏర్పడుతున్నాయి .అలాగే బ్రహ్మ ప్రయత్నం లేకుండా ఆయన లక్షానికి విలక్షణ మైన జడ స్వరూపం గాను సృష్టి జరుగు తోంది .అన్ని కార్యాలకు కారణం ఎలా అవసరమో ,కార్య మైన జగత్తు కు కారణం ఉండాలి .అదే సర్వజన మైన బ్రహ్మం .బ్రహ్మం ప్రయత్నం లేకుండా సృష్టి జరుగు తోంది కనుక ,జగత్తు ను సృష్టించిన మరో శక్తి బ్రహ్మం లోనే ఉంది .బ్రహ్మం వివర్త రూపం లో వృద్ధి చెందగా ,ఆయన లోని శక్తి (మాయా శక్తి )ఇచ్చా శక్తి,హిరణ్య గర్భుడు ,మనస్సు ,భూతాలు ,ప్రాణులు ,కర్మలు ,ఫలాలు కల్గుతున్నాయి .కర్మ ఫలమే అమృతం .అక్షర పరమాత్మ సర్వజ్ఞుడు ,సర్వ వేత్త ,జ్ఞాన తపస్సు కల వాడు ..జీవుల అనుభవాలు విచిత్రం గా ఉండ టానికి కారణాలు పూర్వ కర్మ ఫలమే .అంటే కాని పరమేశ్వర పక్ష పాఠం కాదు .
ద్వితీయ ఖండం
అగ్ని హోత్రాది కర్మలు విద్యుక్తం గా చేయక పొతే వచ్చే దోషాలు ,చేస్తే వచ్చే ఫలితాలు మొదటి ఆరు మంత్రాలలో చెప్పారు .కర్మ ఫలం అనిత్యం కనుక వైరాగ్యం అవసరం .యజ్ఞాది కర్మలు వాటి పడవల వంటివి .సంసార సాగరాన్ని దాటింప లేవు .వీటి లో తిరిగే వారు గుడ్డి వారే .యజ్న ఫలం గా స్వర్గాన్ని పొంది మళ్ళీ జన్మిస్తారు .వైరాగ్యం ఒండితే మళ్ళీ బ్రహ్మను చేరతాడు .
ద్వితీయోధ్యాయం -ప్రధమ ఖండం
ప్రజ్వ లించే అగ్ని నుంచి సమాన రూపాలైన అగ్ని కణాలు పుట్టి నట్లు ,సత్య పర బ్రహ్మం నుంచి వివిధ జీవులు పుదు తున్నాయ్ .అందులోనే లయమవుతున్నాయి .అగ్నికి ,అగ్ని కణానికి ఎలా భేదం లేదో జీవునికి ,బ్రహ్మానికి భేదం లేదు .కర్మ వాసన చేత సృష్టి జరుగు తోంది .శరీర ఉపాధులు నశిస్తే ,ఘటా కాశం ,మహా కాశం లో కలిసి నట్లు బ్రహ్మం లో జీవులు ఐక్యమౌతారు .ఇదే విరాట్ పురుషుని వల్ల శకలం సృష్టింప బడు తోంది .ఆతనికి కూడా బ్రహ్మమే కారణం .అది తెలిసి న వాడు జీవన్ముక్తి పొందు తాడు .
ద్వితీయ ఖండం
మనసు ద్వారా బ్రహ్మాన్ని తెలియాలి .ఓంకారమనే ధనుస్సు తో ,చిత్త ఏకాగ్రత అనే లక్ష్యాన్ని ,జీవుడు అనే బాణం తో బ్రహ్మ మనే లక్ష్యాన్ని కొట్టాలి .ఓంకారం తో ఏకాగ్రత ను సాధించాలి .ఆత్మేతర ప్రసంగాలు మానె యాలి .అంతటా బ్రహ్మమే .హృదయాకాశం లోనే ఆత్మ సాక్షాత్కరిస్తుంది .”సర్వం ఖల్విదం బ్రహ్మ ”
తృతీయ ముండకం -ప్రధమ భాగం
ఒకే మోస్తరు గా ఉన్న విడదీయ లేని జంట పక్షులు ఒకే వృక్షాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి .అందులో ఒకటి కమ్మని ఫలాలు తింటోంది .రెండవది ఏదీ పట్ట నట్టు ఉంది .ఇవేజీవ ,ఈశ్వరులు .మొదటిది కర్మ ఫలం అనుభ విస్తుంటే ,రెండవ దానికి సర్వజ్ఞత్వం వల్ల ఆ ఫలం లేదు .శరీరమే వృక్షం .జీవేశ్వారులు నిజం గా ఒక్కరే .ఉపాధి భేదం వల్ల ఇద్దరు గా కని పిస్తున్నారు .అజ్ఞానం చేత జీవుడు దుఖితుడు .జ్ఞానం తో శోక రహితుడు -ఈశ్వరుడు .జ్ఞానం వల్లనే జీవుడు ఈశ్వరుదౌతాడు .ప్కరమాత్మ స్వరూపం తెలిసిన వాడు ”ముని ”యై ,ఆత్మ లోనే క్రీడించి ,రామిస్తాడు .అతడు బ్రహ్మ వేత్త లలో శ్రేష్టుడు .ఆహ్య సాధనా పేక్ష ఏ క్రీడా .నిర పెక్షయే ”రతి ”
సత్యం తో ,ఏకాగ్ర తపస్సు తో యాత్మ జ్ఞానం తో ,ఆత్మ సాక్షాత్కారం పొందాలి యతీశ్వరులు హృదయా కాశం లో ఆత్మ సాక్షాత్కారం పొందుతారు ”.సత్యమే జయం ”.ఆత్మకు రూపం లేదు కనుక కంటికి కన్పించదు .వాక్ చెప్ప లేదు .ఇంద్రియ గొచరం కాదు .ఆత్మ జ్ఞానికి భోగేచ్చ లేదు . ద్వితీయ ఖండం
పరబ్రహ్మాన్ని తెలిసిన పురుషుని సేవించిన వారికి కూడా బ్రహ్మో పాసన ఫలం కలుగు తుంది .బ్రహ్మ వేత్త సాక్షాత్తు బ్రహ్మమే .అలాంటి పురుషుని ఉపాసన బ్రహ్మో పాసనే .ప్రాపంచిక విషయాలను కోరే వారు జన్మ పరం పర లో పడి మోక్షాన్ని పొంద లేరు .కామ త్యాగం వల్ల ఆత్మ కాముడు ఆప్త కాము డౌతాడు .ఆత్మ జ్ఞానం తోవిషయ ,కామాలు నశిస్తాయి .సర్వ కామాల సంపూర్ణ త్యాగమే మోక్ష సాధనం .బహు వేదాధ్యయనం చేత మేధా ,అన్య శాస్త్ర ప్రావీణ్యం చేత లభ్యం .ఆత్మేచ్చ కల వారికి పర మాత్మ తన పార మార్ధిక స్వరూపాన్ని ప్రకాశింప జేస్తాడు సన్యాస పూర్వక జ్ఞానమే బ్రహ్మ లోకా వాప్తి .బ్రహ్మ లోకం అంటే బ్రహ్మమే లోకం .బ్రహ్మ జ్ఞానికి బ్రహ్మ విదుడే జన్మిస్తాడు .
సశేషం
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –30 -03 -12 .

గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com