దశోపనిషత్ సారం –6

 దశోపనిషత్ సారం –6

                                    ఐతరేయ ఉపనిషత్
  ఇది ఋగ్వేదానికి చెందింది .30 అధ్యాయాలు ,ఎనిమిది ఖండాలున్నాయి .ఒకటవ అధ్యాయం  మొదటి ఖండం లో సృష్టికి పూర్వం ఆత్మ ఒక్కటే .దాని నుండి నామ రూపాత్మక జగత్తు సృష్టి జరిగింది .ఆత్మ నిజం గా త్రికాలాతీతం ,నిత్యం .దానికి పూర్వ ,పరాలు లేవు .సాంఖ్యులు సృష్టికి ముందు ఏమీ లేదు అంటారు .తార్కికులు పరమాణువులు అంటారు .ఆత్మ ”లోకాన్ని సృష్టిస్తాను ”అన గానే సృష్టి జరిగింది .మాయ అంటే ఆత్మ శక్తిమాత్రమే .ఆ శక్తి విజ్రుమ్భానే ఆలోచించటం మొద లైన క్రియలు .ఆ ఆలోచన ల తో ”అమ్భస్సు ‘,,కిరణం ,మారం ,జలం ఏర్పడ్డాయి .ద్యులోకానికి అవతల అంభో లోకం .కిరణం అంటే అంత రిక్షం .మారం అంటే భూలోకం .అధోలోకాలు జలాలు .అమ్భోజానికి అంటే విద్యుల్లోకానికి పైన మహర్లోక ,జనోలోక ,తపోలోక సత్య లోకాలున్నాయి.వాటి నుండి వర్ష రూపం గా జలం వస్తుంది .కనుక ఇవన్నీ అంభో లోకాలే .సూర్య కిరణాల ఆధారం వల్ల అంతరిక్షం ,మరీచీ లోకం ,ఏర్పడ్డాయి .భూలోక వాసులు మరణ జీవులు కనుక ”మర లోకం ”అన్నారు .మర అంటే మరణం .అడుగున ఉన్నవాన్ని భోగాభుములు అయిన జల లోకాలు .ఆత్మ నుంచి పుట్టిన ఈ నాలుగు లోకాల ద్వారా సృష్టి జరిగింది .లోకాల తర్వాత లోక పాలకులను సృజించాడు .సంరక్షకుడు విరాట్ పురుషుని ,అతని శిరస్సు ,హస్త,పాదం అనే అవయవాలన్నీ పంచ భూతాలే .విరాట్ పురుషుని నుంచి లోక పాలకు లేర్పడ్డారు .
ఆ విరాట్ పురుషుని  ముఖ గోళం ,దానిలో వాగింద్రియాలు ,దాని అధిష్టాన దేవత అగ్ని ,నాశిక గోళం ,ఘ్రానేన్ద్రియం ,అధిష్టాన దేవత వాయువు ,నేత్ర గోళం దర్శనం అధిష్టాన దేవత సూర్యుడు ఏర్పడ్డాయి .కర్ణం -శ్రోత్రిన్ద్రియం .దిక్కులే దేవతలు .చర్మం స్పర్షేన్ద్రియం .ఓషధి వనస్పతులు దేవతలు .హృదయం అంతః కారణ అనే మనస్సు .దేవత చంద్రుడు .సర్వ బంధన స్తానం నాభి విసర్జనేన్ద్రియం మృత్యువు .శిశినం ,రేతస్స్సు జలం ప్రజా పతి .ఇంద్రియ గోళాలు స్తులం .వ్యవహరించే ఇంద్రియాలు సూక్ష్మం అధిష్టాన దేవతల అనుగ్రహం తో యింద్రియ వ్యాపారాలు జరుగు తున్నాయి .
రెండవ ఖండం లో ఇంద్రియాలకు అధిష్టాన దేవత లైన అగ్ని మొదలైన వారు ,తాము నివశించ టానికి తగిన శరీరాన్ని సృస్టించ మని సృష్టి కర్తను ప్రార్ధించారు .గోవులను సృష్టించాడు .పై దంతాలు లేవు పనికి రాదన్నారు .అశ్వాన్ని సృష్టించాడు .విజ్ఞానంలేదు కనుక ఒద్దన్నారు .పురుషున్ని సృష్టించాడు .వివేక సంపన్నం కనుక అందులో ప్రవేశిస్తాం అన్నారు దేవతలు .మానవ శరీరమే మోక్ష సాధనం కనుక అందులో ప్రవేశిస్తా మన్నారు .పురుష శరీరం లో ,ఆయా ఇంద్రియ గోళాల్లో ప్రవేశించమని ఆజ్ఞా పించాడు .అగ్ని -వాగ్రూప లో ముఖం లో ,వాయువు ప్రాణ వాయువు గా నాశిక లో ,సూర్యుడు తేజో రూపం గా కళ్ళలో ,దిక్కులు శ్రోత్రెంద్రియంగా చెవుల్లో ,ఓషధులు ,వనస్పతులు మరో రూపం లో చర్మం లో ,చంద్రుడు మనో రూపం లో హృదయం లో ,మృత్యుదేవత అపాన రూపం గా నాభిలో ,జలాలు రేతస్సు రూపం గా శిశినం లో ,చేరారు .ఇంద్రియ గోళాలు ఆది భౌతికాలు .ఇంద్రియాలు ఆధ్యాత్మికాలు .అగ్ని మొద లైనవి ఆది దైవికాలు .జీవుని ప్రయోజనానికే ఇవన్నీ ఏర్పాటు చేశాడు .
ఆకలి ,దప్పిక ఉన్న వారికి ఆహారం లోనే భోగం కల్పించాడు .ఆహారం చేత తృప్తి పొందితే ఖుత్పిపాసలు కూడా తృప్తి చెందుతాయి .జీవుడు ఈ సంఘానికి అధ్యక్షుడు భోక్త .మూడవ ఖండం లో ఈ దేవత లందరికి అన్నాన్ని సృష్టించినా విధానం ఉంది .దీన్ని గ్రహించ టానికి అపాన వాయువును సృష్టించి పురుషునికి ఇచ్చాడు .అది ,పురుషుని లో చేరి ,తన శక్తి తో అన్నం ముఖం ద్వారం గుండా లోపలి పోయి జతరాగ్ని తో హుతమై మల రూపం లో బయటికి వెళ్తుంది .అపానం అంటే ప్రాణ ఉదాన ,అపాన ,వ్యాన ,సమాన అన్న అయిదు పేర్లతో పిలువ బడే వాయువే .
పరమేశ్వరుడు శిరస్సు ద్వారా ప్రవేశించాలని నిశ్చయించుకొని శిరస్సు చీల్చుకొని ప్రవేశించాడు .ఈ ద్వారాన్ని ”విద్రుతి ”అంటారు .”నందవ ”అనే పేరూ ఉంది .పర మేశ్వరుడు పురుష శరీరం లో జీవుడు అయాడు .ప్రాణ రూపం గా పాదాల్లో చేరాడు .జ్ఞానేన్ద్రియాలన్ని శిరో భాగం లోను ,కర్మేన్ద్రియాలన్ని అదోభాగం లోను ఉన్నాయి .విద్రుతి -సుషుమ్నా నాడి చివరి భాగం .బ్రహ్మాన్ని చేరే మార్గం కనుక దీన్ని బ్రహ్మ రంధ్రం అన్నారు .బ్రహ్మానంద కారణం కనుక ”నందనం ”అని పేరు .జీవుడికి మూడు నివాసాలున్నాయి .జాగ్రత్ కాలమ్ లో నేత్రాలలో ,స్వప్నం లో కంఠం లో ,సుషుప్తి లో హృదయం లో క్రీదిస్తాడు .బ్రహ్మ వర్చస్సు నేత్రం లో కన్పిస్తుంది .దీనికే అవస్తా త్రయం అని పేరు .జ్ఞానం తో తురీయ అవస్త పొంది ,సమాధి స్తితి లో బ్రహ్మానందం పొందుతాడు .అవసాన కాలమ్ లో బ్రహ్మ రంధ్రం ద్వారా ప్రానోత్క్రమణ చేసి ఉత్తమ లోకం చేరతాడు .సుకృతం తో సంసారం మాయ అని తెలుసు కోని ,సాక్షాత్కారం పొంది ముక్తుదౌతాడు .,
బ్రహ్మాత్మిక సాక్షాత్కారం పొందిన జ్ఞాని నిత్య పరోక్ష అఖండ ఆనందాత్మక మైన నిజ స్వరూపాన్ని కనుగొని ,”ఇప్పటికి నేను ఆనందించ గలిగాను కదా ”అనుకోని ఆనందిస్తాడు .అందుచే అతడు ”ఇదంద్రుడు ”అని పిలువ బాదుతాడు .ఇదం అంటే ఈ జీవ బ్రహ్మిక్యాన్ని ద్ర అంటే చూసిన వాణ్ని అని అర్ధం .పరమాత్మ తత్వాన్ని పొందిన వారిని ,ఇదంద్రాదులు ”ఇంద్రుడు ”అంటారు .
రెండవ అధ్యాయం లో జీవుడు ఆహార రూపం లో ”రేతస్సు ”అవుతున్నాడని చెప్పారు .స్త్రీ తో కలిసి నపుడు పిండం ఏర్పడుతుంది .పిత్రుశారీరం ప్రధమ స్తానం .స్త్రీ గర్భం లో చేరి బయటకు రావటం ద్వితీయ జన్మం .పుత్రాత్మక మైన దేహం తండ్రిదే .పుణ్య కర్మ కోసం తన రూపమే అయిన కుమారుడు ప్రతినిధి గా అవసాన కాలమ్ లో ఉంటాడు .శరీరం వదిలి ,ఇంకో దానిలో చేరటం తృతీయ జన్మ .వామా దేవుడు మాత్రు గర్భం లో ఉండే ,”ఆత్త్మ జ్ఞానం తో అజ్ఞానం పోయింది .సంసార బంధం నుంచి తప్పించుకొన్నాను అ”’అన్నాడు .అంటే ప్రతి బంధకం లేక పొతే వెంటనే మోక్షం వస్తుంది .వామా దేవుడు మాత్రు గర్భం లోనే ఆత్మ స్వరూపం టుసు కొన్నాడు .అందుకే మ్రుత్యుగార్భ నివాస మాత్రం గానే సర్వ బంధాలు తొలగి పోయాయి .అజర ,అమృత ,అభయ ,అపూర్వ ,అనపర ,అనంతర ,అబాహ్య ప్రజ్ఞా నామ్రుతైక రస మైన స్వస్వరుప పర మాత్మ భావం పొంది అమ్రుతుడయాడు .మర్త్య భావం పోయి జీవన్ముక్తుడైనాడు .అందుకని ప్రాణ ఉత్క్రమణ లేదు ..అమ్రుతత్వమే లభించింది .
మూడవ అధ్యాయం లో ప్రజ్ఞాన రూప మైన ఆత్మ -శరీరం లో ప్రవేశించి ,హిరణ్య గర్భ ,ఇంద్ర ,ప్రజాపతి ,అగ్ని మొదలైన దేవతలు ,పంచ భూతాలు ,,జంతువులూ ,,సర్పాది అన్దజాలు ,జరాయుజాలు ,స్వేదజాలు ,ఉద్భిజాలు ,అశ్వ ,గో ,పురుషాదులు ,ఏనుగులు ,స్తావరాలు మొదలైన వన్నీ ప్రజ్ఞాన నేత్రాలే .అందుచే ప్రజ్ఞానమే బ్రహ్మ .సర్వ ప్రాణుల్లో ప్రకాశించే చైతన్య స్వరూప మైన ఆత్మ ప్రకాశమే నిర్గుణ పర బ్రహ్మ .ఇది తెలిసిన వామ దేవాదులు అమ్రుతులయారు .
చివరి భాగం గా ఛాందోగ్య ,బృహదారణ్యక ఉపనిషత్ లను తరువాత తెలియ  జేస్తాను
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -04 -12 .చైత్ర శుద్ధ నవమి -ఆది వారం -శ్రీరామ నవమి శుభాకాంక్షలతో

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.