దశోపనిషత్ సారం —7 -చివరి భాగం

దశోపనిషత్ సారం —7 -చివరి భాగం 

                                                         09 -ఛాందోగ్య ఉపనిషత్
   సామ వేదానికి చెందింది ఈ ఉపనిషత్. ”తత్వ మసి  ”అనేది ముఖ్య విషయం . .ఎనిమిది ప్రపాథకాలున్నాయి .ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞాన ప్రతి పత్తి -మూడవ పాతకం లో ”సర్వం ఖల్విదం బ్రహ్మ తజ్జా నీతి శాంత ఉపాసీత ”అని బోధింప బడింది .దృశ్య ప్రపంచం అంతా పర బ్రహ్మమే .దాని వల్లనే సృష్టి ,స్తితి ,లయాలు జరుగు తున్నాయి .”ఏకస్మిన్ విదుషి భుక్తే సర్వం జగ త్రుప్తం భవతి ”అంటే జ్ఞాని త్రుప్తుడైతే ,జగత్తంతా తృప్తి చెందుతుంది .
శ్వేత కేతువు తో తండ్రి ఉద్దాలకుడు ”తగిన గురువు వద్ద వేదాధ్యయనం చేయి ”అన్నాడు .విద్య నేర్చి గర్విష్టి యై తండ్రి దగ్గరకు వచ్చాడు .”ఏది తెలిస్తే అన్నీ తెలుస్తాయో ,దేనిని వింటే అన్నిటినీ విన్నట్లో ,దీనిని ఊహిస్తే సర్వాన్ని ఊహించినట్లో ”అలాంటి విద్య నేర్చావా ?అని అడిగాడు .లేదని చెప్పాడు కొడుకు .తానే వివరం గా బోధించాడు .మట్టి తో చేసిన వస్తువు మట్టి కన్నా వేరు కాదు .కుండ నామ మాత్రమె .సత్యమైనది మన్ను .మన్ను విషయం తెలిస్తే వాటి లోంచి వచ్చిన అన్ని విషయాలు తెలుస్తాయి .ఈ దృశ్య జగత్తు అంతా పూర్వం ”సత్ ”గా ఉండేది .అది ”ఏక మేవా ద్వితీయం ”అంటే ,సజాతీయ ,విజాతీయ భేదాలు లేనిది .దాని లోంచి అన్నీ వచ్చాయి .వీటి నామ రూపాలు తీసేస్తే బ్రహ్మ పదార్దమే మిగులు తుంది .కనుక బ్రహ్మను తెలుసుకొంటే జగత్తు తెలిసి నట్లే .ఆ సద్వస్తువే జాల రూపం పొందింది .దాని లోంచి పృథ్వి ,దాని నుంచి పంటలు ,వచ్చాయి .కనుక మూలం సత్ .దాని వల్లే సృష్టి జరిగింది .
చరా చర భుతాలన్ని అన్డజాలు ,జరాయుజాలు ,,ఉద్భవించాయి .కనుక జీవులన్నీ సత్ రూపమే  .తేజస్సు ,జాలం ,పృథ్వి ,”త్రివ్రుట్ కరణం ”చేయ బడి నాయి .ప్రతి భూతాన్ని రెండు భాగాలు చేసి ,ఒక భాగం అలానే ఉంచి ,మిగతా సగాన్ని రెండు భాగాలు చేసి ,ప్రతి భూతం యొక్క పెద్ద భాగం లో ఇతర భూతాల చిన్న భాగాలను కలపతామే ”త్రివ్రుట్ కరణం ”.దీని వల్లనే అగ్ని లోని ఎరుపు ,త్రివ్రుట్ కృతం కాని తేజోరుపం ,,దాని లోని శుక్ల రూపం ఏర్పడు తాయి .త్రివ్రుట్ కృతం కాని జలరుపం ,కృష్ణుని వర్ణం త్రివ్రుట్ కృతం కాని పృధ్వీ రూపం .అంటే అగ్ని ,ఆ భూత త్రయానికి భిన్నం కాదని భావం ..పురుషుడు తిన్న అన్నం జథారాగ్ని  చే పచనమయి మూడు భాగాలవుతుంది .స్తూల ,మధ్యమ ,శూక్ష్మం .స్తూలం  పురీషం గా బయటకు పోతుంది .మధ్యమ భాగం మాంసమవుతుంది .సుక్ష్మ భాగం మనస్సు అవుతుంది .జలం కూడా అంతే .స్తూలం మూత్రం గా ,మధ్యమం రక్తం గా ,సూక్ష్మం ప్రాణం గా మారుతుంది .మిగిలిన వాటి లో స్తూలం  ఎముక గా ,మధ్యమం మజ్జ గా ,సుక్ష్మం వాక్కు గా మారుతుంది .రక్త మాంసాదులు పృధివి ఆపం ,తేజో త్రివ్రుట్ కారణాలే .
అన్నం యొక్క సుక్ష్మ భాగం మనసు ను చేరి షోడశ కళలు గా మారుతాయి .అవే దర్శన ,శ్రవణ ,మననాలు .మానసిక వీర్యం గల పురుషుడు ”షోడశ కళా ప్రపూర్ణుడు   ”.మనస్సు అన్న మయం .అన్నం తింటేనే మనసు ద్రుధం అవుతుంది .  .”సత్వాత్  సంజాయతే జ్ఞానం ”అన్నారు అందుకే .సుషుప్తి స్తితి లో జీవుడిని ”స్వపితి ”అంటారు .అంటే సత్  అనే పదార్ధం తో ఏకం అవుతున్నాడని అర్ధం .పక్షి కాలికి తాడు కడితే ,అది తిరిగి తిరిగి అక్కడికే చేరుతుంది .అలాగే జీవుడు కూడా .జీవుడు మనసు ద్వారా కలిగే అనేక కామాలు అనే జాగ్రత్ స్వప్నా లలో ఎగ బడి సుఖాలను భావించి ,విశ్రాంతి లేక ,సుషుప్తి లో తన నిజ స్వరూపం తో అంటే సత్ తో  ఏకీభవించి ,నిజ మైన విశ్రాంతి పొందుతున్నాడు .పురుషుడు మరణిస్తే ”వాక్కు -మనసులో చేరుతుంది .మనసు ప్రాణాన్ని ,ప్రాణం తేజస్సు లో ,చేరుతాయి .ఇదే ”తత్వమసి ”.కనుక సత్ పదార్దమే శరీరం లో ప్రవేశించి ,జీవుడు గా వ్యవహరింప బడు తున్నాడు .జీవునికి ,బ్రహ్మానికి అద్వితీయమే .అంటే రెండు ఒకటే అని ఈ ఉపనిషత్  సారం .
  10 -బృహదారణ్యక  ఉపనిషత్ 
ఇది శుక్ల యజుర్వేదానికి చెందింది .పరిమాణం లో ,అర్ధ గౌరవం లో గొప్పది కనుక ఆ పేరు .అరణ్యం లో పథనం చేశారు  కనుక ఆరణ్యకం .
వాజసని పుత్రుడు ,వైశంపాయనుని శిష్యుడు ,అయిన  యాజ్న వల్క్యుడు గురువు గారి ఆగ్రహానికి బలై  నాడు .తన విద్య తనకు ఇమ్మన్నాడు .విద్యనూ అంతటిని భౌతికం చేసి ”వమనం ”చేశాడు .దీనిని ”తిత్తిరి పక్షులు ”భాక్షించాగా ,వాటి ద్వారానే ,వచ్చిన విద్యయే ”తైత్తిరీయ ఉపనిషత్”.యాజ్న్య వల్కుడు మళ్ళీ సూర్యుని నుండి విద్య నేర్చుకొన్నాడు అదే ”శుక్ల యజుర్వేదం ”దానినే ”వాజస నేయం ”అన్నారు .కాన్వ ,మాధ్యందిన శాఖలు గా ప్రచారం పొందింది .ఈశావాస్య ఉపనిషత్ మాధ్యందిన శాఖ కు చెందింది .బృహదారణ్యకం ”కాణ్వ శాఖ ”కు చెందినది .ఇందులో ఎనిమిది అధ్యాయాలున్నాయి .
జనక మహారాజు బ్రహ్మ విద్య నేర్చుకొన దలిచి ,”బహు దక్షినాకం ”అనే యజ్ఞం చేశాడు .ఉత్తమ గురువు ఎవరో తెలుసు కొన్నాడు .100 గోవులను తెప్పించి కొమ్ములను బంగారం తో అలంకరించి ,”మీలో బ్రహ్మ విద్య లో గొప్ప వారు గ్రహించండి ”అన్నాడు .యాజ్న్య వల్క్యుడు  తన శిష్యుడు సామశ్రవ వసువు ”ను గోవులను ఇంటికి తోలుకొని పొమ్మన్నాడు .మిగతా వారికి కోపమొచ్చింది .ఆశ్వలుడు ”నువ్వు బ్రహ్మష్టుడవని గర్వమా ?”అని అడిగాడు .ఆయన ”విద్వాద్వారేన్యులగు బ్రహ్మష్టులకు నమస్కారం .నేను గోవులను అపెక్షిస్తున్నాను .అందుకే అలా చేశాను ”అని వినయం గా చెప్పాడు .అందర్నీ వాక్యార్ధాలతో ఓడించాడు .వారందరూ ఆయన్ను గొప్ప ”బ్రహ్మ వేత్త ”గా తీర్పు చెప్పారు .ఆయన వద్దే జనక చక్ర వర్తి బ్రహ్మ విద్య నేర్చాడు .
ఆరవ అధ్యాయం -ఒక రోజూ యాజ్న్య వల్కుడు జనకుని కొలువుకు వెళ్ళాడు .కారణం అడిగాడు .తాను పూర్వం ;;జిత్వా ”గురువు వద్ద ”వాగ్దేవతయే బ్రహ్మం ”అని తెలుసుకోన్నానని  చెప్పాడు .అది అసంపూర్తి విద్య అని తెలిసినా ,ఆ గురువు పై గురు భావం తగ్గ లేదు అన్నాడు .”మీ గురువు గారు బాగా చెప్పారు .దాని ఆయతనం ,ప్రతిష్టా స్థానం గురించి చెప్పారా “”/?అని అడిగాడు .లేదన్నాడు .అయితె విద్యలో ఒక పాదమే తెలుసుకున్నావు .శిష్యుని ప్రార్ధన తో అంతా నేర్ప టానికి సిద్ధ పడ్డాడు .గో సహశ్రం దానం ఇవ్వ బోయాడు .విద్య నేర్చిన తర్వాతే దానం అన్నాడు యాజ్న్య వల్క్యుడు .జనకుడు తనకు ”ఉదంకుడు ”ప్రాణమే బ్రహ్మం ”అని ,బర్కుడు ఆదిత్యుడే బ్రహ్మం గర్దభీ విపేతుడు శ్రోత్రమే బ్రహ్మం ,అని ,విడగ్ధుడు హృదయ మే బ్రహ్మం ,అని చెప్పారని  అంటాడు .ఇదంతా అసమగ్రం అని తేల్చి సత్య  స్వరూప విజ్ఞానాన్నిబోదిస్తాడు .
 ద్వితీయ బ్రాహ్మణం
కుడి కంటి లోని పురుషుడు ”ఇందుడు ”అతడే ఇంద్రుడు .దీప్తి కలవాడే ఇందుడు .అతనినే వైశ్వానరుని గా ఉపాసించాలి .ఎడమ కంటి లోని వాడు ”పత్ని ”హృదయాకాశం వీరి స్థానం .అక్కడి రక్త పిండం వారి ఆహారం .అక్కడి వలయాకారం గా ఉన్న దోమ తెర వంటిది అక్కడి నుంచి పోయే ఊర్ధ్వ నాడి ,సంచారీ స్తానం .అది అతని శూక్ష్మం గా విభజింప బడి ,చీలి పోతుంది .హృదయం లో ”హితం ”అనే నరాలున్నాయి .అన్నరసం వీటి ద్వారా ప్రసరిస్తుంది .భోక్త్రు రూపమై ,వైశ్వానరుడు భోగ్య రూపమై న విరాట్టు ,ఇంద్ర ,ఇంద్రాణి దంపతులుగా వర్ణింప బడ్డారు .
తైజసుని తూర్పున తూర్పు ప్రాణం ,దక్షిణాన దక్షిణ ప్రాణం ,పశ్చి మాన పశ్చిమ ప్రాణం ,ఉత్త రాణ ఉత్తర ప్రాణం ,ఊర్ధ్వం గా ఊర్ధ్వ ప్రాణం ,అదో భాగం లో అధః ప్రాణం ,సమస్త దిక్కులలో ,సమస్త ప్రాణాలు ఉండటం తో తైజసుడు ప్రాణం తో ఏకత్వం పొందుతాడు .ప్రాణం అంటే ప్రాజ్ఞుడే .నేతి ,నేతి లో తురీయసాక్షీ భావం పొందు తాడు .
తృతీయ బ్రాహ్మణం -పురుషుడు ఏ జ్యోతిస్సుచే వ్యవహరిస్తున్నాడు ?అని జనకుని ప్రశ్న .సూర్యుడు అనే జ్యోతిస్సు వలన ,అస్త మించే టప్పుడు అని మళ్ళీ ప్రశ్న .చంద్రుడు అనే జ్యోతిస్సు తో అని సమాధానం .ఇద్దరు లేనప్పుడు అని ప్రశ్న .అగ్ని ,అదీ లేక పొతే ,వాక్కు ,వాక్కు కూడా లేక పొతే ఆత్మయే .ఆత్మ ఇంద్రియాలలో ఒకటా ?భిన్నమా ?అని మళ్ళీ ప్రశ్న .ఆత్మ విజ్ఞాన మయం .ఇంద్రియ మధ్యగతం .స్వయం జ్యోతి స్వరూపం .హృదయ అంతరస్త  పురుషుడే అని సమాధానం .నది రెండు ఒడ్డుల మధ్య ఈదే చేప లాగ జాగ్రత్ ,సుషుప్తి ల మధ్య లో తిరుగు తాడు .
చతుర్ధ బ్రాహ్మణం -ఆత్మ దుర్బలమై ,బుద్ధి పని చేయక ,స్మ్రుతి తప్పినపుడు ,తేజో రూప మైన ఇంద్రియాలను తనతో తీసుకొని హృదయం చేరతాడు .మరణ కాలం లో కన్ను చూడ లేదు .సూర్యాంశ కనుక సూర్యుని చేరు తుంది .జీవుడు ఏదో మార్గం గుండా ,బయటికి పోవ టానికి ప్రయత్నిస్తాడు .మంచి కర్మ చేస్తే కంటిద్వారా ప్రాణం పోతుంది .ఆదిత్య లోకం వస్తుంది .ఉపాసన చేస్తే శిరస్సు పగిలి ప్రాణం పోతుంది .హిరణ్య గర్భున్ని చేరతాడు .
ఆత్మను విద్య ,కర్మలు పూర్వానుభవం మే బాధిస్తాయి . .ఏ వస్తువు ను కోరుతాడో ,దానికి తగిన కర్మలు చేస్తాడు .-ఫలితం పొందుతాడు .
బ్రహ్మ విద్యకు విరుద్ధ మైన కర్మ మార్గం అవలంబిస్తే అజ్ఞానం లోనే ఉంటాడు .ఆత్మా ఆదిత్యుడు జ్యోతిస్సులన్నిటి కంటే జ్యోతిస్సు .అదే ఆయుస్సు .అంతా ఆత్మ లోనే ప్రతిష్టితం .”అమృత స్వరూప మైన ఆత్మను నేనే ”అనే జ్ఞానం కలవాడు ”అమృతుడు ”ఆత్మ దర్శనానికి మనస్సు సాధనం .బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన జనకుడు ”నా విదేహ రాజ్యం దానం చేసి ,మీకు దాస్యం చేయటానికి నన్ను నేను సమర్పించు కుంటున్నాను ”అని జనక చక్ర వర్తి గురు భక్తి ప్రకటించాడు .
పంచమ బ్రాహ్మణం –యాజ్న్య వల్కునికి మైత్రేయి ,కాత్యాయిని భార్యలు .సన్యసించ బోయి ”ఏమి కావాలి ”అని వారిని అడిగాడు .మైత్రేయి ”అమృతత్వం పొందే విద్య చెప్పండి ”అని అడిగింది .”ప్రతి వాడు తన ప్రయోజనం కోసం వస్తువు ను ప్రేమిస్తాడు .ఆంటే ప్రేమ ముఖ్యం .శ్రవణ ,మననాలతో ఇది సాధ్యం .ఆత్మ నశించదు .విజ్ఞాన ఘన రూపం లో వుంటుంది .ఆత్మ సాక్షాత్కారమే అమృతత్వ మైన ముక్తి .అని జనకునికి  బోధించి ,యాజ్న వల్క్యుడు సన్యాసాశ్రమం స్వీకరించాడు .
ఇదీ బృహదారణ్యక సారం
దశోపనిషత్ సారం ఇంతటి తో సంపూర్ణం .
ఆధారం –శ్రీ శ్రీ శ్రీ విద్యాశంకర భారతీ స్వామి వారు రచించిన ”ఉపనిషత్ కౌముది ”.
ఉపనిషత్తు లకు  తేలిక భాష లో ,ఆహ్లాదం ,ఆనందం కల్గించి తేలిగ్గా అందరికి అర్ధం అయే టట్లు తాత్పర్యం, వ్యాఖ్యానం రాసి, బ్రహ్మ సూత్ర భాష్యానికి తేలికైన వివరణ రాసి ,ఒక యజ్ఞం గా ఆ కార్య క్రమాన్ని పూర్తి చేసి లోకానికి అందించి ,నాకు ఆ పుస్తకాలను స్వయం గా వచ్చి అంద జేసి ,నాలో ఆధ్యాత్మిక అవగాహనను పెంచి, ఉపనిషత్తులపై అవ గహన కల్పించి విజ్ఞాన మయ లోకానికి దారి చూపించిన వారు –  మా రెండో అబ్బాయి శర్మ భార్య ఆంటే మాకోడలు ఇందిరకు మాతామహులు అయిన స్వర్గీయ నోరి శ్రీనాధ వెంకట సోమయాజులు గారికి ఈ ”దశోపనిషత్ సార వ్యాస పరంపరను ”స భక్తికం  గా అంకిత మిస్తూ ,వారికి నాపై ఉన్న అపారమైన ఆప్యాయతకు కృతజ్ఞత తెలియ జేసుకొంటున్నాను .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –01 -04 -12 .—శ్రీ రామ నవమి శుభా కాంక్షలు 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.