ఊసుల్లో ఉయ్యూరు –24
నిప్పు లాంటి పాలేరు -అప్పల సూరి
మా ఇంట్లో సుమారు ముప్ఫై సంవత్స రాలు గొడ్డు ,గోదా ఉండేవి .పశువులుంటే ,పాలేరు ఉండటం సహజం .పొలాలున్నాయి కనుక మేతకు ఇబ్బంది వుండేది కాదు .స్వంత వ్యవసాయం చేయక పోయినా ,పశువుల మేతకు ,మా చిన్న తనం లో కొరత లేదు .ఎక్కడైనా పచ్చని మేత దొరికేది .చెరుకు సీజన్ లో చెరుకు దవ్వ కనీసం ఆరు నెలలు గ్రాసం .బాగా ఇష్టపడి తినేవి గొడ్లు .ఒక రకం గా చెప్పాలంటే గొడ్లకు బలే తియ్యని రోజులు కే.సి.పీ.పని చేసిన రోజులన్నీ .అక్కడికే గొడ్లను తోలు కోని వెళ్లి ,దవ్వ కోసి మేపుకొని వచ్చే వారు పాలేళ్ళు .కడుపు నిండా తిని వచ్చి ,చెంబుల నిండా పాలు పిండేవి గేదెలు ,ఆవులు .ఇప్పుడు నేను చెప్పినదంతా నా చిన్ననాటి విషయాలు .అంటే సుమారు అరవై ఏళ్ళ కింది మాటలు .
మా నాన్న గారు ,మా అమ్మ ప్రోద్బలం తో ఇంట్లో పాడి కోసం గేదె ను కొన్నారు .ఒకటి రెండైనాయి .వాటికోసం గొడ్ల పాక .మా పక్కిల్లు మా మేన మామ గారిది .వారింటి పక్క మా కు గొడ్ల దొడ్డి ఉంది .అక్కడే పాక ,గడ్డి వాము ఉండేవి . పసుపు లేటి సీతా రామయ్య అనే గొడ్ల బేర గాడు ఉండే వాడు .చాలా మంచి వాడు .మంచి గేదె ను కోని పించాడు .దాన్నే పెద్ద గేదె అనే వాళ్ళం .చాలా అందం గా ఉండేది .పాలు కూడా ధారా పాతమే .మంచి పాలేరు ను కూడా సీతా రామయ్యే కుదిర్చాడు .అప్పల సూరి అనే తూర్పు కాపుల కుర్రాడు పాలేరు గా కుది రాడు .కుది మట్టం గా లాగు చొక్కాతో నల్లగా గుండ్రని ముఖం తో ఉండే వాడు .దుస్తులను శుభ్రం గా ఉంచుకొనే వాడు .పశువులను అంత శుభ్రం గా ఉంచే వాడు .కడిగిన ముత్యాల్లా మెరుస్తుండేవి .ఎప్పుడు గడ్డి పరకలు పెట్టి ఒళ్ళంతా తుడుస్తూ ఒంటికి పేడ అంట కుండా చూసే వాడు .అప్పుడు చిన్న పాలేల్లకు జీతం ఏడాదికి నాలుగు బస్తాల ధాన్యం .ఒక జత బట్టలు .తిండి మా ఇంట్లోనే .అన్ని పనులు చేసేవాడు . .నిగ నిగ లాడుతూ కని పించే వాడు .మంచి నవ్వు ముఖం .మేము అంటే బాగా ఇష్ట పడే వాడు ”అప్పల సూరి ,అప్పల సూరి ”అని అన్నిటికి వాడినే పిలిచి పని చెపే వాళ్ళం .ఏ పనీ విసుక్కోకుండా చేసే వాడు .అప్పుడు పాలేల్లే వాకిలి ఊడ్చి ,పేడ కలాపు జల్లే వారు . .ఇంట్లో వాళ్ళు ముగ్గులు వేసు కొనే వారు ..మా వాకిలి పెద్దదే .మట్టి .పేడ కల్లాపి జల్లితే పచ్చగా మెరిసి పోయేది .ముగ్గులతో పల్లె టూరి శోభ అంతా కన్పించేది .సూరి మా అందరికి తలలో నాలుక లా ఉండే వాడు .రాత్రి నిద్ర కూడా మా ఇంట్లోనే .మంచి దుప్పటి ,కప్పుకొనే దుప్పటి ఉండేవి .వాటిని వాకిటి అరుగు మీద ఒక మూల చూరు లో దాచుకొనే వాడు ..వాడు భోజనం చేయ టానికి ఒక సత్తు గిన్నె అడుగున వెడల్పు తక్కువ ,పైన వెడల్పు ఎక్కువగా ,కింద మట్టు తో వుండేది .ఆ రోజుల్లో పాలేల్లందరికి అలాంటి గిన్నె లే ఉండేవి . మంచినీళ్ళ కోసం పొడవైన సత్తు గ్లాసు .వీటిని దొడ్లో దాచుకొనే వాడు .ఒంటి మీద ఎప్పుడు గళ్ళ తువ్వాలుండేది .పని చేసే టప్పుడు నెత్తికి చుట్టూ కొనే వాడు .
చాలా నిదానం గా మాట్లాడే వాడు అప్పల సూరి .పని మాత్రం మహా వేగం .పరుష పదం కాని ,కోపం కాని అసలుండేవి కాదు .అందుకే అందరికి అతనంటే అభిమానం .ఇంట్లో పాలేల్లకు పొద్దున్నే ,రాత్రి వండిన అన్నమే చద్దన్నం గా పెట్టె వారు .ఇంటి పని ,దొడ్డి పని అయి న తరువాతే వాడికి అన్నం .చక్కగా కుది మట్టం గా కూచునిఆవకాయ ,లేక మాగాయ ,చింతకాయ గోంగూర పచ్చడి తో చద్దన్నం .మజ్జిగ పోసే వారు .గొడ్ల దొడ్డి ని అతి శుభ్రం గా ఊడ్చే వాడు .ఆ కాలమ్ లో ఊడవ టానికి ”పోలి కట్టలు ”ఉండేవి .చాలా మెత్తగా ఊడవటానికి అడుగు న వెడల్పుగా ,పైన వెడల్పు తక్కువగా వాటిని కట్టటం ఒక నేర్పు .జారిపోకుండా పూరి కొస తో అడ్డం గా పాయలు పాయలుగా కట్టే వాళ్ళు .ఇది పాలేళ్ళే కట్టు కొనే వారు .కట్టినవి అమ్మినా దాన్ని సరి చేసుకోవాలి .మా గొడ్ల దొడ్డి చాలా పెద్దది .అక్కడే మూడడుగుల ఇటుక రాతి కట్టడం వున్న నీటి బావి ఉండేది .గొడ్లకు అందులోని నీళ్ళే తోడి, తోట్టేల్లో పోసి తాగించే వారు .వాటిని ఎప్పటి కప్పుడు కడుపు నిండా నీళ్ళు పెట్టె వాడు సూరి .గేదెల డొక్కలు ఎప్పుడు నిండి ఉండటం అతని కాలమ్ లో నే చూసాం .పదింటి కల్లా గొడ్లను విప్పి మేతకు తోలుకొని పోయే వాడు .ఎక్కడ పచ్చదనం ఉంటె అక్కడ మేపే వారు .అప్పుడు మా ఇంటి వెనక చామలి నిండా మోకాలి లోతు పచ్చ మేత ఉండేది .అక్కడ మేపే వారు .వీలయితే కోసుకోచ్చే వారు .కనీసం మూడు గంటలు బయట మేత మేసి ,హాయిగా తిరిరిగి వచ్చేవి గొడ్లు .కాలికి పని బాగా ఉండేది .పుల్లేరు కాలువ లో వాటిని దింపి ,ఒళ్లంతా వరి గడ్డి చెత్తతో తోమి నిగ నిగ లాదేట్లు చేసి ఇంటికి తోలుకొని వచ్చే వాడు .మళ్ళీ మధ్యాహ్న భోజనం చేసే వాడు .పొలం వెళ్లి పచ్చి గడ్డి కోసుకొని వచ్చే వాడు .చాలా పెద్ద మోపు తెచ్చే వాడు .అందారు ఆశ్చర్య పోయే వారు .మోపు ను నెత్తిన పెట్టుకోని ,చేతిలో కర్ర భుజం మీదుగా దానికి ఆసరా గా ఉంచుకొని గడ్డి మోపులు పాలేళ్ళు తేవటం బలే గా చూడ ముచ్చట గా ఉండేది .అలానే తెచ్చేవాడు అప్పల సూరి .గొడ్లకు పచ్చగడ్డి వేస్తూ ,తినగానే మళ్ళీ వేస్తూ చాలా అపురూపం గా చూసే వాడు .రాత్రి పూట ఎండు గడ్డి వేసే వాడు .చక్కగా పక్క పరి చే వాడు .ఎత్తు పల్లాలు లేకుండా ,పడుకోవ టానికి వీలుగా ఎప్పుడు పారతో చెక్కుతూ చదును గా ఉండేట్లు చేసే వాడు .పేడ ,ఉచ్చ లను కిందికి కారెట్లు చేసే వాడు .ఎప్పటి పేడ కడి అప్పుడే తీసి పేడను పోగేసే వాడు మూడు రోజుల కోసారిఊక తో కలిపి పిడకలు చేసి గోడలకు కొట్టే వాడు .ఎండిన తరువాత ఒలిచి ,నెల మీద తిరగేసి ఆర బెట్టె వాడు .బాగా ఎండిన తర్వాత గూడుగా తయారు చేసే వాడు .ఇంట్లో పాలు కాచుకోవటానికి పిడకలే వాడే వాళ్ళం .పిడకలు కాలుతుంటే భలే వాసన వచ్చేది .పిడకలు కాలగా వచ్చే కచ్చిక అంట్లు తోము కోవ టానికి ,పళ్ళు తోము కోవ టానికి ఉప యోగించే వాళ్ళం .అందరం కచ్చిక తోనే పళ్ళు తోమే వాళ్ళం .అప్పల సూరి నాన్న ,అమ్మ ల కోసం వేప పుల్లలు పచ్చివి కోసి కట్టగా తెచ్చే వాడు .వాళ్ళిద్దరూ వేప పుల్లతో పళ్ళు తోమే వారు .రాత్రి ఎనిమిదింటి దాకా దొడ్లోకి వెళ్లి ,పశువుల ఆలనా ,పాలనా చూస్తూ అప్పుడు మళ్ళీ అన్నం తిని ,ఒక వారగా వాకిట్లోనో లేక వేసవి కాలమ్ అయితె దొడ్లోనో పడుకొని నిద్ర పోయేవాడు .తెల్లవారుజ్హామున అయిదింటికే లేచి పనిలో దిగే వాడు .ఒకటి రెండు కేకలకే నిద్ర లేచేవాడు .ఇల్లు ఊడవటం కూడా అతనే చేసే వాడు .వంట ఇల్లు ,పదమ టిల్లు లోకి రానిచ్చే వారు కాదు. సావిడి హాలు ,గది మాత్రం కొబ్బరి లేక పూచిక లేక కుంచె చీపురు తోనే ఊడ్పు .పోలి కట్టలు దొరక్కపొతే తాటాకు చీపుళ్ళు ఉండేవి గొడ్ల దొడ్డి ఊడవ టానికి .బాగా వంగి ఊడవలసి వచ్చేది. గొడ్ల దొడ్లో రొచ్చు కంపు అసలుండ కుండా చేసే వాడు సూరి ..పాలు ,మేత ,పిడకలు ,శుభ్రత ,అన్నీ అతని టైం లో బాగుండేవి .
సూరి కి నాన్న లేడు .అమ్మ వారానికో సారి మా ఇంటికి వచ్చి వాడి యోగ క్షేమాలు విచారించేది .మంచి మాటలు వాడికి చెప్పేది .ఆమె నల్లగా ,పొడుగ్గా ,ముక్కుకు ,చెవులకు ఇత్తడి ఆభరణాలతో వుండేది తెల్ల బట్టలు కట్టేది తూర్పు యాసతో మాట్లాడేది .తల తిప్పుడు .చాలా మర్యాదగా ఉండేది .అతని అన్నయ్యలు గంగయ్య ,రామా రావు లు వంగల దత్తు గారిదగ్గర పెద్ద పాలీళ్లు గా పని చేశారు .వాళ్ళిద్దరి భార్యలు చాలా మంచివాళ్ళు ..ఇంటికి వచ్చి అతని సంగతులు తెలుసు కొనే వారు .ఇంకో అన్న రామా రావు కట్టెల అడితి లో కట్టెలు కొట్టే వాడు .మంచి బలిస్తుడు .తర్వాతవాడు కనకా రావు .కొంతకాలం పాలేరు తనం చేసి ,చివరికి టైర్ చక్రాల బండి మీద బిస్కట్లు వగైరా అమ్మే వాడు .సూరి పెద్దన భార్య పచ్చగా పెద్ద బొట్టు తో పెద్ద ముత్తైదువు లా ఉండేది .ఇప్పటికి ఎక్కడ కని పించినా పలకరించి ,ఆప్యాయం గా మాట్లాడుతుంది .మా అమ్మ పాలేల్లను చాలా శ్రద్ధ గా చూసేది .కడుపు నిండా తిండి పెట్టేది .సినిమా లకు వెళ్ళ టానికి డబ్బు లిచ్చెది .సంక్రాంతి ,దసరా ,వీరమ్మ తల్లి తిరు నాళ్ళ లోపాలేల్లకు మామూళ్ళు ఇచ్చేది .వాళ్ళంతా ఆమ్మ గారు అమ్మ గారు అంటూ నాన్న ను అయ్యా గారు ,అయ్యా గారు అంటూ ఎంతో మర్యాదగా ఉండేవారు .క్రమంగా గేదెలు ,ఆవులు చేరాయి .అన్నిటిని జాగ్రత్త గా చూసే వాడు సూరి .కబుర్లు బాగా చెప్పే వాడు .పాటలు పాడే వాడు .అక్కయ్యలతో కబుర్లు బాగా చెప్పే వాడు .వాడు మాట్లాడుతుంటే ముచ్చటగా ఉండేది .తల ఒంచుకొనే ఉండే వాడు .అంత మర్యాద .ఏ పనీ చెప్పించుకొనే వాడు కాదు .అన్నిటికి ముందుండే వాడు .ఒడ్లు మర పట్టించాలంటే మేమెవరం వెళ్ళక్కర్లేదు .అన్నీ వాడే చూసే వాడు .మా ఇంట్లో చాలా మంది ఉండేవారం .అందరికి ఇంటి దొడ్డిలో నీళ్ళు తోడి గంగాళాలు ,కాగులు ,బకెట్లు ,గుండిగలు ఎప్పటికప్పుడు నింపి సిద్ధం చేసే వాడు .అందరికి తలలో నాలుక గా మెసిలే వాడు .దాదాపు నాలుగైదేళ్ళు మా దగ్గర పాలేరు తనం చేశాడు .ఆ తర్వాత చాలా మంది పాలేళ్ళు పని చేశారు కాని మా కుటుంబం మాత్రం అప్పల సూరి ని మరిచి పోలేదు .గొడ్లు ఇల్లు ,మనుషులం అందరం అతని పనితనానికి అబ్బుర పడే వాళ్ళం .అతనుమానేసినా అతన్ని గురించే చెప్పు కొనే వాళ్ళం .నిజాయితీకి మారు పేరుగా ,ప్రవర్తనకు నిప్పుగా అప్పల సూరి వున్నాడు .పెళ్లి చేసు కొన్నాడని తెలిసింది .తరువాత ఏమి జరిగిందో తెలీదు కాని అకస్మాత్తుగా చని పోయాడని తెలిసింది .దురదృష్ట వంతుడు అప్పల సూరి .మాకు ఉప యోగ పడి నట్లు ,వాళ్ల కుటుంబానికి ఉపయోగ పది ఉంటె ఎంతో బాగుండేదని పిస్తుంది .
మా దగ్గర ఆ తరువాత పని చేసిన పాలేళ్ళలో అప్పారావు కూడా జాగ్రత్తగా చేశాడు .ఎర్రగా ఉండి మంచితనం గా ఉండేవాడు .అప్పటికి ఇంటి దగ్గర భోజనాలు తీసేసాం .అరవై ఏళ్ళ పల్లె రాఘవులు ,కొడుకుశ్రీ రాములు కొంత కాలమ్ చేశారు .రాఘవులు కు ఇరవై బస్తా లిచ్చే వాళ్ళం .కృష్ణ అనే గౌల్ల కుర్రాడు చలాకీ గా చేసినా ,పని దొంగ ,మాటకారి .వాడి టైం లో గొడ్లు చాలా ఇబ్బందులు పడ్డాయి .తరచుగా మేతకు తోలుకొని వెళ్లి వదిలేసే వాడు .అవి పారి పోవటం లేక బందెల దొడ్లో పెట్టటం జరిగేది .వాడే వెతుక్కోచ్చే వాడు .వాళ్ల అమ్మా నాన్న చాలా మంచివాళ్ళు .వీడి ఆకతాయి తనానికి బాధ పడే వాళ్ళు . ఒక సారి వాడి ని భరించలేక కిందపడేసి బెల్టుతో బాది పారేశాను .అమ్మా అయ్యా అంటూ విపరీతం ఏడ్చి దెబ్బలు తట్టు కోలేక ఆరడుగుల గోడ అమాంతం దూకి పారి పోయాడు .ఇక రాడేమో ననుకోన్నాం .మర్నాడు వాడి మేన మామ వచ్చి క్షమించమని చెప్పించిపనిలో మల్ల్లీ చేర్పించాడు ..ఉయ్యూరు కాటూరు పొలాలకు వెళ్లి మేత కోసుకొని వచ్చే వాడు కాని రెగ్యులర్ గా వక్చెది లేదు .నరసింహ నే అతను నిజాయితీ గా చేశాడు అతను పెద్ద పాలేరు .అతని కాలమ్ లో వరి, అపరాలు విపరీతం గా పండాయి .నేను దగ్గర లేక పోయినా పొలం పనులన్నీ పురమాయించి బాగా చేసే వాడు .మల్లిగాడు భోజనం ,పడక తో సహా పాలేరుగా పనిచేశాడు .కబుర్ల పోచికోలు . ,.రాశులకు రాసులు తినే వాడు .పనిఅలానే చేశాడు .గొడ్లను బానే చూశాడు .ఆ తర్వాత, ముందు కొందరు చేశారు కాని ఎవ్వరు సంతృప్తి కలిగేట్లు చేయలేదు .క్రమంగా గొడ్లను మేపటం కష్టమైంది .తిరిగే చోటు తగ్గి పోయింది .మేత ఖరీదైంది .వాటి దానా రెట్లు పెరిగి పోయాయి .అన్నీ పెట్టినా పాలు ఇచ్చేది తక్కువ .పిల్లలంతా చదువులకు వెళ్ళారు .వాటి పాలు తీయటం తాగ లేక పందారాలు చేయటం ఇక కుదరని పని అనుకోని క్రమంగా తగ్గించే శాం .పాలేళ్ళు దొరకటం కష్టమైంది .దొరికినా చేసే వాడు తక్కువ .ఇదంతా విసుగని పించింది .ఎప్పుడు వాటి యావే .వాటికి మేత వేశారా ,నీళ్ళు పెట్టారా జనప కట్ట కోసి వేశారా ,రాత్రి ఎండు గడ్డి బాగా వేశారా ,పచ్చిమేత ,,దవ్వా తెస్తున్నారా అని ఆరాలు .ఇలా వుండగా అవి దొడ్లోంచి పారి పోవటాలు .చాలా చికాగ్గా ఉండేది .దొడ్డిన్నిండా పెద్ద గడ్డివాము .వాటిలో జానప కట్టలు .ఆ వాసన బలేగా ఉండేది కమ్మని వాసన . తౌడు ,చిట్టు బస్తాలకు బస్తాలు కొనే వాళ్ళం .రెండు కలిపి పెద్ద డ్రమ్ములో పోసే వాళ్ళం .చిక్కని కుడితి గేదెలకు ,ఆవులకు పెట్టించే వాళ్ళం .అప్పల సూరి పిల్లి పిసర్లు,ఉలవలు కలిపి రుబ్బి కుడితి లో కలిపే వాడు. బాగా పాలిచ్చేవి గేదెలు ..ఉలవల దాలి వేసి ఉడికిన ఉలవాలను బలం కోసం పెట్టె వాళ్ళం ..ఇదో భోగం .దానా బస్తాలు కొనే వాళ్ళం .యంత తిన్నా ఇచ్చే పాలు తక్కువ .తాగే వారూ లేరు.ఇలాంటి స్తితిలో దూడల్ని ఎవరైనా కావాలి అని అడిగితె ఇచ్చేసే వాళ్ళం .మొదట కొన్న పెద్ద గేదె సంతానం నిర్విఘ్నం గా చాలా కాలమ్ కొన సాగింది .పెద్ద పడ్డ ,చిన్న పడ్డ ,చిన్న గేదె బండ గేదె ,కొమ్ముల గేదె ,యెర్ర గేదె ఇలా ఎన్నో మా దొడ్లో మాకు కనులకు విందు చేసి ఆనందాన్నిచ్చాయి .హాస్పేట్ నుంచి మా అన్నయ్య ఆవు దూడ వచ్చాయి .అవి మైసూర్ జాతివి .వాటి అసంతానం కూడా చాలా కాలమ్ కొన సాగింది .పెయ్య దూడలకంటే జెర్సీ మగ దూడలు పుట్టాయి .రోగాలు ,రోస్తులు /కాటూరు పొలం చేసిన సీతా రామయ్యకు ఒకజెర్సీ కోడె దూడను ఇచ్చేశాను .అతనికి బాగా దానితో కలిసి వచ్చింది .ఎప్పుడు అది బుసలు కొట్టుతూ మీదకు దూకుతుండేది .ఇదీ మా పశు పరిశ్రమ .కంకిపాడు సంతలో లేక పొతే గుడ్ల వల్లేరు సంతలో పశువుల్ని కొనే వాళ్ళం .అక్కడ అంతా మాయ బేర గాళ్ళు .ఒక్క సీతా రామయ్య తప్ప నిజాయితీ గా బేర గాల్లుండే వారు కాదు .ఇదీ మా పశువుల పెంపకం ,యాజ మాన్యమూను . .౩౦ ఏళ్ళు పైగా పశువుల ను అజమాయిషీ చేసినా మాకు నచ్చిన వాడు ,మేము మెచ్చిన వాడు అయిన పాలేరు అప్పల సూరి ఒకడే అని మళ్ళీ మళ్ళీ చెబుతాము .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –03 -04 -12 .

దుర్గా ప్రసాద్ గారూ!
మీ పాలేరు నిజాయితీ పై మీరు రాసిన వ్యాసం ఎంతోబాగుంది.అందరినీ వారి వారి బాల్య
దశలకు తీసుకెళ్ళి తమ చిన్ననాటి జ్ఞాపకాలను తాము కూడా నెమరు వేసుకొనేటట్లు చేశారు.ధన్యవాదాలు.
మామూలుగా సొర,బీర,పొట్ల వంటి కాయల్లో లేతవాటిని లేత దవ్వలు అంటాం.ఈ చెరుకు దవ్వ అనేది నాకు
పూర్తిగా కొత్త పదం. అలాగే చామలి అంటే ఏమిటో కూడా వివరించి ఉండాల్సింది.ఒకప్పుడు మట్టుగల పాత్రలు
నేనూ చూశాను.ఎండుగడ్డి వామిలో మగ్గిన జనప కట్ట ప్రత్యేకమైన వాసన నాకూ విదితమే.పోతే, దాలి అనే
పదం కూడా తెలిసిందే.దాలి గుంటలో కుక్క అనే ప్రయోగం తెలుగులో ఉన్నట్లే ఇంగ్లిష్ లో ‘ Dog in the
manger’ అనే వాడుక ఉంది.అయితే మీరు’ ఉలవల దాలి’ అంటే ఏమిటో వివరిస్తే బాగుండేది.పొలికట్టలు
సాధారణంగా పరాసి అనే మొక్కను ఎండబెట్టి చేస్తారు. ఇవి చాలా దృడంగా,మన్నికగా ఉంటాయి.ఇదే
సందర్భంలో ఉలవచారు గురించికూడా వివరిస్తే బాగుండేది. నేటి తరం ఎన్నడూ వినికూడా ఉండని పదాలు
చక్కగా సందర్భానుసారం వివరిస్తున్నందుకు మరోమారు ధన్యవాదాలు.హృదయమున్న గృహస్తులూ,
నిజాయితీగల పాలేర్లూ నేడు నేడు మందుకైనా దొరకడం లేదు.నేను కోరిన పదాలను వివరిస్తారని
ఆశిస్తాను.
— ముత్తేవి రవీంద్రనాథ్.
ధన్య వాదాలు రవి గారు -ఉయ్యూరు ఏ.జి .కాలేజి వున్న స్థలాన్ని ”చామలి ”అని మా ఉరి వారంతా పిలిచే వారు .పచ్చ గడ్డి దట్టం గా ఉన్న ప్రదేశం.కాలేజి ఆవరణ కాక మిగిలిన దాన్ని ఆ పేరు తో పిలిచే వారు .ఉలవలు ఉడికించటానికి గొయ్యి ,దానిలో ఉలవల కుండా ,అందులో నీళ్ళు పోసి ,చుట్టూ గడ్డి వెంటి లాగా చుట్టి అడుగున పిడకలు వేసే వారు .పైననిప్పు అంటిస్తే నెమ్మది గా అంటుకొని సాయంత్రానికి ఉలవలన్ని ఉడికి ,పొట్టలు పగిలి కని పించేవి ఉలవలు ఉడుకు తుంటే కమ్మని వాసన వచ్చేది ..వాటిని గచ్చు నేల మీద ఆర బోసి ,చల్లారిన తర్వాత ఉప్పు ,తౌడు చిట్టు కలిపి బుట్ట లలో పెట్టి ఎడ్లముందో ,గేదెల ముందో ఉంచేవారు .అవి కమ్మగా ఆరగించేవి .పెద్ద వాళ్లకు తెలియ కుండా పాలేల్లను అడిగి మా బోటి పిల్లలం తినే వాళ్ళం బలే రుచిగా ఉండేవి .బలవర్ధక ఆహారం .ఉలవలె మాకు నిషిద్ధం ఇక ఉలవ చారు ఇటీవలే మేము వినటం .ఇప్పుడు హోటళ్ళలో ,పెళ్ళిళ్ళలో ఉలవ చారు ఫాషనై తప్పని సరి అయింది .నేనెప్పుడు తాగలేదు .శ్రద్ధగా చదివి తగిన సూచనలు చేసినందుకు ధన్య వాదాలు -దుర్గా ప్రసాద్