ఎల్లలు దాటిన శ్రీ ఎల్లా మృదంగ నాదం

     ఎల్లలు దాటిన శ్రీ ఎల్లా మృదంగ నాదం

నిన్న అంటే బుధవారం 11  వ తేది ఇక్కడి షార్లెట్ ఆంధ్రులకు పర్వదినం. మృదంగ వాద్యం లో అనితర సాధ్యo. ప్రతిభ కనపరచిన  ,పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వ్వర రావు గారు ఇక్కడికి విచ్చేసిన సందర్భం  గా తెలుగు వారు ,సంగీత ప్రియులు .సంగీత,సాహిత్యాభిమానులు వారికి ఘన స్వగాతంపలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు .ఎల్లా వారు వారి అమ్మాయిని చూడటానికే ఇక్కడికి వచ్చినా,ఇక్కడి వారంతా వారిని దర్శించి ,వారితో పరిచయం పొందటానికి మంచి కృషి చేసి ,సఫలీక్రుతూ లయారు .మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇక్కడి రేడియో ప్రతి బుధవారం నిర్వహించే తెలుగు కార్య క్రమం లో వారిని ఇంటర్వ్యు చేశారు . శ్రీ మతి నాగమణి ఆ కార్య క్రమాన్ని నిర్వహించారు స్టూడియో లో.కాని ఇంటర్వ్యు మాత్రం అంతా  మా అమ్మాయి వాళ్ళ ఇంటినుంచే జరిగింది ఫోన్ పైన .సరీగ్గా పావు తక్కువ పన్నెండు కు వారు మా ఇంటికి విచ్చేశారు .పట్ట్టు పంచను లుంగి గా కట్టి ,పట్టు లాల్చీ తో నుదుట యెర్రని నిలువు బొట్టుతో ,మెడ లో రుద్రాక్ష మాల,స్పటిక మాలతో ముఖం పై చెరగని చిరు నవ్వుతో ,మూర్తీ భవించిన మృదంగ దేవతలా .వెలిగి పోతున్న ముఖ వర్చస్సు తో శ్రీ ఎల్లా వెంకటేశ్వర రావు గారు మా ఇంట్లోకి ఆడు గు పెట్టారు .నేను ,ఆ అమ్మాయి విజయ లక్ష్మి సాదరం గా స్వాగతం  చెప్పి మేడ  మీదకు వారిని తీసుకొని వెళ్లి కూర్చో బెట్టాం .సరిగ్గా పన్నెండు గంటలకు ఇంటర్వ్యు ను నాగమణి ప్రారంభించారు .నన్ను పరిచయం చేసి ,నా ద్వారా ఎల్లా వారిని శ్రోతలకు పరిచయం చేయమని కోరారు.సంతోషం తో అంగీక రించిన నేను ఇలా ఎల్లా వారిని పరిచయం చేశాను .వారి ప్రక్కనే కూర్చొని  ఫోన్ ద్వారా వారిని గురించి నేను చెప్పిన మాటలు వినండి.-
                  ”గానానికి సహకార వాద్యం గా మాత్రమే ఉన్న మృదంగాన్ని ,ఎన్నో ప్రయోగాలు చేసి ,ఎంతో పెంపొందించి ,సంగీత వాద్యాలలో ఒక స్తితిని ,స్థాయిని మృదంగానికి కల్పించిన ఘనత పద్మశ్రీ  ఎల్లావెంకటేశ్వర రావు గారిదే.మృదంగం పై ఆయన వేళ్ళు  అలా అలవోకగా నాట్య మాడుతూ ,ఎల్లా పలికిస్తారో తెలీకుండా ,అలా ఎలా వాయిన్చారబ్బా అని ఆశ్చర్యం లో మునిగే టట్లు ,చేసే ప్రతిభ ఎల్లా వారిది.మృదంగం భారత దేశానికి మాత్రమే పరిమితమైంది అన్న అప ప్రదను తొలగించి ,,భారత దేశపు ఎల్లలు దాటించి న మార్దంగిక సార్వ భౌములు ఎల్లా వారు .ఎన్ని ప్రయోగాలు /ఎన్నెన్ని ప్రదర్శనలో తలచు కుంటే ఆశ్చర్యమేస్తుంది .ఇది సాధ్యమా అని పిస్తుంది .ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ,తనతో బాటు ,తన మృదంగ విద్యనూ ,శిఖరారోహనం  చేయించి న మహా మార్దంగికులు శ్రీ వెంకటేశ్వర రావు గారు .
మృదంగం తో మార్దవ స్వరాలను పలికించి ,అతి లలిత ధ్వనులను విని పించి ,మాధ్యమం లో కదను తొక్కి ,తారాస్తాయి లోను ,హృదయాలపై నాద స్వరాలను నాట్య మాడిస్తారు. .నాదా మ్రుతాన్ని ఒలికిస్తారు .రస గంగ లో స్నానం చేయిస్తారు .నవ మృదంగ ప్రయోగం లో అనితర సాధ్యం గా నిలిచి ,నాద బ్రహ్మయై ,నవ నాద బ్రహ్మ గా సాక్షాత్కరిస్తారు .ఎల్లా వారి ప్రతిభను ,ఎల్లా వర్నిన్చాగలం /ఎందరో ప్రసిద్ధకర్ణాటక గాయకులకు మృదంగ సహకారం అందించి ,ఆ కచేరీలకు వన్నె ,వాసి కల్పించిన కళా తపస్వి ఎల్లా వారు .
.                  ”ముఖ్యం గా ,ప్రముఖ వాగ్గేయ కారు లైన పద్మ విభూషణ్ శ్రీ మంగళంపల్లి బాల మురళి కృష్ణ గారి గాత్రం .ఎల్లా వారి మృదంగ సహకారం .అన్నవరపు రామ స్వామిగారి వయోలిన్ తోడూ  వింటే చూస్తే  అదొక రస త్రివేణీ సంగమమే అని పిస్తుంది .రస గంగా ప్రవాహమే అని పించేది .మనసులను  పరవశిమ్పజేయటమే  కాదు పవిత్రతను సంతరించిన మహద్భాయ్గం  ఈ సంగీత విద్వాంసత్రయం కొన్ని దశాబ్దాల పాటు ఆంద్ర సంగీత లోకాన్ని ఏలారు .సుస్వర సంగీత ఝరులనుప్రవహింప జేసి తన్మయులను చేశారు ..ప్రస్తుతం ఎల్లా వారు ఆంద్ర దేశపు సరిహద్దు దాటి .అమెరికా కు వచ్చి న శుభ సందర్భం గా ఇక్కడి సంగీత ప్రియులంతా ,ఎల్లలు లేని ఆనంద ఉత్సాహాలతో వారికి స్వాగతం చెప్పి వారి ముఖతా వారి జీవిత విశేషాలను ,వారు పొందిన సత్కారాలను ,చేసిన ప్రయోగాలను ,సాధించిన విజయాలను ,ఇంకా సాధించాలను కొన్న విషయాలను ,భవిష్యత్ లో వారు చే బట్టే కార్య క్రమాలను వివరం గా తెలుసు కోవాలని ఉవ్విళ్ళూరు తున్నారు ..ఇదంతా ఎల్లా వారి .ఇక్కడి సంగీత ప్రియుల విశాల హృదయానికి దర్పణం .ఎల్లా వారి మృదంగ విన్యాసాలకు ఎల్లలు లేనట్లే వారు పొందిన బిరుదులకు ,అందుకొన్న సత్కారాలకు ఎల్లలు లేవు .ఎల్లా వెంకటేశ్వర రావు గారు భారత దేశానికి ముఖ్యం గా ఆంద్ర దేశ సాంస్కృతిక రాయ బారి గా నేను భావిస్తున్నాను .ఇప్పుడు వారు తమను తాము ఆవిష్కరించుకొని విశేషాలను  అంద జేయ వలసినదిగా కోరుతున్నాను అని చెప్పాను .ఆయనచాలా సంబర పడ్డారు .నాగమణి గారు ఆన్ లైన్ లో వారు చెప్పిన వాటిని శ్రోతలకు అందించారు .చివరికి నేను మళ్ళీ లైన్ లోకి వచ్చి వారు సధించిన విషయాలపై సంతృప్తి పొందారా /భవిష్యత్ ప్రణాళిక లేమిటి?మీ కుటుంబం నుంచి మీ వారసులేవరైనా ఈ విద్యలో రానిస్తున్నారా /అని ప్రశ్నించాను .అన్నిటికి చక్కని సమాధానాలను తెలిపి గంటకు పైగా నడిచిన కార్య క్రమాన్ని రక్తి కట్టించారు .అలవోకగా వారు మాట్లాడిన తీరు శ్రోతలను బాగా ఆకట్టు కొంది. .నాగమణి గారి బృందం అభినంద నీయులు .ఇప్పుడు ఎల్లా వారు చెప్పిన విషయాలను మీకు వివరిస్తాను
.
వారు ముందుగా దుర్గా ప్రసాద్ గారు పరిచయం చేసిన తీరు చాలా బాగుందని ,తానేమి చెప్పాలో దిశా నిర్దేశం చేసి ప్రేరణ కల్గిన్చారని ,చెప్పిన తీరు ఆకట్టు కోనేట్లుందని అని చెప్పారు .  ఎల్లా వారిది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర పాల కోడేరు పెదతండ్రి ఎల్లా సోమయ్య గారే వీరి గురువు .ఆ కుటుంబం అప్పటి కే  నాలుగు తరాలుగా సంగీతం లో ప్రాముఖ్యం సంత రిచుకోన్నది .వీరు అయిదవ తరం వారు.నాయనమ్మ గారి ద్వారా ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు ,పాటలు వింటూ సంగీతం పై మక్కువ పెంచుకొన్నారు .తల్లి గారు మహాలక్ష్మ గారు వీరిని కడుపు  తో ఉన్నప్పుడే ఆమె పాడుకొనే భక్తీ గీతాలన్నీ వినిప్రహ్లాదుడు తల్లి గర్భం లో వుండగా నారద మహర్షి చెప్పిన హరి భక్తీ విషయాలన్నీ విని మహా భక్తు దైనట్లు .ఎల్లా వారు కూడా  సంగీతాన్ని తల్లి గర్భం లో ఉండగానే ఒంట బట్టిన్చుకొన్నారు .ఒక వినాయకచవితి నాడు పందిళ్ళ లో జరిగే కచేరీకి మృదంగం వాయించే ఆయన రాక పొతే ఎల్లా వారిని వాయించ మన్నారటఅప్పటికి ఆయన వయస్సు ఏడు మాత్రమెధైర్యం గా వాయించి అందరి ప్రశంసలు పొందారు .అప్పటి నుంచి నాన్ స్టాప్ గా మృదంగం వాయిస్తూనే వున్నారు దాదాపు అర్ధ శతాబ్ది మృదంగ లోకం లో విహరిస్తున్నారు .వాయించి నందుకు మెచ్చి బహుమతులు అంద  జేశే వారట .అది గొప్ప ప్రోత్సాహం గా ఉండేది .ఎందరో ప్రసిద్ధులైన గాయకులకు మృదంగ సహకారం అందించారు .క్రోవి సత్య నారాయణ గారు ,ద్వారం వెంకట స్వామి నాయుడు గారు ,బాల మురళి కృష్ణ వంటి దిగ్దంతుల సభల్లో వీరి మృదంగ విన్యాసం పలు  పోకడలు పోయింది .ఏడవ ఏట ప్రారంభ మైన  కచేరీ యాభై తొమ్మిదవ ఏటి దాకా  అవిచ్చిన్నం గా కొన సాగుతోంది .అంతకు ముందు ఎవరూ  మృదంగం తో సోలో కచేరి చేసిన వారు లేరు .ఎల్లా తో నే అది ప్రారంభమైనది అదీ వారి ఘనత .రోజుకు 16 గంటలు కఠోర సాధన చేసే వారు.ఆ విద్య అంతు చూడాలనీ ఆరాటం వారిని అంత పని చేయించింది .ఇంకో ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే వారు అసలు స్కూల్ కు వెళ్లి చదువు కొనే లేదు .ఆ తర్వాత ఎప్పుడో మృదంగ విద్య లో ఏం.ఏ.పీ.హెచ్.డి.చేశారు.
            మొదటి సారిగా భారత రాష్ట్ర పతి శ్రీ సర్వే పల్లి రాదా కృష్ణన్ చేతుల మీదుగా ప్రధమ బహుమతిగా బంగారు వీణ ను పొందారత. .అది ఆరుగురు రాష్ట్ర పతుల నుంచి పురస్కారాలను పొందిన ఘనత వారిది .అందరుప్రదాన మంత్రుల నుండి బహుతులను స్వీకరించారు .1984 లో అమెరికా లోని నార్త్కరోలిన లో ఉన్న షార్లెట్ కు వచ్చి కచేరి చేశారట .మళ్ళీ ఇదే రావటం .శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి భక్తులు ఎల్లా వార.తన బలం అంతా ఆ అమ్మదనంటారు .ప్రభుత్వం  తో సంప్రదించి ఏం .ఏ.మృదంగ కోర్సు ను ఏర్పాటు చేయించారట .అప్పటికి సిలబస్ అనేది లేదు వీరే సిలబస్ ను తయారు చేసి అందించారు.ఆ ఘనత ఎల్లా వారిదే .ఎన్నో విశ్వ విద్యా లయాలలో మృదంగ విద్యను ప్రవేశ పెట్టించారు .కోర్సులను ఏర్పాటు చేసి పర్య వేక్షిస్తున్నారు .నిరంతరం అదొక తపస్సు గా కొన సాగిస్తున్నారు .వీరి పరిశోధనకుమొదటి స్థాయి జాతీయ బహుమతి పొందారు ఘన సత్కారం జరిగింది .తానొక బాల మేధావిని అనిఆయన చెప్పు కొన్నారు .లేకుంటే ఇంత విద్య తనకు సాధ్య మ యేది కాదంటారు
.            
ఇప్పుడు వారు చేసిన ప్రయోగాల గురించి తెలుసు కొందాం -మొదటి సారిగా 30 వాద్యాలతో శివ తాండవం చేశారు .దీనికి అంతర్జాతీయ బహుమతి పొందారు .ఆది శంకరా చార్యుల వారి స్తోత్రాలకు సంగీతాన్ని సమకూర్చి మంచి ప్రచారం చేశారు వారికి కీర్తి లభించింది .150 మంది తో త్రివేణి సంగమంఅనే సంగీత నాట్య ,వాద్య సంగీతం తో అద్భుత కళా రూపాన్ని  రూపొందించి పలు  ప్రశంసలందు కొన్నారు .ఇది ప్రత్యక్ష ప్రసారమై అన్దరిని ఆకట్టు కొన్నది హైదరా బాద్ లోని కలిత కళా తోరణం లో మూడు గంటల పాటు సాగిన ఎల్లా వారి కళా సృష్టి .ఇది .              తనకు దేశ విదేశాలలో రెండు వేల మంది శిష్యులున్నారని గర్వం గా చెప్పు కొన్నారు .అందులో పది మంది ఏ వన్   మృదంగ వాద్యకారులున్నారనిఇంతమంది ఇంకే కళా కారునికి లేరని చెప్పారు .1972  నుంచి తన విదేశీ పర్యటన ప్రారంభమైందని ఇప్పటికి 70  దేశాలు పర్యటించానని తెలియ జేశారు . అమెరికా కు పన్నెండు సార్లు వచ్చానన్నారు .
సంగీతం వినటం ఒక కళ   అని ,ప్రదర్శన ఇంకో కళ అనీ ఆ రెండిటి మీద ఇప్పుడు ద్రుష్టి పెట్టి యువకులకు నేర్పు తున్నానని చెప్పారు .వీణా ,వేణువు మృదంగం మాత్రమే భారతీయ వాద్యాల్ని సామ వేదం లో నుంచి సంగీతం జన్మించిందని యజుర్వేదం నుంచి మృదంగా విర్భావం  జరిగిందని వివ రించారు .యెన్.టి.రామా రావు ముఖ్య మంత్రి గా ఉన్న కాలమ్ లో విద్యాలయాలలో సంగీతం నాట్యం నేర్పే ఏర్పాటు చేయించానని అన్నారు .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సభలు సమావేశాలు and tagged . Bookmark the permalink.

2 Responses to ఎల్లలు దాటిన శ్రీ ఎల్లా మృదంగ నాదం

  1. పారదర్శి అంటున్నారు:

    మీ మాటలలో, మృదంగ విద్వాంసులు ఎల్లా గారి పరిచయ వాక్యాలు, ఇతర విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

  2. ravindranathmuthevi అంటున్నారు:

    పాలకోడేరు బాలమేధావి అవిరామంగా శ్రమించి, దీక్షతో ఎల్లలులేని ఎల్లాగా ఎల్లా రూపొందారో
    మీరు వివరించిన తీరు బాగుంది.
    ముత్తేవి రవీంద్రనాథ్, డేటన్,న్యూజెర్సీ, యు.యస్.ఏ.నుంచి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.