వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –3
అభిషేక జలం హరించే ఉమా కమండ లేశ్వరుడు
తూర్పు గోదావరి జిల్లా లో వసిష్ఠ నదీ తీరం లో ఉన్న క్షేత్రం ర్యాలి .అక్కడ జగన్మోహన ఆలయం తో బాటు ఉమా కమండ లేశ్వర దేవాలయం కూడా ప్రసిద్ధి చెందంది .బ్రహ్మ దేవుడు తపస్సు చేసిన ప్రదేశం గా పేరు పొందింది .బ్రహ్మ ,తన కమండలం పై ఉమా దేవితో కూడిన శివుడిని ప్రతిష్టించాడు .అదే ఉమా కమండ లేశ్వర ఆలయం .శివ లింగం రుద్రాక్ష లాగా గరుకు గా ఉంటుంది .సోమ సూత్రం లేక పోవటం ప్రత్యేకత .శంకరుడు కాముడిని దాహించాడు కనుక చాలా వేడి గా ఉంటాడు .అందుకని అభిషేకం చేసిన గంగా జలం అంతా అప్పటి కప్పుడు హరించుకు పోవటం వింత గా అని పిస్తుంది .బయటకు కాని ,కిందకు కాని నీళ్ళు పోయే మార్గ మే లేదు .అక్కడజగన్మోహన కేశవాలయం లో నీరు ఎప్పుడూ ఊరుతుంది .ఇక్కడ హరించుకు పోతుంది .అదీ చిత్రాతి చిత్రం .
నాట్యాభి నయ కరణాలు ఉన్న కూచి పూడి రామ లింగని గుడి
కృష్ణా జిల్లా కూచి పూడి కూచి పూడి నాట్య సిద్ధాంత కర్త సిద్ధేంద్ర యతీంద్రుల జనం స్థానం .కూచి పూడి నాట్యానికి కేంద్రం గా వర్ధిల్లింది .శ్రీ బాలా త్రిపుర సుందరీ సాహిత శ్రీ రామ లింగేశ్వర స్వామిని శ్రీ రాముడు ప్రతిష్టించి నట్లు స్థల పురాణ కధనం .ఆలయ ముఖ మంద పం లో 108 నాట్యాభినయ కారణాలను అత్యద్భుతం గా చెక్కారు .చిదంబరం ఆలయం లోని కరణాలను చూసి ,ప్రముఖ కూచి పూడి నాట్యా చార్యులు పద్మ శ్రీ వెంపటి చిన సత్యం గారు వీటిని ఏర్పాటు చేసి తమ కళా భిమానాన్ని చాటుకొన్నారు .
పడమర ద్వారం -తూర్పు ఆలయం ఉన్న -కోడూరు
కృష్ణా జిల్లా దివి తాలూకా లో అవని గడ్డ కు దగ్గరలో కోడూరు గ్రామం లో శ్రీ సోమ శేఖర స్వామి ఆలయం తూర్పు వైపున ఉన్నా ,ద్వారం మాత్రం పడ మర వైపుకు ఉండటం విశేషం .ఈ ఆలయాన్ని ప్రఖ్యాత కవి ,పండితుడు ,శతాధిక గ్రంధ కర్త అయిన నాదెళ్ళ పురు షోత్తమ కవి 1894 లో నిర్మించారు .కోడూరు ఒకప్పటి రేవు పట్టణం .”దివి దుర్గం ”అనే పేరు దీనికి సార్ధక నామం గా ఉండేది .ఇప్పుడు మంచి వ్యాపార కేంద్రం .నిత్య ధూప దీప నైవేద్యాలతో అభిషేకాలతో ఆలయం వర్ధిల్లు తోంది .
సశేషం —- గబ్బిట దుర్గా ప్రసాద్ –16 -04 -12

క్యాంపు -యు.ఎస్.ఏ