ఊసుల్లో ఉయ్యూరు —25 మా కుటుంబ వైద్య నారాయణులు

 ఊసుల్లో ఉయ్యూరు —25
మా కుటుంబ వైద్య నారాయణులు
               నా చిన్న తనం లో మేము కొంత కాలమ్  అనంత పురం జిల్లా హిందూ పురం లో ఉన్నామన్న సంగతి చాలా సార్లు రాశాను .అక్కడ నాకు బాగా గుర్తు ఉన్న డాక్టర్ శ్రీ కాశీ నాద గారు .కన్నడం వారు .తెలుగు బాగానే అర్ధ మయేది .కొంచెం తెలుగు మాట్లాడే వారు .మా ఇంటికి దగ్గర లో శివాలయం ఉండేది .దానికి అవతలఆయన వైద్య శాల ఉండేది .అవసరం అయితె ఇంటికి వచ్చి చూసే వారు .లేక పోతే డిస్పెంసరి కి వెళ్లి జబ్బు విషయాలు చెబితే మందు ఇచ్చే వారు ఆ కాలమ్ లో మందు అంటే సీసాలలో యెర్రని నీళ్ళు .అందులో ఏం కలిపే వారో తెలీదు . రెండు మూడు డోసులకు ఇచ్చే వారు .అది తాగితే జ్వరం లాంటివి ,కడుపు నెప్పి ,విరేచనాలు పోయేవి .ఆయన చాలా హుందా గా ఉండే వారు .కొంచెం ఎత్తుగా పాంట్ ,షర్టు పైన తెల్ల కోటు , మెడలో స్టేతస్కోప్  తో ఉండే వారు .కామ్ పౌన్దర్  కూడా ఉండే వాడు .నాడి చూసే వారునాలుక జాపించి పరీక్షించే వారు .డాక్టర్     గారు  నాన్నకు  మంచి స్నేహితులు .మాకు తెలిసిన వారందరికీ ఆయనే వైద్యులు .హస్త వాసి మంచిదిఅని చెప్పు కొనే వారు .దాని అర్ధం ఏమిటో నాకు అప్పుడు తెలిసేది కాదు  .నాకు తెలిసిన మొదటి మా కుటుంబ వైద్యులు డాక్టర్ కాశీ నాద్ గారే
   డాక్టర్    మామిళ్ళ పల్లి నరసింహ మూర్తి గారు
 1950 లో మేము హిందూ పురం నుంచి ఉయ్యూరు కు శాశ్వతం గా కుటుంబాన్ని మార్చేశాము . 
నాన్న గారు అక్కడి మునిసి పల్ హై స్కూల్ నుంచి కృష్ణా జిల్లా బోర్డ్ కు బదిలీ అయారు సీనియర్ తెలుగు పండితులుగా జగ్గయ్య పేట లో చేరి ఉయ్యూరు స్కూల్ లో పదవీ విరమణ చేశారు .ఆ కాలమ్ లో మాకు మా ఇంటి వైద్య దేవుడు శ్రీ నరసింహ మూర్తి గారు .మాకే కాదు దాదాపు ఊర్లో అందరికీ .ఆయనకు గుర్రం బండి ఉండేది .ఇళ్ళకు రావాలంటే దాని మీదే వచ్చే వారు .తోలటానికి ఒక ముస్లిం వుండే వాడు .డాక్టర్ గారు మా ఇంటికి దగ్గరలో ఇప్పుడు ఉన్న నీళ్ళ టాంక్ ఎదురుగా , రాయప్రోలు వెంకాయమ్మ గారింట్లో ఉండేవారు . ముందు ఎడమ వైపు ఒక గది దానిలో మందులు అంటే క్లినిక్ గా ఉండేది .పెద్ద హాలు డాక్టర్ గారు హాల్ లో కుర్చీలో కూర్చుని వైద్యులకు పరీక్ష చేసే వారు .ఆయనది బాగా భారీ పార్స నాలిటి .వెనక పెంకు టింట్లో కుటుంబం ఉండేది .
దాదాపు ఎస్వీ రంగా రావు అంత ఉండే వారు .తెల్లని మల్లు పంచ గోచి పోసి కట్టే వారు .దాని పై తెల్లని పొడ వైన చొక్కా .మేడలో ఉత్తరీయం కొసలు ముందుకు వెనక్కు వేలాడుతూ వేసు కొనే వారు .మేడలో స్టేత స్కోపు  .injection చేయ టానికి చిన్న రేకు పెట్టె .అందులో సూదులు ,స్పిరిట్ దూది వగైరా ఉండేవి .ఆయన మన రావి కొండల రావు లాగా మొద్దు పెదవులతో ఉండే వారు .చాలా నెమ్మదిగా మాట్లాడే వారు .ఉదయం తొమ్మిదికి ఆస్పత్రి తెరచే వారు .నాడి నాలుక చూసి మందులు రాసిచ్చే వారు .
మందులను మనం తెచ్చు కొన్న సీసాలలో మందులు కలిపి వాళ్ళ అబ్బాయి ఇచ్చే వాడు . ధర్మా మీటర్ తో జ్వరం చూసే వారు .మందులను రాసిస్తే వాళ్ల అబ్బాయి హరి లిపి ఇచ్చి ఎలా వాడాలో చెప్పే వాడు .అతను నాకు సీనియర్ .ఫీజు తక్కువ గానే ఉండేది .సంవత్స రానికి ధాన్యం కొలిచే వారం అని జ్ఞాపకం .పాలేళ్ళతో ఇంటికి పంపే వాళ్ళం .డాక్టర్ గారు ఆయుర్వేద మందులు కూడా తయారు చేసే వారని గుర్తు . .ఇంట్లో సన్ని కల్లు వగైరా ఉండేవని జ్ఞాపకం .మిల్క్ ఆఫ్ మగ్నీశియా సోడియం   బై కార్బోనేట్ వగైరాలు కలిపిన అరకులే ఆనాడు మందులు .ఎర్రగా తెల్లగా ఉండేవి అరకులు .బజార్లో కోని వాడే మందులు తక్కువే..injections కూడా కావలసినవి  ఆయనే చేసే వారు  .నరసింహ మూర్తి డాక్టర్ గారిని ఊరిలో అందరు దేవుడు గా భావించే వారు .మంచి గౌరవం .కక్కుర్తి ఉండేది కాదు .మా ఇళ్ళకు కబురు చేస్తే సైకిల్ మీద వచ్చి వాలే వారు .నాన్నకు మంచి స్నేహితులు .ఊళ్ళో నాన్న ,ఆది రాజు నరసింహా రావు చోడవరపు  చంద్ర శేఖర రావు ,డాక్టర్ గారు  వారణాసి ,సదా శివ రావు గారు ,మామయ్య గంగయ్య గారు అందరికి పెద్దలు .వారేమి చెబితే అందరు అది చేయటం ఉండేది .మంచి కార్య క్రమాలకు డాక్టర్ గారి సాయం బాగా ఉండేది
ఇంత మంచి డాక్టర్ గారికి భార్య మాత్రం ఆయన్ను అర్ధం చేసుకొనేది కాక పోవటం ఆశ్చర్యం వేస్తుంది .చింపిరి జుట్టు తో ,చాలా అసహ్యం గా కని పించేది .ఎప్పుడూ ,ఎవరితోనో పోట్లాడుతూ ఉండేది .డాక్టర్ గారు బయటికి వెళ్లి నప్పుడు రోగుల్ని సత్యవతి గారు  పీడించేదని అనే వారు .ఎవరింటికి పెద్ద గా వచ్చేది కాదు .డాక్టర్ గారు మాత్రం భోజ నాలకు పిలిస్తే రాత్రి  పూట మాత్రం వచ్చే వారు .ఆయనకు ఇద్దరు కొడుకులు ,ఒక కూతురు .ఆయన  చెల్లెలు సత్యవతమ్మ గారు .చాలా లోకజ్ఞానం ,ఆధ్యాత్మిక భావాలు ఉన్నది .చిన్నప్పుడే ఒక కొడుకు పుట్టిన తర్వాత భర్త చని పోయాడు .అన్న గారి దగ్గరే కొడుకు తో ఉండేది సత్యవతమ్మ గారు అంటే ఊళ్ళో అందరికి చాలా గౌరవం .మంచిగా మాట్లాడు తుంది సాయం   చేసేది చక్కని సలహాల నిచ్చేది నా పెళ్లి వరకు ఉయ్యూరు లోనే ఉన్నారామే .మా అమ్మకు మంచి స్నేహితు రాలు నాకు గురు సమాను రాలు .డాక్టర్ గారి పిల్లలకు చదువు అబ్బలేదు .ఒకడు కామ్పౌందర్ గా ఉన్నాడు .రెండో వాడు జులాయిగా తిరిగే వాడు .ఇంట్లో సంసారం చిద్రం గ ఉండేది .డాక్టర్ గారికి మనశ్శాంతి లేకుండా పోయింది .కూతురికీ చదువు అబ్బలేదు .అకస్మాత్తు గా డాక్టర్ నరసింహ మూర్తి గారు మర నించారు .కుటుంబం బజారు పాలైంది .అప్పుడు సత్యవతమ్మ గారు అంటే డాక్టర్ గారి చెల్లెలు పెద్ద మనసు తో కొడుకు ప్రసన్న ను ఒప్పించి మేన కోడలితో వివాహం జారి పించించి కోడలితో విశాఖ పట్నం వెళ్ళింది .అక్కడ  షిప్ యార్డ్ లో ప్రసన్నకు మంచి ఉద్యోగం .ఆ తరు వాత నర సింహ మూర్తి గారి కుటుంబం ఉయ్యూరు నుంచి వెళ్లి పోయింది .ఆ తరు వాత వారి గురించి తెలీదు .

              నేను డిగ్రీ పాసై విశాఖ పట్నం మెడికల్ కాలేజి లో ఒక సంవత్సరం ఫిజికల్ dimonstrator    గా పని చేసి నపుడు   ప్రతి వారం షిప్ యార్డ్ లో వారింటికి వెళ్లి రెండు పూటలు అక్కడే ఉండి వచ్చే వాడిని సత్యవతమ్మ గారు కొడుకు ప్రసన్న నన్ను ఎంతో ఆప్యాయం గా చూసే వారు .కోడ లు కూడా మంచి తనం తో అత్త గారిని మెప్పించేది .నేను అక్కడ ఉయ్యూరు లో మా ఇంట్లో ఉన్నంత స్వేచ్చ గా ఉండే వాడిని .అది సత్య వతమ్మ గారి మంచి తనానికి నిదర్శనం .ఆమె కు ఎన్నో పాటలు భజనలు భగవద్గీత ఉపనిషత్తులు అన్నీ కన్తతా వచ్చు .ఎప్పుడు వాటిని స్మరించు కొంటు అందరితో సత్కాల క్షేపం చేసేది . ఆ తరువాత చాలా సంవత్స రాలు ఆవిడ కాని ప్రసన్న కాని ఉయ్యూరు వస్తే మా ఇంటికి వచ్చి వెళ్ళే వాళ్ళు .నేనెప్పుడైనా విశాఖ వెళ్తే వారింటికి వెళ్ళే వాణ్ని .ఇప్పడు మాకు వారి వివ రాలేమీ తెలీవు .అదీ డాక్టర్ నరసింహ మూర్తి గారి కుటుంబ కధ .
నరసింహ మూర్తి గారు మాకు వైద్య నారాయణ మూర్తే
ఆ కాలమ్ లో రావి చెట్టు బజారు లో ఇప్పుడున్న ప్రెసిడెంట్ రామా రావు ఇంట్లో వాకిలి అరుగు మీద ఒక హోమియో క్లినిక్ ను హరి ఇంటి పేరున్న సోదరులు నడిపారు .ఎప్పుడైనా అక్కడ మందులు తెచ్చు కొనే వాళ్ళం .
ఆయుర్వేదానికి  ఉయ్యూరు మంచి ప్రసిద్ధి .మాకు తెలిసిన వారిలో వేదాంతం నారా యణా చార్యులు గారు ముఖ్యులు .ఆయన విష్ణ్వాలయ అర్చకులు .రోగ నిదానం బాగా తెలిసిన వారు .నాడి పట్టు కోని జబ్బు ను యిట్టె పసి కట్టి చెప్పే వారు .యాభై ,అరవై దశకం లో ఆయనే ఆయుర్వేదం లో దిట్ట .ఆలయం ప్రక్కనే ఇల్లు సంచి కట్టు వైద్యం .అప్పటికే చాలా వయో వృద్ధులు .దైవ సేవ కే సమయం ఎక్కువ వెచ్చించే వారు .సాధారణ జ్వరాలకు మాత్రలు కట్టి ఇచ్చే వారు .ఊర్ధ్వ పున్ద్రాలతో ,చామన చాయగా వెడల్పైన ముఖం తో ఆకర్షణీయం గా దైవ వర్చస్సు తో ఉండే వారు .పైత్యాన్తకం కుప్పె మాదీ ఫల రసాయనం భావనా అల్లం వగైరా లను ఇచ్చే వారు .కుప్పె లను సాన మీద తేనెతో రంగ రించి అరటి ఆకులో వేసుకొని  నాలుకతోనాకే వాళ్ళం .కాషాయాలు కాచుకొనే విధానం చెప్పే వారు అప్పుడు లంఖణం పరమఔషధం  .అమ్మ ఆయన్ను బాబాయి గారు అని పిలిచేది .నేను తరచూ ఆయన నామాలు పెట్టు కొనే విధానం చూస్తూ ముచ్చట పడే వాడిని .అద్దం లేకుండా అద్భుతం గా నామ ధారణ చేసే వారు వారికి రామా చార్యులు ,వాసుదేవా చార్యులు  రాదా కృష్ణ మా చార్యులు అనే కుమారులు .చివరి వాడు   హై స్కూల్ లో నాకు సహాధ్యాయి .చిన్న వయసు లోనే అంటే అరవై దశకం లో చని పోయాడు .మిగిలిన వారిలో శ్రీ రామా చార్యులు గారు ఆగమ పండితులు ప్రతిష్ట మొదలైనవి సాది కారం గా చేసే వారు మా దేవాలయ ప్పునః ప్రతిష్ట వారితోనే చేయించాము .పిల్లా పాప లతో వర్దిల్లారు .గాయత్రి ప్రెస్ పెట్టి ఎన్నో ఆధ్యాత్మిక గ్రంధాలను ముద్రించారు .గాయత్రి గురుకులం పెట్టి సంగీతా నాట్యాలలో శిక్షణ నిప్పించారు .చివరగా వాన ప్రస్తాశ్రమం స్వీకరించి రెండేళ్ళ క్రితమే విష్ణు సాయుజ్యాన్ని పొందారు .వాసు దేవా చార్లు గారు అర్చకత్వం లో ఉన్నారు ఆయనా నాలుగేళ్ల  క్రితమే మర ణించారు .మా ఆంజనేయ దేవాలయ పునర్నిర్మాణానికి మాకు మంచి ప్రేరణ నిచ్చిన వారు వాసు దేవా చార్యులు .
  వీరి తరువాత పేర్కొన బడ దగింది  వేదాంతం రామ చంద్రా చార్యులు గారు  రు.విష్ణాలయ అర్చకులు . దగ్గరే పెద్ద ఇల్లు. మహా భారీ పర్స నాలిటి .ఊర్ధ్వ  పున్డ్రాలతో పంచ ,లాల్చి తో ఉత్తరీయం తో ఉండే వారు 
.ఇంట్లో ఆయుర్వేద మందులు తయారు చేసే సామగ్రి అంతా ఉండేది .ముఖ్యం గా కోరింత దగ్గుకు మంచి మందు ఇచ్చే వారు .ఇంటికి వచ్చే వారు .అమ్మ ఆయన్ను బాబాయి గారు అని పిలిచేది .ఆయన సోదరులే వేదాంతం అనంత పద్మ నాభా చార్యుల వారు .వాస్తు జ్యోతిశాలలో ఉద్దండులు .మా దేవాలయ పునః ప్రతిష్టకు వారితోనే ముహూర్తం పెట్టిన్చాం .బందర్లో హయ గ్రీవ సదనం ఏర్పాటు చేసిఎన్నో గ్రంధాలు రాశారు డబ్బు మీద ఆశ లేదుగాయత్రి అమ్మ వారి భక్తులు .వారింటికివేల్తే భోజనం పెట్ట కుండా పంపరు పరమ నిష్టా గరిష్టులు .వీరి సోదరులే నూజివీడు ఆచార్యులు గారు అని పిలువ బడే మహా గొప్ప ఆయుర్వేద వైద్యులు .దేశ దేశాలలో లబ్ధ ప్రతిష్టులు .రామ చంద్రా చార్యుల వారికి సంతానం లేదు తోడల్లుడి కుమారుడు రమణ ను దత్తత తీసుకొని వివాహం చేశారు .అతనే ఆయనకు ఉత్తరాది కారి .ఆచార్యుల వారికి దూర్వాస మహర్షికి ఉన్నంత కోపం ఉండేది .ఎవరి మాటా లెక్క పెట్టె వారు కాదు .కాంగ్రెస్ అంటే విప రీత అభిమానం .వైఖానస జయంతి జరిపి సంగీత విద్వాంసులను సత్కరించి వారితో కచ్చేరీలు పెట్టించే వారు మామయ్య ఆయన్ను ”మామా ”అని పిలిచే వాడు .మేము తాత గారు అనే వాళ్ళం .నేనంటే అభిమానం గా ఉండే వారు .ఆయన భార్య ప్రసాదాలను చాలా రుచి కరం గా చేసే వారు .చని పోయే వరకు చేస్తూనే ఉండే వారు కుటుంబ స్నేహం మా కు .
మామిళ్ళ పల్లి నాగేశ్వర రావు గారు
శివాలయ అర్చకులైన శ్రీ నాగేశ్వర రావు గారిల్లు మా కు దగ్గరే .వాళ్ళబ్బాయి సత్య నారాయణ నాకు సహాధ్యాయి .పెద్దబ్బాయి 
ఆయుర్వేద డాక్టర్ .మంచి
రోగ నిదానం ఉంది .లేబర్ కు డాక్టర్ గా వుండే వారు .మాకు ఆత్మీయులు .ఇంటికి వచ్చి మాట్లాడే వారు .మందులు తెచ్చి ఇచ్చే వారు .1961 లో నాన్న గారికి తీవ్రం గా జబ్బు చేసింది .అందరు వైద్యులను సంప్రదిన్చాం .వీరిని కూడా పిలిచాం .దాదాపు చివరి గడియలు అని చెప్పి ఇంటికి వెళ్లి ”గరళం ”తెచ్చి వేశారు .అదే మొదట ఆ మాట వినటం .మామయ్య అమ్మా అందరు ఆశ గా ఎదురు చూశారు .కాని ఆయుర్దాయమున్న వారికి పని చేస్తుంది కాని ఇప్పుడు పని చేసే సమయం కాదేమో .అదేమీ పని చేయ లేదు .మళ్ళీ మా కుటుంబ డాక్టర్ శ్రీ మిక్కిలి నేని సాంబశివ రావు గారిని నేనే వెళ్లి పిల్చుకోచ్చాను .అప్పటికే అయి పోయిందని ఆయన పెదవి విరిచాడు .ఈ విధం గా నాన్న గారిని చివరి ప్రయత్నం గా రక్షించాలని నాగేశ్వర రావు గారు ప్రయత్నించారు .నాన్న మాకు దక్కే యోగం లేక పోవటం వల్ల వారి ప్రయత్నాలేవీ ఫలించ లేదు
ఆ తర్వాత కూడా చాలా కాలమ్ మా కుటుంబ వైద్యులు గా నాగేశ్వర రావు గారు వ్యవ హరించారు
  డాక్టర్ మిక్కిలి నేని సాంబ శివ రావు గారు
 మా కుటుంబానికి దాదాపు ముప్ఫై ఏళ్ళు డాక్టర్ గా వ్యవహరించిన వారు డాక్టర్ మిక్కిలి నేని సాంబ శివ రావు గారు .ఏం .బి .బి.ఎస్ .నెమ్మదిన వారు భారీ గా ఉండే వారు ఆయన ఇల్లు ఏకాంబరేశ్వర పాలస్ దాటిన తర్వాత ఉండేది .బాగా స్తితి పరులు .భార్య చాలా యోగ్యురాలు కొడుకులలో ఇద్దరు డాక్టర్లు ఒకరు కే.సి .పీ లో ఉద్యోగి .హంబర్ సైకిల్ మీద వచ్చే వారు దానికి చిన్న సీటు .ఒక పిర్ర కూడా ఆనదు .  .అయినా దాన్నే వాడే వారు. గేర్ కేసు ఉండేది కాదు .ఆయన హాస్పిటల్ ఉమా ప్రెస్ కు ఎదురు గా వుండేది .ఒక నర్సు కామ్పౌందర్ వుండే వారు అన్ని మందులు ఉండేవి .ఓపిక ఉంటె నడిచో రిక్షా మీదో సైకిల్ మీదో ఆస్పత్రికి వెళ్ళే వాళ్ళం .ఒక వేళ లేవ లేని పరిస్తితి లో ఉంటె పాలేల్లతో కబురు చేస్తే వచ్చే వారు ;ఇంషర్ట్ వేసే వారు .మందుల పెట్టె తో వచ్చే వారు స్టేత స్కోపు వుండేది .ఒక్కో సారి బుష్ షర్ట్ వేసే వారు .ఓపిగ్గా అన్నీ అడిగి తెలుసు కొనే వారు .ఆయన వద్ద ఉన్న injections చేసే వారు .త్వరలోనే వ్యాధి తగ్గేది దాదాపు ఆయన వాడే బిళ్ళలు ”ఎల్కొసిన్ ”.దేనికైనా అవే నని అనుకున్తుండే వాళ్ళం .మర్యాద గా వుండే వారు .నాన్న కు ఆయనంటే మహా అభిమానం .నాన్న అంటే ఆయనకు గౌరవం .వ్యవ సాయం పాలేరు ఎడ్లు పాడి ఉండేవి .మా పొలాల దగ్గరే వారి పొలాలు .తరచూ పొలాల దగ్గరకలుస్తుండే వాళ్ళం .చికాకు ఉండేది కాదు.కోపం లేదు .అందరు ఆయన్ను దేవుడు గానే చూసే వారు .ఊళ్ళో అప్పుడు ఆయన ఒక్కరే డాక్టర్ .కనుక అందరికి ఆయనే వైద్యులు. బాగా సంపాదించారు .నాన్న గారి చివరి ఘడియల్లో కూడా వచ్చి తగిన వైద్యం చేశారు .మా అందరికి దేవుడు వంటి డాక్టర్ శ్రీ సాంబ శివ రావు గారు
  డాక్టర్ వెంపటి కుమార స్వామి గారు
 అమ్మ కు చాలా అభిమానుడైన డాక్టర్ కుమార స్వామి గారు .అతను నాకు హై స్కూల్  లో జూనియర్ .అతని అన్న నాకు క్లాస్ మేట్ .
ఏం.బి.బి ఎస్ .పాసై ఉయ్యూరు లో క్లినిక్ పెట్టాడు .కనక వల్లి నివాసి .బానే జనం లోకి చొచ్చుకు పోయాడు .నిదానం గా అన్నీ వివరం గా చెప్పే వాడు .వేదాలు ,ఉపనిషత్తులు పురాణాలు చదివే వాడు కొని వాటిని తెప్పించే వాడు మసీదు దగ్గర ఆస్పత్రి ఉండేది కొబ్బరి తోట లో స్వంత ఇల్లు ఏర్పాటు చేసుకొన్నాడు కనక వల్లి లో పొలాలున్నాయి .కూతురు ,కొడుకు .అమ్మ కు బి.పీ.వస్తే ఆయన దగ్గరకు తీసుకొని వెళ్లాం .అప్పటి నుంచి సుమారు ఇరవై ఏళ్ళు మా కుటుంబానికి డాక్టర్ గా వున్నాడు .చిరు నవ్వు తో పలకరించే వాడు దాదాపు బ్రాహ్మణ్యం అంతా అతని దగ్గరే వైద్యం .చుట్టు పక్కల ఊళ్ళ వాళ్ళు కూడా వచ్చే వారు .అప్పటికే పోటీ పెరిగింది .అమ్మను ఇంకెక్కడి కైనా తీసుకొని వెళ్లి చూపిద్దామని ప్రయత్నం చేస్తే ఒప్పు కొనేది కాదు ”నేను పోతే కుమార స్వామి చేతుల మీదు గానే పోతాను .నన్ను ఇంకో డాక్టరు దగ్గరకు తీస్సుకు వెళ్ళద్దు ”అని ఖచ్చితం గా చెప్పింది .అన్నట్లు గానే జరిగింది .మా ప్రయత్నాలు విర మిన్చుకోన్నాం .అంతటి నమ్మకం ఆయన మీద .1982 లో నేను ఉయ్యూరు హై స్కూల్ లో పని చేస్తుండగా అమ్మకు సీరియస్ అయితే కుమారస్వామి ఆస్పత్రి లో చేర్పించాం .మందులు వాడాడు కొంత నయం అని పించింది .నన్ను స్కూల్ కు వెళ్ళ మన్నాడు కంగారు లేదన్నాడు .స్కూల్ కు వెళ్తూ ఆస్పత్రి కి వెళ్లి అమ్మ ను చూశా .”ఒరే కంగారేమీ లేదు నువ్వ్వు స్కూల్ కు వెళ్ళు .నాకు బానే ఉంది ”అంది అమ్మ .అట్నించి స్కూల్ కు వెళ్లాను మధ్యాహ్నం పన్నెండిటికి స్కూల్ కు కబురు వచ్చింది .పరిస్తితి బాగా లేదని వెంటనే వెళ్లాను .నా కోసమే ఉన్నట్లని పించింది .అప్పటికే ప్రభావతి మామయ్య అక్కడ ఉన్నారు .అంతే నన్ను చూసిన కాసేపటికి కన్ను మూసింది .ఇలా సాంబశివ రావు గారి చేతి లో నాన్న ,కుమార స్వామి గారి చేతిలో అమ్మా చివరి శ్వాస పీల్చారు .
ఇప్పుడు మాకు కుమారస్వామి కుమారుడు వెంపటి కృష్ణ యాజీ డాక్టరు. మంచి వాడు .ప్రభుత్వ డాక్టర్ గా బందర్ లో పని చేసి ,ఈ చట్రం లో ఇమడ లేక శ్రీ రామ చంద్ర SENTINARI హాస్పిటల్ — విజయ నగర్ హైదరాబాద్ లో స్వచ్చంద సేవ చేస్తున్నాడు అయిదారేళ్ళ నుంచి అతనే మాకు కన్సల్టంట్ డాక్టర్ .మూడో సారి అమెరికా వెళ్లి నప్పుడు ప్రభావతికి బి.ఫై.పెరిగితే మెయిల్ లో విషయం తెలియ జేస్తే వెంటనే తగిన మందులు సూచించి కంగారు తగ్గించాడు ఇప్పుడు కూడా వచ్చే టప్పుడు ఒక సారి మేమిద్దరం చెక్ చేయించుకొని వచ్చాం .ఇంకా అతనికి ఉయ్యూరు లో ఇల్లు కనక వల్లి లో పొలాలు ఉన్నాయి .మా అబ్బాయి రమణ వివాహానికి గుంటూరు కు కుటుంబం తో వచ్చిన సంస్కారి .సరస భారతి లో రాసే దంతా తప్పక చదివి స్పందిస్తూ ఉంటాడు ”మాస్టారు”అని మర్యాదగా సంబోధిస్తాడు .నిజం గానే అతను అతని అక్కయ్య ఉయ్యూరు హై స్కూల్ లో నాకు శిష్యులే .ఫిజికల్ సైన్సు బోధించాను .ఆ అమ్మాయి అమెరికా లో ఉంది. మంచి తెలివి తేట లున్న పిల్లలు వారిద్దరూ .కుమారస్వామి అతి చిన్న వయసు లో నే మర  నించటం ఆ కుటుంబానికి ఆశని పాతమే
  బుర్రా శేషయ్య డాక్టర్ గారు
            బుర్రా శేషయ్య గారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు .మామయ్య  ద్వారా పరిచయం .నాకు మొహం మీద నల్లని మచ్చలు ఏర్పడేవి దానికి వారి దగ్గర ఆయుర్వేద మందు పుచ్చు కొన్నాను .వేడి వల్ల  వచ్చిందని వేడి తగ్గ టానికి మందు ఇచ్చారు .బాగా పని చేసింది మళ్ళీ ఆ నలుపు రాలేదు పంచె ,లాల్చి తో ఉండే వారు .ఎత్తు గా ఉండే వారి నిమ్మదస్తులు నవ్వు ముఖం .అప్పటికే అరవై పైగా .నేను మరచి పోలేని ఆయుర్వేద భిషగ్వరులు శేషయ్య గారు
 డాక్టర్ కనక మేడల రంగా రావు గారు
            అసలు డాక్టర్ల లో దేవుడు ఉంటాడు అనటానికి నిదర్శనం మా కనక మేడల రంగా రావు గారు .ఉయ్యూరు పంచాయితీ కి ఎదురు లేకుండా నాలుగైదు పర్యాయాలు ఎన్నికైన ప్రజల మనిషి .జారి పోతున్న పాన్టును పైకి లాక్కొంటు తెల్లని ఖద్దరు పాంటు ఖద్దరు బుష్ షర్ట్ వేసుకొని మూర్తీ భావించిన స్వచ్చ రూపం గా ఆరోగ్య దేవత లా కని పించే వారు .పాపం ఆయనకు ఉబ్బసం ఉండేది అలానే బాధ పడుతూ వైద్యం చేసే వారు .ఆయన రోగి చెయ్యి పట్టు కుంటే చాలు మూడు వంతుల్ రోగం తగ్గి పోయేది .ఎవ్వరి దగ్గరా డబ్బు తీసుకొనే వారు కాదు .అంతా ఉచిత వైద్యమే .మందులు కూడా ఉచితమే .పేదల పాలిటి పెన్నిధి రంగ రాయలు . .అతి తక్కువ ఖరీదు గల మందులతో నయం చేయటం రంగా రావుడాక్టర్ గారి ప్రత్యేకం .ఆయన దగ్గర కామ్పౌన్దర్ దాదాపు నలభై ఏళ్ళు పని చేశాడంటే యెంత మంచి డాక్టరో ఆయన మనకు తెలుస్తుంది .రిక్షాలో వెళ్ళే వారు .తర్వాతా అందరి కోరిక పై ఉయ్యూరు శాసన  సభకు కాకాని వెంకట రత్నం  గారి కుమారుడు రామ మోహన రావు పై పోటీ చేసి అతి సునాయాసం గా గెలు పొంది ఏం ..ఎల్ .ఏ.అయారు .శాసన సభ్యులు గా నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేశారు .అప్పుడు కూడా ఆయన జీవన శైలి మార లేదు .ఆయన కని పిస్తే ఆటో మాటిక్ గా మన రెండు చేతులు ముడిచి నమస్కరిస్తాయి .అదీ ఆయన ఆకర్షణ ,పవిత్రత ,ప్రజా సేవ .ఇలాంటి వారుంటారా అని పించిన ప్రజా సేవకులు డాక్టర్ రంగా రావు గారు .ఒక సారి నాకు బదిలీ కావాల్సి వస్తే ఆయన తన కారు లో నన్ను కొలచల చలపతి ని బందరు తీస్సుకొని వెళ్లి ఆఫీసర్ల తో మాట్లాడి వెంటనే ట్రాన్స్ఫర్ చేయించిన మంచి మనిషి .ఆయన మొదటి సారి ఉయ్యూరు కు పంచాయితీ ప్రెసిడెంట్ గా పోటీ చేసినపుడు వర్గ కులాలకు అతీతం గా అందరు కలిసి ఆయన్ను భారీ మెజారిటీ తో  గేలి పించి తమ కృతజ్ఞతను ప్రజలంతా తెలియ జేసుకొన్నారు .ఇలాంటి వైద్య దేవతలను ఒక సారి స్మరించే అదృష్టం నాకు కల్గి నందుకు ఆనందం  గా వుంది .కృతజ్ఞతలను తెల్పు కొనే అవకాశం కలిగి నందుకు సంతృప్తి గా ఉంది అందుకే మన వాళ్ళు ”వైద్యో నారాయణో HARIH   అని ప్రస్తు తించారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17 -04 -12 –
కాంప్  –యు.ఎస్.ఏ.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

2 Responses to ఊసుల్లో ఉయ్యూరు —25 మా కుటుంబ వైద్య నారాయణులు

 1. premchand says:

  Dear Mastaru, I entirely share your well deserved tribute to DR ranga Rao whom I knew personally. He gave his Prefect car For my second brother’s marriage. He was an extremely nice manand generous to a fault. Also to be remembered are Garudachalam’s father who was an Ayurvedic and Dr Subbarao, who had a medical shop which his son Madhu, a contemporary of my brother who ran the shop on the main road opposite the Registrars office.Premchand

 2. కృష్ణ యాజి says:

  మాష్టార్కి
  నమస్కారములు
  నా శిష్యుడు అని మీచేత అనిపించుకోవడము చాలా థ్రిల్లింగా వుంది
  కృష్ణ యాజి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.