ఊసుల్లో ఉయ్యూరు –26
ఇక్కడి మన వాళ్ళు
ఇక్కడి మన వాళ్ళు అంటే నా ఉద్దేశ్యం లో ”అమెరికా లో నాకు తెలిసిన మన వాళ్ళు ”అని భావం .నేను నా శ్రీ మతి మొదటి సారిగా అమెరికా కు మా అమ్మాయి ,అల్లుడు ఇంటికి టెక్సాస్ లోని హూస్టన్ కు 2002 లో వచ్చాము .
అప్పుడు మాకు మొదట ఇక్కడ పరిచయ మైన వారు శ్రీ మతి వావిలాల లక్ష్మి శ్రీ వావిలాల కృష్ణ దంపతులు .మా అమ్మాయి వారిద్దరిని అమ్మక్కయ్య ,పెద నాన్న అని పిలిచేది .వాళ్ళూ హూస్టన్ లోనే ఉండే వారు .దాదాపు ప్రతి వారం కలుసు కొనే వారం .లక్ష్మి గారు నాకు బంధువే .మా ఉయ్యూరు లో మా అమ్మ గారి బాబాయి గుండు అంతర్వేది గారి మనుమ రాలు .అంటే ఆయన కుమారుడు మేమందరం ”అప్పన్న కొండ మామయ్య ”అని పిలిచే గుండు వరాహ లక్ష్మీ నర సింహ మూర్తి (డాక్టర్ జి.వి.ఎల్ .యెన్ .మూర్తి )గారి అమ్మాయే .ఆయన జేమ్షేడ్పూర్ టాటా ఐరన అండ్ స్టీల్ ఫాక్టరీ లో చీఫ్ కెమిస్ట్ .అంతర్వేది గారు పోలిస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రాజ మండ్రి లో చేసి ఉయ్యూరు లో స్తిర పడ్డారు .అప్పన్న కొండ మామయ్య సంవత్స రానికి కనీసం రెండు మూడు సార్లు ఉయ్యూరు వచ్చే వాడు .వచ్చి నప్పుడల్లా మా ఇంటికీ ,మా మేన మామ గంగయ్య గారింటికి తప్పక వచ్చి కని పించి వెళ్ళే వాడు. ఆ కాలమ్ లోనే ఆయన విజయ వాడ హోటల్ లో దిగి ఉయ్యూరు కు కార్ లో వచ్చే వాడు .మమ్మలనందరినీ ఆప్యాయం గా పలకరించే వాడు .ఒళ్లో కూర్చో పెట్టు కోని కబుర్లు చెప్పే వాడు .తెల్లని బెంగాలి పంచె ,లాల్చీ తో వుండే వాడు చాలా ఎత్తు దానికి తగ్గ శరీరం .బాగా అందం గా వుండే వాడు .నుదుటి మీద కాల్చిన మచ్చ ఉండేది .సత్య సాయి బాబా భక్తుడు .అమ్మను అక్కయ్యా అని మామయ్యను అన్నయ్యా అని ఆప్యాయం గా పిలిచే వాడు .నేను బి.ఎస్.సి పాసై తరువాత చదువు కోసం ఆలో చిస్తుంటే వేసవి సెలవుల్లో ఆయన వచ్చి ఆంద్ర యూని వేర్సిటి registraar మహా దేవన్ తనకు బాగా తెలుసనీ recommendation లెటర్ ఇచ్చి నన్ను విశాఖ పంపించాడు .ఆయన కూడా ఎంతో ఆదరం గా మాట్లాడి ఫిజిక్స్ లో సీట్లు అయి పోయాయని marine ఫిజిక్స్ లో ఇస్తానని చెప్పారు .లేను చేర లేదు .అంతటి సహాయ కారి అప్పన కొండ మామయ్య .
ఆయన కూతురే లక్ష్మి గారు .ఆవిడ భర్త గారే వావి లాల కృష్ణ గారు .రాజ మండ్రి నివాసి .అక్కడే పుట్టారు .అనసూయమ్మ గారి మనవడు ..వావిలాల వాసు దేవ శాస్త్రి గారు అంటే సాహిత్యం లో పరిచయం ఉన్న వారి కి బానే తెలుస్తుంది .శాస్త్రి గారు షేక్స్ పియర్ నాటకాలను మొట్ట మొదట తెలుగు లోకి అనువదించిన వారు .అంతే కాదు ”నందక రాజ్యం ”అనే తొలిస్వతంత్ర నాటకాన్ని , తొలి సాంఘిక నాట కాన్ని రాసిన కవి పండితులు .వీరేశ లింగం గారు ,వడ్డాది సుబ్బా రాయ కవి గారు ,వావి లాల వాసు దేవ శాస్త్రి గారు ఆ నాడు సమ కాలికులు .వీరు ముగ్గురిని ”ఆధునిక కవిత్రయం ”అని పిలిచే వారు .అలాంటి శాస్త్రి గారి మనుమడే కృష్ణ గారు .శాస్త్రి గారి రచనలను నాకు ఇచ్చారు ఇక్కడ .అంతే కాదు కృష్ణ గారు హూస్టన్ లో ”తెలుగు సంఘం ”ను మొట్ట మొదట గా ఏర్పరచి ,తెలుగు వారందరినీ కలిపిన వ్యక్తీ .అప్పుడు వీరికి సహకరించిన వారి లో చిట్టెన్ రాజు గారు ప్రముఖులు .వీరంతా తెలుగు భాష ,సంస్కృతీ లకు వ్యాప్తికి నిల బెట్ట టానికి అహర్నిశలు పని చేసిన తొలి తరం వ్యక్తులు .
లక్ష్మి గారు మమ్మల్ని మీనాక్షి దేవాలయం , ,దుర్గాలయం ,ఇస్కాన్ దేవాలయాలకు వెంట పెట్టు కోని తీసుకొని వెళ్లి చూపించారు .రైస్ యుని versity లో ఒక తెలుగు అమ్మాయి కూచి పూడి నాట్యాన్ని తొలి సారిగా రంగం మీద ప్రదర్శిస్తుంటే తీసుకొని వెళ్లి చూపించారు .దంపతు లిద్దరూ ఎంతో అప్యాయం గా పలకరించి సంభాషించే వారు .ఇండియా వచ్చినా తప్పక మాకు ఫోన్ చేస్తారు ఈ మార్చ్ లో అప్పన్న కొండ మామయ్య శత జయంతి కోసం రాజ మండ్రి వచ్చి ,ఆయన చదివిన కాలేజి లో ఆ కార్య క్రమాన్ని ఘనం గా నిర్వ హింప జేసి మాకు తెలియ జేశారు
హూస్టన్ లో ఉండగానే ప్రఖ్యాత నాట్యా చారిని వింజ మూరి రత్న పాప పరిచయం అయారు .ఆమె సుమారు పాతిక ఏళ్ళ క్రితం అమెరికా వచ్చి ఇక్కడ నాట్య కళాశాల స్తాపించి వేలాది మందికి భరత నాట్యం కూచి పూడి నేరించారు నేర్పిస్తున్నారు .రైస్ universiti లో పరిచయం అయారు హాస్టన్ లో నే ఉంటారు . ఆ రోజే ఆమె తల్లి గారు వింజ మూరి అనసూయ గారు కూడా పరిచయ మయారు .ఆమె పేరు మా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం సీతా అనసూయలు గా ప్రసిద్ధులు ఆ అక్కా చెల్లెళ్ళు .జాన పడ సాహిత్యాన్ని అద్భుతం గా ప్రచారం చేసిన విదుషీ మణులు .దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారి మేన కోడళ్ళు .ఆయన పాటలను ఊరూరా సంగీతా మేనా లో ఊరేగించిన వారు .కృష్ణ శాస్త్రి గారు మా పెద్దక్కయ్యా గాడే పల్లి లోపాముద్ర ,బావ కృపానిధి గార్లకు దగ్గర బంధువు .శాస్త్రి గారు మద్రాస్ లో టి.నగర్ లో ఉండే వారు .మద్రాస్ కు నేను వెళ్లి నప్పుడల్లా కృష్ణ శాస్త్రి గారింటికి మాక్కయ్య తీసుకొని వెళ్ళేది ఆయన ఎంతో ప్రేమతో పలకరించే వారు స్క్రిబ్లింగ్ పాడ్ పై సంభాషణ జారి పే వారు .ఒకటి రెండు సార్లు ఆయన కారు లో నన్ను ,నా మేన కోడలు సత్య కళ ను తీసుకొని వెళ్లి తిప్పారు ఆయన ఇంకో ఇరవై రోజులకు చని పోతారంగా నేను చివరి సారిగా వారిని వారింట్లో దర్శించాను .అప్పటికి ఆరోగ్యం బానే ఉంది .ఎన్నెన్నో విషయాలు అడిగి తెలుసు కొనే వారు .ఇలా రత్న పాప ,సీతా అనసూయ లకు మా ఉయ్యూరు సంబంధం వుంది .
అయిదు లేక ఆరేళ్ళ క్రితం చిట్టెన్ రాజు గారు హైదరా బాద్ లో తొలి ప్రపంచ తెలుగు సభలు నిర్వహిస్తూ శ్రీ బాపు ,రమణ ల స్నేహ షష్టి పూర్తి జరిపారు దానికి నేను హాజ రైనాను .అనసూయ గారు అప్పుడు హైదరాబాద్ వచ్చి తన పుస్తకాన్ని ఆవిష్కరించారు. బాపు రమణలకు అద్భుత సన్మానం జరిపారు రాజు గారు .చిరస్మర ణీయం అది .అనసూయ గారిని పలకరించాను .ఆవిడ బందుత్వాన్ని అంతా ఏకరువు పెట్టారు .
మూడేళ్ళ క్రితం కూచి పూడి లో వెంపటి చిన సత్యం గారి ఆధ్వర్యం లో మూడు రోజుల సిద్ధేంద్ర ఉత్స వాలు జరిగితే రత్న పాప వచ్చారు .ఆమె సత్యం గారి శిష్యురాలే .నేను మా హూస్టన్ పరిచయాన్ని జ్ఞాపకం చేశాను .చాలా ఆనందించారు . .నేను శ్రీ నాధుడు రాసిన శివుడు పార్వతీ మీది పద్యాన్ని ఎందుకో స్టేజి మీద చదివితే ఆమె తనకు ఆ పద్యం కావాలని ఆంటే రాసి ఇచ్చాను .దాన్ని తాను నేర్పే నాట్యం లో చేరుస్తానని అంత బాగా ఉందని అన్నారు .ఆ పద్యం”చంద్ర బింబానన ,చంద్ర రేఖా మౌళి ,నీల కుంతల ఫాల నీల గళుడు —”
మేమిద్దరం ,మా అమ్మాయి మనవడు శ్రీ కెత్ నవంబర్ లో కాలి ఫోర్నియా వెళ్లి మా మేనల్లుడు వేలూరి మృత్యుంజయ శాస్త్రి (jay veluri )ఇంట్లో ఫ్రీమాంట్ లో పది హీను రోజులున్నం .వాడి భార్య విజయ లక్ష్మి మమ్మల్నిబాబాయి గారు ,పిన్ని గారు అంటు ఎంతో ఆదరం గా చూశారు .చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ చూపించారు .అక్కడే మన ఉయ్యూరు లో చోడ వరపు చంద్రశేఖర రావు గారి మనవడు మృత్యుంజయ మూర్తి కనిపించాడు అతన్ని నేను ”పొట్టి ”అని పిలిచే వాడిని మంచి intelligent .బాంక్ ఆఫ్ అమెరికా లో పెద్ద ఉద్యోగి .ఇక్కడికి రాక ముందు ఇండియా లో స్టేట్ బాంక్ లో కూడా పెద్ద ఉద్యోగం చేశాడు .మా వాళ్ళింటికి వచ్చి మమ్మల్ని అందరిని వాళ్ళింటికి భోజనానికి ఆహ్వానించి పిల్లలకు పరిచయం చేసి ఎంతో గౌరవం చూపించాడు మూర్తి అతని భార్యా.అక్కడే మా వాడి ఇంటికి ఎదురు గా పింగళి వారి కుటుంబం పరి చయం+ అయింది .వృద్ధ దంపతులు .చాలా నియమ నిష్టలతో ఉంటారు ;కార్తీక మాసం లో వచ్చాం కనుక సత్య నారాయణ వ్రతం చేసి మమ్మల్నందర్నీ భోజ నానికి పిలిచారు .సాయంత్రం మేమందరం స్కూల్ గ్రౌండ్ కు నడక కు వెళ్ళే వాళ్ళం .ఆ పది హీను రోజులు యిట్టె గడి ఛి పోయాయి శాస్త్రి కొడుకు కృష్ణ కూతురు వీణా బాగా మమ్మల్ని ఆకట్టు కున్నారు .
నేను రోజూ అభిషే+కం చేసి పౌర్ణమి నాడు సత్య నారాయణ వ్రతం కూడా చేశాను. మా మేనల్లుడు శాస్త్రి దాదాపు ఇరవై ఏళ్ళ క్రితమే మిచిగాన్ చదువు కోవటానికి వచ్చి ,పూర్తి చేసి క్రమంగా ఉద్యోగం సంపాదించి ,భార్యకు కూడా ఉద్యోగం చూపించాడు.మా అక్కా బావ లను కనీసం ఎనిమిది సార్లైనా ఇక్కడికితీసు కోని వచ్చి ఉంటాడు .అతను అతని పెద నాన్న ముకుందం గారి అబ్బాయిని పవన్ ను కూడా ఇక్కడికి తెచ్చి నిలబడేట్లు చేశాడు. బావ మరిదిని భార్యను ,మా తమ్ముడు కొడుకు ను తీసుకొచ్చి ఆవ కాశాలు కలిగించాడు. పావన్ ఇప్పుడు మా అమ్మాయి వాళ్ల ఇళ్ళ దగ్గరే షార్లెట్ లో ఉన్నాడు .ఈ విధం గా మా జాయ్ వేలూరి వేలూరి సామ్రాజ్యాన్ని ఇక్కడ చక్కగా స్తిర పరిచి అందరికి అండ గా నిలి చాడు .అతను మొదటి సారిగా ఇక్కడికి రావా టానికి అతని స్నేహితుడు కొడాలి శ్రీనివాస్ ,ఇతర మిత్రులే నిలబడి నిల బెట్టారు .కొడాలి బందర్లో మా వాడి క్లాస్ మేట్ .స్నేహితం అంతే ఇదీ అని రుజువు చేసిన వాళ్ళు వీరంతా .
సశేషం —-రెండో సారి ప్రయాణం లో విశేషాలు ఇంకో సారి
—- మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —18 -04 -12 .
కాంప్ –యు.ఎస్ ఏ.