వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –5
లింగోద్భావాన్ని చూపే శివ లింగం
గుంటూరు జిల్లా చండ వోలు లో చాలా పురాతన మైన ”లింగోద్భవ స్వామి ”దేవాలయం ఉంది .శివ రాత్రి నాడు లింగోద్భవ సమయం లో శివుడు ఇక్కడ లింగ రూపం పొందాడని ప్రజల విశ్వాసం .ఆ లింగం ఆది ,అంతాలను తెలుసు కోవ టానికి బ్రహ్మా ,విష్ణువు ప్రయత్నించి విఫలు రైనా సంగతి అందరికి తెలిసిన విషయమే .చిన్న లింగం గుది లోను ,పెద్ద లింగం బయటా ఉంటాయి .మొగలి రేకు గుర్తు ,హంస గుర్తు ఈ లింగాల పై ఉండటం చిత్రాతి చిత్రం .లింగోద్భవం జరిగింది ఇక్కడే నని చెప్ప టానికి ఈ రెండు గుర్తులు సాక్ష్యం గా ఉన్నాయని ఇక్కడి వారి విశ్వాసం .
చేజెర్ల కపోతెశ్వరుడు
గుంటూరు జిల్లా నరస రావు పేట కు ౨౫ కి.మీ.దూరం లో ”చేజెర్ల ”గ్రామం లో కపోతేశ్వర స్వామి ఆలయం ఉంది .ఇది చతుర్భుజా కారం లో ఉండటం విశేషం .స్వామి పావురం ఆకారం లో లింగ రూపం లో ఉండటం మరో విచిత్రం .శిబి చక్ర వర్తి ,త్యాగ ఉద్ది తో తన తోడ లోని మాంసాన్ని కోసి పావురాయిని కాపాడిన ప్రదేశం ఇదే అని జనుల విశ్వాసం .దాని గుర్తు గానే ఇక్కడ శివుడు కపోతేశ్వరు డై ,శిబి త్యాగానికి చిహ్నం గా నిలి చాడు .
అయిదంతస్తుల మహా ద్వారం ఉన్న పుష్ప గరి
కడప జిల్లా లో పినాకినీ నదికి తూర్పున కొండ పై పుష్ప గిరి ఉంది .దీని పైనే గొప్ప ప్రాకారం ,మహా ద్వారం ఉన్నాయి .దీని లోపల చెన్న కేశవా స్వామి ,ఆయనకు ఉత్తరం గా ”పుష్పాచ లింగం ”ఉండటం విశేషం .మహాద్వారం అయిదు అంతస్తులు కలిగి విపరీతమైన ఆశ్చర్యం కలిగిస్తుంది .పుష్పాచ లింగేశ్వరునికి ,ఎడమ వైపు ఉమా మహేశ్వర లింగం ఉండటం విశేషం .కొండ కింద ”ప్రయాగ మాధవ మూర్తి ”ఉన్నాడు .ఈ స్వామికి పశ్చిమం వైపు ”రుద్ర పాదం ”ఉంది .24 అడుగుల పొడవు ,ఎనిమిది అడుగుల వెడల్పు ఉన్న కుడి పాదం ఇది .దీనికి సుమారు కిలో మీటర్ దూరం లో ”ముని పాక ”అనే గ్రామం లో విష్ణు పాదం ఉంది .ఆంధ్రులకు ఏకైక పీఠం పుష్ప గిరి యే.
తేళ్ళ మండపం
ఆ సమ కడప జిల్లా లో ”రాయచోటి ”లో వీర భద్ర స్వామి ఆలయం ఉంది .దసరా పండుగ రోజున స్వామి వారి గ్రామ విహారం లో ”పారు వేట ”ఉత్సవం జర్గు తుంది .ఈ ఉత్స వాన్ని ”తేళ్ళ మండపం ”అనే చోట జర పటం ఆన వాయితీ గా వస్తోంది ఆ సమయం లో వేలాది తేళ్ళు అక్కడికి చేరు కొంటాయి .ఎవర్నీ ఏమీ చేయవు .ఉత్సవం అయి పోగానే ఒక్క తేలు కూడా అక్కడ ఉండ కుండా వెళ్లి పోవటం చిత్రాతి చిత్రం .
సశేషం ——–మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —18 -04 -12 .
కాంప్-యు.ఎస్.యే.
వీక్షకులు
- 981,033 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- కళా విశ్వ నాథ దర్శనం -1
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.27 వ.భాగం.5.2.23.
- అరుణ మంత్రార్థం. 12వ.భాగం.5.2.23.
- ఉయ్యూరులో వీరమ్మతల్లి ఉత్సవాలు పది రోజుల సంబరాలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం -2
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -398
- గాంధీజీ కంటే ముందే అస్పృశ్యత ను వ్యతిరేకించి ఆచరించిన –తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -ఫిబ్రవరి
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష. 25వ భాగం 3.2.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,925)
- సమీక్ష (1,280)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (308)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (838)
- సమీక్ష (25)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (362)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు