ఊసుల్లో ఉయ్యూరు –27 ఇక్కడి మన వాళ్ళు –2

  ఊసుల్లో ఉయ్యూరు –27
ఇక్కడి మన వాళ్ళు –2
 మొదటి సారి అమెరికా కు వచ్చిన తర్వాత ఆరు నెలలు ఉండి  డిసెంబర్ మొదటి వారం లో ఇండియా కు తిరిగి వెళ్లాం .మళ్ళీ రెండోసారి మిచిగాన్ లో ని ట్రాయ్ కు 2005 నవంబర్ లో వచ్చి 2006   మే నెలలో తిరిగి వెళ్లాం .అయితె 2004 లో జనవరి నెలలో ఇప్పటి ఏం .ఎల్ .సి .శ్రీ రాజేంద్ర ప్రసాద్ నన్ను ఉయ్యూరు పంచాయితీ కి రావాల్సింది గా ఫోన్ చేశాడు .ఆతని భార్య భ్రమ రాంబ ఉయ్యూరు సర్పంచ్ అతను  z.p.t.c.membar . అమెరికా లోని మైనేని గోపాల క్రిష్ణయ్య గారు ఇక్కడ స్లాబ్ మాత్రమే వేసి ఉన్న కొత్త లైబ్రరి కి అధిక మొత్తం లో విరాళం అందించారని దాన్ని సర్వాంగ సుందరం గా ఏ.సి.లైబ్రరి గా నిర్మించాలని దానికి ఒక కమిటీ ని వేస్తున్నామని నన్ను దానికి కన్వీనర్ గ చేస్తున్నామని అందరికి తెలియ జేశాడు .ఆ డబ్బు ను గోపాల కృష్ణ గారి అన్న గారు తాతయ్య గారి ఎకౌంటు లో జమ చేసి ఖర్చు పెట్టాలని చెప్పారు సరే అన్నాను .నిర్మాణ కమిటీ లో మిగిలిన వారందరూ సరే నన్నారు. హై స్కూల్ దగ్గర ఉన్న దీన్ని తీర్చి  దిద్దటానికి వెలగా  వెంకటప్పయ్య గారు, అప్పటి కృష్ణా జిల్లా గ్రంధా లయ సంస్థ చైర్మన్ గొర్రె పాటి గోపీచంద్ వగైరాలంతా సహక రించారు రెండు పూట్ల పని చూసి డబ్బు లెక్కలు వేసి తాతయ్య గారి ద్వారా బట్వాడా చేయించే వాడిని .ఆయన మా ఇంటికి కారు లో వచ్చి నన్ను తీసుకొని వెళ్ళే వారు .అంతా బానే జరిగి పోతోంది .దక్షిణ భారత దేశం లో ఏ.సి .లైబ్రరి మొదటగా ఉయ్యూరు లో నే ఏర్పడు తోంది .మంచి ప్రచారం కల్గింది .ఆ నాటి ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు దీన్ని ప్రారంభించాలని చాలా ఉవ్విల్లూరారాని   రాజేంద్ర చెబుతూ ఉండే వాడు .కాని మే నెలలో జరిగిన ఎన్నికల లో తెలుగు దేశం ఓడి పోయి రాజ శేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడింది .2004 జూలై  రెండో వారం లో లైబ్రరీ ప్రారంభోత్సం అత్యంత వైభవం గా కొత్త మంత్రులైన జక్కం పూడి రామ మోహన రావు కోనేరు రంగా రావు శాసన సభ్యులు సారధి ,రాజేంద్ర ప్రసాద్ వంటి వారందరూ హాజరై జరిపించారు .ఆ సభకు అమెరికా నుండి మైనేని గోపాల కృష్ణ గారు కూడా హాజ రైనారు. అదే మొదటి సారి వారిని చూడటం .ఒకటి రెండు సార్లు అమెరికా నుంచి నేను చేస్తున్న పనిని తాతయ్య గారు చెబితే నాకు ఫోన్ చేసి మాట్లాడిన గుర్తు .ఆయన అక్కగారు అన్న పూర్ణమ్మ గారు బావ గారు రాచ కొండ నరసింహ శర్మ గారు ఇంకో అక్క గారు అందరు వచ్చారు .అమెరికా నుండి గోపాల కృష్ణ గారు అతి ఖరీదైన రెఫెరెన్సు పుస్తకాలను ఆంగ్ల సాహిత్యాన్ని షిప్పింగ్ ద్వారా మా ఇంటికి పంపించారు. వాటిని జాగ్రత్త చేసి ఆవిష్కరణ రోజున లైబ్రరీ లో ఉంచాము. దీనికే చాలా ఖర్చు చేశారు .అంతే కాదు ప్రారంభోత్సవ ఖర్చు కూడా వారే భరించారు . చాలా ఉదార హృదయులని పించారు .వారందరినీ అంటే మన ఉయ్యూరు వారందర్నీ అక్కడ చూడటం చాలా విశేషం అని పించింది .నేను దగ్గరుండి నిర్మాణం చేయించి నందుకు నాకు సత్కారం కూడా చేశారు .లెక్క లన్ని పూర్తి చేసి తాతయ్య గారికి అందించి నా బాధ్యత ను నేను నెర వేర్చాను .మర్నాడు కూడా వారంతా తాతయ్య గారిట్లో ఉండి తర్వాత వెళ్లి పోయారు .అదే గోపాల కృష్ణ గారితో పరిచయం .అమెరికా వెళ్లి ఒకటి రెండు సార్లు ఫోన్ చేశారు
మేము రెండో సారి 2005 లో అమెరికా వెళ్లి నప్పుడు వారి ఫోన్ నంబర్ కు చేస్తే లైన్ కలవ లేదు న్యు జెర్సీ కి ప్రయత్నించా .మా బంధువు పవన్ కూడా అక్కడికి వెళ్లి అడ్డ్రెస్ కోసం ప్రయత్నించాడు .దొరక లేదు అంటే రెండో సారి ఇక్కడికి వచ్చి నప్పుడు వారితో మాట్లాడే ఆవ  కాశం .కలగ లేదు .ప్రయత్నం విర మించాను. అయితె ట్రాయ్ లో మా అమ్మాయికి మంచి స్నేహితులున్నారు జ్యోతి ,ప్రీతి బిందు ,హరిణి ,లావణ్య ,నాగమణి అనూరాధ .అందరు మంచి ఆప్తు లయారు వీరంతా మన రాష్ట్రం వారే .అందరి కుటుంబాలు కలిసి మెలసి మేలిగేవి. వారానికి ఎక్కడో అక్కడ భోజనాలు బర్త్ డీ పార్టీలు విష్ణు సహశ్ర నామ ,లలితా సహస్ర నామ పారాయణాలు తో కాలమ్ గడిచి పోయింది మంచి చలి కాలమ్ అడుగు ఎత్తున స్నో పడేది. ఒళ్లంతా స్వెట్టర్లు కోట్లు బూట్లు గ్లోవేస్ తో బయటికి వెళ్ళే వాళ్ళం .యుద్ధానికి వెళ్ళే సైనికుల్లాగా తయారయ్యే వాళ్ళం ..హరిణి ఇంట్లో ఉగాది నాడు పంచాంగ  శ్రవణం చేశాను .సంక్రాంతికి అక్కడి అందరి పిల్లలకు మా ఇంట్లో భోగి పళ్ళు మా  మన వళ్ళ తో పాటు పోయిన్చాం .ప్రీతి వాళ్లకు సత్య నారాయణ స్వామి వ్రతం చేయించాను .చిన్న పిల్లలు అవటం తో ఎక్కడికీ వెళ్ళ లేదు .ఒక్క పిట్స్ బర్గ్  దగ్గరున్న వెంకటేశ్వర స్వామి గుడికి మాత్రం కార్ లో అందరం వెళ్లి వచ్చాం .
                 ఆ అర్వాత ఎప్పుడో గోపాల కృష్ణ గారి అబ్బాయి  కృష్ణ  అమెరికా నుంచి ఉయ్యూరు వచ్చి లైబ్రరి కి కంప్యుటర్ బహూక రించాడు .నాకు ఫోన్ చేస్తే వెళ్లాను అప్పుడు గోపాల క్రిష్నయ్య గారి సరైన ఫోన్  నంబర్ అతను ఇచ్చాడు. అలబామా లో ఉంటున్నట్లు చెప్పాడు .అతను తండ్రిని మించిన తనయుడు అని పించాడు .సంస్కారి గా అని పించాడు .
మూడో సారి మేము 2008 మే లో మిచిగాన్ లోని స్టెర్లింగ్ హైట్స్ కు మా అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లాం .వేసవి కాలమ్ చాలా బాగా ఉన్ది. ఇక్కడ కడప అమ్మాయి మాధవి వాళ్ల కుటుంబం తో పరిచయం అయింది.చాలా మంచి కుటుంబం .వాళ్ల మామ గారు అత్త గారు కూడా హైదరా బాద్ నుండి వచ్చారు .వారానికో సారి కలుస్తూ రోజూ ఫోన్ చేసు కొంటు ఉండే వాళ్ళం. ఆ అమ్మాయి భర్త సుధీంద్ర యోగ్యుడు .ఒక అబ్బాయి అప్పటికే .మళ్ళీ అమ్మాయి పుట్టింది .ఇక్కడి వాళ్ళందరికీ మా అమ్మాయి విజయలక్ష్మి సామూహిక సీమంతం అందరి సహకారం తో నిర్వ హించేది .లడ్డు లు కట్టి అందరికి ఇచ్చేది దాన్లో  మా అమ్మాయి స్పెషల్ .మూడు నెలలు గడిచి పోయాయి ఒక సారి ఎందుకో మైనేని గోపాల కృష్ణ గారికి ఫోన్ చేయాలని పించి, చేశా .వాళ్ళంతా పెద్ద వాళ్ళు మన తో మాట్లాడు తారో లేదో అని అనుమానం .కాని ఆయన వెంటనే మాట్లాడారు .ఎంతో ఆత్మీయతను కలిగించారు .ఈ మూడు నెలలు ఆయనతో మాట్లాడక పోవటం బాధ అని పించింది .ఆయన అమెరికా లో విశ్వ విద్యాలయాలలో సీనియర్ లైబ్రేరియన్ గా పని చేసి పదవీ విరమణ చేశారు ఉయ్యూరు దగ్గర కుమ్మ మూరు నివాసి .వారి అక్క గారు గాంధీ గారి దర్శనం తో ప్రభావం పొంది సాధారణ జీవితం గడుపుతూ ఖద్దరు ధరిస్తూ ఉన్ది .భార్య భర్త లిద్దరూ డాక్టర్లే .ఆయన ప్రఖ్యాత కధకుడు రా.వి .శాస్త్రి గారి తమ్ముడు .మేమున్నపుడు ఇక్కడే ఫీల డెల్ఫియా లో వాళ్ళ అబ్బాయి దగ్గర ఉన్నారు. ఫోన్ లో సంభాషించే వారు. మంచి కవి .కవితలు పుస్తక రూపం లో కి తెచ్చారు ఉయ్యూరు కు మేము వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడుతూనే ఉండే వారు విశాఖ లో ఆ వృద్ధ దంపతులున్నారు .శర్మ గారు వదాన్యులు .చేతికి ఎముక లేదు .పుస్తక ప్రియులు .ఎక్కడ ఏ కొత్త  పుస్తకం వచ్చినా కోని చదివే వారు .ఇలా గోపాల కృష్ణాయ గారి ద్వారా వారి బావ గారు శర్మ గారు పరిచయం అయారు .గోపాల కృష్ణ గారు మా కుటుంబానికి ఆప్తులై మరీ దగ్గరయారు. దాదాపు రోజూ మెయిల్ లోనో ఫోన్ లోనో పలకరించు కొనే వాళ్ళం .నాకు ఎన్నో ఖరీదైన చద వాల్సిన పుస్తకాలు పంపించి చదివించారు . నా అభిమాని ఇమాన్యుల్ కాంట్ పుస్తకాలను నాకు పంపారు .కాంట్ పై నేను సుదీర్ఘం రాయాలని ప్రారంభించాను .ఈ ప్రయాణం తోఆపేశాను .మళ్ళీ వెళ్లి పూర్తి చేయాలి ఇప్పటికి మంచి పుస్తకాలు కోని పంపుతూనే ఉన్నారు .ఆయనకు నేనేమీ పంపలేక పోయాను .  .వారి సౌజన్యం జనం జన్మ కు మరువ లేము ..మా ఉయ్యూరు నివాసి మైనేని వారు .వారి భార్య సత్య వతి గారు కూడా వారికేమీ తీసి పోలేదు ఆప్యాయం గా పలక రిస్తారు అలబామా లో ఉంటూ  పెరట్లో కూరలు పండించి మాకు పోస్ట్ లో పంపిన  సాధ్వి ఆమె .మూడు నెలలు ఎలా గడిచి పోయాయో తెలీదు .వారు మా ఉయ్యూరు లో సరస్వతి tutorial   కాలేజి ని నిర్మించి పుచ్చా శివయ్య  గారి తో కలిసి వంద లాది  విద్యార్ధులకు విద్యా దానం చేసిన అనే   హను మంత రావు గారిని నాకు ఇక్కడ పరిచయంచేశారు మైనేని గారి దగ్గర బంధువే అన్నే వారు ..ఉయ్యూరు లో ఉండగా ఆయన నాకు చాలా పరిచయం.మా నాన్న గారు ఆ కాలేజి లో తెలుగు పండితులు గా   పని చేశారు కూడా .మా తమ్ముడు కొంత కాలమ్ చేశాడు .హనుమంత రావు గారు చాలా కాలమ్ కిందటే అమెరికా వచ్చి చికాగో లోడిగ్రీ విద్యార్ధులకు  లెక్కలు బోదించి ఇప్పుడు డెట్రాయిట్ లో ఉంటున్నారు .లెక్కల బోధన లో ఆయనకు మంచి పేరు ఉన్ది .మెట్రిక్ కు విద్యార్ధులను తయారు చేసే వారు .ఆయన దగ్గర చదివారంటే పాస్ గ్యారంటీ .ఇప్పుడు ఆయనకు ఎనభై ఏళ్ళ వయసున్నట్లు మై నేని వారు తెలిపారు .వారబ్బాయి సురేష్ ఉయ్యూరు విద్యార్దియే .ఎలర్జీ డాక్టర్ గా, డెట్రాయిట్ మెడికల్ అసోసియేషన్ కు ముఖ్యుడు గా ఉంటున్నాడు .

  ఈ మూడవ ట్రిప్ లో పరి చయం  అయిన మరో ప్రముఖ వ్యక్తీ శ్రీ ఆరిక పూడి ప్రేమ చంద్ గారు .మా ఉయ్యూరు నివాసే .ప్రపంచ బాంక్ లో నాలుగు దశాబ్దాలు వివిధ హోదాల్లో పని చేసి అత్యున్నత పదవి నలంకరించి ఎన్నో దేశాలు సందర్శించి వాటికి ఆర్ధిక సలహా దారు గా పని చేస్తున్న  ప్రపంచ ప్రసిద్ధ ఆర్ధిక వేత్త  ప్రేమ చంద్ గారు .నాకు వీరిని మైనేని వారే పరిచయం చేశారు ఫోన్ ద్వారా .ప్రేమ చంద్ అంటే మైనేని వారికి వీర అభిమానం .ఆయన్ను దేవుడు గా భావించే ఆరాధనా భావం .ప్రేమ్చంద్ ఇంగ్లీష్ లో రాసిన తన జీవిత చరిత్ర ను మైనేని నాకు ఇక్కడికిపంపి చదవ మన్నారు .అద్భుతం గా వుంది .ప్రతి పంక్తిని క్షుణ్ణం  గా చదివాను .వారి చిన్నతనం లో ఉయ్యూరు ,పరిసరప్రాంతాలు  వారి విద్యా, ఉద్యోగం వగైరాలన్నీ ఒక డాక్యు mentari లాగా కళ్ళకు కట్టేట్లు రాశారు .చాలా సులభ మైన శైలి .నేను చదివి తెలుగు లో దాదాపు ముప్ఫై పేజీల నా స్పందనను గోపాల కృష్ణ గారికి రాసి పంపాను .ఆయన దాన్ని ప్రేమ చంద్ గారికి పంపారు .ఆయన చదివి నాకు ధన్య వాదలను ఫోన్ లో తెలియ జేశారు .అప్పటి నుంచి తరచుగా ఫోన్ సంభాషణ జరిపే వాళ్ళం .మైనేని వారు మేము ఇండియా వెళ్ళ గానే ప్రేమ చంద్ గారికి ఉయ్యురులో ఘన సన్మానంఎర్పాటు చేయించమని దానికి పూర్తి స్పాన్సర్ తానె ఉంటానని కోరారు నాకూ అలాంటి వారికి తగినట్లు సన్మానం చేయాలనే అని పించి సరే నన్నాను .మేము నవంబర్ లో ఇండియా వెళ్లాం .ప్రేమ చంద్ గారు కూడా ప్రతి సంవత్సరం నవంబర్ లో తప్పక భారత్ ను సందర్శిస్తారు .అలానే వచ్చారు 2008 డిసెంబర్ 21 తేది ఆది వారం ప్రేమ చంద్ గారికి సాహితీమండలి తరఫున ఏ.సి లైబ్రరి లో  లో  ఘన  సన్మానం చేశాం .ఏం.ఎల్ సి .రాజేంద్ర ప్రసాద్ .విజయ వాడ ఆకాశ వాణి డైరెక్టర్ శ్రీమంగళ గిరి  ఆదిత్య ప్రసాద్ కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష ,కార్య దర్షులు శ్రీ గుత్తి కొండ సుబ్బా రావు ,పూర్ణచంద్ వగైరా హేమా హేమీల సమక్షం లో ఘన సత్కారం చేశాం .ఖర్చు అంతా మైనేని వారిదే .భూమి పుత్రుడికి సన్మానం .పట్టు బట్టలు ,పట్టు శాలువా తో సన్మా నిన్చాం .నన్ను పట్టు బట్టలు కొనుక్కో మన్నారు మైనేని వారు .వారి ఆజ్ఞా శిరో దార్యం .వాటిని నాకు ప్రేమ చంద్ గారు అంద జేశారు.ప్రపంచ ఆర్ధిక పరిస్తితి పై చాలా స్పందన  కలిగే ప్రసంగం చేసి ప్రేమ చంద్ గారు అందర్నీ ఆకట్టు కొన్నారు .వారు ప్రచారం కోరు కోని మనిషి .నేను వారి గురించి పరిచయం రాసి అందరికి పంచి పెట్టాను. మీడియా వాళ్ళు వారిని ఇంటర్వ్యూ తీసుకొన్నారు .మంచి ప్రచారమే చేశారు .ఆకాశ వాణి వారు వారిని ఆహ్వానించి వారి ఇంటర్ వ్యూ  తీసుకొని ప్రసారం చేశారు .అలా చాలా మందికి ప్రేమ చంద్ గారిని పరిచయం చేసే అదృష్టం మాకు కల్గించిన విశాల హృదయులు మైనేని గోపాల కృష్ణ గారు .ఇప్పటికీ తరచుగా ఫోన్ చేయటమో మెయిల్ లో పలకరించాటమో చేస్తారు .ప్రేమ చంద్ గారు కనీసం డజను పుస్తకాల నైనా రాసి ఉంటారు . ఎన్నో విలువైన గ్రంధాలను పంపి నాతొ చదివించిన సరస హృదయులు .మైనేని వారు .వారు నాకు పంపిన డబ్బు చాలా ఉన్ది. దాన్ని ప్రేమ చంద్ గారి సన్మానానికి ఖర్చు పెట్ట గా మిగిలిన ధనాన్ని వారి అను మతి తో బందరు లో కొత్త గా ఏర్పాటు చేసిన కృష్ణా విశ్వ విద్యా లాయానికి వారి పేరు మీద గా నేను, గుత్తి కొండ సుబ్బా రావు గారు మండలి బుద్ధ ప్రసాద్ గారి సమక్షం లో అంద జేశాము .అక్కడ కూడా మైనేని వారి దాతృత్వాన్ని తెలియ జేయ గలిగాము .
ప్రేమ చంద్ గారు ,మైనేని గారు -నేను సరస భారతి లో రాసే ప్రతి విషయాన్నీ చదివి వెంటనే స్పందిస్తున్నారు .నాకు గొప్ప ప్రేరణ కల్గిస్తున్నారు .ఇలా ఇద్దరు మహాను భావులు ఉయ్యూరు వారు ఇక్కడ ఉంటూ మాత్రు దేశాన్ని మరువ కుండా సేవ చేస్తున్నారు ఇద్దరు దాదాపు నలభై ఏళ్ళ నుండి అమెరికా లో ఉంటున్న ప్రముఖులే -మా ఉయ్యూరు వారే .వారిని ఇలా మా వాళ్ళందరికీ పరిచయం చేయటం నా బాధ్యత గా భావించాను .
ఉయ్యూరు కు చెందిన ప్రముఖ వ్యాపారస్తులు ఊర తాతయ్య గారి కుమారులిద్దరూ ఊర సాంబశివ రావు ఊర సాయి బాబు ఇద్దరు ఇక్కడ చాల కాలమ్ నుంచి డాక్టర్లు గా ఉన్నారు .ఉయ్యూరు దగ్గర వున్న తోట్ల వల్లూరు కు చెందిన నోరి దత్తాత్రేయుడు గారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాన్సర్ స్పెషలిస్ట్ అన్న సంగతి విశ్వ వ్యాప్తం గా అందరికి తెలిసిన విషయమే .
అలాగే మైల వరం శాసన సభ్యులు స్వర్గీయ కోమటి భాస్కర రావు గారి కుమారులు ఇక్కడి  తానా కు అధ్యక్షులు గా ఉన్నారు .భాస్కర రావు    గారు నేను మైల వరం దగ్గర చిలుకూరి వారి గూడెం హై స్కూల్ హెడ్ మాస్టర్ గా   పని చేసినపుడు పరిచయం .భాస్కర రావు గారి అబ్బాయి గారు వాళ్ళు నాలుగేళ్ల క్రితం ఇండియా వచ్చి తానా ద్వారా కృష్ణా జిల్లా అభివృద్ధి చేయాలని ఒక సమా వేశం జరిపారు. వివిధ రంగాలలో  నిష్ణాతు లైన వారిని కమిటీ సభ్యులు గ తీసు కొన్నారు .అప్పటి కృష్ణా జిల్లా పరిషద్ చైర్మన్ శ్రీ కుక్కల నాగేశ్వరరావు గారి సారధ్యం లో విజయ వాడ లో వీరందరి విస్తృత సమా వేశం జరిగింది. అందులోవిద్యా విషయం మీద  నన్ను సభ్యుని గా తీసుకొన్నారు .ఆ మీటింగ్ లో నేను చేయ వలసిన సంస్కరణలను గురించి విపులం గా మాట్లాడి ఒక రిపోర్ట్ వారికి అంద జేశాను .ఆ సభలో పిన్నమ నేని కోటేశ్వర రావు చనుమోలు వెంకట్రావు గారు జంధ్యాల శంకర్ వంటి ప్రముఖులున్నారు ఆ సమావేశం తరువాత మళ్ళీ ఏమి జరిగిందో ఎవరికి తెలీదు .
ఇప్పుడు తానా ప్రెసిడెంట్ గా వున్న తోట కూర ప్రసాద్ గారు కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్ కార్య దర్శిగా అధ్యక్షునిగా పని చేసి న గన్న వరానికి చెందిన  హిందీ పండితులు తోట కూర అప్పా రాయ వర్మ గారి కుమారుడే .వర్మ మా కు ఆత్మీయుడు ,నాకు చాలా అభిమాని .మా ఇంట్లో పెళ్లిళ్లకు ఉయ్యూరు వచ్చి ఆశీర్వ దించిన సహృదయుడు వర్మ గారు .పెద్ద మనిషి. హుందా తనం ఉన్న వ్యక్తీ .ఈ విధం గా ఇంకా ఎందరెందరో పరిచయం ఉన్న వారందరూ ఇక్కడ తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వ హిస్తూ  మాత్రు దేశానికి సేవ చేస్తూ మన భాష ను ,సంస్కృతిని పరి రక్షించు కొంటు భావి తరాలకు అంద జేస్తూ శ్లాఘ నీయ మైన సేవలందిస్తున్నారు .మచిలీ పట్నానికి చెందిన సిలికాన్ వాలీ లో తన సేవా విశ్వ రూపాన్ని ప్రదర్శిస్తున్న శ్రీ కూచి భొట్ల ఆనంద్ గారు అందరి అభిమానం సంపాదించిన వారే .ఈ మధ్య ఉయ్యూరు కు కూడా వచ్చిన వారే ;కృష్ణా జిల్లా  రచయితల సంఘం నిర్వ హించే జాతీయ .ప్రపంచ తెలుగు రచయితల సభలకు ఆనంద్ గారు ప్రత్యెక ఆకర్షణే .తెలుగు తనం మూర్తీ భావించే కట్టు బొట్టు తో వారెక్కడైనా ప్రత్యక్షం .ఎన్నో గిన్నీ బుక్ రికార్డులను సాధించిన నిరంతర సంస్కృతీ ప్రచార సారధి .శ్రీ ఆరిక పూడి ప్రేమ చంద్ గారు యెన్.ఆర్.ఐ .లు భారత దేశానికి చేస్తున్న సేవలను వారి ద్వారా జరిగిన ,జరుగుతున్న అభివృద్ధి ని తాను వ్రాసిన పుస్తకం లో విపులం గా చర్చించారు .దాన్ని చదివి నేను ప్రవాస భారతీయులు చేసిన సేవల గురించి ఒక వ్యాసం రాసి విజయ వాడ రేడియో స్టేషన్ కు పంపితే దాన్ని ఇంటర్వ్యూ గా ప్రసారం చేశారు .ఈ విధం గా వారి సేవలను ప్రజా లందరికి తెలియ జేసే అవకాశం నాకు లభించింది .దీన్ని వ్రాసిన ప్రేమ చంద్ గారికిఅభి నందనాలు.
ఇప్పుడు నాతొ పాటు ఇక్కడ ముగ్గురు ప్రముఖ వ్యక్తులు ఉన్నారు .వారిలో శ్రీ దేవి నేని మధు సూదన రావు గారు ఒకరు .కృష్ణా జిల్లా కంకిపాడు దగ్గర తెన్నేరు నివాసి .గన్నవరం దగ్గర హై టెక్ ప్రింట్స్ అది పతి గా చాలా కాలమ్ ఉన్నారు .తర్వాత దాన్ని వదిలేసి వారి స్వగ్రామం లో ఆధునిక వ్యవ సాయ పద్ధతులతో పంటలు పండిస్తున్నారు .గొప్ప సాహిత్యాభి మాని ఎందరికో పుస్తకాలను కోని ముద్రించి ఆప్యాయం గా అంద జేసే వ్యక్తీ విద్యార్ధులను తీర్చి దిద్దాలనే తపన ఉన్న వారు. వారి శ్రీ మతి వారికి గొప్ప సహకారం. తల్లి గారి పేర  ఒక సేవా సంస్థను నెల కొల్పి పుస్తక ప్రచురణ చేసి అందరికి సాహిత్యాన్ని అందు బాటు లోకి తెస్తున్నారు .ఇటీవలే పిల్లల కోసం ముఖ్యమైన పద్యాలు పాటలు రెండు పుస్తకాలుగా ముద్రించి స్చూల్స్ కు  ఉచితం గా పంపిణీ చేశారు .కృష్ణా జిల్లా ప్రదానో పాధ్యాయ  సంఘానికి వెన్నెముక గా నిలిచి మేము చేబట్టిన ఎన్నో కార్య క్రమాలకు స్పాన్సర్ గా ఉన్నారు .సమాజానికి ఇంకా ఏదో చేయాలనే తపన వారిని నిద్ర పోనీదు .ఆధునిక పరికరాల వాడకం వారికి కరతలా మలకం . .వారిద్దరమ్మాయిలు అమెరికా లోనే ఉన్నారు .సంవత్స రానికి రెండు మూడు సార్లైనా అమెరికా  వస్తుంటారు .నాతొ తరచు ఫోన్ సంభాషణ చేస్తున్నారు .ప్రేమ చంద్ గారి సన్మానానికి విచ్చేశారు ఆయన కార్య క్రమాలకు నన్ను ఆహ్వానిస్తే వెళ్తుంటాను .మంచి మనిషి ,యోగ్యులు మధు సూదన రావు గారు .
ఇక్కడున్న రెండవ ప్రముఖ వ్యక్తీ మా ఉయ్యూరు లో కమ్మర్షియల్ టాక్స్ ఆఫీసర్ గా పని చేసి రిటైర్ అయిన సాహితీ ప్రియులు శ్రీ ముత్తేవి రవీంద్ర నాద్ .తెనాలి వాసి .ఆధునిక భావాలలున్న వారు .మంచి హేతు వాది .ఆయన భావాలతో మనం ఏకీభవించక పోయినా స్నేహ శీలి. ఉయ్యూరు లో పని చేస్తుంద గానె పరిచయం .ఎన్నో విషయాల మీద పుంఖాను పుంఖాలుగా  వ్యాసాలను సమగ్రం గా  రచించిన సాహిత్య కృషీ వలుడు .ఆరోగ్యం మీదా ఆహార పదార్ధాల మీద రచనలు చేశారు .ఆయనకు గొప్ప పేరు సంపాదించి పెట్టింది ”తెనాలి రామ కృష్ణుడు ”అనే పుస్తకం .పాండు రంగ మహాత్మ్యాన్ని ఆధారం గా చేసుకొని గొప్ప విశ్లేశానాత్మకం గా బృహత్ గ్రంధాన్ని రాశారు అదొక విజ్ఞాన సర్వస్వం గా వుంటుంది.ఎదైనాలోతులు తరచి ఆది కారం గా రాసే ఓపికా తీరికా బాధ్యతా ఉన్న వారు .నాకు గొప్ప ప్రేరణ వారి రచనలు .వారి అమ్మాయి దగ్గర ఇక్కడే అమెరికా లో ఉన్నారు .తరచూ మెయిల్ ద్వారా కలుస్తారు .నాలుగు రోజుల క్రితం ఫోన్ చేసి మాట్లాడారు .
ఇప్పుడు రవి గారు ”శ్రీ కృష్ణ దేవరాయలు -ఆముక్త మాల్యద ”పై సమగ్ర గ్రంధం రాస్తున్నట్లు ఫోన్ లో తెలియ జేశారు .అదొక సర్వస్వం గా తీసుకు  వచ్చే కార్యక్రమం .అభినందించాను .త్వరలో ఆ పుస్తకం వెలుగు చూడాలి. వారు జూన్ లో ఇండియా వెళ్లి పోతారు .
మూడవ ప్రముఖుడు ఆత్మీయుడు కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తి కొండ సుబ్బారావు గారు .రచయితల సంఘానికి వెన్నెముక .ఎన్నో ఘన కార్యాలను సంఘం ద్వారా చేసిన మనిషి .మా సాహితీ మండలి, సరస భారతికి గొప్ప అభి మాని .మేము ఏ పెద్ద కార్య క్రమం చేసినా సుబ్బారావు పూర్ణ చంద్ లేకుండా చెయ్యం .పిలవ గానే తప్పని సరిగా హాజరయ్యే సహృదయత వారిద్దరిది. ఎంతో సాహితీ సేవ చేసిన రధ సారధులు సుబ్బారావు పూర్ణ చందులు. ఒక రకం గా సూర్య చంద్రుల వంటి వారు .సుబ్బా రావు గారు మాతో పాటే అమెరికా వచ్చారు. ఈ నెలాఖరుకు ఇండియా వెళ్తారు .మెయిల్ లో తరచూ కలుస్తూ ఉంటాము
ఇలా ఎందరెందరో మహాను భావులు -అందరికి వందనాలు .
సమాప్తం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19 -04 -12 .
కాంప్ –అమెరికా 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

1 Response to ఊసుల్లో ఉయ్యూరు –27 ఇక్కడి మన వాళ్ళు –2

  1. బాగు౦ది సారూ, మా గురి౦చిన మ౦చిమాటలకు మప్పిదాలు-పూర్ణచ౦దు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.