వింత ఆలయాలు -విచిత్ర విశేషాలు –6
రస భాండ నిలయం -సిద్ధ వటం
కడప జిల్లా పెన్నా నదీ తీరాన సిద్ధ వటం అనే గ్రామం లో అనేక సిద్ధ పురుషులు ఉండే వారట .అందుకే ఆ పేరు సార్ధక మైంది .అందులో ”రస సిద్ధులు ”చాలా మంది ఉండే వారట .అక్కడ భూమి ని తవ్వితే నేక రస భాండాలు కన్పించాయత .వాటి లో ఏమి ఉందొ ,వాటి వివ రాలు ఇప్పటికీ ఎవరికీ తెలియదట .ఆ రసం ఎందుకు ఉప యోగించారో ,ఉపయోగిస్తారో ఈ నాటికి అంతు పట్టని మిస్టరి గా నే ఉందట .అదీ సిద్ధ వటం హిస్టరీ .తిరునాళ్ళ లో ఇక్కడి నీటి బుగ్గలు ఉబుకు తాయత .అదొక వింత గా చెప్పు కొంటారు .
గోపాద ముద్రలున్న మహా నందీశ్వరుడు
కర్నూలు జిల్లా నంద్యాలకు దగ్గరలో ఉన్న మహా నంది గొప్ప శైవ క్షేత్రం .మహా నందీశ్వర లింగం కింద ”రుద్ర కుండం ”అనే కోనేటి లోకి ,నీరు నిరంతరం గా ప్రవహిస్తూ ఉంటుంది .లింగం మీద ఆవు పాద ముద్రలు కని పించటం ఇక్కడి వింత .అది సాలగ్రామ లింగం అవటం మరీ విశేషం .పుష్కరిణి లో నీళ్ళు ఎప్పుడు అయిదు అడుగుల లోతు లో ఉండటం మరో విశేషం .దీని లో స్నానం చేయటం పరమానందం ,వింత అనుభవం .అడుగున వేసిన చిన్న పైసా కూడా స్పష్టం గా కని పిస్తుంది .స్నానం చేస్తుంటే మనం దేవతలమేమో నన్న దివ్య భ్రాంతి ,కాంతి మన శరీరాలకు కలిగి మరిచి పోలేని అనుభూతి గా మిగిలి పోతుంది .ఆనంద పార వశ్యం కల్గిస్తుంది .దీని కంతటికీ కారణం ఆ జలం శుద్ధ స్పటిక జలం అవటమే .దివ్యాను భూతి అంటే ఏమిటో ఇక్కడే మనం పొందగలం .
అభిషేక జలం బయటకు రానివ్వని బాల బ్రహ్మేశ్వర లింగం
మహబూబ్ నగర్ జిల్లా లో ,కర్నూలు కు దగ్గరగా ,’అలంపురం ‘చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రం .దక్షిణ కాశి అంటారు .తుంగ భద్రా నదీ తీరం .ఇక్కడా నవ బ్రహ్మ లకు ఆలయాలున్నాయి .ఇక్కడి బాల బ్రహ్మా లయం చాలా ప్రసిద్ధి పొందింది .బాల బ్రహ్మేశ్వర లింగానికి ఎంత నీటి తో అభిషేకం చేసినా ,ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాదట .గుడి లోపల ఉన్న గణ పతి విగ్ర హాన్ని వన మూలికలు ,పసరులు ,ఇసుక తో కలిపి ,ఈ ఆలయాన్ని నిర్మించిన రస సిద్ధుడు తయారు చేశాడట .ముట్టు కుంటే గరుకు గా ఉంటుందట .ఇక్కడి ఆలయాలన్నీ మహోన్నత శిల్పాలతో విరాజిల్లుతూ ఉంటాయి జోగులాంబా దేవి శక్తి క్షేత్రం ఇది .ఆలాయా లన్ని గుహల్లా గా ఉండటం విచిత్రం .రాతికీ ,రాతికీ మధ్య అతికించా టానికి సున్నం లాంటిది ఏదీ వాడక పోవటం మరీ విచిత్రం .
బోయలే పూజారు లైన బీచు పల్లి
మహబూబ్ నగర్ జిల్లా లో కృష్ణా తీరాన బీచు పల్లి ఆంజనేయ స్వామి ఆలయం ,మహిమాన్విత మై ప్రసిద్ధి చెందింది .స్వామి స్వయం గా వెలసిన దివ్య క్షేత్రం.
స్వామి అర్చకులు బోయ వాళ్ళే .స్వామి దర్శనం తో దీర్ఘ వ్యాదు లన్నీ మాటు మాయం అవుతాయని భక్త జన విశ్వాసం .స్వామి సమీ పం లో ఉన్న ”కడిమి చెట్టు ”మహా మహిమాన్విత మైనదని ఇక్కడి ప్రజల అచంచల విశ్వాసం .
లింగం మీద ఒకే మట్టం లో నీరు ఉండే వాడ పల్లి
మూసీ నదికి ముచి కుంద నది అని పేరు .ఇది నల్గొండ జిల్లా వాడ పల్లి వద్ద కృష్ణా నది లో కలుస్తుంది .ఇక్కడి అగస్స్త్యేశ్వర దేవాలయం పురాణ ప్రసిద్ధ మైనది .శివ లింగం మీద నీరు ఎప్పుడూ ఒకే ఎత్తు లో ఊరుతూ ఉండటం ఇక్కడి విశేషం .దీనికి దగ్గర లో నర సింహ స్వామి ఆలయమూ విశిష్ట మైనదే .స్వామికి ఎదురుగా పద కొండు దీపాలు నిరంతరం వెలుగు తూ ఉండటం విశేషం .అందులో నర సింహ స్వామి ముక్కు కు దగ్గర గా ఉన్న దీపం గాలికి రెప రెప లాడుతూ కన్పించటం మరీ విచిత్రం. .మిగిలిన దీపాలు నిశ్చలం గా వెలుగుతూ కన్పిస్తాయి .దేవుడు ఊపిరి పీలుస్తున్నాడు అన్న భావన కలిగేట్లు శిల్పి నిర్మించిన నిర్మాణ చాతుర్యం ఆశ్చర్యం కలిగించి ఆతని చాతుర్యానికి జోహారు లర్పిస్తాం .శైవ ,వైష్ణవ దివ్య క్షేత్రం వాడ పల్లి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –19 -04 -12
క్యాంపు –అమెరికా
వీక్షకులు
- 980,462 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గాంధీజీ కంటే ముందే అస్పృశ్యత ను వ్యతిరేకించి ఆచరించిన –తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -ఫిబ్రవరి
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష. 25వ భాగం 3.2.23.
- అరుణ మంత్రార్థం. 10వ భాగం.3.2.23.
- కళా తపస్వికి శ్రద్ధాంజలి
- సుప్రకాశ శతకం
- అక్షర ప్రభాకరుడు’’ కూర్చిన వినూత్న’’ అక్షర స్వరం ‘’
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.24 వ భాగం.2.2.23.
- అరుణ మంత్రార్థం. 9వ భాగం.2.2.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,924)
- సమీక్ష (1,279)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (306)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (837)
- సమీక్ష (25)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (360)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు