వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –1

వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –1

                కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో 2009  మే లో నిర్వహింప బడినవందేళ్ళ తెలుగు కధ సదస్సులో నాకు ఇచ్చిన  ఈ విషయం పై నేను రాసి సమర్పించిన వ్యాసం ఇది .దాదాపు మూడేళ్ళ తరువాత మీకోసం వెలుగు చూస్తోంది .

          కధ అనేది చెప్పటం ,వినటం తో ప్రారంభ మైంది .తర్వాత రాయటం ,చదవటం గా మారింది .మళ్ళీ రాయటం ,వినటం ,రాయటం చూడటం దాకా మాధ్యమాల  వల్ల పరిణామం చెందింది .వినటం లో ఉన్న హాయి ని చదవటం ద్వారా పొందేట్లు చేయటం మంచి కధా రచయిత దృక్పధం .వందేళ్ళ క్రితం వక్ర మార్గం లో పడిన జీవితాన్ని ఒక సారి పరిశీలించు కోని,దారి మార్చుకొని ,”దిద్దు బాటు చేసుకొని మంచికి మార్గం చూపించాడు గురజాడ .మార్పు లేక పొతే జీవన యానం సాగటం కష్టం అని సారాంశం .ఆ దిద్దు బాటు అందరికీ హెచ్చరికే .కధలో ,కధనం లో వినూత్నత ఉండటం వల్ల దిద్దు బాటు కధను ఆధునిక తెలుగు కధ గా స్వీకరించారు .అలా ప్రారంభ మైన తెలుగు కధానిక నిత్య చలన శీలిగా ,ప్రవహిస్తూనే ఉంది .మధ్యలో ఎన్నో వాదాల సెలయేళ్ళు ,భావాల పరవళ్ళు ఆ ప్రధాన శ్రోతస్విని లో కలిసి నిండుదనాన్ని ,పుష్టినీ ఇచ్చాయి .

కధా రచయిత బాధ్యత కూడా పెరిగింది .తాను సమాజం నుంచి వేరు కాదని సమాజ హితమే తన ధ్యేయమని భావించాడు .వ్యష్టి ,సమష్టిల సమన్వయము అర్ధం చేసుకొన్నాడు .రచయిత సమాజానికి ఆత్మ కావాలి అన్న ప్రఖ్యాత రచయిత మాక్సిం గోర్కీ మాటలను మననం చేసుకొన్నాడు .మూధతం నుంచి సమాజ వికాసానికి సమాజాన్ని మార్చే ప్రయత్నాలు సాగించాడు .చెప్పే దాన్ని అండం గా ,ఆకర్షణీయం గా ,బలం గా చెప్పే ఒడుపు తెలుసు కొన్నాడు .ఇదే శిల్పం .దీన్ని బట్టే రచన చేసిందెవరో చెప్పే యచ్చు .డాక్యు మెంతరి లాగా కాకుండా ,మనోహరం గా చెప్పే దారి చూపించాడు .దృష్టి వైశాల్యము హృదయ వైశాల్యమూ పెంచు కొన్నాడు రచయిత ..వాస్తవికత అంతర్వాహిని గా సాగటమే కాకుండా వన్నె తెచ్చింది .ప్రపంచ సాహిత్యం లో ,ఏ ఇతర భాషా సాహిత్యానికీ తీసి పోనిది తెలుగు కధా సాహిత్యం అని నిరూపించాడు .అతి విస్తృత మైంది .అన్ని కొనాల లోని కధలు వచ్చి చేరి సుసంపన్నం అయింది .అయినా మన విమర్శకులకు ఇంకా తృప్తి కలగ లేదు .ద్రౌపది గాంధార రాగం ఆలపించి ,భీమ సేనున్ని జాగృతం చేసి నట్లు మన కధ కులు కూడా గాంధార రాగ మాల పించి,జాతిని చైతన్య వంతం చేయాలి అని ప్రఖ్యాత కధకులు రచయిత రావూరి భరద్వాజ అన్నాడు .అందుకనేనేమో సర్వేపల్లి రాధాకృష్ణ  పండితుడు ‘’కాల పరీక్ష లో నిలిచిన భావాలలో ఏవి మన అభివృద్ధి కి తోడ్పడు తాయో ,వాటినే స్వీకరించాలి .వాటి వెలుగులతో మన నడవడిని ఏర్పరచు కోవాలి అప్పుడే మనం అభ్యుదయ పధం లో ఉన్నట్లు ‘’అన్నారు .

       సృజన శీలి అయిన కధకుడు తన రచనలలో తాను తాదాత్మ్యం చెంది ,ఇతరులకూ తన్మయత్వాన్ని కల్గిస్తాడు .అప్పుడే ఉన్నత మానవుదేర్పడుతాడు .ఏదో విషయం దొరికింది కదా అని రాసేయ రాదు .’’సాహిత్యం పండ్ల గంప కాకూ డదు .నిచ్చెన మెట్లు అవాలి ‘’అన్నారు కధా శ్రీ పాదులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు .ఈ భావన ఉంటె మహోన్నత తెలుగు కధ వస్తుందని వారి భావం .కధ జీవితాన్ని ప్రతి బిమ్బించేదే కాదు ,వ్యాఖ్యానించాలి .రంజింప చేయటంతో పాటు ,మేధస్సును కూడా కదిలించాలి అన్న కొడవటి గంటి కుటుంబ రావు మాటలు అనుసర ణీయం.అభ్యుదయం కోసం రాజ కీయ ,సామాజిక,ఆర్ధిక దృక్పధాలకు స్థానం కల్పించాలి .ఇవి పరస్పరం ఆధార మైనవి .ఒక దాని ప్రభావం మిగిలిన వాటి పై ఉంటుంది .ఆ ప్రభావం తో జనం ఆలోచనా విధానం లో మార్పులు వస్తాయి .వేధింపులు ,సాధింపులు పెరుగు తాయి .వ్యత్యాసాలు కూడా ఎక్కువ అవుతాయి .కలవటం కంటే విడి పోవటం ఎక్కువ అవుతుంది .సహజం గా ఉన్న ఓర్పు నశిస్తుంది .నిరసన ప్రారంభమై ,ఉద్యమ రూపం దాలుస్తుంది .ఆశయ సాధన కోసం తెగింపు వస్తుంది .తిరగ బడటం ,అశాంతి ,అల్లా కల్లోలం పెరిగి జన జీవనం చిద్రమౌతుంది .దాన్ని మళ్ళీ గాడి లో పెట్టటం బ్రహ్మ ప్రళయమే అవుతుంది .మానవ సంబంధాలు మారి పోతున్నాయి .పోటీలో నిలబడ టానికి ఎంతటి కైనా తెగించే సాహసం కలుగు తుంది .ప్రభుత్వాలు ,చట్టాలు మారి పోతాయి .పాలనా సౌలభ్యం అనే పేరు తో తెచ్చే మార్పులకు జనం విల విల లాడి పోతారు .

           విదేశీ వ్యామోహం ఒక వైపు ,ఉన్న భూమి ఆవిరై పోవటం మరో వైపు, కొద్ది మంది సుఖం కోసం బడుగు జీవితాలను ధ్వంసం చేయటం ,స్వేచ్ఛ హరించుకు పోవటం ,కుటుంబ కలహాలు ,అస్తిత్వ నిరూపణ ,నిరుద్యోగం ,చదివిన చదువుకు తగిన గుర్తింపు ,జీతం రాకుండా పోవటం ,భార్యా భర్తల్లో ఎవరిది పైచేయి అన్న భావం ,రక్షణ చూపని వ్యవస్థా ,కాలేజీలలో ఆగడాలు ,ఒకటా ,వందా?అంతు లేని సామాజిక అంశాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జన జీవనం .పరిష్కారం కని పించని ఆరాటం ,పోరాటం .ఇవన్నీ కానీ ,ఇందులో కొన్ని కానీ ఈ వందేళ్ళ లో ఉన్న అంశాలే .సంఖ్య కాల క్రమం లో పెరుగు తోందే కాని తగ్గటంలేదు .తెలుగు కధా ప్రస్తానం లో ఈ సామాజిక అంశాలను పరిశీలించ టమే ఈ వ్యాసం ధ్యేయం .

              సశేషం ———-గబ్బిట దుర్గా ప్రసాద్.

                        క్యాంపు—అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

1 Response to వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –1

  1. స్వామి(కేశవ) అంటున్నారు:

    టైపోలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి గురువుగారు.. వీలుంటే కాస్త చూడండి
    “*చెప్పే దాన్ని అండం గా ,ఆకర్షణీయం గా ,బలం గా చెప్పే…..*”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.