శ్రీ శంకర స్మరణం

  శ్రీ శంకర స్మరణం 
               వైశాఖ శుద్ధ పంచమి అంటే ఈ నెల 26 వ తేదీ గురువారం ఆది శంకరా చార్యుల వారి జయంతి .కేరళ లోని కాలడి లో భూమిపై కాలిడిన అపర శంకర అవతార మూర్తి అయిన శంకర భగవత్పాదులు చిన్న తనం లోనే సన్యాసాశ్రమం స్వీకరించి ,పరమ గురు శుశ్రూష లో  విద్యలు నేర్చి,గురువులకే గురువై జగద్గురువులై దేశమంతా కాలి నడక తో పర్య టించి ఆధ్యాత్మ భావ వాహినిని ప్రవ హింప జేశారు . ఎదురైన అన్యమత వాదనలను తన వాదనా పటిమతో ఎదుర్కొని వారిని తన మార్గం లోకి మార్చుకొన్న ఘనులాయన .వైదిక ధర్మ పునరుద్ధరణకు వారు చేసిన సేవ మాటలతో వర్ణించ లేనిది .అద్వైత భావం బీజ రూపం లో ఉన్నదాన్ని వట వృక్షం గా పెంపొందించిన మహాను భావులు .ఇతర దేశాల సరిహద్దు లలో ఉన్న హిందూ మతావ లంబులను అక్కడే పీఠాలు ఏర్పరచి వారిలో వైదిక ,ధర్మ సంస్కారం కలిగించి ,నిలిపిన మహోన్నత వ్యక్తీ .శంకరులే లేకుంటే .ఆ ప్రాంతాల వారందరూ ప్రక్క దేశాల మతాను యాయులై ఈ దేశ భావ జాలాన్నే మరిచి పోయి ఉండే వారు .అలాంటి ప్రదేశాలైన బదరీ నాద్  .కేదార్ నాద్,ప్రాంతాలనుభారతీయ సజీవ జీవన స్రవంతి లోకి మళ్లించిన దార్శనికులు .
జ్ఞానులకు మాత్రమే అందు బాటు లో ఉన్న ప్రస్టాన త్రయం అన బడే బ్రహ్మ సూత్రాలు ఉపనిషత్తులు భగవద్గీత లకు సామాన్యులకు అర్ధ మయే  రీతి లో విపుల మైన వ్యాఖ్యానం రాసి అందు బాటు లోకి తెచ్చిన యోగి వరేన్యులు .మరి ఇంకా దిగువ తరగతి సంగతేమిటి ? వారినీ ద్రుష్టి లో ఉంచుకొని సకల దేవతల పైనా స్తోత్రాలను రచించి ,భక్తి భావం తో ఆడుతూ పాడుతూ పాడు కొనే సులభ శైలి లో ,లయతో, శబ్ద సౌందర్యం తో ,అర్ధ గౌరవం తో రాసి వారికి అందు బాటు లోకి తెచ్చారు .అర్ధం కాక పోయినా ఆ స్తోత్రాలను వింటే చాలు నోటికి వచ్చేంత సులభం గా ఉంటాయి .బహుశా సంస్కృత భాష ను ఇంత గొప్పగా ప్రజల దగ్గరకు తెచ్చిన ,భాషా సేవ చేసిన చరితార్ధుడు ఇంకెవరు లేరని పిస్తుంది .వైరాగ్యం పొందాలనే వారికి వివేక చూడామణి ,వంటి వాటిని రచించి సన్యాసాశ్రమ ధర్మాలను బహు చక్కగా వర్ణించి  ,అందులోని కట్టు బాట్లను ప్రవర్తనా నియ మావళిని బోధించిన సద్గురువు శ్రీ శంకరులు .నిర్గుణ ఉపాసకులే కాక సద్గుణ ఉపాసకులకు కూడా మార్గ దర్శ కత్వం వహించిన జన హితైషి ఆది శంకరులు .అందుకే ఆధ్యాత్మిక జ్యోతి అని పించు కొన్నారు .నిర్యాణం చెంది శతాబ్దాలు గడిచినా ఇంకా మన అందరి ముందు నిలిచి జ్ఞాన జ్యోతి ని ప్రకాశింప జేస్తున్నారు .శంకరాద్వైతం తో జాతిని ,ప్రపంచాన్ని చైతన్య వంతం చేస్తున్నారు .అన్ని మతాల వారి భావనలను వ్యవస్తీక్రుతం చేసి ప్రధాన స్రవంతి  లో నడిచే వీలు కల్పించారు అందుకే ష న్మత    స్థాపనా చార్య అని పించుకొన్నారు .శారదా దేవినే మెప్పించి కాశ్మీరు లోని మహోన్నత శారదా పీఠాన్ని అధిహోరించిన అపర శారదా వతారం .
భగవత్పాదులు రచించిన ”శివా నంద లహరి ”,”సౌందర్య లహరి ”శవ శివా ల అలౌకిక శక్తిని ఆవిష్కరించిన ఉత్తమోత్తమ రచనలు .అద్వైతామృత వర్షం తో సకల జనాలను పులకరింప జేసిన రచనలవి .వాటిల్లోని పరమ గంభీర మైన భావనలను చదివి ,విని స్మరించి తరించాల్సిందే.ఇప్పటికీ చాగంటి కోటేశ్వర రావు గారి లాంటి వారు వాటి లోతుల్ని తరచి ఆస్తిక జనాలకు అంద జేస్తున్నా రంటే ఎంత గొప్ప జ్ఞాన నిధి ని వాటిలో ఆచార్యుల వారు ప్రక్షిప్తం చేశారో ఆశ్చర్యమేస్తుంది .శ్రీ శంకరులు లలితా సహస్ర నామాలకు భాష్యం వివరణ రాయాలని భావించారట .శిష్యుడిని ఆ గ్రంధం తీసుకొని రమ్మని, చెప్పటానికి ఉపక్రమించి కూర్చున్నారట .శిష్యుడు తెచ్చాడు .తీరా చూస్తె అది లలితా సహస్రం కాదు విష్ణు సహస్రం .పూనుకున్నారు కనుక విష్ణు సహస్ర నామాలకే భాష్యం రాశారు .అదే మనకు దక్కింది .లలితా సహస్ర నామాలకు అమ్మ అను మతి నివ్వవ లేదేమో .రాయ లేక పోయారు .
ఇప్పుడు సౌందర్య లహరి గురించి కొన్ని విషయాలు తెలుసు కొందాం .ఒక సారి శంకరా చార్యుల వారు కైలాసం వెళ్లి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను దర్శించారట .స్వామి వారి భక్తీ శ్రద్ధ లకు సంతోషించి, పరమేశ్వరుడు అయిదు స్పటిక లింగాలను వారికి ప్రదానం చేశారట .మాత పార్వతీ దేవి వంద శ్లోకాలతో ఉన్న ఒక మంత్ర గ్రంధాన్ని ఆయనకు బహూకరించింది .ఆ రెండిటినీ తీసుకొని సెలవు పొంది భూ లోకానికి తిరిగి వస్తున్న తరుణం లో వాకిట్లో ఉన్న నందీశ్వరుడు ఆ గ్రంధాన్ని లాగ బోయాడు .అలాంటి ఉత్తమ గ్రంధం కైలాసం నుండి భూలోకం చేరటం నందికి నచ్చలేదట .అందుకని ఆ పని చేశాడట .అలా లాక్కో బోతున్నప్పుడు అందులోని 59 శ్లోకాల భాగం నందీశ్వరుడికి చిక్కిందట.మిగిలిన 41 శ్లోకాలున్న భాగమే శ్రీ శంకరాచార్యుల వారికి దక్కిందట .శంకరులు చింతిస్తూ ఉంటె శార్వాణి .”నంది లాక్కొన్న శ్లోకాల గురించి చింతించ వద్దు. ఆ యాభై తొమ్మిది శ్లోకాలను నువ్వే రచించు ”అన్న వాణి విన్పించింది .అంతే ఆయన లోని కవితా గంగ ఉత్తుంగ భావ తరంగాలతో ప్రవహిన్చిందట .నిమిషాల మీద ఆ యాభై తొమ్మిది శ్లోకాలు అలవోకగా  శంకరుల నోటి నుండి అపూర్వం గా నభూతో గా వెలువడ్డాయట .కనుకనే సౌందర్య లహరి లో లలితా పరమ భట్టారిక ఇచ్చిన 41 శ్లోకాలలో మంత్రాను ష్టానానికి సంబంధించిన కఠిన నియమాలతో ఉన్న మంత్ర ,కుండలినీ యోగాలు ,శ్రీ విద్యో పాసనా ఉన్నాయి . గురుముఖతహా నేర్చుకొని నియమ నిష్టలతో అనుష్టించాల్సినవే ఇవన్నీ .ఏ మాత్రం తప్పు జరిగినా బెడిసి కొడుతుందని విశ్వ సిస్తారు .కనుక సౌందర్య లహరి లో మొదటి 41 శ్లోకాలు అమ్మ వారిచ్చినవి తరువాతి 59 శ్లోకాలు శ్రీ శంకర కృతం .ఏవైనా అమ్మ  వారి వర ప్రసాదమే  సౌందర్య లహరి .
సౌందర్య లహరి శ్లోకాలన్నీ చిక్కని పడ బంధం తో ఉంటాయి .ఏ పదాన్ని మార్చలేం .ఒక  వేళ  సాహసం చేసి పెట్టినా రస స్ఫూర్తి కల్గించదు .అది భగవద్దత్తం .
శ్రీ శంకరులకు పరమేశ్వరుడు అనుగ్రహించిన పంచ లింగాలలో ఒకటి కంచిలోని యోగ లింగం –చంద్ర మౌలీశ్వరుని గా పూజింప బడుతున్నాడు .రెండవది కేదార నాద్ లోని ముక్తి లింగం ,మూడోది నేపాల్ దేశం లోని వర లింగం ,నాల్గవది చిదంబరం లోని మోక్ష లింగం ,అయిదవది శృంగేరి లోని భోగలింగం గా చెబుతారు ,
శ్రీ శంకర జయంతి నాడు శ్రీ శంకరుల అద్వైతామృతాన్ని ,గ్రోలుతూ ,స్తోత్ర మకరందాన్ని ఆస్వాదిస్తూ ,జ్ఞాన జ్యోతి వైపు అడుగులు వేద్దాం .ఆ మహాను భావుడిని ఒక సారి సంస్మరించుకొనే మహద్భాగ్యం నాకు కల్గినందుకు ఆనందం గా  ఉంది
”  నారాయణ సమారంభాం -శంకరాచార్య మధ్యమాం -అస్మదాచార్య పర్యన్తాం -వందే గురు పరంపరాం ”
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —25 -04 -12 .
      కాంప్-అమెరికా 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

2 Responses to శ్రీ శంకర స్మరణం

 1. bharathi says:

  శ్రుతి స్మృతి పురాణానా మాలయం కరుణాలయం
  నమామి భగవత్పాదశంకరం లోకశంకరమ్ //

 2. శ్రీ శంకర స్మరణం చాలా బాగుంది. ఈ వ్యాసం సందర్భోచితం మాత్రమే కాదు. సముచితం
  కూడా. ఆది శంకరులను క్లుప్తంగానే అయినా చాలా చక్కగా పరిచయం చేశారు.శంకరాచార్యుల
  సిద్ధాంతాలు రుచించని వారు కూడా గొప్ప తత్త్వవేత్తగా భారతీయ చింతనా స్రవంతికి, సంస్కృత
  సాహిత్యానికి ఆయన చేసిన నిరుపమానమైన సేవలను మరువలేరన్నది వాస్తవం.
  ఇకపోతే టైపు చేయడంలో మునుపటి కంటే మీరు మరింత శ్రద్ధ కనబరిచారు. భాషా
  దోషాలు, ముద్రణా స్ఖాలిత్యాలు చాలమేరకు పరిహరించారు. స్పేస్ నియమం ఇంకా పూర్తిగా
  పాటించడం లేదు. భాషా దోషాలలో మచ్చుకు రెండు మాత్రమే చెప్పదలచాను. మొదటిది
  ‘నిర్గుణ ఉపాసన’ కు వ్యతిరిక్తార్థక పదం ‘సగుణ ఉపాసన’ . మీరు పేర్కొన్నట్లు ‘ సద్గుణ
  ఉపాసన’ కాదు. అలాగే ‘ గురు ముఖతః ‘ అనడానికి మీరు’ గురు ముఖతహా ‘ అన్నారు.
  ఇలాంటి దోషాలు కూడా పునరావృతం కాకుంటే మరింత బాగుండగలదని మీ దృష్టికి
  తెస్తున్నాను. గమనించగోరతాను.

  — ముత్తేవి రవీంద్రనాథ్, డేటన్, న్యూజెర్సీ, యు.యస్.ఏ. నుంచి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.