వందేళ్ళ తెలుగు కధ-సామాజికాంశం-4
శ్రీ శారద ,ఆలూరి భుజంగ రావు ,ధనికొండ హనుమంత రావు ,రావూరి భరద్వాజ –పేదరికం లోని వివిధ పార్శ్వాలను కధల్లో స్పృశించారు .స్వయం గా అనుభవించారు కనుక ,ఆ కధలు సజీవం గా ఉన్నాయి .మనుష్యులలో దాగొని ఉన్న మానవత్వాన్ని ,స్నేహ సౌరభాలను ,బాంధవ్యాలను ,మర్యాదలను ,ఆప్యాయతలను మల్లె పూల వంటి మాటలతో ఆచంట జానకీ రాం కధనం చేశారు .హృదయ మార్దవానికివి తీపి గుర్తులు గా మిగిలి పోయాయి .ఇల్లిన్దిల సరస్వతీ దేవి ,తురగా జానకీ రాణి, వాకాటి పాండు రంగా రావు ,గంధం యాజ్న వల్క్య శర్మ, గంధం వేంకాస్వామి శర్మా కుటుంబం లోని ఆత్మీయతలను ,వ్యక్తికి సమాజం పట్ల ఉండాల్సిన బాధ్యతలను ,నైతిక ధర్మాన్ని తెలియ జెప్పే కధలను రాసి చిరస్మరణీయం చేశారు .వ్యంగ్య వైభవం తో పఠాభి కధలు కధలు గిల్లుతూ బుజ్జగించాయి ,మన చేత కాని తనాన్ని బయట పెట్టాయి .వసుంధర కధలు జీవన విలువలను తెలియ జెప్పాయి .అలవోకగా కధలు ఎలా రాయ వచ్చో నేర్పాయి .అన్నిటా,తన స్పర్శలేకుండా కే.ఆర్.కే.మోహన్ హాస్యపు పంట పండించారు .తెలుగు వారి ఆవకాయ ఘాటును రుచి చూపించారు . సినీ నటి, గాయక, దర్శకురాలు భానుమతి అత్తగారికీ కోడలికి మధ్య వైరుధ్యం ఉన్నట్లు కన్పిస్తున్నా ,ఒకరి పట్ల ఒకరికి ఉండే ప్రేమాను రాగాలను వివిధ కధల్లో వివరించారు .పసందైన విందూ చేశారు .చలం చూపించిన విశృంఖలత కు ముని మాణిక్యం గారు కులపాలికా ప్రణయం తో అడ్డు కట్ట వేశారు .’’స్నానం స్నానాల దొడ్లోనే చేయాలి .మైదా నా ల్లో కాదు ‘’అని కొ.కు.చలానికి చురక అంటించింది అందుకే .సమాజం లోని అన్నిటికీ స్థానం ఉండాలి .హాస్యం ఒక దర్శనం కావాలి అన్న భావన తో గుండె బరువు ,టెన్షన్ లను తగ్గించి ఆరోగ్యం అందించారు తమ అనేకానేక కధల్లో భమిడి పాటి రామ గోపాలం అనే భరాగో..అనుపానాన్ని బట్టి హాస్య తత్త్వం బోధించారు .
ఇలా సాగుతున్న కధా ప్రస్తానం లో ఒక విలక్షణ మైన గొంతు తో ,పదునైన కలం తో అందర్ని ఆకర్షించి ,ముందుకు దూసుకు పోయాడు గొల్ల పూడి మారుతీ రావు .మనసు లోని సున్నితపు పొరలను తాకే అతి సున్నిత మైన మాటలతో రాయ గలవారు మారుతీ రావు .మనసుకు సూటిగా తాకే టట్లు, రాసి మెప్పించాడు .కధల్లో ‘’బిట్వీన్ ది లైన్స్ ‘’ కు మంచి ప్రాముఖ్యతనిచ్చాడు.ప్రతి కధ లో కొత్తదనం ,కొత్త ధోరణి ఉండే మార్గం ఎంచు కొన్నాడు .సరి కొత్త ప్రయోగాలు చేశాడు .మానవుల మనస్సులో మనం చూడని కోణాలను,అందం గా ,సరళం గా సరసం గా ఆవిష్కరించారు .అచ్చ్చమైన తెలుగు దనానికి , , అపురూప మైన కధా రచనకు ,ప్రతినిధులు ఆయన కధలు .’’పాలు విరిగి పోయాయి ‘’కధ లో బేల అయిన ఒక ఆడ పిల్ల అంత రంగాన్ని వివిధ కోణాల్లో అద్భుతం గా ఆవిష్కరించాడు .షాజహాన్ తన భార్య స్మృతి చిహ్నం గా తాజమహల్ ను కట్టితే ,ఆగ్రా లోని గుర్రబ్బండీ తోలే నందలాల్ తాను అపురూపం గా ప్రేమించి న తన భార్య కు చని పోయిన తరువాత ఆమె గుర్తుగా ఒక ‘’తులసి కోట’’కట్టు కొన్నాడు .అదే అతని జ్ఞాపకాల్లో అమరత్వం .మారుతీ రావు ఆ తాజ మహల్ కంటే ,ఈ తులసి కోటే గొప్ప ప్రేమ చిహ్నం అని భావిస్తాడు .ప్రేమకు ,ఆరాధనకు దానం ,దర్పం అక్కర లేదని ,చెప్పిన కళ్ళు చెమరించె కధ .మాన వత్వం పరిమళించిన కధ ‘’తాజ్మహల్’’అందం అంత రంగానికి ఉండాలి. అప్పుడే నిండుదనం .లోని అందం లుప్త మైతే జీవితం పై విరక్తి కలిగి తప్పటడుగులు వేయిస్తుందని తెలియ జెప్పిన కధ ‘’అందమైన జీవితం. ‘’ఊహలని సాహిత్యానికి అనువదించటం మాత్రం అలవరచు కొన్న గొంగళి పురుగు ‘’దశ లో మారుతీ రావు’’ పరకీయ ‘’కధ రాశాడు .ఇందులో సుజాత అనే మహిళ విపత్కర పరిస్థితులను తనకు అనుకూలం గా మార్చుకొని ,బుద్ధి కుశలత తో పోరాట పటిమ ము చూపి,సంసార జీవితం గడుపుతూ ,ఆదర్శం గా నిలుస్తుంది .పరోపకార మిదం శరీరం అన్న భావాన్ని ‘’నేను ‘’కధ లో ఒక మామిడి కొమ్మ తన అమ్మ అయిన చెట్టు గురించి స్వాగతం గా చెప్పిస్తాడు.చదివి హాట్సాఫ్ అనాల్సిందే .మారుతీ రావు సంభాషణలు వేద వాక్యాలు గా ఉంటాయి .వాటిని మార్చలేం .మారిస్తే ,ఆ అర్ధం ,భావం గాంభీర్యం రావు .ఇవ్వటం లో ఉన్న ఆనందాన్ని చక్కగా వివరిస్తాడు .ప్రతి పాత్ర లో నిండుదనం ,పరి పూర్ణత ,ప్రయోజనం ఉన్న మంచి కధలు రాసి మారుతీ రావు వన్నె కెక్కాడు .కాలం విసిరే సవాళ్ళ ను ఎదుర్కొని నిలిచినా పాత్రలవి .సజీవం గా సాక్షాత్కరిస్తాయి .కళారాధన అంటే స్వీయ ఆత్మ సందర్శనమే అన్న సూక్తి మారుతీ రావు చక్కగా ఉపయోగించు కొన్నాడు .Each man,poet ,philosopher ,or writer inhales much before exhales ‘’అన్న పట్టు తెలిసిన వాడు గొల్లపూడి .అందుకే గొప్ప రచయిత గా పేరు పొందాడు .Beatifully photograaphing a thing ‘’అన్నది రచయిత లక్షణం అన్నారు .అప్పుడే ఉత్తమ రచన వస్తుంది .దాదాపు 1975 వరకు రాసిన కధ కధకులు అందరు ,కవులు ,పండితులు ,విమర్శకులు ,పాతది చదివి జీర్ణించు కొని ,కొత్త దారి తొక్కిన వారే .ఆ తర్వాత తరం వచ్చే సరికి కాలం తో పాటు చాలా మార్పులు వచ్చాయి .అధ్యయనం తగ్గింది .పరిశీలనా తగ్గి నట్లు కన్పించింది .ఇక్కడి నుంచి తెలుగు కధ చాలా మలుపులు తిరిగింది .ఆ వివరాలు తర్వాత తెలియ జేస్తాను .
సశేషం —-మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —26-04-12.
క్యాంపు—అమెరికా
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com