వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –5
తెలుగు నేల నాలుగు ప్రాంతాల లోగిలి .ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ,రాయల సీమ ,తెలంగాణా .ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రజల జీవన సరళి ,ఆచార వ్యవ హారాలు ,కట్టుబాట్లు ,వేరు వేరుగా ఉంటాయి .నైసర్గిక స్వరూపం ,పంటలు ,భూగర్భ నిక్షేపాలు ,,జలాశయాలు ,తాగు నీరు ,సాగు నీరు అందు బాటు వేరు వేరు గా ఉంటాయి .రవాణా సౌకర్యాలలో తేడా ,అడవుల విస్తీర్ణం ,భూమిని సాగు లోకి తెచ్చు కొనే సౌలభ్యం ,వాణిజ్య పంటల జోరు ,భూగర్భ జలాల విని యోగం ,వర్ష పాఠం ,ఈ ప్రాంతాల అభి వృద్ధికి ,వెనుక బడి పోవటానికి కారణాలవుతున్నాయి .తరతరాల దొరల పెత్తనం ,ఎదిరించే ధైర్యం లేక పోవటం ,ప్రజలను మరీ అంధకారం లోకి నెట్టాయి .ప్రజాస్వామ్యం వచ్చి అరవైయేళ్ళు దాటినా ఇంకా బానిస బతుకులే .ముఖ్యమంత్రి ఎవరైనా తన ప్రాంతానికే అభివృద్ధి .మిగిలిన జనం తన వాళ్ళు కాదు అనుకోవటం ,,పరిశ్రమ లన్ని ఒకే చోట చేరటం ,అధికారాలన్నీ గుత్తగా ఒకే కుటుంబాలకు పరిమిత మవటం ,ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా వర్షపు నీటిని నిలువ చేసే వనర్లను ఏర్పరచుకో లేక పోవటం ,విద్యుచ్చక్తి సరిగ్గా అందక పోవటం ,చీకటి బతుకులు ,చిద్ర మైపోయిన చేతి వృత్తులు ,ఆరుగాలాలు కష్టించి ,పండించిన పంటకు రైతుకు గిట్టు బాటు ధర లేక పోవటం ,వల్ల జనం లో నిరాశా ,నిస్పృహా .అందుకని ప్రాంతాలు ఏవైనా తీరు మాత్రం ఒక్కటి గానే ఉంది .వీటికి తోడు ఎన్నికల రాజ కీయాలు .ముఠా తత్త్వం ,హింస ,దౌర్జన్యం ,ప్రాణాలకు విలువ లేక పోవటం నిత్యం చూస్తూ ఉన్న విషయమే .పరిపాలన లో అవినీతి ,రక్షణ నిచ్చే వారిలోనూ నిర్లక్ష్య ధోరణి , ,న్యాయాన్నికాపాడే చోట్ల కూడా సామాన్యుడికి ఎదు రీతే .
బలం గల వాడిదే రాజ్యం .ఇవీ దాదాపు 25 ఏళ్ళు గా మన రాష్ట్ర పరిస్థితి .అతివృష్టి ,అనావృష్టి ,నాణ్యత లేని నిర్మాణాలు ,ప్రజల జీవితాలతో చేలగాటమాడు తున్నాయి .వీటికి మించి నక్సలైట్ల దాడులు ,మిలిటెంట్ల భీభాత్సాలు తో నిత్యం అభద్రతా భావం అలముకొన్న జీవితాలు .విద్య విషయానికి వస్తే కార్పోరెట్ల కళకళ .ప్రభుత్వ విద్యాలయాల విల విల ,వెల వెలా .పోటీ పరీక్షల్లో అగచాట్లు .చిన్న తరగతి చదువుకే వేలాది రూపాయల ఖర్చు .సరైన సౌకర్యాలు లేని ప్రభుత్వ విద్యాలయాలు .సిబ్బంది కరవు .ఆర్ధిక స్థితి కారణం అంటూ ఉపాధ్యాయ ,అధ్యాపకుల నియామకానికి ఏళ్ళూ ,పూళ్ళూ.గిరిజన ఆవాసాల పై నిర్లక్ష్యం .సెజ్ ల పేరిట పంట పొలాలకు ఎసరు .గంగ పుత్రులపై దాష్టీకం .ఇంతకు మించి మేధో వలసలు .అమెరికా పై అందరి చూపు .అదే లక్ష్యం గా మారటం .ఆంద్ర దేశం లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారంతా దాదాపు ప్రవాస భారతీయులు గా మారి పోవటం .ముసలి తలిదండ్రులను విస్మరించటం .ఏడాదికో ,రెండేళ్ళ కో ఒక సారి చుట్టపు చూపుగా వచ్చి పోవటం అనేక సమస్యలకు కారణాలవుతున్నాయి .భార్యా భర్త లిద్దరూ ఉద్యోగం చేయటం ,ఉద్యోగ భద్రత లేక పోవటం పిల్లల చదువు పట్ల నిర్లక్ష్యం ,వారి పై ప్రేమ కరువవటం ,.అనుబంధాలు ,ఆత్మీయతలు కనిపించక పోవటం హమేషా దర్శనం ఇస్తున్న విషయాలు .ఇవన్నీ ఇప్పుడు సామాజికామ్శాలే .
బాల కార్మికులు ,రేషన్ కార్డుల అక్రమ బట్వాడా రేషన్ సారిగా ఇవ్వక పోవటం ,గృహ నిర్మాణ విషయం లో శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలు .ఇలాంటి సమస్యల సుడి గుండం లో పడి ఆంద్ర ప్రజానీకం అలమటించి పోతోంది .రాష్ట్రం విడి పోతుందో ,కలిసి ఉంటుందో తెలీని నిత్య అనిశ్చిత స్థితి .ఎన్నికలలో ధన ప్రవాహం, వాగ్దానాల వెల్లువ .పోటీ చేసే వారి సంఖ్య మరీ పెరిగి పోవటం ,ఓట్లు ఉన్నాయో లేవో చివరిదాకా తెలీని వింత స్థితి .ఉందని వెళ్తే లేదని తెలిసి నీరసం తో ఇంటి ముఖం పట్టటం .వీటన్నిటి పైనా సామాన్యుడు సణుగు తూనే ఉన్నాడు , గొణుగు తూనే ఉన్నాడు .ఆశ్రిత పక్ష పాతం ,అయిన వారికి అందలాలు .మోసే జనం జావ కారి పోవటం .ఓర్పు హద్దు దాటి పోయింది .నిరసన గళం విప్పుతున్నారు .పిడికిళ్ళు బిగిస్తున్నారు .మేధావులూ వెన్ను తడుతున్నారు .ఇన్ని సమస్యల నుంచి తప్పించు కోవటం అసాధ్యం .దీనికి తోడూ ఉపకులాల చిచ్చు .విడదీసే వారే కాని కలిపే వారు లేక పోవటం బాధే .
ఇవన్నీ చూసి చూసి విసుగెత్తి చదువు కొన్న వారు తమకు తెలిసిన భాషలో ,తమరు నేర్చిన మాండలికం లో
తమ వారికి అర్ధం అయేట్లు రాస్తున్నారు .బోధిస్తున్నారు .చైతన్యం తెప్పిస్తున్నారు .దుర్భర జీవితాల నుంచి బయట పడ టానికి దారి చూపిస్తున్నారు .రచయితలుగా తమ కర్తవ్యాన్ని సంపూర్తి గా నెర వేరుస్తున్నారు .వ్రుత్తి చేసుకొనే వారి గొంతుకలు విచ్చు కొన్నాయ్ .తమ పరిభాషలో అద్భుతం గా రాస్తున్నారు ..చైతన్యం తెస్తున్నారు .ఈ పాతిక సంవత్స రాలలో అన్ని ప్రక్రియల్లోను వైవిధ్యం బాగా చోటు చేసుకొన్నది .ముఖ్యం గా బలం గ చెప్పేది ,చెప్పగలిగేది కధ కనుక దాని వాసీ ,రాసీ పెరిగింది .కధా ప్రాచుర్యం నాణ్యతా పెరిగాయి .దాని అవసరమూ అలానే పెరిగింది .కధ ఒక ఆయుధమే అయింది వారి చేతి లో .ఇలాంటి సామాజికాంశాలను ,అద్భుత కధా కదన రీతి లో ఆవిష్కరించారు మన కధకులు .మరుగున పడిన మాటలను పదునైన ఆయుధాలుగా మార్చు కొన్నారు .తమ మాండలిక సంపదను అందరికి పంచుతున్నారు .దీనితో గొప్ప చైతన్య స్పృహ వచ్చింది .ఆశించిన ఫలితం కని పించింది .స్వంత గొంతుక హెచ్చింది .అన్ని బంధనాలను తెంచుకొని ధైర్యం గా ముందు అడుగు వేస్తున్నారు .ప్రాంతీయ వారీ సమస్యలను చిత్రించి తీర్చి దిద్దు తున్నారు .పెద్దగా సాహిత్యాధ్యయనం లేక పోయినా మంచి కధలు ,అవసర మైన కధలు ,కదిలించే కధలు వస్తున్న కాలమ్ ఇది .ఆ విశేషాలేమిటో తరువాత తెలుసు కొందాం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27 -04 -12 .
కాంప్-అమెరికా
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com