రాలిన కధా గంధం గంధం వెంకా స్వామి శర్మ

              రాలిన కధా గంధం
  కొన్ని పరిచయాలు మధురం గా ఉంటాయి .పరిమళ భరితం గా ఉంటాయి .ఆ మనిషి వెళ్లి పోయినా ఆ పరీమళాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి .అలాంటి అరుదైన సుపరిచయం శ్రీ గంధం వెనకా స్వామి శర్మ గారితో కలగటం నా అదృష్టం గా భావిస్తాను .సరీగ్గా పదేళ్ళ క్రితం అంటే 2002 మార్చ్ లో భారతీయ సాహిత్య పరిషత్ వారు విజయ వాడ సత్యనారాయణ పురం లోని శిశు విద్యా మందిరం లో  రెండు రోజుల పాటు తెలుగు కధ పై సదస్సు నిర్వహించారు .ఆ సభకు పోలా ప్రగడ వారు ,కసిరెడ్డిగారు ,వంటి దిద్గంతులు వచ్చారు .అప్పుడే ముగ్గురు వ్యక్తులతో నాకు పరిచయం అయింది .ఒకరు గంధం శర్మ గారు రెండో వారు కస్తూరి మురళీ కృష్ణ గారు మూడో వారు సాగి కమలా కార శర్మ గారు .సాగి వారి పరిచయం ”మూసీ ”మాస పత్రిక తో బల పది కొన సాగుతూనే ఉంది .కస్తూరి వారు అప్పుడప్పుడు కస్తూరి పరిమళాలను చల్లుతూ మెరుపు లా మెరిసి వెళ్లి పోయే వారు .ఇటీవలే అంటే మార్చ్ నెలలో ఆయనతో బంధం ”సన్ ఫ్లవర్ వార పత్రిక ”సందర్భం గా బలపడింది .ఆయన చల్ల పల్లి రమ్మని నన్ను పిలవటం నేను వెళ్ళటం ,రచనలు పంపమని కోరటం ,నేను పంపటం అమెరికా వచ్చే లోపే జరిగి పోయాయి .అప్పుడప్పుడు ఫోన్ లో పలక రిస్తూ మెయిల్ రాస్తూ ఉన్నారు .

                 మేము 2002 జూన్ లో అమెరికా వచ్చాం .మళ్ళీ డిసెంబర్ లో ఇండియా చేరాం .ఆ వెంటనే గంధం వెంకా స్వామి శర్మ గారు ఫోన్ చేసి తాను తన కధలను కొన్ని ఒక సంకలనం గా తెస్తున్నానని ,దాని ది.టి.పీ.కాపీ పంపుతున్నానని ,నేను దానికి ముందు మాట రాయాలని అతి త్వర లో పంపిస్తే సంతోషం అనీ చెప్పారు .దాన్ని అందుకొని వెంటనే చదవటం ప్రారంభించాను .ప్రతి వాక్యం ,ప్రతి మాటా శ్రద్ధ గా చదివాను .ఆ రచన లో నాకు మళ్ళీ మధురాంతకం రాజా రాం దర్శన మిచ్చారు .ఆనంద బాష్పాలే రాలాయి .అద్భుత మైన కధలు .ఇది వరకు పత్రికల్లో కొన్ని  చదివినా జ్ఞాపకం లేవు .కొత్త లోకం లో విహరించి నట్లుంది .అప్పటి దాకా ఆయన కధకులు అన్న మాట పెద్ద గా తెలీదు నాకు .వెంటనే దాదాపు ఎనిమిది పేజీల స్పందన రాసి వెంటనే పంపాను .ఆనాడ పడ్డారు .అందిందని ,చాలా బాగుందని మెచ్చారు .అలా మళ్ళీ వారితో పరిచయం ఎనిమిది నెలల తర్వాత ధృఢ పడింది .తరచు ఫోన్లో మాట్లాడుకొనే వాళ్ళం .ఒక్కో సారి అర గంట కు పైనే మాట్లాడే వారు .అంతటి సహృదయత వారికి నాపై ఉండేది ఇంతకీ వారి కధా సంకలనం పేరు ”అమృత హస్తాలు ”.కధా కదన చాతుర్యం కన్నులు చెమర్చే సన్ని వేషాలు అర్ధ వంత మైన సంభాషణలు ,మాన వత్వాన్ని తట్టి లేపిన కధా సముచ్చయం అది నేను పెట్టిన పేరు ”కధా గంధం ”.అలా క్రమంగా హృదయాలు కలిశాయి .వారి శ్రీ మతి గారితోనూ మంచి పరిచయం ఏర్పడింది .ఆమె కూడా వారికి ప్రాణ స్పందనం గా ఉండే వారు .అమృత హస్తాల ఆవిష్కరణ సభకు ఆహ్వానిస్తే వెళ్లాను .అప్పుడే వారి తమ్ముడు యాజ్న వల్క్య శర్మ గారితో పరిచయమయింది గాఢ తా పెరిగింది .”నాయనమ్మ కధలు ”ప్రచురించి పంపారు .అందులోను వారు మానవత్వపు మహోన్నతత్వాన్ని ఆవిష్కరించారు .సేవా భావం మనిషి ని దేవుణ్ణి చేస్తుందని రాసిన కధలు .ఆయన కధలన్నీ జీవితం లోంచి పుట్టినవే .అనుభవ సారాలే .దాని మీదా నేను నా భావాలను రాశాను .ఆనందించారు .”రుక్మిణీ పరిణయం ”కావ్యాన్ని పునర్ముద్రించి పంపారు .దానిపై విపుల మైన వ్యాఖ్యానం రాశాను .పొంగి పోయారు అది తాను ఆరవతరం వాడిగా మాతా మహుల ఋణం తీర్చుకొన్న విధానం .ఉయ్యూరు సాహితీ మండలికి ఆహ్వానించి వారి కధా సరళి గురంచి మాట్లాడించి భార్యా భర్తలకు ఉడతా భక్తీ గా . సన్మానం చేశాను .ఇంకా మా మధ్య దూరం కరిగి పోయింది .కృష్ణా జిల్లా రచయితల సభ లన్నిటి లోను మేము కలుస్తూనే ఉండే వారం .స్నేహ సౌరభాలను వెద జల్లు తూనే ఉండే వారు ..
మూడేళ్ళ క్రితం వారి శ్రీ మతి మరణ వార్త ను గద్గద కంఠం తో ఫోన్లో తెలియ జేశారు .ఎదిచేశారు .శూన్యమే తన జీవితం అన్నారు .వారిని నేను ఒడార్చాల్సి వచ్చింది .అపర కర్మ కు వెళ్లి వచ్చాను .వారి రేడియో కధల విశేషాలన్నీ పూసా గుచ్చి నట్లు చెబుతూ ఉండే వారు .సరస భారతి ఏర్పడి న దగ్గర్నుంచి వారు తరచుగా కార్యక్రమాలకు వచ్చే వారు .కవి సమ్మేళనం లో పాల్గొనే వారు .మంచి కార్యక్రమాలు చేస్తున్నారని ఆశీర్వ దించే వారు .
             వారి సలహాతో నాలుగేళ్ల క్రితం విశ్వనాధ మీద పెద్ద కార్యక్రమం నిర్వహించాము .డాక్టర్ మడకా సత్యనారాయణ ..వేయి పడగలు నవలపై బెల్లంకొండ శివకుమారి ఏక వీర పై డాక్టర్ గుమ్మా సాంబశివ రావు కల్ప వ్రుఖం పై చాలా విలువైన ప్రసంగాలు చేశారు . రెండేళ్ళ క్రితం ”పురాణాలు నేటి కాలానికి అవసరమా “‘అన్న విషయం పై సభ జరపమని సలహా నిచ్చి ఆయన ,మడక వారు శివ కుమారి యాజ్న  వల్క్య శర్మ గారు 
, యడవల్లి మనోరమ వచ్చి మరో లోకానికి తీసుకు వెళ్ళే మరపు రాని ప్రసంగాలు చేశారు .మనోరమ మా పపై పిన్ని మేన కోడలని అప్పుడే తెలిసింది .శర్మ గారు తన దగ్గరున్న పుస్తకాలు నాకు పంపటం నేను నా దగ్గరున్నవి వారికి పంపటం జరిగేది .వారు నా రచనలను చదివి మీలో ఇంతటి రచయిత ఉన్నాడా అని ఆశ్చర్య పోయే వారు .వారు నాకు కావ్య కాంత గణ పతి గారి జీవిత చరిత్ర ను పంపారు .ఆయన నంటే వారికి ఆరాధ్యం .నేను దువ్వూరి వెంకట రమణయ్య గారి స్వీయ చరిత్ర పంపాను .చదివి ఎంతో పొంగి పోయారు .గుంటూరులో మా అబ్బాయి రమణ వివాహం అయితే వచ్చి మాకు బట్టలు పెట్టి ఆశీర్వ దించిన పెద్దలు శర్మ గారు .తమ్ముడు యాజ్న వల్క్య శర్మను ,రమాదేవిని ఆమె భర్తను మడక సత్య నారాయణ గారిని కూడా తమతో పాటు వచ్చేట్లు చేసిన స్నేహ బంధం వారిది .
డిసెంబర్ లో విజయ వాడ సత్యనారాయణ పురం లో మల్లాది వెంకటేశ్వర్ల్ కుమార్తె వివాహం జరిగితే మేము వస్తున్నట్లు తెలిసి మమ్మల్ని చూడ టానికి శ్రమ పది వచ్చిన మరపు రాని మనీషి .ఎందుకు శ్రమ పడ్డారు మేమే వచ్చే వాళ్ళం కదా అంటే ”మీరిద్దరూ నాకు ఆది దంపతుల్లా కని పిస్తారు .మిమ్మల్ని చూడ కుండా ఉండలేను ”అన్నారు .కళ్ళు చెమర్చాయి మాకు .శ్రీ నందన నామ సంవత్సర ఉగాది సందర్భం గామార్చి ౧౮ న కవి సమ్మేళనం  జరిపితే  రాలేక కవిత రాసి పంపారు .అది ఇప్పుడు ”ఆదిత్య హృదయం ”లో ప్రచురింప బడింది .సాధారణం గా వారు కవిత ను ఒక వ్యాసం లాగా రాస్తారు .నేను దాన్ని కవిత్వీకరించి అచ్చుకు పంపి ,ఒక కాపీ వారికి పంపుతూ ఉండే వాణ్ని .”ఎంత బాగా వచ్చిందండీ కవిత ”అని మ్రురిసి పోయారు .కిన్దత్దాది కవి సమ్మేళనాన్ని ”మా అక్కయ్య ”శీర్షిక పై నిర్వహించాం .వారు వారి అక్కయ్య పై చాలా ఆరాధనా భావం తో రాసి పంపారు .దాన్ని కవిత్వ రూపం లోకి తెచ్చి అచ్చు వేషం .చదివి ఆనంద బాష్పాలే రాల్చారు .అంతటి సహృదయ స్పందన వారిది .ఎప్పుడూ నవ్వు ముఖమే .ఎప్పుడూ చతురోక్తులే .ఎప్పుడు తన అనుభవాల తేగల పాతరను తవ్వి పోయతమే .తన కుటుంబం లోని మహా వ్యక్తులను ఆరాధనా భావం తో సంస్మరించాతమే .సభల్లో కలిసి నప్పుడల్లా నేను తెసిన ఫోటో లను వారికి పంపటం అలవాటు అందుకొని కృతజ్ఞత చెప్పటం వారి రివాజు .సరస సల్లాపాలకు వారు పెట్టింది పేరు .దాదాపు ఎనభై ఎనిమిదేళ్ళ వయసు లోను నిరంతరం చెరగని చిరు నవ్వు తో ప్రత్యక్ష మయ్యే వారు .వారి 85 వ పుట్టిన రోజూ పాడుగాను వారి సోదరులు ,వారి కుటుంబం విజయవాడ రామ కోటి లో ఘనం గా నిర్వహించారు .నన్ను రమ్మని ఆహ్వానిస్తే వెళ్లి వచ్చాను .”రస భారతి లో వారు సభ్యులు .నెల నేలా విజయ వాడ లో నిర్వహించే కార్య క్రమాలకు క్రమం తప్ప కుండా హాజరవుతారు .డాక్టర్ గుమ్మా సాంబశివ రావు గారంటే అమిత వాత్సల్యం ”అని ముద్దు గాగుమ్మా”అని పిలిచే వారు .
యాజ్న వల్క్య మహర్షి అంటే వీర పూజే .కుతుమ్బ్కమ్ లో అందరి తోనూ మంచి సంబంధాలున్నాయి ధర్మ వారపు సుబ్రహ్మణ్యం ఆయనకు దగ్గర బంధువే .విజయ వాడ రేడియో స్టేషన్ ఉంచి వారి కధలు చాలా ప్రసారం అయాయి వారికి బాగా నచ్చిన కధ ”గురివింద”.సుమారు సంవత్సరం క్రితం వారి ”అమృత హస్తాలు”పై పరిశోధన చేసిన అతను ఆ పుస్తకాన్ని ఆవిషకరణ సభను విజయ వాడ హోటల్ యిలా పురం లో జరిపి శర్మ గారిని సత్కరిచాడు .నేనూవేల్లాను .ఎండ్లూరి సుధాకర్ ,ఆదిత్య ప్రసాద్ గుత్తి కొండా గుమ్మా వంటి ముఖ్యులు పాల్గొన్నారు .శర్మ గారు అంటే అందరికీ పూజ్య భావం .అందరికి పెద్దన్న .పెద నాన్న .తాతయ్య మిత్రుడు హితుడు స్నేహితుడు అభిమాని హితైషి .
మేము అమెరికా బయల్దేరా టానికి నాలుగు రోజుల ముందుగా ఫోన్ చేశారు బాగా మాట్లాడు కొన్నాం .మేము అమెరికా వెళ్తున్న సంగతి విని ”క్షేమంగా వెళ్లి లాభం గా రండి ”అని పెద్ద మనసు తో ఆశీర్వ దించారు .ఉయ్యూరు నుండి బయల్దేరే ముందు రోజూ నేనుఫోన్ చేసి వారితో మాట్లాడాను మళ్ళీ ఆనందం గా ఆశీర్వదిస్తూ అమెరికా నుంచి ఫోన్ చేస్తుండండి అని కోరారు తపకుండా అన్నాను .కాని చెయ్య లేక పోయాను .ఇప్పుడు బాధ గా ఉంది .ఇప్పుడే మా అబ్బాయి ఉయ్యూరు నుంచి మెయిల్ రాస్తూ అందులో శర్మ గారి మరణ వార్త రాశాడు .21  వ తేదీ న చని పోయి నట్లు వాళ్ల అబ్బాయి ఉయ్యూరు కు మన ఇంటికి ఫోన్ చేశారట .ఇది వారికి అశ్రు తర్పణం .
స్నేహితుడు హితుడు బాంధవుడు ఆత్మీయుడు ,ఆత్మ బంధువు సాహిత్య శీలి మానవతా హృదయ విపంచి ,ఆదర్శ గృహస్తు ,నిత్య సాహిత్య అనుసరనీయుడు స్వర్గీయ గంధం వేంకా స్వామి శర్మ గారి మరణం సాహిత్య లోకానికి మాన వీయ విలువలకు తీరని వెలితి .వారి ఆత్మ కు శాంతి కలగాలని ఆ  భగ వంతుడిని ప్రార్ధిస్తూ  వారి కుటుంబానికి ప్రగాఢ సాను భూతిని తెలియ జేస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29 -04 -12 .
క్యాంపు-అమెరికా
గబ్బిట దుర్గా ప్రసాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.