అమెరికా డైరీ—carrington cares- ఆశోపహతులు హరి విల్లు

              అమెరికా డైరీ—

ఆశోపహతుల పాలిటి హరి విల్లు –     carrington cares

అమెరికా వచ్చి మూడు వారాలైంది .ఇప్పటి వరకు వారానికి మూడు భోజనాలు ,ఆరు భజనల తో తీరికే లేక పోయింది .అయితే నిన్న అంటే 29 వ తేదీ శని వారం   ఒక దివ్య క్షేత్రాన్ని సందర్శించి అద్భుత అనుభూతి ని పొందాం .అదే ‘’–caarrington cares  ‘’అనే వృద్ధాశ్రమం .అక్కడ సుమారు యాభై మంది అతి వ్రుద్దులున్నారు .వారందరూ వీల్ చైర్ కు పరిమిత మైనవారే .నడవ లేని , కోర్చో లేని , ,గట్టిగా చూడ లేని , ,వినికిడి లేని వారు అందులో చాలా మంది .వారెవరికీ నా అనే వాళ్ళు ఉండి ఉండరు .పని చేసే శక్తి లేని వారు .ఎవరైనా సాయం చేస్తే నే వారు ఏదైనా తిన గలరు .కంప్యుటర్ పని కూడా  ఎవరో సాయం చేస్తే చూడ గలరు .కళ్ళు ఉన్నా  కని పించని వారు ,చెవులున్నా విని పించని వారు కాళ్ళు ఉన్నా  నడవ లేని శక్తి హీనులు .దాదాపు అందరి పరిస్థితీ అదే .ఒకామె అచ్చం గా ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు ‘’స్టీఫెన్ హాక్ ‘’లా గా అన్నీ చైర్ లోనే .పాపం మెడ మాత్రం ఆమెకు తెలీకుండా అటూ ఇటు తిరుగు తూ వుంటుంది ..ఇలాంటి ఆశోపహతులు దైవోప హతుల కోసం caarrington  అనే చోట  చుట్టూ ప్రక్కల ఉన్న ప్రజా సహకారం తో నిర్వహిస్తున్న శరణాలయం ఇది .స్తానిక వాలంటీర్ ల సాయం తో వృద్ధుల సేవ చేస్తున్నారు .వారికి ఏ  కొరతా లేకుండా అన్నీ తామే అయి బాధ్యత గా’ నిర్వహిస్తున్నారు .నాకు యేమని పించిందంటే మానవత్వం కొలువై ఉన్న  దేవాలయం అని పించింది .

‘’ cares ‘’అనే దానికి పూర్తి వివరణ caring and remembering every one special .నిజంగా అంత విధి నిర్వహణ తో వారందరికి అన్నీ తామే అయి వాలంటీర్లు సేవ చేస్తున్నారు .చుట్టూ పచ్చని ప్రకృతి మధ్య వుంది ఈ ఆశ్రమం .కళ్ళకు ఆనందాన్నిచ్చే రక రకాల రంగుల పూలు .లోపల సకల ఆధునిక  సదు పాయాలతో గదులు .ఆధునిక సౌకర్యాలన్నీ అందు బాటు లో ఉంచారు .మంచి పుస్తకాలున్న గ్రంధాలయం .ఒక పది మంది కూచుని హాయిగా చూసే అవకాశం తో టి.వి..రేడియో .పరి శుభ్రమైన  పరిసరాలు .అర్జెంట్ గా ఏ బాధ వచ్చినా చూసే డాక్టర్లు .అందుబాటు లో అన్ని మందులు .వంట గది .అందులో పని చేసే వంట వాళ్ళు .ప్రత్యెక లాండ్రీ .అపరిశుభ్రత కు తావే లేని ప్రదేశం .కాళ్ళకు కట్లతో, చేతికి పుళ్ళ తో ,అన్ని రకాల అవకరాలతో మనకు మొదట చూడంగానే ‘’అయ్యో ‘’అని పించే సన్నివేశం  .కాని వారందరి ముఖం లో చిరు నవ్వు ,కళ్ళల్లో ఆశా జ్యోతి ,గుండె దిటవు ,మనో ధైర్యం ,జీవించ గలుగు తున్నామనే ధైర్యం ,సమాజం తమకు చేస్తున్న సేవల పట్ల కృతజ్ఞతా భావం వారందరి లో ప్రస్ఫుటం గా కన పడింది .మరణించే  దాకా ఆరోగ్యం గా జీవింప జేయాలన్న సత్సంకల్పం నిర్వాహకుల్లో ఉంది .అంకిత భావం తో సేవా భావం తో మానవ సేవే మాధవ సేవ అనే పవిత్ర ఆశయం తో ,ఇది మనం చేయాలన్న కనీస విధి అన్న ధ్యేయం తో అక్కడి వాలంటీర్లు ఆ వృద్ధ నారాయణులకు చేస్తున్న సేవ చూస్తుంటే వారికి చేతు  లెత్తి నమస్కరించ బుద్ధేస్తుంది.ఒక పవిత్ర దేవాలయం లో ఉన్నట్లని పిస్తుంది అలాంటి గొప్ప అనుభూతి ని కల్పించిన దాని నిర్వాహకుల్లో ఒక రైన వాలంటీర్ ప్రెసిడెంట్ – steve linden man , రెండవ వారైనactivitydirector –robin dieker  కు ఎన్ని ప్రశంసా వాక్యాలు చెప్పినా తక్కువే .అందర్నీ కంటికి రెప్ప లాగా చూసుకొంటున్న వారి దైవీక్రుత మానవ సేవకు ధన్య వాదాలు ,కృతజ్ఞతలు .వారం లో వారికి రోజు వారీ ఇచ్చే మెను అంటే భోజన వివరాలు బోర్డ్ మీద కని పిస్తుంది .

ఈ సంస్థ ను లాభ నష్టాలు తో సంబంధం లేకుండా నిర్వ హించటం ఒక విశేషం .వాలంటీర్ లను దగ్గర లో ఉన్న కమ్యునిటీ నుంచే తీసుకోవటం మరో ముందడుగు .వాలంటీర్స్ అందరు కుర్ర వాళ్ళే .యువతీ యువకులే .వారందరి ధ్యేయం ఈ వృద్ధ దేవతలకు అన్ని రకాల సేవలు అందించటమే .ఈ సంస్థ ను 1994 లో ప్రారంభించి అందరి మన్ననలను అందు కొంటూ సక్రమం గా నిర్వ హిస్తున్నారు .అక్కడ బోర్డ్ మీద వాలంటీర్ అంటే ఏమిటో ,రెసిడెంట్ అంటే ఏమిటో సేవ అంటే ఏమిటో ఖచ్చిత మైన వివ రాలున్నాయి .సేవకు లెవ్వరు ఆ ఆవరణ లో పొగ తాగటం నిషేధం .అవసరానికంటే ఎక్కువ పదార్ధాలు అందజేస్తే ఇంకా వద్దు .సమృద్ధిగా ఉన్నాయని బోర్డ్ పెట్టటం ఇక్కడ ప్రత్యేకం గా కన్పించింది .ఇలాంటి సేవా కేంద్రాలు ఇక్కడ ఎన్నో ఉండ వచ్చు .అయితే ఇంత సమగ్రం గా ఉన్న సేవా కేంద్రాన్ని ,ఇంతటి సంతృప్తి తో ఆశ్రమ వాసులు ఉండటాన్ని చూడటం ఇదే మొదలు నాకు .అందుకే ఈ స్పందన .

అలాంటి పవిత్ర దివ్య క్షేత్రం లో నిన్న మధ్యాహ్నం కాలు పెట్టాం .ఇక్కడి సత్య సాయి సెంటర్ వారు చిన్న పిల్లల తో ఒక ఆంగ్ల నాటికను తయారు చేసి ఆ వృద్ధుల ముందు ప్రదర్శించే అవకాశం తీసు కొన్నారు .పిల్లలు దాదాపు నెల రోజుల నుదీ బాగా ప్రాక్టిస్ చేసి తయారై వచ్చారు .వారి వెంట తలిదండ్రులు కూడా .గీత అనే అమ్మాయి దీనికి దర్శకత్వం వహించింది .మధ్యాహ్నం రెండున్నరకు ప్రార్ధన తో ప్రారంభ మైంది .వృద్ధుల్ని ,ఆసక్తి .ఓపికా ఉన్న వారిని ఒక ముప్ఫై మందిని ముందే వీల్ చైర్ లలో వాలంటీర్లు తీసుకొని వచ్చి కూర్చో బెట్టారు .వారందరిలో ఏదో వింత ఆశ గోచరించింది .పిల్లలు బాగా నే నటించారు .ఆ నాటిక సారాంశం మాటలు చెప్పటం కాదు చేతల్లో మంచి చేయాలి సాయ పడాలి అన్న నీతి .మా మనవడు శ్రీ కెత్  క్రిస్తియన్   ఫాదర్ వేషం వేశాడు .పిల్లలందరూ మన సాంప్రదాయ దుస్తులే ధరించారు .అన్ని భాషల పిల్లలు ఉన్నారు .కొందరు భక్తీ గీతాలు పాడారు .దాదాపు ఒక గంట వారందరికి వినోదం కలిగించారు. ఆ వృద్ధుల కళ్ళల్లో ఆనందం తాండ వించింది .మాటలతో చెప్ప లేని వారు పిల్లల్ని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టు కొన్నారు .కొందరు షేక్ హాండ్ ఇచ్చారు .కృతజ్ఞతలను కొందరు చక్కగా వ్యక్తీక రించారు .ఇంత మంది  పువ్వుల్లాంటి ,నవ్వుల్లాంటి ,దేవుడి ప్రతి రూపాల్లాంటి ,పవిత్ర హ్రుదయాల్లాంటి చిన్నారు లను చూసి వారందరూ చలించి పోయారు .ఆనంద బాష్పాలు రాల్చారు .మాట పెగలని వాళ్ళు పెదిమలు కదిలించి భావ వ్యక్తీకరణ చేశారు .ఇందరు పిల్ల దేవతల మధ్య హాయిగా ,ఆనందం గా మనస్సు పరవశం చెందేట్లు గడిపాము అన్న భావం వారందరి లో స్పష్టం గా  దర్శించ గలిగాం .వారికి ఎంత సంతృప్తి కలిగిందో ,మాకూ అంతే తృప్తి కల్గింది వారందరికీ మనో రంజనం కలుగ జేసి నందుకు .మా లాంటి వారితో ఆ వృద్ధ నారాయణులు కర స్పర్శ చేసి అభి నందించారు .మేమందరం వారి మధ్య గడి పి నందుకు ధన్య వాదాలు చెప్పారు .మాతో ఫోటో లు తీయించు కొన్నారు .మరుగున పడిన భావా లన్నీ  ఒక్క సారి బహిర్గతమై నాయి మాకూ ,వారికీ . మనసు నిండా నవ్వారు ,కాళ్ళ నిండా చూశారు ,మాలా చేయ లేని వారు గుండె నిండా సంతోషాన్ని నింపు కొన్నారు .వారెవరికి మృత్యు భయం లేనట్లని పించింది .ప్రశాంతం గా దైవ సన్నిధి కి చేరుతాము అన్న ధీమా వ్యక్త మయింది .నిరుడు కూడా ఇలానే సాయి సెంటర్ వారు వచ్చి వినోదాన్ని పంచి వెళ్లారట .దాన్ని జ్ఞాపకం చేసుకొన్నారు ఒకరిద్దరు .దీన్ని సక్రమంగా నిర్వ హించటం లో సాయి సెంటర్ నిర్వాహకులు సుబ్బరాజ్ ,సత్య ,పవన్ డాక్టర్ సర్వేష్ వగైరా ల కృషి ప్రశంస నీయం.ఈ విధం గా వారానికి ఒకసారో రెండు సార్లో వివిధ సంస్థల వాళ్ళు ఇక్కడికి వచ్చి వారికి మనోల్లాసం కల్గిస్తారట.

ఆశ్రమ నిర్వహణ అంటే ఇలా సేవా ,అంకిత భావాలతో నిర్వహించాలని ఆదర్శం గా చూపిన caarrington cares వారికి మరో మాటు ధన్య వాదాలు అంద జేస్తున్నాను .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –29-04-12

క్యాంపు-అమెరికా

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

4 Responses to అమెరికా డైరీ—carrington cares- ఆశోపహతులు హరి విల్లు

 1. Anand says:

  Mee anubhavanni hrudayaniki hathukupoyela varnincharu . Thanks.Kallu chemarchayi.

 2. Carrington Cares వంటి సంస్తలున్నాయనీ, అవెంతో ఆదర్శంగా నడుపబడుతున్నాయనీ చక్కగా తెలిపారు.మీరు రాసింది చదవగానే నాకూ చూడాలనిపించింది.ఈసారి వచ్చినప్పుడు వీలు కల్పించుకోవాలి.ధన్యవాదాలు.
  –ముత్తేవి రవీంద్రనాథ్,
  డేటన్, న్యూజెర్సీ, యు.యస్.ఏ.నుంచి.

 3. Vidyasagar says:

  ఆశోపహతులు meaning, please

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.