వైశాఖ పౌర్ణమి – బుద్ధుడు అంటే ఎవరు ?

    వైశాఖ పౌర్ణమి

              ఆ.కా.,మా.,వై .పౌర్ణమి లలో పవిత్ర సముద్ర స్నానాలను చేస్తాం .ఆ వరుస లో చివరి పున్నమి వైశాఖ .దీన్నే మహా వైశాఖి గా భావిస్తారు .దీని తరువాత వచ్చేది జ్యేష్ట పౌర్ణమి ని ఏరువాక పౌర్నమని ,ఆ తర్వాతా వచ్చే ఆషాఢపున్నమిని గురు పూర్ణమి లేక వ్యాస పూర్ణిమ లేక జయంతి అని ,ఆ తరువాత వచ్చే శ్రావణ పౌర్ణమి ని జంధ్యాల పూర్ణమి లేక రాఖీ పౌర్ణమి గా జరుపుకొంటాం .వైశాఖ పౌర్ణమి ని బుద్ధ పూర్ణిమ గా భావిస్తారు .అన్నమయ్య జయంతి కూడా ఈ రోజే కావటం యాదృచ్చికం .ఇది ఎల్లుండి అంటే మే ఆరవ తేది ఆదివారం .

              శాక్యముని గా, ఆసియా  జ్యోతి గా, అహింసా మూర్తి గా, కరుణా సింధు గా ,ప్రేమ నిలయునిగా ,విశ్వ జ్యోతి గా పూజింపబడే ,ఆరాధింప బడే గౌతమ బుద్ధుడు జన్మించిన రోజు ,జ్ఞానోదయాన్ని పొందిన రోజు ,మహానిర్యాణం చెందిన రోజు వైశాఖ పౌర్ణమి అవటం చాలా గొప్పగా ఉంది .అందుకనే బౌద్ధ మతావలంబులకు వైశాఖ పౌర్ణమి పరమ పవిత్ర   మైనది .ఈ రోజు విశిష్టతను తెలుసు కొందాం .శుద్ధోదన మహారాజు కుమారు డైన సిద్ధార్ధుడు ప్రాపంచిక సుఖాన్ని రోసి ,మనసు ను దిటవు పరచుకొని ,భార్యా ,పిల్లవాడిని రాజ్యాన్ని వదలి ఆత్మా జ్ఞాన సముపార్జనకు బయల్దేరాడు .దాదాపు ఎనిమిదేళ్ళు శరీరాన్ని అతి కష్టాల పాలు చేసి కొని శారీరకం గా బాగా బలహీనుడై పోయాడు .నాలుగు ఏళ్ళు ‘’సమాన ‘’స్తితి లో అంటే నడకే తప్ప ,ఆహారం ఏమీ తీసుకో క పోవటం  కటిక ఉపవాసం తో గడి పాడు .అప్పుడు బీహారు రాష్ట్రం లో గయకు దగ్గర ప్రవహించే ‘’నిరంజన నది ‘’దగ్గరకు తనతో బాటు వస్తున్నా అయిదుగురు యాత్రికు ల తో పాటు చేరు కొన్నాడు .చాలా బలహీన  పడి,శల్యా వసిస్తుడై, ప్రాణాలు గాలిలో కలిసి పోయే స్థితి  లో ఉన్నాడు.అ నది లో ఎప్పుడూ మోకాలు లోతు నీరు సుళ్ళు తిరుగుతూ ప్రవహిస్తుంది .ఇప్పుడు ఆ నది సరస్వతి మొదలైన  కొన్ని నదుల  లానే  అంత రించి పోయింది .కని పించదు . ఆ నది ని దాటే ప్రయత్నం చేశాడు సిద్ధార్ధుడు .బలహీనుడై పోవటం వల్ల అడుగు కూడా ముందుకు వెయ్య లేక పోయాడు .అప్పుడు అనుకో కుండా ఒక ఎండు చెట్టు కొమ్మ కొట్టుకు వస్తు, కని పించింది .దాన్ని పట్టు కొని కొన్ని గంటలు  నీటి లో ,ఆ ప్రవాహ ఉద్ధృతి లో ఉండిపోయాడు .కాళ్ళు తడ బడుతున్నాయి .మానసిక పరిశోధన చేయాలను కొన్న తనకు ఈ పరీక్ష ఏమిటి ?అను కొన్నాడు .తన ప్రయత్నం లో ఏదో లోపం ఉందని పించింది .ఇది తెలియగానే అనుకోకుండా కొంత  కొత్త శక్తి శరీరం లో చేరి నట్లని పించింది .ఆ శక్తి తో నిరంజన నదిని దాటాడు .అలసటగా ఉన్నందున అక్కడ ఉన్న బోధి వృక్షం కింద కూర్చుండిపోయాడు .తనకు జ్ఞానోదయం కలిగే వరకు అక్కడి నుంచి కదలను అని ఒక వేళ కలుగక పోతే మరణమే శరణ్యం అని ప్రతిజ్ఞా చేశాడు .

                      శరీరం లోని సర్వ శక్తుల్ని కేంద్రీకరిస్తేనే సాధానా ఫలం లభిస్తుందని తెలుసు కొన్నాడు .+అది పొందటానికి ఒక్క క్షణం చాలు .లేక పోతే యుగాలైనా  సరి పోవు .దీన్నే సామన అనే సాధన గా భావిస్తారు .అంతే –అది వైశాఖ పౌర్ణమి రోజు  .పూర్ణ చంద్రుడు ఆకాశం లో వెన్నెల కురి పిస్తున్నాడు .ఆ క్షణం లో గౌతమునికి అకస్మాత్తు గా జ్ఞానోదయం అయింది .వింత కాంతి శరీరం అంతా ఆవహించింది .ముఖం వెలుగులు చిమ్మింది .కొన్ని గంటలు ఆ నిశ్చేతన స్థితి లో గడి పాడు .తరువాత లేచి నిల బడ్డాడు .తనతో ఉన్న తోటి ప్రయాణీకులతో ‘’భోజనం చేద్దాం ‘’అన్నాడు మొదటి సారిగా నోరు విప్పి .వాళ్ళు ఆశ్చర్య పోయారు .గౌతమునికి ఏదో అయిందని భావించారు .ఆహారం కోసం తహతహ లాడుతున్నా డేమో నని భ్రమ పడ్డారు .వారి భావాన్ని గ్రహించిన తధాగత బుద్ధుడు ‘’మీరు పోర  బడ్డారు .నేనన్నది ఉపవాసానికి సంబంధించింది కాదు .ఎరుక ఫలితం ,జ్ఞానోదయ విశేషం .దాన్ని స్వీకరిద్దాం అని నా ఉద్దేశ్యం ‘.ఈ వైశాఖ పౌర్ణమి రోజున వెన్నెల కురుస్తుండగా నాలో ‘’జ్ఞాన పూర్ణ చంద్రోదయం ‘’అయింది . నాలో వచ్చిన మార్పు ను గమనించండి .’’అని వివరించాడు .వారికేమీ అర్ధం కాక ,ఆయన ప్రాణానికి ఆయన్ను వదిలేసి, తమ దారి తాము చూసుకోవటానికి వెళ్లి పోయారు .కొన్నేళ్ళ తర్వాత బుద్ధుడు వారిని వెతుక్కొంటూ సారనాద్ చేరి వారిని కలుసు కొని తన ధర్మాలను వివరించి జ్ఞానోదయం కల్గించి   శిష్యులుగా  స్వీకరించాడు .2600 సంవత్సరాలు అయినా   ఇంకా ఆ మహాను భావుడైన బుద్ధుని భగవానుని గా ప్రపంచం అంతా కోలుస్తూనే ఉంది .ప్రపంచ శాంతికి ఆయన బోధన లే  శరణ్యం గా భావిస్తోంది .  

                                                      బుద్ధుడు అంటే ఎవరు ?

   జాగృతి ,ఎరుక .లేక జ్ఞానోదయం ను పొందిన వాడిని బుద్ధుడు అంటారు .అజ్ఞానం అనే నిద్ర వదిలించుకొని జ్ఞానం అనే ప్రకాశాన్ని పొంది ,సకల వస్తు జాలం యొక్క నిజ స్వరూపం తెలిసిన వాడే బుద్ధుడు .దోషరహితుడైన వాడు ,మానసిక నిషేదాలకు అతీతుడు బుద్ధుడు .గౌతమ బుద్ధుని కంటే ముందు చాలా మంది బుద్ధులున్నారు .భవిష్యత్ లోను ఉంటారు .బుద్ధునికి తెలియనిది ఏదీ ఉండదు .భూత ,భవిష్యత్ ,వర్త మానాలను ఒకే సారి చూడ గల ప్రజ్ఞ అతనికి ఉంటుంది .పరిమితి లేని భూత దయ ,కారుణ్యం ,ప్రేమా ఉన్నవాడు బుద్ధుడు .పక్ష పాతం లేకుండా అందర్ని హృదయానికి ఆప్యాయం గా హత్తు కొనే వాడు బుద్ధుడు .

      బుద్ధుడు జీవులను ఉద్ధరించే కార్యక్రమాలను నిర్వహిస్తాడు .బుద్ధుని ప్రభావం వల్ల క్రూర జంతువులూ కూడా తమ క్రూర స్వభావాన్ని వదిలి సాధువులు గా మారి పోతాయి .బుద్ధుడు ఆధ్యాత్మిక గురువు గా ఉండి విశ్వ జనుల మానసిక పరి పక్వత ను పెంపొందిస్తాడు .ఆచార్య నాగార్జునుడు చెప్పి నట్లు బుద్ధుని సాయం  పొందని జీవి లేనే లేదు. .బుద్ధుని దయా ,సానుభూతి ,అనుకంప ,ప్రేమ ,కరుణ లు మాటల , చేతల పరిధి ని దాటి ఉంటాయి .బుద్ధుని జ్ఞానం ,పరిపూర్ణత ,శక్తి వర్ణనా తీతం .మనం ఒక వస్తువు ను ఎంత స్పష్టం గా కళ్ళతో తో చూడ గలమో ,బుద్ధుడు అయిన వాడు  ఈ విశ్వాన్ని అంతటిని, అంత స్పష్టం గా చూడ గలడు.ఇతరులకు ఏది మంచిదో ఆయనకు పూర్తిగా తెలుసు .దానినే అప్పటి కప్పుడు ఆయన చేస్తాడు .దాని కోసం ముందస్తు ప్రణాళిక ఆయనకు ఉండదు .సూర్యుడికి వేడి నివ్వటం ,ప్రకాశాన్నివ్వడం అన్న ధర్మం ఎంత సహజమో ,బుద్ధునికి ప్రేమ ,కారుణ్యం,దయా, సహాయం అంత సహజాతాలు .పరోప కారమే బుద్ధుని శ్వాస.

                                           గౌతమ బుద్ధుని బోధనలు

       మనసుకు శిక్షణ నివ్వటానికి బాహ్య నియమాల కంటే అంత రంగిక నియమాలకే విలువనివ్వాలి ,వాటి పైనే ఆధార పడాలి అన్నాడు బుద్ధ భగ వానుడు .పని చేయటానికి పరిస్థితులు అనుకూలించాలి అని తాత్సారం చేయరాదంటాడు .మనం మనకు వ్యతి రేకం గా ఉన్న పరిస్తితులను కూడా అనుకూలం గా మార్చుకొనే సమర్ధత ఉన్న వాళ్ళం అని గ్రహించాలి .పరిస్థితులను మార్చాలనే ప్రయత్నం లో మునిగి పొతే ,ధర్మా చరన  అసాధ్యమవుతుంది అన్నాడు శాక్యముని .ఆ ప్రయత్నం లో ధ్యానం పై మనసు నిలవదని హెచ్చ రించాడు .సమయమూ వృధా అయి కోరికలకు అంతు లేకుండా పోతుంది .ఈ క్షణమే మనకు అనుకూలం ,పవిత్ర మైనది అన్న భావన తో పని చేయాలి .వచ్చిన ,చేతి లో ఉన్న అవకాశాన్ని దుర్విని యోగం చేసు కోరాదు.భౌతిక సంపాదనే ధ్యేయం కాదు .ధనం చేరితే సమస్యలూ పెరుగు తాయి .జీవిత పరమార్ధం నిర్వాణమే .ధర్మా చరణ వల్లనే ఇది సాధ్యం .మనసు అదుపు లో ఉంటె ,అన్నీ మన వశం అవుతాయి అని స్పష్టం గా చెప్పాడు భగవానుడు .

             ధర్మం అంటే పరి పూర్ణత .బుద్ధ బోధనలు అనుసరిస్తే స్వీయ రక్షణ ఏర్పడుతుంది .ధర్మా  చరణ అంటే ఉత్కృష్ట మాన వ జీవనమే .భౌతికాభి వృద్ధి కాదు .అంత రంగ పరి పూర్ణత సాధించటమే .మానశిక శాంతి ,ఆనందం పొందటమే .పూర్వకాలం లో బుద్ధులందరూ అతి నిరాడంబర సామాన్య జీవితాన్నే గడి పారు .వ్యతిరేక పరిస్థితుల్లో జీవించారు .అయితే బుద్ధ బోధనలను ధర్మాన్ని పాటించి సుఖ ,శాంతులను పొందారు .గౌతమ బుద్ధుని బోధలను అనుసరించితే బాహ్యా ,ఆంతరంగిక శాంతి సౌఖ్యం లభిస్తాయి .ఆదర్శ జీవన విధానం వల్ల ఇవి సాధ్యమవుతాయి .

                     ఒక సారి బుద్ధుడు ‘’కల్మా నగరం ‘’లో విహరిస్తుంటే ,ప్రజలు ఆయన్ను కలిసి ‘’చాలా మంది గురువులు చాలా విషయాలు చెబుతున్నారు .అవి పరస్పర విరుద్ధం గా ఉన్నాయి .ఒకదానికొకటి పొంతన గా లేవు .మేము దేన్నీ పాటించాలో పాలు పోవటం లేదు .దయ చేసి మార్గ దర్శకం చేయండి ‘’అని వేడు కొన్నారు .దానికి బుద్ధ భగ  వానుడు ప్రశాంత చిత్తం తో పది సూత్రాలు చెప్పాడు .ఒకటి –చాలా సార్లు చెప్పారని ,రెండు –గ్రంధాల్లో ఉన్నాయని ,మూడు –గురువు చెప్పాడని ,నాలుగు –చుట్టూ ఉన్న వారు చేస్తున్నారని ,అయిదు –అందులో అలౌకిక శక్తులున్నాయని ,ఆరు –మీ నమ్మకానికి సరిగ్గా ఉందని ,ఏడు –ఆలోచనకు సరైనదిగా కని పించిందని ,ఎనిమిది –సంఘం లో గౌరవ నీయ వ్యక్తులు బోధించారని ,తొమ్మిది –గురువు అదే సత్యం అని గట్టిగా పడే పడే చెప్పాడని ,పది –దాన్ని సమర్ధించ టానికి లేక ఎదురు తిరగటానికి అని –నమ్మ వద్దు .మీ అనుభవానికి ,ఆలోచనకు ,వివేకానికి ,నీకు ,సమాజం లో అందరికి ఉప యోగా పడుతుందని అనుకొంటే నే నమ్మి ఏదైనా ఆచరించు ‘’అని అతి స్పష్టం గా తధాగతుడు మార్గ  నిర్దేశం చేశాడు .

                ‘’నా బోధలు వేదాంతం కాదు .అవి నా సూటి అనుభవ ఫలితాలు .అవి సాధనకు మార్గం కానీ ఆరాధనకు మార్గం కాదు .నేను చెప్పిందంతా నది దాటే కర్ర పుల్ల అంటే తెడ్డు లాంటిదే .ఒడ్డుకు చేరిన తరువాత ఆ తేడ్డును భుజాన వేసు కొని  మోసుకొని తిరిగితే, వెర్రి వెంగళప్ప అంటారు .శిష్యుడు బంధువు అయిన ఆనంద తో ‘’ఆనందా !నా మీద గౌరవం తో ,ప్రేమ ,అనురాగాలతో ధర్మాన్ని పాటించ వద్దు .అలా చేస్తే నిన్ను నేను శిష్యునిగా భావించను .ఆ ధర్మాన్ని నువ్వు నీ అనుభవం తో జోడించి అనుసరిస్తే సత్యాన్నితెలుసు కొ గలుగు తావు .  .అప్పుడే నువ్వు నాకు నిజమైన శిష్యుడివి అని పించు కొంటావు ‘’అని అతి విష్పస్తం గా ధర్మా చరణ విధానాన్ని విశ్లేషించి చెప్పాడు భగవాన్ బుద్ధుడు .

                   అశాంతి, హింస ,దౌర్జన్యం ,అజ్ఞానం ,అవివేకం ,మానసిక దౌర్బల్యం పెచ్చు మీరి అశాంతి తో అలమటిస్తున్న నేటి  సకల మానవాళి కి బుద్ధుని బోధలు రక్షా కవచాలు .బుద్ధ పౌర్ణమి అని పిలువ బడే ఈ వైశాఖ పౌర్ణమి నాడు ఆ అహింసా మూర్తి ని ఒక సారి జ్ఞాపకం చేసుకొనే ప్రయత్నం చేశాను .ఓం శాన్థిహ్ .

                       మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —4-5-12

                           కాంప్—అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

3 Responses to వైశాఖ పౌర్ణమి – బుద్ధుడు అంటే ఎవరు ?

 1. ఎందుకో ‽ ఏమో అంటున్నారు:

  అబ్బ! చాల thanks అండీ ! ఈ comment మటుకు post చదవకుండా చూసి పెడుతున్నాను.
  ఏదో చక్కని సుమూహార్తాన మీ blog కి subscribe అయ్యాను సర్, అప్పటినించి అన్నీ
  useful stuff ఇస్తున్నారు, శ్రీశైలం గురించి, దశోపనిశత్తుల గురించి ఇప్పుడు
  బుద్ధుడి గురించి,
  నేను అంతర్యామి బాగా చదివే వాడిని
  చిన్నప్పటినుంచి
  so
  నాకు ఏ దైనా సందేహం వచ్చిందనుకోండి
  దాని solution ఆ next నాకు అందే అంతర్యామి లో దొరికేది.
  నిన్న 2 days నుంచి night నిద్రపట్టక youtube లో బుద్ధ భగవానుని
  documentaries అన్ని చూస్తున్న
  నిన్న నా friend ఒక ఆమె ఇలా పంపారు ఇవాళ మీరు
  బాగుంది
  యత్ భావం తత్ భవతి వలె

  thanks

  • gdurgaprasad అంటున్నారు:

   మీ ఆనందం తో పాలు పంచు కొన్నందుకు మహదానందం గా ఉంది .తవ్వే కొద్దీ రత్నాలు ,మాణిక్యాలు .ఓపిక ఉండాలే కనీ అంతా బంగారమే .–దుర్గా ప్రసాద్

   • ఎందుకో ‽ ఏమో అంటున్నారు:

    మహదానందం అంటే బ్రహ్మ (భావన) స్థితి ఆ ఆనందానికి సాక్షి అయితేనే నిర్గుణ బ్రహ్మ అని నిన్న ఇదే time లో మీ లానే US ఉన్న మా సత్సంగం అమ్మ phone లో చెప్పారు.

    సర్, బుద్ధుడు చెప్పిన నిర్వాణానికి ఉపనిషత్తులు తెలిపిన పరబ్రహ్మ నిర్ణయానికి ఒక సమీక్ష ల ఎమన్నా మీదైన అభిప్రాయం
    చెప్తారా? ఎందుకంటే ఉపనిషత్తులు సత్యాన్నే ప్రబోధించాయి నా ప్రియాతి ప్రియమైన బుద్ధ భాగానుడు
    సత్యం కోసమే అన్నట్టు జీవించి నిర్వాణాని ప్రతిపాదన చేసారు

    so what do you say about these too! as one ?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.