సత్య కధా సుధ—1

   సత్య కధా సుధ—1

       ఒక రాజు గారికి దైవ భక్తీ ఎక్కువ .దేశం లో ఉన్న తన ప్రజల్లో దైవం మీద విశ్వాసం ఎలా ఉందొ తెలుసు కోవాలనే వింత కోరిక కలిగింది .మూడు ప్రశ్న లను  ఇచ్చి దండోరా వేయించాడు .మొదటి ప్రశ్న దేవుడున్నాడా ?.రెండోది ఉంటె ఎటు వైపు చూస్తుంటాడు ?మూడో ప్రశ్న ఏమి చేస్తుంటాడు?ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన వాళ్ళే రాజు దగ్గ్గరకు రావాలి .చెప్ప లేక పోతే శిరచ్చేదమే .అదీ చాటింపు .దేశం లోని పండితులు జ్ఞానులు ,భక్తులు ,సన్యాసులు అందరు విన్నారు .కానీ శిక్షను  ను చూసి ఎవరు సాహసించి వెళ్ళ లేక పోయారు .

             చివరికి ఒక సన్యాసి మాత్రం అన్నిటికీ తెగించి రాజు దగ్గరకు వచ్చాడు .తాను ప్రశ్నలకు సమాధానం చెబుతానని ,శిక్ష విషయం కూడా తెలుసు నని విన్న వించాడు రాజుతో .సరే నన్నాడు రాజు .దైవ విషయం పై చర్చ కనుక ఒక దీపారాధన తెప్పించమని ,నైవేద్యానికి ఒక గ్లాసు పాలు కావాలని కోరాడు .అలానే ఏర్పాటు చేశారు .సమాధానం చెప్పమని రాజు తొందర పెడుతున్నాడు .అప్పుడు సన్యాసి రాజుతో ‘’నువ్వు అడిగే వాడివి నేను చెప్పే వాడిని కనుక నేను ఉన్నతాసనం మీద కూర్చో వాలి ,నువ్వు శిష్యుడైనందు వల్ల కింద కూర్చోవాలి అన్నాడు .ఇది ఉపదేశ నియమం ‘’అని చెప్పాడు  సన్యాసి .రాజు అంగీకరించి అలానే చేశాడు .సింహాసనం మీద కూర్చొని రాజును ప్రశ్నించ మని అడిగాడు సన్యాసి .రాజు మొదటి ప్రశ్న ‘’దేవుడున్నాడా “’?అని అడిగాడు .సన్యాసి పాల గ్లాసు ను చూపించి ‘’ఈ పాలలో వెన్న ఉందా?’’అని ఎదురు ప్రశ్న వేశాడు .ఉందని రాజు సమాధానం చెప్పాడు .చూపించమన్నాడు సన్యాసి .పాలను తోడేసి చిలికితే కాని వెన్న రాదు అని రాజు సమాధానం చెప్పాడు .అప్పుడు సన్యాసి ‘’భగవంతుని గురించి నిరంతర చింతన ఉన్న వాళ్ళ కే ఆయన కని పిస్తాడు ‘’అని సమాధానం సంతృప్తిగా చెప్పాడు .

           రాజు ‘’దేవుడు ఎటు చూస్తాడు ?’’అని రెండో ప్రశ్న వేశాడు .సన్యాసి సమాధానం చెప్ప కుండా ‘’ఈ దీపం ఎటు చూస్తోంది ?’’అని ప్రశ్నించాడు .అన్ని వైపులకూ చూస్తోందని రాజు సమాధానం .వెంటనే సన్యాసి ‘’దీపం లాగానే దేవుడూ అన్ని దిక్కులకు చూస్తాడు ‘’అని సమాధానం చెప్పాడు .తృప్తి చెందిన రాజు మూడో ప్రశ్న ‘’దేవుడు ఏం చేస్తుంటాడు?అని అడిగాడు . సన్యాసి ‘’రాజా !నువ్వు ప్రభువువు.నువ్వు ఇప్పుడు కింద కూర్చున్నావు .నేను సాధారణ సన్యాసిని .సింహాసనం మీద కూర్చున్నాను .అలాగే భాగ వంతుడు కింది వాణ్ణి పైకి పై వాణ్ని కిందా కు మారుస్తుంటాడు ‘’అని సమాధాన మిచ్చాడు .రాజు పరమానందాన్ని పొందాడు  .అప్పటి నుంచి ఆ రాజు భగవంతుని పై అనన్య భక్తిని కలిగి ధన్యుడు అయాడు  .

          జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు ‘’సుఖావ బోదార్ధం ఆఖ్యాయికాఖ్యానం ‘’అన్నారు .అంటేగహన మైన వేదాంత విషయాలను బోధించ టానికి ,తేలికగా అర్ధం ఆవ టానికి కధలు అవసరం అని చెప్పారు .

             దైవీ శక్తి అనంతం .అర్ధం చేసుకోవటం మనకు మించిన పని .ఈ విషయాన్నే ఒక సంస్కృత మహా కవి అందమైన శ్లోకం లో చెప్పాడు .

         ‘’అసిత గిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే –సుర తరు వర శాఖా లేఖినీ పత్రముర్వీ –

         లిఖితి యది గృహీత్వా ,శారదా సర్వ కాలం –తదపి తవ గుణా నా మీశ పారం నయాతి ‘’

     భావం –కాటుక పర్వతాన్ని తెచ్చి ,సముద్రం లో వేసి సిరా తొట్టె గా మార్చి, కల్ప వృక్ష శాఖను కలంగా తీసుకొని ,భూమి నంతా రాయ టానికి  వాడు కొని ఆ సరస్వతీ దేవి సర్వ కాలాల్లో ను రాస్తున్నా, భగ వంతుని గుణాలు తరగటం లేదట .అంటే ఆమె తరం కాలేదు అని అర్ధం .ఇదీ దైవీ గుణ విభూతి .ఎంత చెప్పినా తరగని గని .

   సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –4-5-12.

            కాంప్-అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

4 Responses to సత్య కధా సుధ—1

 1. Sir, Namasthe !!

  అద్వైత సాంప్రదాయం వాళ్ళు పై వరుకు చెప్పి ఊరుకుంటే (అచల పరిపూర్ణ పరబయలు ) అచల సిద్ధాంతమ్ అనుసరించే వాళ్ళు ఆ కథను ఇలా మలిచారు.

  కాని రెండింటా తమ సిద్ధాంత అభివ్యక్తీకరనయే అంతర్లీన అంశము.
  సరే!
  రాజు ఆ సన్యాసి సమాధానాలకు సంతృప్తి చెందినా వాడి ఆ క్షణం లో నే అనన్య భక్తుడవ్వగా, ఈ లోపు మంత్రి వరేన్యులు సభా ముఖం గా ఇలా ప్రశ్నిస్తారు,
  ఈ సన్యాసి వారు చెప్పిన సమాధానాలలో ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని,
  అప్పుడు ఒక కుర్రాడు నాకు అభ్యంతరం ఉన్నది అంటూ వస్తాడు
  ఆ కుర్రాడి తేజస్సును కాంచిన వాడి రాజు ఆతడిని సాదరంగా ఆహ్వానించి
  సరే మీకు సమాధానం తెలిస్తే చెప్పవచ్చును అని చెప్తూ
  మొదటి ప్రశ్న అడుగుతాడు,
  ఎక్కడున్నాడు దేవుడు? అని
  సన్యాసి ఏమి చెప్పాడు, పాలలో వెన్నలా అంతటా ఉన్నాడని కదా!
  అయ్యా రాజన్ ! పాలగిన్నె బహు ముఖములు కలది గానూ, ఇంకా పరిధిని కలిగి యున్నది,
  భగవంతునికి ఎల్లలు లేవు, కనుక ఆ అవుపమానంతో నేను ఏకీ భావించటం లేదు, కాని దేవుడు సర్వత్రా సమవ్యాపి గా ఉన్నాడని ఒప్పుకోనుచున్నాను
  అంటాడు.
  ఈ సమాధానానికి ఆశ్చర్యానంద భరితుడై రాజు రెండవ ప్రశ్న అడుగుతాడు,
  దేవుడు ఎవరిని (దేనిని) చూస్తూ ఉంటాడు?
  సన్యాసి ఏమి చెప్పాడు?
  దీపం లా అన్ని వైపులా అంతటిని చూస్తూ ఉంటాడు అనికదా!
  కాని అంతటా నిండి నిబిడీ కృతమైన వాడు దేనినైనా చూడాలి అంటే అది అతనికి భిన్నంగా ఉండేది అయ్యి ఉండాలి కదా?
  అలా తనకు అన్యం గా మరోటి ఉన్నదంటే అది మొదటి definition ని break చేస్తుంది కనుక
  దేవుడు దేనిని చూడదు చూడలేడు కూడా!
  సరే మూడవ ప్రశ్న … దేవుడు ఏమి చేస్తూ ఉంటాడు,
  ఈ ప్రశ్నకు కూడా రెండవ ప్రశ్నకు వచ్చిన సమాధానమే చెల్లుతుంది..
  దేవుడు ఏమైనా చెయ్యాలి అంటే కదలాలి కదా!
  కదలాలి అంటే తనకంటే వేరుగా ఖాళి ఉండాలి కదా! తనకంటే వేరుగా ఖాళి ఉంటె తాను దేవుడు అవ్వడు కదా! according to 1st law
  so దేవుడు కదలదు మెదలదు !

  ఆయన అచలుడు ఇదే బృహద్వాశిష్ట అచల సిద్ధాంతం

  మరో లా భావిమ్పకండి ఇంత మంచి STUFF అండ జేస్తున్నారు నేను రోజు పోగు చేసుకుంటూ మా వాళ్ళందరితో పంచుకుంటున్నాను pdf గా మార్చి మరీ!
  అందుకనే చెప్పాను! ఇది
  నాకు వాల్లెవరో తెలియదు కాని ఒకరి site లో audio file దొరికితే ఇలా video గా మార్చాను
  ఒక సారి చూడండీ sir please

  thankyou very much sir

  Sairam

  Shiva
  ?!

 2. Dear Bloggers,

  Please find the English version of the above mentioned great info: @
  http://achalayoga.blogspot.in/2009/05/where-is-god.html

  thanks
  Shiva
  http://endukoemo.blogspot.in

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.