సత్య కధా సుధ
దైవీ శక్తి ని గురించి ఒక ఆస్తికుడు ,నాస్తికుడు తీవ్రం గా వాదించు కొన్నారు .’’నేను అన్నం తినను ‘’అన్నాడు నాస్తికుడు ‘’నీతో దేవుడు తి ని పిస్తాడుగా ‘’అన్నాడు ఆస్తికుడు .దేవున్నితప్పించు కోవటానికి ఒక అడవి చేరి మర్రి చేట్టుమాటున దాక్కున్నాడు .అప్పుడు ఒక బాట సారి వచ్చి అన్నం మూటను చెట్టు కు వేలాద దీసి తువ్వాల వేసుకొని హాయిగా నిద్ర పోయాడు .ఇంతలో పెద్ద పులి గాండ్రింపు విని మూటను వదిలి పారి పోయాడు .కొంత సేపటికి ఒక దొంగల ముథ దొంగిలించిన ధనం తో అక్కడికి వచ్చి పడుకో బోతూ చెట్టు కు ఉన్న మూటను చూసి ఎవరో తమకు విషాన్నం పెట్టి ధనాన్ని కాజేయాలను కొన్నారని భావించి వెదికారు .పాపం చెట్టు మాటున నాస్తికుడిని చూసి లాక్కొచ్చారు .ఆ మూట అతనిదే నను కొన్నారు .వాడు లబో దిబో తనకేమీ తెలీదు అంటున్నాడు .మూట లో అన్నం తినమన్నారు. అన్నం తినను అని శపథం చేశాడుగా .తిననని మొరాయించాడు .కొట్టి ,భయ పెట్టి తి ని పించారు .వాడు చావ లేదే అని ఆశ్చర్య పోయి ,వాడే చస్తాడు లేఅనుకొని వెళ్లి పోయారు దొంగలు.కనుక తినటం తినక పోవటం నీ ఇష్టం లో లేదు అని ఆ తర్వాతా ఆస్తికుడు చెప్పాదన్నది మనం గ్రహించే విషయం .
విధి ఆడే వింత నాటకాన్ని గురించి ఇంకో కధ –ఒక రాజు తన కుమార్తెకు సంగీత సాహిత్యాలు నేర్పించమని ఒక గురువు ను ఏర్పాటు చేశాడు .బానే నేర్పాడు ఆమె కు యుక్త వయసు వచ్చింది గురుదక్షిణ గా పెద్ద సంపదను ఇచ్చి రాకుమారి నమస్కరించింది . .దాన్ని గ్రహించ కుండా రాజకుమార్తె తనను పెళ్లి చేసుకోవటమే గురుదక్షిణ అన్నాడు .రాకుమారి అతనితో గురువు తండ్రి లాంటి వాడని అలా కోరటం తప్పని చెప్పింది గురువు కు కోపం వచ్చి అంతు చూస్తానని వెళ్లి పోయాడు .
ఒక రోజు రాజు గురువు ను పిలిచి కూతురు జాతకాన్ని పరిశీలించి తగిన వరున్ని చూడ టానికి సహాయం కోరాడు .దుష్టుడు అయిన గురువు ఆమె వల్ల రాజు రాజ్యాన్ని కోల్పోతాడని చెప్పాడు .ఉపాయం ఏమిటి అని అడిగితె చంపెయట మే అన్నాడు ఆ పని చేయ లేనన్నాడు రాజు .అయితే ఆమెను ఒక పెట్టె లో పెట్టి నీళ్ళ లో వదిలేయమని అప్పుడు పీడా విరగడ అవుతుందని చెప్పాడు .అలానే చేశాడు రాజు .ఆ పెట్టె నీటి లో కొట్టు కు పోతోంది .అప్పుడే వేటకు వచ్చిన రాజ కుమారుడు ఒకడు ఆ పెట్టెను నీటి లోంచి బయటకు తెప్పించి చూశాడు అందులో రాకుమార్తె ఉంది .ఆమెను విషయం అంతా వివరించ మని కోరితే చెప్పింది .రా కుమారుడు రాజ గురువు దుష్ట పన్నాగం తెలుసు కొని తన దగ్గర పట్టు బడిన ఒక ఎలుగు బంటి ని పెట్టెలో పెట్టించి మళ్ళీ నీళ్ళ లోకి వదిలేశాడు .
గురువు శిష్యులతో ఒక దేవాలయం లో ఉండి పెట్టె కోసం ఎదురు చూస్తున్నాడు .పెళ్ళికి ఏర్పాట్లన్నీ చేసు కొన్నాడు .పెట్టె కని పించాగానే శిష్యులతో తెప్పించాడు .గుడి లో పెట్టించాడు .ఎవరు వచ్చి గోల చేసినా తలుపు లు తీయ వద్దని ఒక వేళ తానే కేక లేసినా కూడా గుడి తలుపులు తీయ వద్దని గట్టి గా హెచ్చ రించి లోపలి చేరాడు .నెమ్మదిగా పెట్టె తలుపు తీశాడు .మెత్తగా తగిలితే సుకుమార రాకుమార్తె అను కొన్నాడు .పూర్తిగా తీయ గానే భల్లూకం కోరలతో వాడి మేడ పట్టుకొని చీల్చి తినేయటం మొదలెట్టింది .గట్టిగా అరుస్తున్నాడు ,ఏడుస్తున్నాడు గురువు .గురువు అజ్ఞా ప్రకారం శిష్యులు తేలిగ్గా తీసుకొని తలు పులు తీయ లేదు . గురువు ను హాయిగా భక్షించి జారు కుంది .దురాశ ఎంత ప్రమాదాన్ని తెస్తుందో తెలిపే కధ ఇది .
‘’అన్యదా చిన్తితం కార్యం దైవ మన్యాత్ర చింత ఎత్—రాజ కన్యా పహారే ణ విప్రో భల్లూక భక్షితః ‘’అన్న శ్లోకానికి ఈ కధ వివరణ .
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ —9-5-12
కాంప్—అమెరికా +
> రాజ కన్యా పహారే ణ విప్రో భల్లూక భక్షితః
కథ బాగుంది.
ముద్రారాక్షసాలున్నాయి. కొంచెం గుణింతాలు చూసుకోండి.