సత్య కధా సుధ – 8
ఆశ కు అంతు లేదు అని చెప్పటానికి ఒక చిన్న కధ .ఒకడు రాజు ను ఆశ్రయించి ,అనుగ్రహం పొంది భూమిని అంతటిని దానం గా పొందాడు .రాజ లాంచనాలతో ఏనుగు మీద ఎక్కి ఊరేగుతూ ఇంటికి వచ్చాడు .అందరు ఎంతో సంతోషించారు .అమాంతం గా గది లోకి వెళ్లి ఎక్కి ఎక్కి ఏడవటం మొదలు పెట్టాడు .ఎందుకు ఏ డుస్తున్నాడో ఎవరికి తెలీటం లేదు .కాసేపు ఏడవ నిచ్చి భార్య వెళ్లి పలకరించి” సమస్త భూమి రాజు గారు మీకు దారా దత్తం చేశారు కదా ఇంకా ఏడవటానికి కారణం ఏమిటి” అని అడిగింది .వాడు ;’’;అయ్యో ఆకాశాన్ని దానం చేయమని అడగ లేక పోయాను కదా “’అని బావురు మన్నాడట
సంతృప్తి ఉన్న వాడు మూడు లోకాల్లోను పూజ్యుడు .దరిద్రుడు ఎవడు అని ప్రశ్నిస్తే ఆశకు అంటూ లేని వాడు అని సమాధానం .ధన వంతుడేవడు అన్న ప్రశ్న కు –పరి పూర్ణ తృప్తి కలవాడు అని సమాధానం చెప్పారు పెద్దలు .మేరు పర్వతాన్ని సృష్టించిన బ్రహ్మ దేవుడిని ఒక జ్ఞాని ఇలా ప్రశ్నించాడట –ఈ మేరువు ను ఎవరి కోసం సృష్టించావు /–ఆశ లేని వాళ్ళకు అది అక్కర లేదు .దురాశా పరులకు అది సంతృప్తి ని ఇవ్వదు .బంగారు పర్వతాన్ని సృష్టించానని మురిసి పోతున్నా వేమో –ఎవరికీ ఉపయోగం లేని నిర్వాకం చేశావ్ –అని దేప్పాడటజ్ఞాని .
భార్యా ,పిల్లలు అనే వాళ్ళు ప్రతి జన్మకు మారి పోతారు .పరమాత్మ నుండి విడి పోయిన ఈ జీవుడు ఎన్ని జన్మ లేత్తదో ,ఎన్ని సముద్రాలు దాటాడో తెలీదంటాడు జ్ఞాని .దీన్ని గురించిన చిన్న కధ భారతం నుండి –కురుక్షేత్ర సంగ్రామం లో పద్మ వ్యూహాన్ని చేదించి ,బయటకు రాలేక అవక్ర పరాక్రమం టో పోరాడి వీర మరణం పొందాడు అభిమన్య కుమారుడు .తండ్రి పుత్రా శోకం టో బాధ పడుతున్నాడు .స్వయం గా శ్రీ కృష్ణ పరమాత్మ వచ్చి ఓదార్చినా దుఖాన్ని తగ్గించు కొ లేక పోయాడు .అప్పుడు కృష్ణుడు అర్జునుడిని స్వర్గ లోకానికి తీసుకొని వెళ్ళాడట .అక్కడ హాయిగా ఆడు కొంటున్న అభి మన్యున్ని చూశాడు కిరీటి .అర్జునుడు ఆనందం పట్టా లేక దగ్గరికి వెళ్లి ,ఆప్యాయం గా కావలించుకొన్నాడు .అభికి అంతా కొత్తగా వుంది .వింతగా చూస్తున్నాడు ‘’నేను నీ తండ్రి అర్జునుడిని ‘’అన్నాడు చివరికి ధనుంజయుడు .’’ఎన్నో తండ్రివి ?’’అని ప్రశ్నించాడు కుమారుడు అతి నిర్లిప్తం గా .కనుక సంసార బంధాలు జన్మ జన్మ కూ మారుతాయని తెలియ జెప్పటమే ఇందు లోని ఆంతర్యం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –12-5-12.
కాంప్ —అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com