ఆండీస్ పర్వతాల్లో’’ ఇంకా’’ సామ్రాజ్యం


                             ఆండీస్ పర్వతాల్లో’’ ఇంకా’’ సామ్రాజ్యం  

హిమాలయాల తర్వాతఎత్తైన పర్వతా లు ఆండీస్ పర్వ తాలు .అగ్ని పర్వతాలు అక్కడ ఉన్నాయి .అవి ‘’పె రు దేశం ‘’నుంచి వ్యాపించాయి .పెరు లో ని పురాతన  ‘ఇంకా ‘’ప్రజలన జీవన విధానం ,దాన్ని పరి పాలించిన చక్రవర్తుల పరి పాలన గురించి తెలుసు కొందాం .అక్కడ సూర్య దేవుణ్ణి విరకోచ అంటారు .(మన –విరోచానుడికి దగ్గర గా ఉందా?)ఆయనే   వారి దైవం .ఒక సారి విరోచ కు ప్రజల మీద దయకలిగి ,ఆకాశం నుండి కొంచెం కిందికి వచ్చి చూశాడు .అక్కడి వారంతా అడవి జంతువుల్లా బతుకు తుండటం చూసి బాధ పడ్డాడు .తన కొడుకు ‘’మాన్కొక పాక్ ‘’కూతురు ‘’మామా ఒకలా’’లను భూమి పైకి పంపి ,ప్రజలకు ఇల్లు ,పట్టణాలు నిర్మించ టానికి  వ్యవససాయం కు సాయం  చేయ మన్నాడు .చివర రెండుగా చీలిన రెండు పొడవైన లావు బంగారు కడ్డీలను వారికిచ్చి ,వాటితో పొలాలు దున్నామని చెప్పాడు .అవి ఎక్కడ లోతుగా భూమి లోకి దిగి పోతాయో అదే గొప్ప పట్టణం అవుతుందని చెప్పి పంపాడు .తండ్రి మాట ప్రకారం వారిద్దరూ భూమికి చేరారు .ప్రదేశాలను గాలిస్తూ సారవంత మైన భూమి కోసం ఒక లోయ చేరారు ..ఒక రోజు ఉదయం మాంకో కాపాక్ తానే మెరిసి పోయే దేవుడిగా భావించాడు .బంగారు కాడి  నేల మీద లోతుగా దిగిన చోటు నుండి ,మైళ్ళ కొద్దీ భూమిని దున్నారు .అప్పుడు సూర్యుని కుమారుడిని తానే అని ప్రకటించు కొన్నాడు .అతనినే ‘’ఇంకా ‘’అంటారు .అక్కడే స్తానికుల సహాయం టో పెద్ద నగరాన్ని నిర్మించాడు .సోదరి కూడా సహాయం చేసింది .ఆ నగరాన్ని’’ కూజో ‘’అని పిలిచారు అంటే ‘’భూమికి నాభి ‘’అని పేరు .ఆ తర్వాతా ఇంకా  పాలన లో అది దక్షిణ అమెరికా లో గొప్ప నాగరక కేంద్రం అయింది .ఇదంతా ఇంకా ప్రజలు తార తరాలుగా చెప్పు  కొంటున్న కధ

                అయితే చారిత్రిక కధనం వేరుగా ఉంది .వారి దృష్టి లో మాన్కోకపాక్ మామూలు మనుష్యుడే .క్రీ.ష1200  లో దక్షిణ అమెరికా నేటివ్ ఇండియన్ల ప్రభువైనాడు .వారి భాష ‘’.quechua ‘’ఆ సామ్రాజ్యమే ఇంకా సామ్రాజ్యం .చక్రవర్తి కి మాత్రమే ఇంకా అనే పేరు ఉండేది .13  మంది ఇంకా చక్ర వర్తులు ఆ సామ్రాజ్యాన్ని స్పెయిన్ వారు 1532  లో ఆక్ర మించే వరకు పాలించారు .సామ్రాజ్యాన్ని రెండు వేళ   అయిదు వందల మైళ్ళు విస్తీర్ణం తో ఉత్తరాన ఈ నాటి కొత్త కొలంబియా నుండి ,దక్షిణ మధ్య చిలి వరకు వ్యాపించి ఉండేది .దక్షిణ అమెరికా పడమటి భాగం ఆండీస్ పర్వతాల పుట్టి నిల్లు .ఇరవై వేల అడుగుల ఎత్తున్న ఈ పర్వతాల పై ఇంకా సామ్రాజ్యం వ్యాపించి ఉంది .

                                                         హైటెక్ సొసైటీ    

          ఇంకా సామ్రాజ్యం లో పటిష్ట మైన కమ్యునికేషన్,రవాణా ,సమర్ధ వంత మైన పాలనా ఉండేవి .రెండు పర్వతాల మధ్య ఖాళీ ప్రదేశాన్ని దాట  టానికి ‘’ఎగేవ్ ‘’అనే మొక్కల పీచు ను తాల్లుగా పేని వేలాడే వంతెనలను నిర్మించారు .14000 మైళ్ళ రోడ్లను నిర్మించారు .మంచు గడ్డలు జారి పడే చోట రాతి గోడలు కట్టి పడ కుండా చేశారు .ఎడారులలో ఇసుక తుఫాన్లు తట్టుకొనే విశ్రాంతి మందిరాలు నిర్మించారు .వీటిని ‘’ఎడోబ్ ‘’ అంటారు .స్పానిష్ పత్రిక’’ పెడ్రో డీ కూజా ‘’రాసిన దాని ప్రకారం ప్రపంచం లోనే ఇంకా వారు నిర్మించిన రోడ్లు చాలా నాన్య మైనవనీ ,గొప్ప వని తెలుస్తోంది .లోతైన లోయల్లో ,ఎత్తైన పర్వతాల మీద ,టన్నెల్స్ లో ,మంచు గట్ల మీద ,జారే మంచులో  మెట్లతో ,రక్షణ ప్రదేశాల తో రోడ్ల నిర్మాణం చేశారు .దారి లో పరిశుభ్రత ,విడిది గదులు ,సూర్య దేవాలయాలు ,స్టోర్ హౌసులు ,అన్ని సౌకర్యాలతో నిర్మించి మనకే ఆశ్చర్యం కలిగించేట్లు చేశారు .

                                                           వార్తా హరులు

     ఇంత విశాల సామ్రాజ్యం లో వార్తల్ని ఒక చోటు నుండి ఇంకో చోటుకు చేర వేయటం కష్టం .దీని కోసం వేలాది ‘’పోస్ట్ రున్నేర్స్ ‘’ను ఏర్పాటు చేశారు .పది హేను రోజుల షిఫ్ట్ డ్యూటి తో వాళ్ళు పని చేసే వారు .డ్యూటి అవగానే విశ్రాంతి గదుల్లో ఉండే వారు .కంచుశంఖ ధ్వని విని వార్తా హరులు వస్తున్నారని తెలుసు కొనే వారు .వార్తాహరుల్ని chasquis అంటారు .ఎలాంటి భయంకర వాతావరణం లో నైనా వీరు రెండు మైళ్ళ దూరం సునాయాసం గా వెళ్ళ గలరు .రాత్రి ,పగలు లెక్కే లేదు .దారి అంత సుపరిచితం గా వుండేది వీరికి .వ్యాపారం ,కాని  వార్త కాని రోజుకు దాదాపు రెండు వందల మైళ్ళు చేరేవి .

                                                              వ్యవసాయం

  ఇంకా ల ముఖ్య వ్రుత్తి వ్యవ సాయం .ప్రతి కూల వాతావరణం లో కూడా ల్యాండ్ స్కేప్ ల  పై పంటలు పండించే వారు .రాళ్ళతో మెట్లు మెట్లు గా కట్టి  మధ్యఖాళీలు ఉండేట్లు  చేసి ,ఆ మధ్య భాగాన పంటలు పండించే వారు .మనకు తేయాకు తోటలున్నట్లు .ఇప్పటికీ అదే తరహా వ్యవ సాయమే కోన సాగిస్తున్నారు .పర్వతాల మీద ఈ వ్యవసాయ ఏర్పాట్లు పెద్ద’’ స్టేయిర్ కేసులు’’ ల్లా కన్పించి కను విందు చేస్తాయి ఎడారులలోనూ ప్రత్యెక నీటి వసతులు కల్పించి ,నీటి పారుదల సౌకర్యాలేర్పరచి పంటలు పండించారు .వారిచే సస్య శ్యామలం కాని భూమి వుండేది కాదు .స్క్వాష్ ,చిలగడ దుంప ,పత్తి ,యామ్స్ ,ఔషధ మొక్కలు ,బీన్స్ ,మిర్చి ,కోకా ,క్వినోవా లను పండిస్తారు .మొక్క జొన్నతో రొట్టెలు ,కేకులు ‘’ఛి చా’’. వంటి తినే పదార్ధాలను తయారు చేసే వారు .నీరు లేకుండా గడ్డ కట్టించిన బంగాళా దుంప ను ‘’చునొ ‘’(staples )అంటారు .

                                                                   కుటుంబం

          చక్ర వర్తి ప్రతి ఇంటి పెద్ద కు వ్యవ సాయం కోసం కొంత భూమి ని ఇస్తాడు .దీన్ని ‘’తూపు  ‘’ అంటారు .అందులో వంద పౌండ్ల పంట పండించాలి .మూడో వంతు ఫలసాయం రాజుకు ,ఆయన కుటుంబానికి ,అధికారులకు ,మత గురువులకు ఇవ్వాలి .ఇంకో వంతు సైనికులకు ముసలి వారికి జబ్బు పడ్డ వారికి అందించాలి .మిగిలిన మూడో వంతు కుటుంబానికి .పది మంది రైతుల గ్రూప్ కు ఒక మేనేజర్ ,పది గ్రూపులకు ఇంకో అధికారి ,యాభై గ్రూపులకు పర్య వేక్షకుడు ఉంటా రు .పది వేల  మందికి ఒక నాయకుడుంటాడు .వాడిని’’ బిగ్ యియర్స్’’ అంటారు .వాడి చెవులకు చేట  లంత బంగారు చక్రాలున్డటం వల్ల ఆ పేరొచ్చింది .వయసు ప్రాతి పదిక మీద ఆడ ,మగా గ్రూపులుంటాయి .పదిహేను ఇరవై ఏళ్ళ మధ్య మగాళ్ళు సైన్యం లో చేరటం తప్పని సరి .దాని తర్వాత వారికి మంచి పదవి లభిస్తుంది .సైనికుల భార్యలు ఊలు వడికి ,బట్టలు నేయాలి .ఫాషన్ బట్టలు కుట్టాలి .ముసలి మహిళలు పిల్లల సంరక్షణ చూసు కొంటె చాలు .

              అయిదు ఏళ్ళ లోపు పిల్లలు తలిదంద్రులతో పాటు ఇంట్లోనే ఉంటారు .తొమ్మిదేళ్ళ వరకు వడకాలి .చెడు ప్రవర్తనకు తీవ్ర దండన ఉంది .తొమ్మిది పన్నెండేళ్ళ మధ్య పిల్లలు చేలల్లో పంటలను కాపలా కాయాలి .ఆడ పిల్లలు వంట ,వడకటం ఛి చా అనే ఆహారాన్ని తయారు చేయాలి .పన్నెండు ముప్ఫై మధ్య స్త్రీలు ఇల్లాళ్ళు గా  ఉండాలి .వీరందరికీ ప్రభుత్వం అన్ని రకాల సాయం అందిస్తుంది .

                                                                    పరి పాలన

      ఇంకా అది కారులు ప్రజల్ని కట్టు బాటు లో ఉంచు తా రు .తక్కువ నేరం చేస్తే అందరి ముందు అవమాన పరుస్తారు .లేక పోతే కోకా ప్లాంటేషన్ కు పంపేస్తారు .తీవ్ర నేరం చేస్తే రాళ్ళ టో కొట్టి చంపేస్తారు .లేక పోతే చచ్చే దాకా తలకిందుగా వేలాడ  దీస్తారు .ఒక్కో సారి వీపు మీద మోయలేనంత బండలను పెడతారు .ఇవన్నీ మనకు భయంకరం గా కన్పించినా ,పరి పాలన చాలా ఆదర్శ వంతం గా ఉండేది .ప్రజలు సుఖ సంతోషాలతో తృప్తి గా జీవించే వారు .

                                                                  చక్ర వర్తి

            చక్ర వర్తి అంటే సూర్య కుమారుడే అని వారి భావం .బంగారు సింహాసనం మీద కూర్చుని పరి పాలించే వాడు ..చుట్టూ మందీ మార్బలం .ఒక సారి వేసుకొన్న దుస్తులు మళ్ళీ వేసు కొనే వాడు కాదు .వాటిని కుటుంబం లోని వారికిచ్చి వేసే వాడు .ఇంకా ప్రభువు మర ణిస్తే బిగ్ యియర్స్ అనే పెద్దలు రాజ కుటుంబం లో సమర్దున్ని ఎంపిక చేసి వారసుని గా ప్రకటిస్తారు .అతడు తండ్రి నివ శించిన భవనం లో ఉండడు  .వేరే ప్రత్యెక భవంతి ని నిర్మించుకొని అందులో ఉంటాడు .బంగారం ,వెండి అధికం గా లభించేవి. ఇంటి గోడలకు బంగారు వెండి రేకులను తాపడం చేసే వారు . స చక్ర వర్తి తన పాలన ఎలా ఉందొ చూడాలని కుజ్కో నుండి బయల్దేరి ఊరేగింపు గా ,వైభవం గా  అది కారు  లంతా వెంట ఉండగా ,బరాబరులు చేస్తుండగా నగర సందర్శనం చేసే వాడు .ప్రజలు దారులకు ఇరు వైపులా చేరి ఆనందంగా పూల వర్షం కురి పించే వారు .ఆయనంటే దేవుడే .ఆయన చని పోతే భరించ లేక కొందరు ఆత్మా హత్య చేసుకొనే వారు .లేక పొతే నోటిలో ఆకులు కుక్కు కొని ,లేక ముక్కు బిగించి శ్వాస ఆడ కుండా చేసుకొని ఆత్మా హత్య చేసుకోవటం వారికి మామూలే .

                                                              ప్రకృతే దైవం

     పర్వతాలను ప్రజలు దేవుని గా పూజించే వారు .పర్వత దేవుళ్ళ కరుణా కటాక్షాల కోసం ‘’కాపా కోచా ‘’అనే వేడుక చేసే వారు .చక్ర వర్తి చని పోతేనో ,ప్రక్రుతి వైప రీత్యాలు జరిగితేనో ఈ ఉత్సవం చేసే వారు .దేవుని ప్రసన్నం చేసుకోవటానికి ,పర్వత దేవుణ్ణి సంతృప్తి పరచటా నికే ఈ ఉత్స వాలు .అందుకోసం ఏంతో  కష్ట పడి పర్వతాగ్రం చేరు కొనే వారు .అవన్నీ మంచు పర్వ తాలు .తమకున్న విలువైన వాటిని కానుకగా అక్కడ సమర్పించే వారు .ఆహారం ,పానీయం ,బంగారు విగ్ర హాలు ,ఒక్కో సారి పది హేనేల్ల ఆడ మగ పిల్లల్ని కూడా బలిదానం చేసే వారు. .ఈ పిల్లలు పెద్ద అధికారి లేక గ్రామ పెద్ద ల  పిల్లలే అయి ఉండాలనే నియమం ..వారి అవయవాలన్నీ బాగా ఉండాలి అది ఇంకో నియమం .వీరిని బలి ఇస్తే సంక్షోభాలు రావని ఇంకా ప్రజల నమ్మకం .వారిని ఊరేగింపు గా తెసుకొని వెళ్తారు .ఆ పిల్లలు కూడా తామొక పవిత్ర కార్యానికి ఉప యోగ పడుతున్నామని సంబర పడతారట .వారిని బాగా అలంకరించి సకలాభరణాలతో ,పర్వతాగ్రానికి త్తీసుకొని వెళ్లి అక్కడ వదిలేసి రావటమే బలి అంటే .అక్కడ మంచు, గాలి, వర్షాలకు వాళ్ళు వాళ్ళ చావు వాళ్ళు చస్తారు .

                                                                          మమ్మీలు

             ఇటీవలి పరిశోధన లో ఆండీస్ పర్వతాల మీద మంచులో పిల్లలు మమ్మీ లు గా కని పించారు .వీరందరూ బలి ఇవ్వ బడ్డ పిల్లలే నని తేలింది .ఒక ఎనిమిదేళ్ళ పిల్ల ,అయిదు వందల సంవత్సరాల మమ్మీ కని పించింది .ఇంకో పద కొండు ఏళ్ళ  అబ్బాయిది అయిదు వేల సంవత్స రాల మమ్మీ .దొరికింది .హిమ ఘాతానికి చని పోయారని తేల్చారు .శరీరాలేమీ పాడు కాలేదు .అమ్మాయి శరీరం పై కప్పిన శాలువా ,దానికి పెట్టిన బంగారు పిన్ను అలానే ఉన్నాయి .తాగే పాత్రలు మెరుపులకు కొంత కాలి పోయి వారి పక్కన కని పించాయి .

                                                               స్పెయిన్ వశం లో ఇంకా

      1532 లో ఇంకా ప్రాంతాన్ని అతి తక్కువ మంది సైనికులతో స్పెయిన్ ఆర్మీ దాడి చేసి వశ పరచు కొన్నది .ఇరవై నాలుగు టన్నుల విలువైన సంపదను దోచుకొని స్పెయిన్ రాజు కు కానుక గా సమర్పించారు .ఇక్కడి ఆదిమ ఇండియన్లు ,ఇప్పటికీ పర్వ తాలను దైవ స్వరూపం గా తండ్రులు గా  ఆరాదిస్తూనే ఉన్నారు .అక్కడ కరగ బెర్రిన హిమ జలాన్ని జబ్బులు తగ్గ టానికి ఉప యోగిస్తున్నారు .ఇంకా చక్ర వర్తులు మహాసామ్రాజయాన్ని  ప్రజల ను సుఖ సంతోషాలతో పాలించి చరిత్ర సృష్టించారు .మనకు వారి పాలనా సామార్ధ్యాని గురించి నేర్చు కావాల్సింది చాలా ఉంది .

     మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —15-5-12.—కాంప్ –అమెరికా
http://suvarchalaanjaneyaswami.wordpress.com

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అనువాదాలు and tagged . Bookmark the permalink.

1 Response to ఆండీస్ పర్వతాల్లో’’ ఇంకా’’ సామ్రాజ్యం

 1. ravindranathmuthevi అంటున్నారు:

  ‘ రుచి ‘అంటే సంస్కృతంలో ‘కాంతి’ అనే అర్థమూ ఉంది.’రోచ’,’రోచక’ అనే విశేషణా శబ్దాలకు
  ‘కాంతివంతమైన’, ‘ప్రకాశమానమైన’ అనే అర్థాలు కూడా ఉన్నాయి. మెరిసే ఆభరణాల తయారీ,
  అద్దాలతో వస్తువుల తయారీ చేసే శ్రామికుడిని ‘రామాయణమ్’ లో వాల్మీకి ‘రోచకః’ అన్నాడు.
  తళ తళ మెరిసే ఎర్ర ఉల్లిపాయల్ని ‘రోచకః’ అనే అంటారు. ‘రోచన’ అన్నా ‘ప్రకాశవంతమైన’ అనే
  అర్థమే.మిలమిల మెరిసే పై చర్మాన్నిబట్టి గజనిమ్మ పండును సంస్కృతంలో ‘రోచనమ్’అంటారు.
  అమిత ప్రకాశం కలవాడు కనుకనే సూర్యుడిని ‘విరోచనః’ అంటూ ‘ Superlative’ లో అంటారు.
  (‘వి’ ముందు చేర్చి) ‘మహాభారతమ్’ లో వ్యాసుడు చంద్రుడిని కూడా ‘విరోచనః’ అనే
  పేర్కొన్నాడు. తళ తళ మెరిసే దాని ఆకుల కారణంగా ‘కానుగ’ లేక ‘గానుగ’ చెట్టును కూడా
  ‘విరోచన వృక్షమ్’ అంటారు. మన ప్రహ్లాదుడి కొడుకూ, బలి చక్రవర్తికి తండ్రీ అయిన ‘విరోచనుడు’
  అనే రాజూ ఉన్నాడు.అందుకే బలికి ‘విరోచన సుతుడు’ అనే మరో పేరుంది.
  ‘ఇంకా’ ప్రజలు సూర్యుడిని ‘విరోచ’ అంటుంటే మన ప్రాచీన సాహిత్యం ‘విరోచన’ అంటుంది.
  ‘ఇంకా’ ప్రజలు సూర్య వంశీకులు. మన భారతదేశంలోనూ ప్రాచీనులు తాము సూర్య, చంద్ర
  వంశాలకు చెందినవారమని సగర్వంగా చాటుకునేవారు. సంస్కృతంలో ‘ఇన’ అంటే సూర్యుడు
  అనే అర్థం. సూర్య వంశాన్ని ‘ఇన కులమ్’ అంటారు.రాముడు ఇనకుల శ్రేష్ఠుడుగా పేరొందాడు.
  ‘ఇంకా’, ‘ఇన’ శబ్దాల సారూప్యత గమనార్హం. మనకూ’ హిమవత్’, మేరు, రోహణ, కవేర మొ.
  పర్వతాలను పూజించడం ఉంది.’మాన్కోకపాక్’, ‘రాముడు’– వీరిరువురి కథలనూ లోతుగా
  పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూడవచ్చు.ఇవేకాదు; ప్రపంచంలోని
  పలు పురాణ గాథలను నిశితంగా పరిశీలిస్తే మానవ జాతులన్నింటి మూలాలూ ఒకటేననీ,
  ఈ ప్రపంచం ఓ చిన్న కుటుంబమనీ గ్రహించగలం.
  –ముత్తేవి రవీంద్రనాథ్, డేటన్,న్యూజెర్సీ,యు.యస్.ఏ.నుంచి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.