సంస్కృతి అంటే ?
సంస్కృతి అనేది మానవ జీవితాలకు మాత్రమే సంబంధించింది .అది ఉండబట్టే మనల్ని మానవులు అంటున్నారు .లేకుంటే జంతువులతో సమానమే .సంస్కృటతి అంటే సభ్యతా ,సంస్కారం అని అనుకొంటాం ..ఇతరుల పట్ల మర్యాదా ,మన్ననా ,గౌరవం చూపటమే ఈ రెండు పదాలకు అర్ధం .అవి లేక పోయినా ,చూపక పోయినా ,సంస్కృతీ విహీనులు గా భావింప బడటం లోక రివాజు .సంస్కృతీ పై మంచి అవగాహన కలిగి ఉండాలి .సామాజికం గా ఐక్యతా ఉండాలి .ఈ రెండు ఉంటె దేశ ఐక్యత సాధ్యం .సమాజం లో ఉన్న వ్యక్తుల మధ్య సంబంధాల వల్ల కలిగేది సంస్కృతి .దీనికోసం నిరంతరం చర్చలు జరుగు తూనే ఉంటాయి .ఈ చర్చల మొత్తం సారాంశమే సంస్కృతి .నాగరకత నుంచి వచ్చేది విద్య .ప్రతి జాతికి ,దేశానికి సంబంధించిన సంస్కృతి ఉంటుంది .
సంస్కృతీ ని అనేకులు అనేక రకాలుగా నిర్వ చించ టానికి ప్రయత్నించారు .అంత తేలికగా నిర్వ చింప బడని పదం .’’ఎవరైతే ,తన ప్రవర్తన లో నాగరకత చూపిస్తారో ,వారు సంస్కతి ఉన్న వ్యక్తులు ;;అంటారు .ఇంకొంచెం ఆలోచిస్తే ,’’ఒక నియమిత సమాజం లో ప్రజల జీవన విధానాన్ని సంస్కృతి ‘’అన వచ్చు .రాతి కాలం నుండి నేటి వరకు మనిషి సుఖం గా ,ఆనందం గా ఉండటానికి ,సంతృప్తి గల జీవనాన్ని ఇచ్చేదీ సంస్కృతి ..చట్టానికి లోబడి ,మానవ ప్రశాంత జీవ నానికి ,సామాజిక ప్రవర్తనకు ,పొందిన జ్ఞానం తో ,పెరిగే విలువలు ,ప్రమాణాలతో జీవనం సాగించట మే సంస్కృతి .సంస్కృతీ టో పాటు ,నాగరకత పదమూ అవినా భావ సంబంధం కలిగి ఉంది .ఒక్కో సారి ఒక దాని కొకటి కలిపి వాడుతూ ఉంటాం .నాగరకత అనేది –సంస్కృతీ కి ఉన్న బాహ్య రూపం .అంటే –మనం ఉపయోగించే వస్తువులు ,యంత్రాలు వగైరా .ఆంతరిక మైనది సంస్కృతీ .నాగరకత శరీరం అయితే ,సంస్కృతీ ఆత్మ .నాగరకత అనేది సంస్కృతీ లో ని భౌతిక పార్శ్వం ..లేదా భౌతిక సంస్కృతి .సామాజిక జీవన వ్యవస్థలు ,కట్టు బాట్లు ,ఆచారాలు ,విలువలు ,కళలు ,సాహిత్యం ,,సంగీతం ,సమాజం లోని వ్యక్తుల పరస్పర చర్యలు ,సంబంధాలలో పొందే అభి వృద్ధి వీటన్నిటిని కలిపి ‘’అభౌతిక సంస్కృతీ ‘’అంటారు .ఈ పార్శ్వాన్నే విస్త్రుతార్ధం లో సంస్కృతీ అంటాం .అంటే సంస్కృతికి ,భౌతిక ,అభౌతిక పార్శ్వాలున్నట్లు గా తెలుస్తోంది ..మనుష్యులు దేన్నీ కలిగి ఉన్నారో అది నాగరకత అని ,మనుష్యులు అంటే ఏమిటో చెప్పేది సంస్కృతీ అని ‘’మకైవార్ ‘’అనే విశ్లేషకుడు సూక్ష్మం గా చెప్పాడు .భౌతిక సంస్కృతీ తేలి కగా మారి పోతుంది .అభౌతి కం అంత తేలిగ్గా మారదు .
సంస్కృతీ లక్షణాలేమిటి
ఏయే లక్షణాలు ఉంటె సంస్కృతీ అనాలి ?సమాజం లో ని వ్యక్తుల ప్రవర్తనా ఫలితం గా ఏర్పడిందే సంస్కృతీ .అంటే సంస్కృతీ సమాజ ఫలితం గా ఏర్పడు తుంది .సంస్కృతి మానవ నిర్మిత మైనదే .అందుకే మనిషి ,అతను చేసే పనులే సంస్కృతీ అన్నారు .కొత్త తరం వారికి అవసర మైనవన్నీ అందించేది సంస్కృతి . .సంస్కృతీ పరిణామ శీలం కలిగి ఉంటుంది .సమాజ అవసరాలను బట్టి మారుతుంది .సంస్కృతి అభ్యాసనం వల్ల అంటే నేర్చు కోవటం వల్ల ఏర్పడుతుంది .భాషా ,కళలు మొదలైనవి నేర్చు కొంటె నే వస్తాయి .తనకు అవసర మైన హోదా,గౌరవం ,తిండి ,బట్టలు ,పొంది సంతృప్తినిస్తుంది .అందుకే సంతృప్తి దాయక మైనదిగా సంస్కృతీ ని భావిస్తారు ..భిన్న సంస్కృతుల మధ్య ఆదాన ప్రదానాలుంటాయి .అనుకరణ అనేది ఆదరణ లకు నిలయమై పంచు కొ బడేది గా ఉంటుంది .నిరంతరం మారుతూ ఉండటం దాని లక్షణం ..ఆలోచన ,భావం అనేవి దాని లక్షణాలే కనుక సంస్కృతీ మారుతూ ,గతిశీలం గా ఉంటుంది .సంస్కతి విస్తృతం గా పెరిగి పోతే ,విడి పోవటమూ జరుగు తుంది .ఒకే విధ మైన సంస్కృతీ ఉన్న వేర్వేరు వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాన్ని సంస్కృతీ ఏర్పరుస్తుంది .అందుకని ,సంస్కృతి భిన్న మైనా ,సమగ్రం గా ఉంటుంది .సంస్కృతీ సమాజం లోని పరి వార్తన ,సామాజిక ప్రమాణాలను,నియంత్రిస్తుంది .కనుక వ్యక్తులు విలువలను ఆచరణ లో పెట్టాలి
సంస్కృతికి పునాది కుటుంబం .ఆర్ధిక స్తితి ,ప్రభుత్వం ,విద్య ,మతం అనే సంస్థలే .ప్రతి వ్యక్తీ పైనా అది కారం ,అనుమతుల ప్రభావం ,ఎక్కువగా ఉంటుంది .ఎవరి సంస్కృతీ వాళ్లకు గొప్పే .ఇతర సంస్కృతుల్ని కూడా ఆద రించే ఉదార భావం అలవాడాలి .’’సంస్కృతీ బహుళత్వం ‘’అనే భావన ఈ రోజు విశ్వ వ్యాపితం గా ఉంది .తరాల మధ్య వ్యత్యాసం ఏర్పడు తుంది .కొన్ని అంశాలలో అభివృద్ధి బానే ఉంటె ,కొన్నిటి విషయాలలో నెమ్మది గా ఉంటుంది .దీన్నే ‘’సంస్కృతిక విలంబన ‘’(కల్చరల్ లాగ్ )అన్నారు విశ్లేషకులు .భిన్న సంస్క్రుతులున్న సమాజాలు కాని ,వ్యక్తులు కాని తారస పడ్డప్పుడు కలిగే ఫలితం ,ప్రభావం ‘’సాంస్కృతిక విఘాతం ‘’అంటారు .ఒత్తిడి వల్ల ఒకరి భావాలపై వేరొకరి భావం పడి ఘర్షణ కలుగు తుంది .
హేబెర్ట్ స్పెన్సర్ ‘’సంస్క్రుతిభౌతికము కాదు ,అభౌతిక ము కాదు .ఈ రెంటికీ భిన్న మైన అర్ధాన్నిస్తుంది ‘’అన్నాడు .కనుక సంస్కృతీ ‘’సూపర్ ఆర్గానిక్ ‘’లక్షణం కలదని భావిస్తున్నారు .సంస్కృతీ ఆదర్శ ప్రాయ మైనదే .’’విసరణ (దిఫ్యూజన్ ) ద్వారా అది చొచ్చు కొని పోతుంది .అందుకే ఈ బాధ భరించ లేక ‘’అనుభవాల ప్రోగు ‘’అని సంస్కృతిని నిర్వ చించారు .ప్రస్తుతం ఉన్న విజ్ఞానాన్ని ,భవిష్యత్తు కు ఉపయోగ పడ టా న్ని ‘’కల్పన ‘’అన్నారు .కల్పన పెరిగితే ,విజ్ఞానం పెరుగు తుంది .ఆధునీ కరణ ,,సమాజ అవసరాల్లో ఒకటి .ఉన్న విషయాలను కనుక్కోవటం ఆవిష్కరణ .ఖండాలు కనుక్కోవటం మొదలైనవి ఆవిష్కరణలు (డిస్కవరి) అన్నారు .సర్దు బాటు కూడా ఒక భాగమే .రెండు సంస్కృతుల మధ్య ఫలదీకరణం జరిగి సంస్కృతీ శక్తిని ,జీవనాన్ని నిలబెట్టు కొంటుంది .ఒక సమూహం నుంచి వేరొక దానికి సాంస్కృతిక అంశాలు వ్యాప్తి చెందటమే సంస్కృతీకరణ .ఒక్కో సారి భిన్న సంస్కృతులు చాలా కాలం కలిసి ఉండటం వల్ల భేదాలు అంతరించి విలీనీ కరణం జరుగుతుంది అని దీని పై ఆలోచించిన జ్ఞానులు పరిశోధనా పూర్వకం గా తెలియ జేశారు .
‘’ఒక సమాజపు సాంస్కృతిక సాంప్రదాయాలను ,అది సంపాదించే ప్రక్రియను సంస్కృతీ స్వీకరణం గా వీరు నిర్వ చించారు .సంస్కృతిని సక్రమింప జేయటాన్ని ,స్వీకరణ లేక’’ en culturation ‘’అంటారని దీని మీద సాధికారం గల mary godman ‘’అనే ఆయన చెప్పాడు .ఈ విధానమే భారతీయ సంస్కృతి భిన్న దేశాలకు వ్యాపించటా నికి కారణం అయింది అని ఆయన సూటిగా నిష్కర్ష గా చెప్పాడు .
మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ —24-5-12.-కాంప్—అమెరికా .
సంస్కృతిని ని గూర్చిన
మీ ఈ విశ్లేష నాత్మక వ్యాసం
మమ్ము సంస్కృతిని గూర్చి మరింత లోతుగా ఆలోచింప చేసినది,
సంస్కృతి యొక్క ఆవిర్భావము, వ్యాప్తిని గూర్చి
వివరించిన విధము సమగ్ర పరిశీలనాత్మక దృష్టిని,
మీ జీవితనుభావమును
మీదు మిక్కిలి (ఈ) దేశ సంస్కృతిపై తమరి మక్కువను
తెలియపరచు చున్నది.
ఏదేని అంశాన్ని ఇంత క్షుణ్ణంగా తెలుస్కోవటం అంటే నాకు భలే ఆసక్తి
అయ్యా !
తమరు ఇంత చక్కని అంశానికి చెందినా వ్యాఖ్యను ఇచ్చారు
అదే చేతితో,
”ఆధ్యాత్మికత అంటే….”
అనే అంశాన్ని కూడా ప్రతిపాదన చేయగలరని విజ్ఞప్తి..!!
ఎంచేతనంటే
నేను ఈ అంశం పై వ్యాసం రాస్తే ఎలా ఉంటుంది ?
అని ఆలోచన చేసిన తరుణంలోనే
మీ సంస్కృతి అంటే … వ్యాసం చూచుట జరిగెను ….
కాని
ఒక (ఇలాంటి) వ్యాఖ్య రాయాలంటే …
కేవలం ఆసక్తి విషయ పరిజ్ఞానం ఉన్న చాలదు,
దానికి తపస్సు, సమగ్ర పరిశీలనాత్మక దృష్టి,
ఎక్కడికక్కడ విశ్లేషణ చేయగల చాతుర్యం అవసరం.
అంతే కాక మీకు మీ జీవితానుభవం యొక్క బలం ఉన్నది
మాకది లేదు
ఇప్పుడిప్పుడే జీవితం లోనికి అడుగుపెడుతున్న
మా బోటి వారికి
మీ సరస భారతి
విజ్ఞాన భారతి.
?!
http://endukoemo.blogspot.in