చరిత్ర –సాహిత్యం –1

          చరిత్ర   –సాహిత్యం –1

          భావి భారత పద నిర్దేశకులు ,శక్తి కణాలు ,ఉత్సాహ వంతులు ,ధైర్య సాహసో పెతులు ,విచక్షణా చతురులూ ,ఆవేశ అగ్ని కణాలు ,అయిన యువ విద్యార్ధినీ విద్యార్ధులకు –అభి నందనాలు .కాలేజికి వచ్చి లేజీ గా ఏదో వింటూ ,పరీక్షల ముందే చదివి పాస్ అవుదాం ఆన్న ఆలోచన ల లోంచి బయట పడి  ,జీవితం  ఏమిటి ?మన కర్తవ్యం ఏమిటి ?మన చుట్టూ ఏమి జరుగు తోంది ?మనం దేశ భవిష్యత్తు లో మన పాత్ర ఏమిటి ?మనల్ని వదిలేస్తే ప్రగతి ఉంటుందా ?మన సంప్రదాయం ఏమిటి ?సంస్కృతీ ఏమిటి ?ఈ చదువుల పరమార్ధం ఏమిటి /విద్య లక్ష్యం ఏమిటి ?పరి పూర్ణ వ్యక్తిత్వ వికాసానాన్ని ఎలా సాధించాలి అనే ప్రశ్న లతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ,ఒక మార్గాన్ని ,లక్ష్యాన్ని ఏర్పరచు కోవాలన్న ధ్యేయం తో  ,రొటీన్ కు భిన్నం గా ,ఆలోచించాలన్న సంకల్పం తో  మీరు చేబట్టిన ఈ ‘’ఇన్నోవేటివ్ ప్రోగ్రాం ‘’విని చాలా సంతోషించాను .జీవిత విలువలను తెలుసు కోవాలన్న మీ ఆరాటం ఆదర్శ నీయం .ఆ దిశ లో సాగుతున్న మీ ప్రయాణం అభినంద నీయం .’’శక్తులు నిండే ,నెత్తురు మండే ‘’మీ లాంటి యువత తో కాసేపు ముచ్చ్చ టి న్చాలని  మీరు కోరినపుడు ఆనందం తో అంగీకా రించాను ..ఇక్కడ నేనేదో చెప్తానని ,మీరేదో వింటారని రనీ ,కాదు మనం పరస్పరం అభిప్రాయాలను అంద జేసుకొందామని వచ్చాను ..నాకు ఈ అవకాశాన్ని అందించిన మీ కాలేజీ యాజమాన్యానికి ,ఇలాంటి కార్య క్రమం చె బట్టి ,రూప కల్పనా చేసి ,మీ విద్యార్ధి నాయకులకు ,మార్గ దర్శకులైన మీ అధ్యాపకులకు ,ముఖ్యం గా ఈ కార్య క్రమాన్ని నా ఉపన్యాసం తో ప్రారంభింప జేయాలని కోరిన ప్రిన్సిపాల్ శ్రీ రాయుడు గారికి కృతజ్ఞతలు .కొత్త ఆలోచన కొత్త మార్గాలను వేస్తుంది .ఏదో వినూత్నం గా చేయాలన్న సంకల్పం ఉంటె తప్పక దారి కన్పిస్తుంది .నీరు పారకుండా ఉంటె మలినం అవుతుంది .అలానే యువ శక్తి ప్రక్వహిస్తేనే సమాజానికి ఉపయోగ పడుతుంది .ప్రేరణ పొందాలనే మీ ఆలోచనకు అభినందనలు .ఇది శుభ సూచకం .—ఇక ప్రస్తుతానికి వద్దాం

                            ‘’చరిత్ర –సాహిత్యం ‘’అనే అంశం మీద డిగ్రీ విద్యార్ధులకు ఉపన్యాసం ఇవ్వమని కోరారు .చాలా సంతోషం .నిజం గా ఈ రోజు మీ కాలేజి చరిత్ర లో ఒక చారిత్రాత్మక సంఘటనే .దీని లో నేను మీతో ముఖాముఖి జరపటం ముఖ్య మైన సంఘటనే .ఈ సందర్భం గా మీరు మీ మనోభావాలను గేయాలుగా వ్యాసాలుగా వ్రాసి లిఖిత పత్రిక తయారు చేయటం –అంటే అప్పుడే సాహితీ ప్రభావం ఈ సంఘటన పై చారిత్రిక అంశం గా   ప్రభావం పడింది అన్న మాట .ఇలాంటి విషయాలు ఎన్నో మన నిత్య జీవితం లో ,జాతి జీవితం లో జరుగుతూ ఉంటాయి .వాటన్నిటి ప్రభావం ఎలా వుంటుంది ?అన్న దాని పై మనం మాట్లాడు కొంటున్నాం .కొంత మూల విషయాల లోకి వెళ్లి చూద్దాం .

          సాహిత్యం అంటే ఏమిటో తెలియాలి కదా ముందు .హితేన సహితం సాహిత్యం .అంటే మేలు చేసేది సాహిత్యం .ఆ మేలు వ్యక్తిగతం ,సమాజ గతం ,జాతి గతం కావచ్చు .అయితే ఈ చెప్పే విషయం సత్యం తో నిండి ఉండాలి .సుందరం గా ఉండాలి .దాని వల్ల ఆనందం రావాలి .అదే సాహిత్యం .దీననే సత్య శివ సుందరం అన్నారు .ఇక చరిత్ర అంటే ఏమిటో తెలుసు కొందాం .సంఘటనల పరంపర నే వ్రాసి ఉంచితే దాన్ని చరిత్ర అన్నారు .దీన్నే’’ రికార్డెడ్ ఇన్సిడెంట్స్ ‘’అంటారు .చరిత్ర జరిగిన తర్వాత సాహిత్యం ఆ చరిత్ర ను చిత్రించ వచ్చు .మరి చరిత్ర లేనప్పుడో ?దాన్నీ చరిత్రాతీతం లేక చరిత్ర పూర్వం అన్నారు .చరిత్ర ,సాహిత్యం పరస్పరం ప్రేరణ పొందుతాయి .అనుకొని సంఘటన జరిగినపుడు  జాతి జీవన విధానం లో మార్పు వచ్చినపుడు ,,ఏదైనా ఉద్యమం జరిగి నపుడు జాతీయ జీవనం లో మార్పు జరిగి నపుడు ,విదేశ దండయాత్ర జరిగి నపుడు ప్రజల మానశిక స్థితి పై దెబ్బ తగిలినప్పుడు ,,మత విద్వేషాలు చేల రేగి నప్పుడు ,భాశోద్యమాలు వచ్చినప్పుడు ,,భాషా ,సంస్కృతీ ,నాగర కథ ల పై పరాయి పెత్తనం వచ్చి నప్పుడు ,జీవిత విధానం లో అనుకొని మార్పులు జరిగి నపుడు భావాలు మానశిక అంశాలు పై దెబ్బ పడినపుడు   ,జనన ,మరణ ,కరువు ,పాడి పంట ,ధర్మ సంకటం వస్తే యువత దారి తప్పి నప్పుడు ,జాతి జీవనం లో విద్యార్ధులను పాల్గొనే టట్లు చేయ నప్పుడు ,వ్యవస్థ చిన్నా భిన్న మైనపుడు ,జాతికి విలువైన విషయాల పై దాడి జరిగి నపుడు  ,సంచలనం కలిగించే యే సంఘటన అయినా జరిగి నపుడు కవులు ,రచయితలు స్పందిస్తారు .వాటికి కళా రూప మైన ఆకృతి ని కల్పిస్తారు .జాతికి సందేశం ఇవ్వాల్సిన సమయం లో ఉత్తేజం కల్గించాల్సిన సందర్భాలలో ప్రేరణ కల్గించి ,జాతిని చైతన్య వంతం చేయటం ,కోసం సాహిత్యం అవసరం .సుస్తిర పరిపాలన అందించ టానికి ,సువ్యవస్థ ఏర్పర చాతానికి ,ప్రజల మనో భీష్టాలను నేర వేర్చ టానికి ,విద్యా వికాసం కల్పించ టానికి రాజకీయ పరమైన రచనలు వస్తాయి .న్యాయ నిర్వహణ కోసం శాస్త్రాలు వస్తాయి .ప్రజా రక్షణ కోసం శాస్ర రచనలు వస్తాయి .ప్రజల మానసిక ఆనందం చాలా ముఖ్యం .దీని కోసం కళలు ,సాంస్కృతిక కార్య క్రమాలు కావాలి .వీటి తో ఆనందం కలగటమే కాదు ఒక గమ్యం కూడా ఏర్పడుతుంది .ఇలాంటి వన్నీ అందించాల్సిన బాధ్యత రచయిత లది .ప్రజల మానసిక స్తితులన్నీ ఒకే రకం గా ఉండవు .పండితుల స్తాయి ఒకతిదే సామాన్యుల కోసం ఇంకోటి .వీరికి పాటలు ,నాటకాలు ,గేయాలు త్వరగా అందుతాయి .దీనితోఆనందం పొందుతారు .అవే జాన పదాలు .ఒక రకం గా జ్ఞాన పదాలు .మార్గాలు వేరు అయినా ఆనందం పొందే తీరు ఒక్కటే .ఆనందమే అందరి పరమావధి ..ఇదంతా స్తూలం గా చెప్పే విషయం .ఇప్పుడు కొంత సూక్ష్మ పరిశీలన చేద్దాం .

  సశేషం —-

 మనవి –ఈ రచనకు దాదాపు తొమ్మిదేళ్ళు .ఉయ్యూరు యే..జి.ఎస్.జి సిద్దార్ధ డిగ్రీ కళా శాల ప్రిన్సిపాల్ శ్రీ బి.వి.రాయుడు గారు నాకు  2003 నవంబర్ మొదటి వారం లో  ఫోన్ చేసి తమ కాలేజి లో ఆ సంవత్సరం డిగ్రీ విద్యార్ధులకు ‘’ఇన్నోవేటివ్ ప్రోగ్రాం ‘’అనే కొత్త కార్య క్రమాన్ని చేబట్టు తున్నామని ,అది విద్యార్ధులను పోటీ పరీక్షలకు తయారు చేయటానికి ,సాహిత్య సాంస్కృతిక వికాసానికి చరిత్రాధ్యయనానికి తోడ్పదాలాన్నదే ధ్యేయమని చెబుతూ ,ఆ కార్య క్రమాన్ని నాతో ప్రారంభింప జేయా లన్నదే తన మనో భావం అని ,అందరు దాన్ని అభి నందిన్చారని కనుక నవంబర్ ఇరవై అయిదవ తేది తమ కళా శాలలో సాయంత్రం మూడు గంటలకు ‘’చరిత్ర –సాహిత్యం ‘’అనే అంశం ‘’మీద కనీసం ఒక గంట సేపు గెస్ట్ లెక్చర్  ఇవ్వాలని  కోరారు .నేను ఏమీ సందేహించ కుండా వెంటనే అంగీకా రించాను .వారితో నాకు చాలా ఏళ్లు గా పరిచయం ఉంది .డిగ్రీ విద్యార్ధులతో కాసేపు మాట్లాడే అరుదైన వకాశమే కాక ,అది ప్రబోదకం గా ,ప్రేరణ కల్గిన్చించేది గా ఉండాలని భావించాను .తగిన సమయం ఉన్దికనుక కావలసిన విషయ సేకరణ చేసి దాన్ని రాసుకోన్నాను .ఆరోజు న కనెను చేసిన ప్రసంగ విషయమే ఇప్పుడు మీకు అందిస్తున్నాను .ఆ తర్వాతా వరుసగా మూడేళ్ళు నాతో రాయుడు గారు అనేక మైన అంశాల పై గెస్ట్ లేక్చార్లను  ఇప్పించారు .ఆదేశం గా భావించి నా కర్తవ్యాన్ని నేర వేర్చాను .ఈ ప్రోగ్రాం వల్ల ఏంతో  మేలు చేకూరిందని వారు కలిసి నప్పుదలా చెప్పే వారు .ముఖ్యం గా నా ప్రసంగాలకు విద్యార్ధులు ఎంతో ఆసక్తి కణ పరిచారని .కళా శాల విద్యార్ధులు ఎన్నో పోటీలలో బహుమతులు పొద  టానికి దోహద పడ్డానని చెప్పే వారు .అది వారి సహృదయత  .అనే నేను భావించాను .ఇదీ ఈ వ్యాసానికి నేపధ్యం .

   మీ—గబ్బిట.దుర్గా ప్రసాద్ —28-5-12.—కాంప్—అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

1 Response to చరిత్ర –సాహిత్యం –1

 1. ఎందుకో ‽ ఏమో అంటున్నారు:

  టైటిల్ చూడగానే సగం చదివిన mail feed ని మళ్ళీ unread mail గా మార్చి ఇదిగోండి ఇప్పుడే పూర్తిగా చూశాను,

  “,జీవితం ఏమిటి ?మన కర్తవ్యం ఏమిటి ?మన చుట్టూ ఏమి జరుగు తోంది ?మనం దేశ భవిష్యత్తు లో మన పాత్ర ఏమిటి ?మనల్ని వదిలేస్తే ప్రగతి ఉంటుందా ?మన సంప్రదాయం ఏమిటి ?సంస్కృతీ ఏమిటి ?ఈ చదువుల పరమార్ధం ఏమిటి /విద్య లక్ష్యం ఏమిటి ?పరి పూర్ణ వ్యక్తిత్వ వికాసానాన్ని ఎలా సాధించాలి” ఈ ప్రశ్నలు నన్ను mesmerise చేశాయి.
  ఈ ప్రశ్నల వేనాకాతల ఒక శ్రీ శ్రీ ఒక ప్రహ్లాదుడు కలసి జంటగా ఒక్కటి ఉన్నట్లు తెలుస్తున్నది,

  ” హితేన సహితం సాహిత్యం ” ఈ definition వినటం ఇదే ప్రథమం !

  ఈ చెప్పే విషయం సత్యం తో నిండి ఉండాలి .సుందరం గా ఉండాలి .దాని వల్ల ఆనందం రావాలి .అదే సాహిత్యం .దీననే సత్య శివ సుందరం అన్నారు

  ఆహా ! ఎంత నిబద్ధతని కల్పించారండి ? ఈ ఒక్క వాక్యం లో
  ఇది చదువుతుంటే, సత్యం మాట్లాడాలి, అది ప్రియమైనది అయి ఉండాలి, ఎవరిని నొప్పిన్చకూదదూనూ !!
  ఈ ఈ భగవత్ వచనాలు స్ఫురించాయి.

  మీరు పెట్టిన కొలబద్ద తో చూస్తే చదవుతున్న ” సాహిత్యం ”
  హిత కరమైనదా?
  సత్యత్వానికి తీసుకు వెళ్తుందా?
  ఇది ఆనంద దాయినియా?
  అని ప్రశ్ని౦చుకుని – పుస్తకం తీస్తే ప్రపంచం లో 90 % చూడాల్సిన పని లేదు అనిపిస్తుంది.

  ఇది నా అభిప్రాయం మటుకే.

  any Way మీరు చాలా చక్కని పోస్ట్ ను ఎప్పటి మాదిరి అందించారు
  మిగితా భాగాల కోసం ఎదురు చూస్తున్నాను

  – సాయిరాం !!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.