ఊసుల్లో ఉయ్యూరు —31 కొలచ (త )ల శ్రీ రామ మూర్తి మామయ్య

 ఊసుల్లో ఉయ్యూరు —31

                                                      కొలచ (త )ల శ్రీ రామ మూర్తి మామయ్య

      ఆయన భూమికి అయిదే అడుగుల ఎత్తుంటాడుటాడు .పిలక ,గోచీ పోసి నలగని శుభ్రమైన తెల్ల గ్లాస్కో  పంచె పైన తెల్ల చేతుల నేత బనీను ,గుండు ,పిలకా ,యెర్రని కళ్ళు ,ఎప్పుడూ ఉండే సూక్ష్మ పరిశీలనా ద్రుష్టి , వేగం గా మాట్లాడే స్వభావం ,ఆత్మీయత ,ఆదరణ ,కొంచెం గడుసు కొంచెం పొగరు ,మాట కరుకు ,ఆలోచన అపర చాణక్యం అన్నీ కలిస్తే మా శ్రీరామ మూర్తి మామయ్య .ఇంటి పేరు కొలచల .అయితే అన్నీ లెక్కలే ఆయనకు .కొలతల్లో దిట్ట .అందుకని ‘’కొలతల మామయ్యా’’ అంటాన్నేను .మా బంధు గణానికినికి ఆయన ‘’ఇంజనీరు గారు ‘’.ఆయనేమీ పాలిటెక్నిక్ లో సివిల్ ఇంజినీరింగ్ చదవ లేదు .కాని ఆయన కలప కొలత వేసినా ,ఇల్లు నిర్మాణానికి  కోల తలు చెప్పినా నూటికి నూరు పాళ్ళు ఖచ్చితమే .ఇంజినీర్లు కూడా అంత ఖచ్చితం గా చెప్పలేరు అనే వారు అందరు .మా అందరికి యే పని వచ్చినా వెంట ఉండి   నిర్మాణం చేసే వాడు .మనకు దిగులుండేది కాదు .ఎంత డబ్బు అవుతుందో ,ఎంత కలప కావాలో ,ఎన్ని ఇటుకలు పడ తాయో ,ఎంత సిమెంటు ,ఇసకా అవసరమో ,కూలి ఎంతవుతుందో అంతా ముందే ఖచ్చితం గా చెప్పి పనిలోకి దిగమంటాడు .అందుకని ఆయన అంటే మా కుటుంబాలలో మహా క్రేజు .

                    కాలేజి కి వెళ్ళే దారిలో కుడి వైపు అప్పుడు ఆఖరి ఇల్లు శ్రీ రామ మూర్తి మమయ్యదే  .వాకిట్లోకి నీళ్ళు పోవటానికి డ్రైనేజి కాలువ మొదటే కట్టించు కొన్నాడు .ఇంట్లో కావాల్సిన అన్ని ఆధునిక సామాను అంటే రేడియో కుర్చీ లు అన్నీ చక్కగా అమర్చుకొన్నాడు .ఇల్లు ఎప్పుడు అతి పరిశుభ్రం గా ఉండేది .శుభ్రత అంటే ,శుచి అంటే ఆయన ఇంట్లోనే .ఇంకెక్కడా అది కని పించేది కాదు .మడి బట్టలకు దండాలు ,గొడ్ల పాక ,పాలేరు ,ధాన్యం పోసు కోవటానికి కొట్టు ,అన్ని వసతులతో వంట గది ,వాకిట్లో విశాల మైన అరుగు .బయట రోడ్డు మీద కూర్చొనే చిన్న అరుగు ఇలా అన్నీ పకడ్బందీ గా ఉన్న ఇల్లు ఆయనది .పడక గది  లో’’ చిలకల పందిరి’ మంచం ‘’,మెత్తని పరుపు ,దిండ్లు ,నలగనితెల్లని పక్క దుప్పట్లు .ఇల్లంతా గచ్చు ,నల్లని నాప రాళ్ళు .భోజనాల గది  ..అంతా ఒక ప్రత్యెక తరహాయే మామయ్యది .అందరికి ఆయన ఇల్లు ,ఒళ్ళు ,పని తీరు ఆదర్శం .ఆయన పడక గదిలో ఆకాలం లో ప్రసిద్ధి చెందినా’’ నేషనల్  ఎకో’’పెద్ద  రేడియో .కర్నాటక సంగీతం అంటే మహా మోజు .రేడియో లో ఎప్పుడు మద్రాస నుంచి వచ్చే కచేరీలు వింటుండే వాడు .

           శ్రీ రామ మూర్తి గారి తండ్రి అంతర్వేది గారు .వేదం బాగా చదువు కొన్న వాడు .నిత్య వ్యవహారాల్లో ఆరి తేరిన వాడు .చాలా సరదాగా మాట్లాడే వాడు .రాజమండ్రి నుంచి పడవల్లో కలప తెప్పించి వ్యాపారం చేసే వాడట కూర గాయాల వ్యాపారము చేశాడని అంటారు . .వ్యవహార దక్షుడిగా పేరు .అందరికి తలలో నాలుక గా వ్యవ హరించే వాడు .నాకు ఆయన బానే గుర్తు .మేము హిందూ పురం నుంచి వచ్చిన కొత్త .ఆయన ఒక సారి మా ఇంటికి వచ్చాడు .నా పేరు ఏమిటి అని అడిగాడు .నేను తల బిరుసుగా ‘’పెసర కాయ ‘’అన్నాను .’’ఆరి భడవా ఖానా  అంత పొగరా ?నేను ఇక నిన్ను ‘’పెసర కాయి ‘’అనే పిలుస్తాను ‘’అని నవ్వుతు అన్నాడు .కాని చాలా ఆప్యాయం గా అలకరించే వాడు .ఆయన మరణం నాకు గుర్తుంది .ఆ పన్నెండు రోజులు మా అందరికి అక్కడే భోజ నాలు .మమ్మల్ని చాలా దగ్గర బంధువులు గా చూసే వారు .మా నాన్న గారంటే విప రీత మైన గౌరవం .మామయ్య నాన్నగారిని ‘’బావ గారూ ‘’అని అమ్మను ‘’భవానక్కాయ్ ‘’అని పిలిచే వాడు .నన్ను దుర్గా పతీ అనే వాడు .ఆయన భార్య పేరు రావమ్మ .మేము అత్తయ్యా అని పిలిచే వాళ్ళం .వాళ్ల పెద్దమ్మాయి సుబ్బమ్మ సూరి బుచ్చి రామయ్య గారి పెద్ద కోడలు .ఆమె మాకు అయిదవ క్లాస్ లో సహాధ్యాయి .ఆమె భర్త మా  స్నేహితుడు నరసింహానికి  పెద్ద అన్న .రెండో కూతురు కామేశ్వరి మా కజిన్ అయిన సూరి రాదా కృష్ణ మూర్తి భార్య .మూడో అమ్మాయి భర్త ప్రభుత్వ ఉద్యోగి .కొడుకు దీక్షితులు మాకు జూనియర్ .

           శ్రీ రామ మూర్తిగా రికి పెద్ద వంతెన దగ్గర  ఎడమ వైపు సైడు కాలవ ను ఆనుకొని చాలా స్థలం ఉంది .అందులో కలప అడితి ఉండేది .సత్యం గారి అడి తీ అని పేరు .మామయ్య ఆయనకు అద్దె కిచ్చాడు దాన్ని .అందులో ఆయన పెద్దల్లుడు గుమాస్తా గా ఉండే వాడు రామ కకృష్ణ శాస్త్రి  అతని పేరు .సత్యం గారి కుటుంబం నరసింహం  కుటుంబం , ,శ్రీ రామ మూర్తి గారి కుటుంబం చాలా సఖ్యత గా  ఉంటారు .అక్కడ కులాలేమీ అడ్డు రాలేదు .సత్యం గారు కమ్మ వారు .ఆయనకు ఇంకో భాగా స్వామి కూడా ఉండే వారు .మంచి కలప దొరికేది .రెట్లు కొంచెం ఎక్కువే .అప్పుడు కలప కొత్త మిషన్లు లేవు .రంపపు కోతే .మాకు కలప కావాలంటే అక్కడే కొనే వాళ్ళం .

   శ్రీ రామ మూర్తి గారి పెద్దమ్మాయి పెళ్లి అయిదు రోజులు చేసి ఊరంతా భోజనాలు పెట్టాడు మామయ్య .దీక్షితులు ఒడుగు నాలుగు రోజులు చేసి అందరినీ పిలిచాడు .అట్లాగే రెండో అమ్మాయి మూడో అమ్మాయి పెళ్ళిళ్ళు అన్నీ విధి విధానం గా చేశాడు .ఆత్మీయత రంగ రించే వాడు .మేము వాళ్ళింట్లో వి.ఐ.పి .లమే .మాకు అంత గౌరవం . ఆ రోజుల్లో ఇళ్లకు వచ్చి బొట్టు పెట్టి భోజనాలకు పిలిచే వారు .భోజనం రెడీ అవగానే ప్రతి ఇంటికి వెళ్లి రమ్మని కబురు చేసే వారు .రెండు పూటలా భోజనాలే .టిఫిన్లు కూడా అక్కడే .మామయ్య అన్నీ ప్రత్యేకం గా దగ్గరుండి  చూసుకొనే వాడు .ఆయనకు  తోడు మా మేన మామ గంగయ్య గారు .ఇద్దరు స్వంత అన్నదమ్ముల్లా మెలిగారు చివరి దాకా .అన్నయ్య మాట తమ్ముడికి వేదం .తమ్ముడి సూచన అన్నకు శిరో దార్యం ‘’గంగన్నయ్యా ‘’అని ఆప్యాయం గా పిలిచే వాడు .మా మామయ్యా మాత్రం శ్రీ రామ్మూర్తీ అనే వాడు .ఏరా  అని చనువుగా పిలుచుకొనే వారు .కుటుంబాలు అంత సన్నిహితం గా ఉండేవి

       రాదా కృష్ణ మూర్తి మాబుల్లి మామ్మ మనవడు .వాడికి శ్రీ రామ మూర్తి మామయ్య రెండో కూతురు కామేశ్వరి తో  వివాహం అయింది .కారణాలు తెలీదు కాని చాలా కాలం వారిద్దరికి కార్యం జరగ లేదు .మామయ్యా టెన్షన్ పడి పోతున్నాడు .ఎవరు చెప్పినా మా వాడు వినటం లేదు .ససేమిరా అంటున్నాడు .మామ్మ కూడా బాధ పడుతోంది .వాళ్ల ఇంట్లో బెజవాడ లో నేను ఇంటర్ చదివాను .చిన్నప్పటి నుంచి వాడికి నాకు చాలా స్నేహం బందుత్వాన్ని మించిన స్నేహం అది .నేను వాణ్ని అన్నయ్యా అని పిలిచే వాణ్ని కాదు ‘’గురూ ‘’అనే వాడిని .వాడు నన్ను పేరు పెట్టి పిలిచే వాడు . గురువు గారి సమస్య శిష్యుడే తీర్చాలి అనే వాళ్ళు అందరు .వాడి సమస్య నాకు వదిలి పెట్టారందరూ అమ్మా నాన్న తో  సహా .ఒక సారి ఏదో శుభ సందర్భం లో మా బంధు గణం ,రాధుడు మామ్మ అందరు మా ఇంటికి వచ్చారు .నేను ఇంటర్ పూర్తీ చ్చేశాను .అప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ వేశాను .అందర్ని ఎకామ్బరేశ్వారా పిక్చర్ పాలస్ కు సినిమా కు తీసుకొని వెళ్ళాము .అమ్మా నాన్న ,చిన్నక్క బావ ,రాదా ,కామేశ్వరి నేను మా తమ్ముడు మోహన్ .నేను ముందే జాగ్రత్త పడి  వారిద్దరికి పక్క పక్క సీట్లు ఎర్పాట యేట్లు చేశా .మేము కొంచెం దూరం గా కూర్చున్నాం .వారిద్దరూ ఏమి మాట్లాడు కున్నారో తెలీదు .కాని ఇంటర్వల్ లో ఇద్దరు కలిసి సోడా తాగారు బయటకు వెళ్లి …అమ్మయ్య అనుకొన్నాం .దీన్ని సాధించి నందుకు నన్ను అందరు అభినందించారు .మర్నాడు మళ్ళీ రికార్డు పెట్టాను .ముందు ససేమిరా అన్నాడు .గట్టిగా వాయిస్తే కార్యానికి ఒప్పు కొన్నాడు .మా ఓదిన కామేశ్వరి ఏమి మంత్రం వేసిందో భలే గా పారింది .మా అందరి గుండెల మీది బరువు తీరి నట్లయింది .అప్పటి దాకా వాడు ఉయ్యుర్లో మామగారింటికి వెళ్లి రెండేళ్లు అయింది .కార్యం మా ఇంట్లోనే జరగాలని షరతు పెట్టాడు మా వాడు .’’థాట్ కాదన్నాడు ‘’మావ .చివరికి అందర్ని సమాధాన పరచి మా ఇంట్లోనే ఏర్పాటు చేశాం .ఆ తర్వాతా మామ ఇంటిని వదల్లేదు వాడు .మామ అల్లం పెళ్ళాం తా రు డబ్బా అన్న వాడు మామ బెల్లం పెళ్ళాం తరగని గనియింది మామ్మ  ను క్రమంగా దూరం చేసుకొన్నాడు ఆ తర్వాతా ఎప్పుడో .ఇంత పని నా వల్లే సాధ్యం అయిందని శ్రీ రామ మూర్తి మామయ్యా ఏంతో  మెచ్చాడు నన్ను .మా ఇంటిల్లి పాదికి బట్టలు పెట్టాడు .అప్పటి నుంచి నేను వాళ్ల దృష్టిలో వి.ఐ.పి.అయాను .

                 ఇంజినీర్ మామయ్య బయటి ఊరికి వెళ్తే తెల్లని లాల్చీ వేసుకొని వెళ్ళే వాడు .ఊళ్ళో ఉంటె ,ఏదైనా పని సూపర్వైజ్ చేయాల్సి వస్తే పంచె ,పైన యెర్రని  కాశీ తువ్వాల  తో వచ్చే వాడు .నల్లని కిర్రు చెప్పులు ఆయన ప్రత్యేకత .బాగుండేవి ముచ్చటగా .ఉదయం పని ప్రారంభం అవటానికి ముందు వచ్చి సూచనలు చేసే వాడు మధ్యలో పదకొండింటికి ఒక సారి వచ్చి చూసే వాడు .మధ్యాహ్నం మూడింటికి వచ్చి దాదాపు ఆరోజు పని ఆయె వరకు ఉండి మర్నాడు ఏమేమి కావాలో చెప్పి ,తెప్పించే ఏర్పాటు చేసే వాడు .యే కట్టుడికి ఎన్ని పాళ్ళు సిమెంట్ వేయాలో ఎంత ఇసక వేయాలో చెప్పే వాడు .అది సరిగ్గా కలపక పోతే తిట్టే వాడు తాపీ మేస్త్రీని .సీతా రామయ్య అనే తాపీ మేస్త్రి పెద్ద వంతెన దగ్గర ఉండే వాడు .అతనే మా దొడ్డి గోడలు గోడల పాక  నీటి తొట్టె గిలక బావి కత్తాడు .ఆ తర్వాతా భిక్షాలు .వడ్రంగి ఫరీదు సాహేబు .భలే పని వాడు .నల్లగా బారుగా ఉండే వాడు .చక్కని నగిషీ పని .మా గదిలో చువ్వల దర్వాజా ,వంటిట్లో మడి అలమార్లు సామాను అలమార్లు అతనే చేశాడు .మామయకు తురకం బాగా వచ్చు .వాళ్ళతో బాగా మాట్లాడే వాడు ..మా గొడ్ల  దొడ్లో సిమెంటు రాయిని  ని యాకమూరు రామయ్య అనే ఆయనతో దగ్గరుండి తీయించాడు .చాలా పెద్ద అచ్చు .దాదాపు అరవై ఏళ్లు దాటినా చెక్కు చెదర కుండా ఇంకా అవి ద్రుధాం గా ఉన్నాయి .కలప నాణ్యత ఆయనకు బాగా తెలుసు .రంపపు కొత్త మిల్లులు వచ్చింతర్వాత అవసరమైతే మా వెంట ఉండి  కొత్త కోయించే వాడు .ముక్క వృధా కాకుండా చాలా జాగ్రత్త పడే వాడు .రిక్షా మీద వెళ్లి వచ్చే వాడు .పని అంటే దైవం అని ఆయన భావన .

     మా మేన మామ గంగయ్య గారికి గానుగ సున్నం తారస రాయి టేకు బద్దీల తో  ఆయనే డాబా కట్టించించాడు దగ్గరుండి .నన్ను చాలా సార్లు ‘’ఒరే  పది వేలు చేత్తో పట్టు కోరా .నేను నీకూ డాబా వేయించి పేద తాను ‘’అనే వాడు .అంత డబ్బు అప్పుడు మా దగ్గర ఉండేది కాదు .కాని ఆ అభిమానానికి జోహార్లు .

    హిందీ టి వి.సీరియల్ ‘’చాణక్య ‘’అందరు చూసే ఉంటారు .అద్భుతం గాఉండేది . .అందులో చాణక్య పాత్రధారి దర్శకుడు ద్వివేది అనుకుంటా .అచ్చం గా మా శ్రీ రామ మూర్తి మామయ్యా అదే వేషం  ,అదే పోజు టో ఉండే వాడు .ఈన్ని చూస్తె ఆయన్ను చూడక్కర లేదు .మామయ్యా చిక్కని ఫిల్టర్ కాఫీ నే తాగే వాడు .మా ఇంట్లోను ఫిల్టర్ కాఫీ యే .ఆయన వస్తే కాఫీ ఇవ్వటం మామూలు .గ్లాసులు ఏంతో  పరిశుభ్రం గా ఉండాలి .మనుష్యుల్ని పూసు కోవటం ,రాసుకోవటం ఆయనకు ఇష్టం లేదు .క్రమశిక్షణ కు పెద్ద పీట వేసే వాడు .ఆ చూపు నుండి తప్పించు కోవటం ఎవరి వల్లా కాదు .అదో ప్రత్యెక శైలి .మా కుటుంబాలే కాదు .ఆయన సలహా సంప్రదింపులు పొందని కుటుంబం ఆ నాడు మా ఉయ్యుర్లో లేనే లేదని చెప్ప వచ్చు .ప్రతి ఫలాపేక్ష లేకుండా అలా చేయటం ఎందరికి సాధ్యం ?అది ఆయనకే సాధ్యమయింది .ఆలోచనలో ,వ్యూహ రచనలో అపర చణ క్యుదని అని పించుకొన్నాడు .మేము కూడా  చాటున ‘’చాణక్యుడు ‘’అనే వాళ్ళం .నవ్వు కంటే సీరియస్ గా ఉండటం ఆయన తరహా .నవ్వాడు అంటే ఏదో ఉంది అనే భావం .

         మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకు ,ఒడుగులకు ఆయన దగ్గరుండి అన్నీ పర్య వేక్షించి జరిపించే వాడు .మా నాన్న గారు చని పోయినపుడు మా కుటుంబానికి ఎంతో అడ దండ గా ఉన్నాడు .మా అమ్మ చని పోయి నపుడు అంతా తానే అయి జరి పించాడు .ఆయన మా దగ్గర ఉంటె వెనక్కి తిరిగి చూసు కొ నక్కర లేదనే దిలాసా మాకు కల్పించాడు ఆయన .మా మేన మామ తర్వాతా ఆయనే మాకు అతి దగ్గర చుట్టం అని పించుకొన్నాడు .ఆయన మూడు కాలాల్లో సంధ్యా వందనం చేసే వాడు .వేదం బాగా చదివు కొన్నాడు .పెళ్ళిళ్ళలో పురుహోతిడుడు ఎక్కడైనా పోరపడితే చక్క దిద్దే వాడు .ఆయన ఇంటికి అతిధులు ఎక్కువ గా వచ్చే వారు .కమ్మని భోజనం పెట్టి తగిన సత్కారం చేసే వాడు .మడి వంట .వేదం చదువు కొన్న వారిని పరీక్షించే చక చక్యం ఉన్నవాడు .మా మేన మామ నిర్వహించే వేద సభలకు హాజరై దగ్గరుండి ఏర్పాట్లు చూసే వాడు .

         ఒక రకం గా మా కుటుంబాలకు సారధి మంత్రి ,సచివుడు ,స్నేహితుడు ,నీతి కోవిదుడు ,అపర చాణక్యుడు ,ఇంజినీరు  మా కొలతల సారీ కొలచల శ్రీ రామ మూర్తి మామయ్య .ఇన్నాళ్ళకు ఆయన్ను తలచుకోవటం నా అదృష్టం గా భావిస్తున్నాను .

  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —31-5-12—కాంప్ —అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

4 Responses to ఊసుల్లో ఉయ్యూరు —31 కొలచ (త )ల శ్రీ రామ మూర్తి మామయ్య

 1. muthevi ravindranath అంటున్నారు:

  మీరు రాసినదాన్నిబట్టి చూస్తుంటే కొలచల శ్రీరామమూర్తి గారిది అతి అరుదైన, విశిష్టమైన
  వ్యక్తిత్వం అనిపిస్తున్నది.ఆ రోజుల్లోనే ఏమిటి? నా బాల్యంలోనూ సౌందర్యారాధకులు దర్జాగా
  గ్లాస్గో (Glasgow) పంచె,లాల్చీల్లో విలాసవంతంగా ఉండేవారు.బ్రిటన్ లోని గ్లాస్గో నగరం
  నాణ్యమైన, పలుచని వస్త్రాల ఉత్పత్తికి ప్రసిద్ధి.మాంచెస్టర్, లివర్ పూల్ నగరాలు కూడా వస్త్ర
  పరిశ్రమలకు పేరు మోసినవే అయినా అతి నాజూకైన గ్లాస్గో వస్త్రాలకు మరేవీ సాటి రావు.ఆ
  వస్త్రాలు ధరించి, ఒంటినీ, ఇంటినీ కూడా అంత నీటుగా చూసుకునే ఆయన బంధుమిత్రులకు
  గృహ నిర్మాణంలో సలహాలూ, సూచనలూ ఇవ్వడమే కాక దగ్గరుండి నిర్మాణ పర్యవేక్షణ కూడా
  చేయడం విశేషం. కలప కోత మిల్లులలో వచ్చే దూగర కంపరం కలిగిస్తుంది.నీటుగాళ్ళు
  ఎవరూ సాధారణంగా కలప కోత మిల్లుల చాయలకు కూడా పోరు. అలాంటిది ఆయన దగ్గరుండి
  మరీ కలపకోతను పర్యవేక్షించడం అరుదైన విషయం.’పరోపకారార్థమిదం శరీరం’ అన్న సూక్తిని
  అక్షరాలా పాటించిన’కొలతల’ మామయ్య రుణాన్ని ‘పెసరకాయ’ తీర్చుకున్న తీరు బాగుంది.
  సాయం చిన్నదే అయినా, జీవితాలను కలపడానికి చేసిన సాయమది; ‘కొలత’ వేయలేనిది !!!
  అన్నట్లు కొలచల సీతారామయ్యగారు (మాస్కోలో పనిచేసిన రష్యన్ భాషా
  అనువాదకులని గుర్తు) మీ అంతర్వేది తాతగారికి ఏమైనా బంధువులా ?
  — ముత్తేవి రవీంద్రనాథ్, డేటన్, న్యూజెర్సీ, యు.యస్.ఏ.నుంచి.

 2. ఏల్చూరి మురళీధరరావు అంటున్నారు:

  శ్రీ దుర్గాప్రసాద్ గారికి
  నమస్కారం!

  శ్రీ కాళిదాస హృదయావిష్కరణకు జీవాతువైన వ్యాఖ్యాతృసార్వభౌముడు శ్రీ కొలచల మల్లినాథసూరి గారి కుటుంబం ఇలా తామరతంపరగా వృద్ధిపొందుతున్నదని తెలిసి ఎంతో సంతోషమయింది.

  ప్రముఖకవి, నాటకకర్త, రామాంజనేయ యుద్ధం నాటకరచన ద్వారా సినీప్రేక్షకుల అభిమానానికి సైతం నోచుకొన్న అభిరూపతల్లజులు శ్రీ గబ్బిట వెంకటరావు గారు మీకేమవుతారో!

  మీ బ్లాగు చాలా బాగున్నది!

  సర్వ శుభాకాంక్షలతో,
  ఏల్చూరి మురళీధరరావు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.