సిద్ధ యోగి పుంగవులు –1

 సిద్ధ యోగి పుంగవులు –1

                                                                  ఖండ యోగి – మస్తాన్ వలి

‘’సిద్ధ యోగి పుంగవులు ‘’అనే శీర్షిక ను ప్రారంభిస్తున్నాను .ఇందులో ఎందరో మహాను భావులున్నారు .వారిని గురించి సంక్షిప్తం గా తెలియ జేయట మే నా ఉద్దేశ్యం .ముందుగా మస్తాన్ వలీ గారిని గురించి తెలియ జేస్తాను . దీనికి ఆధారం స్వర్గీయ ఆచార్య బిరుద రాజు రామ రాజు గారి ”ఆంద్ర యోగులు ”

      మస్తాన్ అంటే ఎప్పుడు దైవ చింతన లో ఉండే వాడు .ఒక రకం గా దైవ మత్తుడు .అలాంటి వారిలో నల్ల మస్తాన్ అనే గుంటూరు జిల్లాకు చెందిన ఈయన ప్రసిద్ధుడు .ఆయన ఒక చోట ఎప్పుడు స్తిరం గా ఉండే వాడు కాదు .గుంటూరు జిల్లా లో సంగడి గుంత లో ఒకరు చిన్న పాక కట్టించి ఆయనకు ఇచ్చారు .ఆయన నడుము వాల్చి ఎన్నడూ పడుకొని ఉండటం ఎవరు చూడలేదు .అనుక్షణ సంచారి .ఒక సారి ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది .ఆయన దగ్గర ఎప్పుడు ఉండే మేక దూరం గా ఉంది .ఆయన ఒక చిన్న మునగ చెట్టు కింద ఉన్నాడు .ఆయన కూర్చున్న చోట తప్ప వర్షానికి తడవని ప్రదేశం లేదట .ఆయన మేక చచ్చి పడింది .దాని దగ్గరకు వెళ్లి భగవంతున్ని ధ్యానించి ‘’లే’’అన్నాడు .అంతే లేచి కూర్చున్నది .ఈ మహిమ అందరికి పాకింది .వేరొక సారి ఆయన దగ్గరుండే కోడి ని ఒకామె ఎత్తుకు పోయి చంపి కూర వండుకుని తిన బోతోంది .దివ్య ద్రుష్టి తో ఆయన చూసి వాళ్ల  ఇంటికి వెళ్లి మాంసపు ముద్దా గా ఉన్న ఆ కోడిని ‘’బోబో’’అని పిలిచాడు .అది కోడి రూపం దాలిస్తే ఆయన ఒళ్ళోకి తీసుకొని నిమిరారు .ఆమె కాళ్ళా వెళ్ళా పడి బతిమి లాడింది కనికరించి  శిష్యురాలిని చేసుకొన్నాడు .

                      వలీ గారు’’ ఖండ యోగ సిద్ధి’’ తెలిసిన వారు .అంటే ముక్కలు ముక్కలుగా ఉన్న శరీర భాగాల్ని సిద్ధి తో  మళ్ళీ యదా రూపం లోకి తేవటం .ఈ విద్య షిర్డీ సాయిబాబాకు ,ఈయనకు ,వాడరేవు లలితానంద సరస్వతి ,మౌన స్వామి ,చీరాల ,కడప అవదూతలకు మాత్రమే ఉండేదట .ఒక సారి ఆయన యోగనిద్రలో ఉన్నారు .గ్రామ సమీపం లో ఒక పొలం లో ఆయన తల ,మొండెం కాళ్ళు ,చేతులు చిన్నా భిన్నమై పడి  ఉండటం రైతు గమనించి గ్రామం లో అందరికి ఏడుస్తూ చెప్పాడు .వాళ్ళంతా అక్కడికి  చేరే సరికి వలీ గారు పూర్తీ రూపం పొంది చిదానందం గా ఉన్నారు .ఇంకోసారి ఒక వ్యాపారి కొట్టు ముందు కూర్చుని ఉన్నాడు వాలీ .కొట్టు వాడికి విసుగెత్తి ఎన్ని సార్లు పొమ్మన్నా పోలేదు .వాడు కోపం తో  ఊగి పోతూ కర్ర పెట్టి ఆయన్ను బాది పారేశాడు .ఆయన శరీరం ముక్కలు ముక్కలై చెల్లా చెదరు గా పడి పోయింది . వ్యాపారే చంపాడని పోలేసులకు చెబితే అతన్ని అరెస్ట్ చేశారు .వలీ గారి శరీర భాగాలను అన్నీ కలిపి ఆకృతి తెచ్చి స్మశానానికి తీసుకు పోతుంటే ఆయన లేచి కూర్చుని అందర్ని ఆశ్చర్యం లో ముంచేశాడు .వ్యాపారి తప్పేమీ లేదని ఓదిలించాడు .

       వాలీ గారికి సర్వజ్ఞత ఉంది .గుంటూరు లో ఆయన ఉన్నప్పుడు పాప రాజు అనే జ్ఞాన యోగి శిష్యుడు ఉన్నావ నందయ్య గురువు ఆజ్న పై ఈయన ఉండే చోటుకు వచ్చాడు .ఆయన ధ్యానం లో ఉన్నాడు ఒక పేద వాడు వలీ గారు ఏదైనా డబ్బు ఇస్తాడేమో నని అక్కడికి వచ్చాడు .నందయ్యను చూసి అతని జేబులో ఉన్న పావలాను బిచ్చ గాడికిమ్మన్నాడు .నందయ్య నోరు తెరిచాడు అంతే ఉంది అతని జేబులో ..అతన్ని పాప రాజు పంపాడు కదా అని అడిగాడు .అవునన్నాడు .అప్పుడు పాప రాజు గొప్ప తనాన్ని వలీ గారు చెప్పారు .పాప రాజు గారింట్లో తండ్రి తద్దినం రోజున భోక్తలు తినక ముందే తనకు అన్న పెట్టి నసంస్కారి అన్నారు .గుంటూరు వాడొకడు కాశీ వెళ్లి గంగా స్నానం విశ్వనాధ సందర్శనం చేసి ఒక పెద్ద మసీదు దగ్గరకు వచ్చాడు అక్కడ ఉన్న ముసలాయన అతనిది గుంటూరు కదా అని అడిగి ఆశ్చర్య పరచాడు .గుంటూరు లోని తన మిత్రుడు వలీ బాగున్నాడా అని అడిగాడు .వలీ ని చూసి రెండు వందల  ఏళ్లు అయిన్దనిచేప్పాడు .ఇంటికి తిరిగి వచ్చి వలీ గారికి ఈ విషయం చెప్పాడు ఆ యాత్రికుడు .కాశీలో తన మిత్రుడు కన్పించాడా అని అడిగారు వలీ .అని అతడు చూశాను అన్నాడు అతన్ని చూసి రెండు వందల ఏళ్లు అయిందన్నారు వలీ .వారిద్దరి సర్వజ్ఞాత్వానికి యాత్రికుడు ఆశ్చర్య పోయి కాళ్ళ మీద పడ్డాడు .

      వలీ గారు నిగ్రహం ,అనుగ్రహం కల వారు .ఒక ముస్లిం యువకుడు ఈయన పోకడ ను పిచ్చి గా భావించి పిచ్చోడు పిచ్చోడు అంటూ గేలి చేసే వాడు .ఈయన నవ్వు కొనే వాడు .కొంత కాలానికి ఆకుర్రాడే పిచ్చి వాడయి పోయాడు .తలిదండ్రులు వాడిని తీసుకొచ్చి ఈయన కాళ్ళ మీద పడేశారు .దయ టో అతని తల నిమిరారు .అంతే .మామూలు మనిషి అయాడు వాడు .ఒక సారి బెజవాడ లో కొందరు ముస్లిం పెద్దలు మాట్లాడు కొంటుఉండగా  వలీ గారు అక్కడికి వచ్చి తన చేతి లో ఉన్న బుట్ట ను అక్కడ పెట్టి తాను మక్కా వెళ్లి తిరిగి వచ్చేదాకా దాన్ని చుస్తున్దమని చెప్పి వెళ్లి పోయారు .వారు పిచ్చేమో అను కొన్నారు .రెండు గంటల తర్వాతా వచ్చి మక్కా విశేషా  లన్ని చెప్పి తన దారి పట్టారు .ఇదంతా గాస్ అను కొని .అక్కడ మక్కా లో ఉన్న తమ వారికి తంతి పంపారు .వారు యాత్ర బానే జరిగిందని వాలీ గారు కూడా వచ్చివేళ్ళారని చెప్పారట .అప్పుడు ఆయన మహమ్మద్ ప్రవక్త అవతారం అని అందరు గ్రహించారట .

       వినుకొండ మహిళా ఒకామె సంతానం కోసం వలీ గారిని ప్రార్ధించింది మగ బిడ్డ పుడతాడని చెప్పి పంపాడు .మగ బిడ్డను కని రెండు నెలల తర్వాతా వలీ గారి ఆశీర్వాదం కోసం బయల్దేరింది వినుకొండ రైలు  స్టేషన్ లోనే వలీ గారి దర్శనం అయింది .ఆమె కృతజ్ఞతలు చెప్పు కొంది .వాలీ గారు ఆమెను గుంటూరు వెళ్ళమని అక్కడ పెద్ద ఉత్సవం జరుగు తోందని చెప్పి పంపారు .గుంటూరు చేరే సరికే ఆ ఉదయమే మస్తాన్ వలీ గారు చని పోయిన  వార్త విన్నది .రెండు గంటలక్రితం తాను సజీవ మస్తాన్ వలీ ని చూసింది .అప్పుడు అర్ధమయింది ఆమెకు చని పోయిన తర్వాతా కూడా  భక్తులకు ఇతర చోట్ల  దర్శనం ఇస్తున్నారని .ఆయన తాను చని పోయే రోజు ను ముందుగా నే ప్రకటించి తన శిష్యుడు మదారు సాహెబ్ కాళ్ళు పిసుకు తుండగా అనుకున్న సమయానికి దేహ యాత్ర చాలించారు .వేలాది జనం చేరారు .ఆయణ తన ఖననాన్ని పిచ్చయ్య గారిచ్చిన స్థలం లో  చేసే ఏర్పాటు కూడా చేసుకొన్నారు .ఆరోగ్య అధికారి నగరం లో సమాధి చేయ టానికి ఒప్పు కోలేదు .సాయంత్రం అవుతోంది .అంత్యక్రియలు చూసి ఇళ్లకు వెళ్లాలని అందరి ఆత్రం ..ఇంతలో ఆ అది కారికి తీవ్ర మైన కడుపు నొప్పి వచ్చి గిల గిల తనను కొంటున్నాడు .జ్ఞానోదయమైంది .వెంటనే ఒప్పు కొన్నాడు .కడుపు నొప్పి తగ్గింది .ఆయన సమాధి హిందూ ముస్లిం లందరికి పవిత్ర దర్గా యే .

          ఆయన ప్రాచుర్యం ఎంత గొప్ప ది అంటే గుంటూరు జిల్లాలో హిందువులు తమ పిల్లలకు మస్తానయ్య ,మస్తానమ్మ అని పేరు పెట్టు కొంటారు .వాలీ గారు సుమారు 1685 ప్రాంతం లో జన్మించి నట్లు భావిస్తారు .మరణం మాత్రం 23-5-1895 అంటే సుమారు రెండు వందల పది సంవత్స రాలు జీవించారని భావన .ఆయన్ను గుంటూరు లో మొదట చూసిన వారందరికి ఎనభై ఏళ్ళ వాడు గా నే కన్పించటం విశేషం .అలాగే చివరి దాకా ఉన్నారు ..ఎన్నో ఏళ్లు తపస్సు చేసి సిద్ధులు పొంది అప్పుడు గుంటూరు వచ్చారన్న మాట .

 ఇంకో యోగి గురించి ఇంకో సారి తెలియ జేస్తాను .

             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –1-6-12—కాంప్—అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

3 Responses to సిద్ధ యోగి పుంగవులు –1

 1. ఎందుకో ‽ ఏమో అంటున్నారు:

  సర్, ఆ title చూడగానే లోనుండీ ఆనందం అలా పొంగి పొర్లుతూ వచ్చి ఈ comment వ్రాస్తున్నాను మీకు శత కోటి నమస్కారములు
  అడగకుండానే ఆకలితెలిసికొని అన్నం పెడుతున్నట్లు ఉంది కడుపునిండా

 2. ఎందుకో ‽ ఏమో అంటున్నారు:

  ఒక రోజు మా సత్సంగం లో బోధకులు ఇలా చెప్పసాగారు, బోధలో భాగంగా !!

  ” ఎందుకు కొందరు అవతార పురుషులు మహిమలను ప్రదర్శిస్తూ ఉంటారు?”

  అనే ప్రశ్నకు బదులుగా! ఇలా

  అవతార పురుషులు కరుణా మయులు దివ్యాత్ములు సాక్షాత్ ఈశ్వర ప్రతిరూపాలు
  మానవ రూపు దాల్చిన దైవ స్వరూపాలు

  అవతార పురుషులను అందరూ చూడలేరు, అవకాశం లేక కొందరైతే, కలి ప్రభావం వలన మరి కొందరు,
  విశ్వాస బలం లేక కొందరు, సంస్కార బలం సరిపోక మిగిలిన వారు, ఇలా అవతారుని చూడలేని వారు ఇందరైతే,

  కాని వీరందరిలో కూడా ఎంతో మంది

  ఎన్నో తామసిక మైన ప్రవృత్తులను కలిగి ఉండి, ఏదో జన్మలోని పుణ్య ప్రశస్తి చేత ఇలా ఈ జన్మలో

  ఏదో నాం కే వాస్తే చూద్దాము ఏ పుట్టలో ఏ పాము ఉందనుకుని వచ్చే వారు వేల సంఖ్యలలో ఉంటారు

  మరి అంతటి తామసిక మైన జీవన విధానం, ఆచరణ, సంప్రదాయాల్లో కొట్టు మిట్టాడు తున్న వారికి
  పరిణితి ని సద్గతిని కలిగించాలంటే

  ఇటువంటి మహిమలను ప్రదర్శించక తప్పదు.

  ఈ మహిమల ప్రదర్శన అంతా కూడా తమోగుణ అంశ కలవారికి

  అంతకు మించిన పైస్తితిని అందించే కార్యక్రమం లో భాగంగా ఇలాంటివి చేస్తుండటం జరుగు తుంది అని

  సవివరంగా హేతు బద్ధంగా తెలుసుకోవటం జరిగింది.

  *నోటి లోనుండీ శివలింగాలు తీయుట, అగ్నిస్తంభన విద్య ప్రదర్శించుట, విభూది సృష్టించుట వంటివి సాధన మార్గం లో ఎదురయ్యే సిద్ధులు గా తెలిసి మనకు పెద్ద విశేషాలు గా కనిపించ నప్పటికీ
  తామస గుణం కలిగిన వారికి అద్భుతముగా అనిపించి వారిలో అపార విశ్వాసాన్ని భక్తిని భయాన్ని కూడా కలిగిస్తాయి వీటి వలణ ఆ అమానవుడు తరింప బడుతున్నాడు

 3. anrd అంటున్నారు:

  విలువైన విషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.