సిద్ధ యోగి పుంగవులు –2

   సిద్ధ యోగి పుంగవులు –2

                                                                అవధూత దొంతులమ్మ

        ఏరుల పుట్టుక ,యోగుల పుట్టుక ఎవరికి తెలియదని సామెత .ఆమెనర్మదా నదీ తీరాన ఉండే  బంజారా మహిళా .ఎలా వచ్చిందో కృష్ణా జిల్లా మచిలీ పట్నం చేరింది అరవై ఏళ్ళ వయసు తో  .ఆమె నెత్తి మీద నీళ్ళ కుండల్ని దొంతరలు గా పెట్టు కొని మోస్తుండేది .అందుకని ఆమె ను’’ దొంతు లమ్మ’’ అన్నారు బందరు జనం .అదే ఆమె పేరు అయి పోయింది .ఒక యోగి ఆమెకు దర్శనం ఇచ్చి సంసార బంధాలను వదిలెయ మని ఆదేశిస్తే ,భర్త అనుమతి తో ఇల్లు వదిలి వచ్చేసింది . దీక్ష నిచ్చి పంపాడు యోగి .ఆమె అవధూత గా మారి ఏంతో  దూరం నడిచి శ్రీ శైలం చేరింది .దిగంబరం గా తిరిగేది .బాహ్య స్పృహ ఉండేది కాదు .నిరంతరం సమాధి స్తితి లో ఉండేది .

              నెమ్మదిగా బందరు చేరి ,మొదట కుమ్మరి వీధిలో తర్వాత జగన్నాధ పురం లో ఉన్నది .ఆమెను కర్రతో కొట్ట  బోయిన వాడి చేయి చచ్చు బడింది .ఆమె కాళ్ళ మీద పడితే అనుగ్రహం తో  చేయి మళ్ళీ పని చేసింది .ఒక సారి ఒక లాయర్ గారి వీధి అరుగు పై కూర్చొని ఉండగా ,ఆయన పిచ్చి కోపం తో ఆమె దగ్గరుండే బట్టల  మూటను కాలితో తన్నాడు .ఆమె నవ్వుతు వెళ్లి పోయింది .ఆ లాయర్ కాలు మంటలు పోట్లకు గురై గిల గిల లాడాడు .ఇలా క్రమంగా ఆమె మహిమలు వ్యాప్తి చెందాయి .ఇంకో సారి చల్ల పల్లి కి చెందిన ముగ్గురు ఆడ వాళ్ళు  బట్టల వ్యాపారం కోసం బందరు వచ్చి బెజవాడ రోడ్డు పక్క ఉన్న వీధి అరుగు మీద కూర్చున్నారు .ఆ పక్కనే దొంతులమ్మ పిచ్చి గుడ్డల మూట తో  కూర్చుని ఉంది .అర్ధ రాత్రి సమయం .ఆమె తమను ఏమి చేస్తుందో నని వారు భయ పడ్డారు .ఇంతలో ఆమె కళ్ళ నుండి సూర్య కిరణాల లాగా మెరుపులు వచ్చాయి ..ఆ ముగ్గురికి ఆశ్చర్యం కలిగి భక్తీ తో  ఆమె శిష్యులయారు .ఆమె వారిని దగ్గరకు పిల్చి కారం ముద్ద తీసి వారి నోటికి అందించింది అది తీపి పదార్ధం గా మారి మధురం గా ఉందట ..బందరు వచ్చి నప్పుడల్లా తనను కలిసి వెళ్ళ మని చెప్పి పంపింది .

     గుంటూరు జిల్లా మంగళ గిరి నుంచి బందరు లో స్తిర పడ్డ వలివేటి పేరయ్య ఆమె మహిమలను గమనించాడు .ఆమె మిరపకాలయలు ,ఉల్లి పాయలు ,ఉప్పు తన గోనే సంచి కింద  దాచి ప్రసాదం గా పెట్టేది .అవి అతి మధురాలయ్యేవి .ఆమె యే కొట్టు దగ్గర నిలబడితే ఆ కొట్టు ఆ రోజు విపరీతం గా లాభాలు గడించటం అందరికి అనుభవం .బ్రతి మాలి రప్పించు కొనే వారు .సర్కిల్ పేట లో చోడవరపు సుబ్బమ్మ అనే వితంతువు దత్త పుత్రుడు అమ్మ చెప్పి నట్లే చని పోయాడు .ఈ విషయం ఆమె కు చెప్ప టానికి  వెళ్తే అమ్మ మండ్ర  గబ్బల మీద కూర్చున్న దృశ్యం చూసి చకితు రాలై  ఆమె మహిమ అపరిమితం అని గ్రహించింది .ఆమె కు దత్త పుత్రుని మరణం తో  పరీక్షించి  వైరాగ్యం బోధించి శిష్యురాలిని చేసుకొన్నది .వేమూరి అచ్చయ్య అనే ఆయన టో ఉపదేశం ఇప్పించింది .

          ఒకాయన ఉపదేశం కోసం వస్తే అర్ధ రాత్రి శ్మశానానికి రమ్మన్నది .అతడు అలానే వెళ్లాడు .ఆమె పెద్ద పులి రూపం లో కని పించి భయ పెట్టింది .ఆయన పారి పోయాడని తెలుస్తోంది .పరీక్షించ కుండా ఎవరికి దీక్షనిచ్చేది కాదు చెరుకూరి పద్మ నాభ ప్రసాద్ బహాద్దర్ పక్ష వాతం తో కుడికాలు చచ్చు పడింది .ఆ కుటుంబం అమ్మ దగ్గరకు వచ్చి శరణు వేడింది .అమ్మ తన కాలును ఆతని కాలుతో గుడ్డ పే లిక తో  కట్టింది .కాసేపు అయిన తర్వాత ఆయన పక్షవాతం మాయ మైంది .అప్పట్నించి ఆ కుటుంబానికి ఆమె రక్ష .వాళ్లకు ఒక కూతురుండేది .ఆమె ను అమ్మ ‘’రాణీ ‘’అని సంబోధించేది .ఆమెను చల్ల పల్లి జమీందార్ యార్ల గడ్డ శివ రామ ప్రసాద్ బహాద్దర్  గారికి ఇచ్చి వివాహం చేయాలని పద్మ నాభ ప్రసాద్ గారు భావించారు .కాని రాజా గారికి చేసుకోవటం ఇష్టం లేదు .కాని అమ్మ ధైర్యం చెప్పింది .ఈ పిల్లను మర్నాడే  ముక్త్యాల జమీందార్ దత్తత తీసుకొని చల్ల పల్లి రాజా గారికిచ్చి వివాహం చేశారు .చల్ల పల్లి కోటలో దొంతులమ్మ అమ్మ వారికి ఘన సన్మానం చేశారు .

        కారు మూరి కృష్ణ మూర్తి అనే ఆయన అమ్మ దగ్గర దీక్ష కోసం వచ్చాడు .ఆయన రామ తారక మంత్రాన్ని25 లక్షల సార్లు ,బాల మంత్రాన్ని ఏడు లక్షల సార్లు ,ప్రసన్నాంజనేయ మంత్రాన్ని నాలుగు లక్షల సార్లు జపించిన మహా పురుషుడు .అనేక సమారాధనలు ,అన్న సంతర్పణలు చేసిన కర్మిష్టి ..చీమల కోసం అయిదు మణుగుల పంచదార ను పోసిన భూత దయా పరుడు .అమ్మ అనుగ్రహం పొంది ఉపదేశం పొంది శిష్యుడై   ఆమె తల పెట్టిన అనే సత్కార్యాలు నిర్వహించిన ఘనుడు కృష్ణ మూర్తి .బాబా మస్తాన్ అనే మహనీయుడు అమ్మతో అర్ధ రాత్రి దాకా తత్వ విచారణ చేసే వాడు .జొన్న విత్తుల శేష గిరి రావు అనే సంగీత కళా కారుడు నటుడు గురువు దండిస్తాడని భయ పడి  అమ్మ పంచ చేరాడు .ఆమె అతన్ని మహా విద్వామ్శుడిని చేసింది .కుర్తాళం సిద్దేశ్వర పీఠానికి అది పతి అయిన కాను కొల్లు త్రివిక్రమ రావు గారు అమ్మ వద్ద జ్ఞాన భిక్ష పొంది ,ఆ తర్వాత సన్య సించి ఆ పీఠ ది పతి అయారు .ఆయనే విశ్వనాధ గారికి గురువు కూడా .మనశ్శాంతి లేని వారు అమ్మను దర్శిస్తే ,చల్లని చూపు తో  మానసిక ప్రశాంతత నిచ్చేది అని గ్రంధాలు తెలియ జేస్తున్నాయి .ఆమె ఎప్పుడు ‘’వికల్ప సమాధి ‘’లో ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అంటే  మనస్సునకు ఆత్మ శక్తి స్వరూప అవస్థ కలగటం చేత సమాధి స్తితి లో –వికల్పాలు నష్టపోకుండా ,చిత్తాన్ని బ్రహ్మ లో లయం చేసి కేవల పర బ్రహ్మ లో నిలిపి ఉంచటం అన్న మాట .

                       దొంతులమ్మ అనుగ్రహాన్ని పొందిన వారిలో దాలి పర్తి పిచ్చిహరి ,యడవల్లి నాగేశ్వర రావు ,క్రోవి సత్యనారాయణ ,కోకా అహోబల రావు ,మొదలైన ప్రముఖులున్నారు .ఆమె 9-2-1932  రాత్రి పదకొండున్నరకు దేహాన్ని చాలించింది .  ఆమె జననం1807  గా భావిస్తారు .దొంతులమ్మ ఉత్స వాలు బందరు లో ఘనం గా నిర్వహిస్తారు .మాఘ మాసం లో పద కొండు రోజులు ఆరాధ నా  ఉత్సవాలు ఘనం గా జరుగు తాయి .ఆమె విగ్రహం లంబాడి దుస్తులతో అలంకరించి ఉంటుంది ..జీవితం చాలించినా సమాధి నుండి భక్తుల కోర్కెలు తీరుస్తుంద నే నమ్మకం ఉంది .—ఇంకో సారి మరో యోగి కధ –

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –1-6-12.—కాంప్—అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

2 Responses to సిద్ధ యోగి పుంగవులు –2

 1. anrd అంటున్నారు:

  విలువైన విషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలండి.

 2. ఎందుకో ‽ ఏమో అంటున్నారు:

  ఆ రాణి గారు పెళ్ళికి ధరించే వస్త్రాలను తొలుత వీరికి సమర్పించి తరువాత వారు ధరించారని విన్నాను,
  ఇక పోతే చల్లపల్లి లో “పెద్దల విధానం” అనబడే మహోత్కృష్ట ఆధ్యాత్మ విధానం ఉన్నది
  అద్దానికి చెందిన పెద్దలు అప్పుడప్పుడు అమ్మ దర్శనం పొందేవారని విన్నాను
  అక్కడా బాహ్యంగా కనిపిస్తున్న మహిమల సంగతి అటు ఉంచినట్లయితే
  అంత జ్ఞానపరమైన విధానం వారిది జన్మరాహిత్యం అనే పరమోత్కృష్ట లక్ష్యం
  ” పెద్దల విధానం” అనుసరించే వారిది.
  చల్లపల్లి నుంచి అవని గదా వైపుగా వెళ్ళే దారిలో సద్గురు శ్రీ బల్లా సుబ్బనాగన్న గారి ఆశ్రమం చాలా ప్రసిద్ధి.
  అక్కడ ఆశ్రమంలో అమ్మ వారు సకలాభరణ భూషితురాలై యున్న దొంతులమ్మ వారి చిత్రపటం వీక్షించవచ్చును.
  Many Many thanks

  -మీకు అవకాశం ఉంటె ఈ matter తో పాటు వారి చిత్ర పటాలను ఉంటె పెట్టగలరు
  సాధు దర్శనం పుణ్యం కదా!
  దొంతులమ్మ అమ్మవారి చిత్రపట౦ నావద్ద ఉందేమో చూసి upload చేసి link ఇస్తాను

  మీ పుణ్యమా అంటూ, మహనీయుల స్మరణ చేస్తున్నాము

  ధన్యోస్మి !!

anrdకు స్పందించండి స్పందనను రద్దుచేయి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.