ఊసుల్లో ఉయ్యూరు –32 వారధి సారధులు

     ఊసుల్లో ఉయ్యూరు –32 
                                                                    వారధి సారధులు 

ఉయ్యూరు  లో మా శివాలయం బజారు నుండి పుల్లేరు కాలువ దాటటానికి వంతెన లేదు .చాలా కాలమ్ గా  ఆందోళన చేస్తున్నా పట్టించు కోలేదు ప్రభుత్వం ,పంచాయితీ కూడా .అవతలి ఒడ్డుకు వెళ్ళాలంటే పూర్వం చిన్న డింగీలు ఉండేవి . పల్లెకారులు వాటిని నడిపే వారు .వాళ్ళు పంచాయితీ పాటల్లో పాల్గొని నడిపే హక్కు సంపాదించు కొనే వారు .దాటే వారెవరైనా ఏదైనా ఇస్తే తీసుకోవటమే కాని ఇంత డబ్బు ఇవ్వాలనే నియమం  లేదు .కాపుల బజారు లో ఒక రేవు వుండేది  . అక్కడి నుంచే దాటే వారు .మాకు యాకమూరు దగ్గరలో కర్రల చిన్న వంతెన ఉండేది . ఇరుగ్గా ఉంటుంది . ఒక రిక్షా అతి కష్టం మీద వెళ్ళ గలిగే వీలు .సైకిళ్ళు ,స్కూటర్లు ఎక్కిన్చాలంటే ఒంతేన చాలా ఎత్తు గా వుంది అప్రోచ్  రోడ్డు సరిగ్గా లేక చాలా ఇబ్బందులు పడే వాళ్ళం వర్షాకాలం బురద లో యమ యాతన గా ఉండేది ..వల్లూరు  వెళ్ళాలన్నా  ,యాక మూరు ,పెనమకూరు దేవర పల్లి వగైరాలకు వెళ్ళాలంటే ఆ చిన్న వంతెనే గతి . లైట్లు కూడా ఉండేవి కాదు . రాత్రి పూట మరీ ఇబ్బందిగా ఉండేది .నిర్మానుష్యం .అలానే సినిమాకి వెళ్ళిన జనం , పొరుగూరి నుండి వచ్చిన వాళ్ళు ఈ ఇబ్బందుల్ని భరిస్తూ కాలవ అవతలికి చిన్న వంతెన మీద నుంచే వెళ్ళే వాళ్ళు .కాలేజి విద్యార్ధులు ,స్కూల్   విద్యార్ధులు ,కూరగాయల అమ్మకం వాళ్ళు అందరికి అంత కంటే గత్యంతరం లేదు .కే.సి.పీ.లో పని చేసే కార్మికులైనా ఇతర ఉద్యోగస్తుల కైనా అంతే గతి .అదీ చిన్న వంతెన పరిస్థితి .సి.బి.యం .ఆస్పత్రి దగ్గర పెద్ద వంతెన ఉండేది .దాని మీద బస్సులు తో సహా అన్నీ వెళ్ళటానికి వీలైనానంత వెడల్పు గా ఉండేది .అక్కడ లాకులు కూడా ఉన్నాయి .అదీ చాలటం లేదని కే.సి.పీ సహకారం తో దాన్ని వెడల్పు పెంచి కొత్త వంతెన కట్ట్టారు .ఇన్ని జరిగినా చిన్న వంతెన పని ఎవరు చేబట్ట    లేదు .అది మరీ ఆ చివర అయి పోయింది .ఊరూ పెరిగింది .కాలవ కట్ట అంతా ఇల్లు వేసుకొన్నారు పేద ప్రజలు .నడిచే వీలు కూడా లేకుండా ఉంది .ప్రజల గోడు బధిర శంఖారావమే అయింది ..

              అన్నీ ప్రభుత్వమే చేయలేదు .ప్రజలు కూడా తమ వంతు పని చేయాలి .ఈ విషయం లో ప్రజా ప్రతినిధులు ,పంచాయితీ ,గ్రామ పెద్దలు అందరు ఒకటై ఆలోచన చేశారు ..దీనికి పరిష్కారం ఆలోచించారు ..మంచి పని చేస్దామను కొంటె వదాన్యులకు కొదవ వుండదు .అయితే గంట కట్టే వాడున్డాలి ..ఆపనికి ఉయ్యూరు లో అత్యంత ధనికులు ,కే.సి .పీ.లో వేలాది షేర్లు వున్నవారు ,ఎన్నో కంపెనీలలో పెట్టుబడు లున్న వారు ,కాలువ అవతల ఎంతో విలువైన భూమి ఉన్న వారు ,ఇన్ని ఉన్నా నేత పంచె ,చొక్కా తో పైన ఖండువాతో పాత  సైకిలు తొక్కు కుంటు , నడిచి వస్తుంటే చంకలో ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ తో వచ్చే వల్లభ నేని వీర భద్ర రావు గారు అందరి దృష్టి లో పడ్డారు .ఆయనకూ ఇక్కడ వంతెన పడితే .తనకూ లాభమే .పొలాల విలువ పెరుగుతుంది .తనకూ నడకా ,చుట్టూ తిరిగి వచ్చే బాధా తప్పూ తుంది .ఆయన మనసు లోను ఇది సుళ్ళు తిరుగు తోంది .శాసన సభ్యులు అనే బాబూ రావు సర్పంచ్ గెల్లి మల్లికార్జున రావు ,బ్రాహ్మనుడైనా మంచి వ్యవసాయం లో దిట్ట గోవింద రాజుల పరబ్రహ్మానంద శర్మ అనే” అబ్బి” గారు  యువకుడు ఉత్సాహ వంతుడు ,మంచి పనుల్లో ముందుకు దూకే యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ అంటే ఇప్పటి శాశన మండలి సభ్యుడు అందరు కలిసి ఆలోచించారు .పరిష్కారం దొరికింది .వీరభద్ర రావు గారు రెండు లక్షలు ,పంచాయితీ కొంత ,డబ్బు వేసుకొని ,మిగిలిన డబ్బు మా బజారు లో ఉన్న కుటుంబాల వారు తలో వెయ్యి రూపాయలు చందా వేసుకొని .ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ ను కలుపు కోని కే.సి .పీ.వారి సహకారం తో వంతెన నిర్మించాలని నిర్ణయానికి వచ్చారు .డబ్బు సమకూర్చు కొన్నారు .పని ప్రారంభించారు .డబ్బును బాంక్ లో డిపాజిట్ చేసి ,అవసరమైనప్పుడు తీస్తూ మా బజారు లో వంతెన పూర్తి చేశారు .చాలా తక్కువ సమయం లోనే నాణ్యత గా కట్టటం విశేషం .దీనితో పుల్లేరు దాటటానికి వారధి ఏర్పడింది .దానికి వీరభద్ర రావు గారు ధన రూప సాయం చేసి అవసరమైతే ఎంత పెట్టుబడి పెట్టతానికైనా ముందుంది పని ని వేగ వంతం చేశారు .మరి ప్రజల నుండి డబ్బు వసూలు చేయటానికి ఆయన ఇంటింటికీ రాలేరు కదా .ఆ బాధ్యత గోవిందరాజుల శర్మ గారికి అప్పా గించారు . ఆయన కొద్ది మంది ప్రముఖులతో ఇంటింటికీ తిరిగి ఇంటికి వెయ్యిరూపాయల చొప్పున వసూలు చేసే బాధ్యత ను తీసుకొని చాలా పకడ్బందీ గా ,అందరికి  నచ్చ చెబుతూ వసూలు చేశాడు .నేనుకుడావెయ్యి రూపాయలు ఇచ్చాను .మిగతా వాళ్లకు చెప్పి ఇప్పించాను .అంతా సమకూరి సద్వినియోగమై మా వంతెన రూపు దాల్చింది .ఈ వారధికి నిజమైన సారధులు వల్లభనేని వీర భద్ర రావు గారు ,రెండో వారు మా బజార్లో ఎత్తు అరుగుల మీద ఉండే గోవిందరాజు శర్మ గారు ..వీరిద్దరి కృషి ,ప్రయత్నం ,మిగిలిన వారి సహకారం వల్లే ఇంత మంచి పని జరిగి ఆ వంతెన ఎంతో ఉపయోగ కారం గా ఉంది .ఈ వంతెన పై లారీలను వెళ్ళ నివ్వ రాదు అనే నియమం ఉంది .కాని దాన్ని పాటించక పోవటం బాధా కారం .ఈ వంతెన మూలం గా ట్రాఫిక్ విపరీతం గా పెరిగింది .స్కూల్ బస్సులు ఆటోలు ,రిక్షాలు ,చిన్న కార్లు అన్నీ హాయిగా వెళ్ళ గలుగు తున్నాయి .,
.            గోవింద రాజు శర్మ గారు నాకు స్కూల్ లో సహాధ్యాయి .ఎప్పుడు గ్లాస్కో లుంగి ,గుండీలు పెట్టని గ్లాస్కో చొక్కా ,పైన తువ్వాల ,డొక్కు లూనా తో ,చైన్ స్మోకింగ్ తో దర్శనం ఇస్తుంటాడు .మంచి వ్యవసాయం చేసే వాడు .కాలేజి కి అవతల గరుగు కు దగ్గరగా పొలాలున్నాయి .మెత్త వ్యవసాయం .చెరుకు బాగా పండించే వాడు .కందా ,పశుపు ,కూడా .మంచి స్నేహ శీలి .అనుక్షణం ఆయనతో కనీసం పది మంది మిత్రులుంటారు .వాకిట్లో ఎప్పుడు సందడే .అందరికి కాఫీలు ఇవ్వటం ఆ ఇల్లాలి డ్యూటి .వాళ్ళ అబ్బాయిలు  నాశిష్యులే .మా అబ్బాయిలకు సహాధ్యాయులే .శర్మ గారు రాజకీయం గా తెలుగుదేశానికి దగ్గర వాడు .అన్నే  బాబూ రావు గారు వడ్డే శోభనాద్రీశ్వర రావు గార్లతో చాలా సన్నిహిత సంబంధాలుండేవి ..బాబూ రావు , వడ్డేలు శర్మ గారితో  సంప్రదించ కుండా ఏ పనీ చేసే వారు కాదు .అలాగా బ్రాహ్మ సంఘం లోను ఆయన మాటే చెల్లు బాటు .అందర్లో తలలో  నాలుక గా ఉండే వాడు . అతని మాటలు కొంచెం పంజేంట్ గా ఉండేవి .మనిషి సౌమ్యుడే .పాపం ఒక సారి ఆయన మా వార్డ్ మెంబర్ గా ఎన్నికలలో దిగాడు .ఎంతో మంది తో పరిచయాలు ,ఎందరో కూలీలు ఆయన పొలాల్లో పని చేసే వారున్నారు ,బ్రాహ్మణ ఓటర్లు ఎక్కువగా ఉన్నారుకానీ చాలా విశ్వాసం తో బరిలో దిగారు .కాని అంచనాలు తారు మారయ్యాయి .దారుణం గా ఓడిపోయారు .పాపం కుంగి పోయాడు .అయితే నేను ఆయన గెలిచే అవకాశాలు లేవని ముందే తెలుసు కొన్నాను .సరే ఫలితాల రోజూ న ఆయన ఇంట్లో నే ఉన్నాం అందరం .అందరికి కాఫీలు ,టీలు ఇచ్చాడు ఫలితం తో సంబంధం లేకుండా .అదీ ఆయన ప్రత్యేకత .”ఏమయ్యా ”అని పిలిస్తే ”మీరు ”అని అతను పలకరించే వాడు .మా రమణ కు వాళ్ళింట్లో మంచి చనువు ..అలాంటి శర్మ గారు మార్చి చివర్లో అకస్మాత్తుగా చని పోయాడు .ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను .
 ఇవాళ మా అబ్బాయి రమణ మెయిల్ రాస్తూ వల్లభనేని  వీరభద్ర రావు  గారు చని పోయారని తెలియ జేశాడు .వీరభద్ర రావు గారు సాదా సీదా జీవితమే గడిపారు .ఆయన ఎంత ధన వంతులు అంటే ఉన్న పాలం గా మా ఉయ్యూరు ను అమ్మేస్తే కోనేంత సంపన్నులు .అయినా చాలా మామూలు గా ఉండే వారు .సైకిలు ,లేక నడకే ..ఇక్కడ ఒక విషయం గుర్తుకు వస్తోంది .కోమట్ల బజారు లేక రావి చెట్టు బజారు లో మా సువర్చలాన్జనేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మిస్తున్న సమయం అది 1988 సంవత్సరం ..అందరి దగ్గరకీ చందాల కోసం తిరుగుతున్నాం .అలానే వీరభద్ర రావు గారికోసం వెళ్లాం .ఇస్తాను ఇతాను అంటూ  చాలా సార్లు తిప్పించుకొన్నారు .కాని రూపాయి కూడా చేప లేదు .సరే రేపుప్రతిష్ట అనగా ముందు రోజూ న మేము వెళ్లి ఆయనకు మళ్ళీ జ్ఞాపకం చేసి ,ఆహ్వానం ఇచ్చి ,డబ్బు సంగతి మర్చి పోయి రమ్మని కోరం .కే.సి.పీ.మేనేజర్శ్రీ ఇంజేటి జగన్నాధ రావు గారు ,అనే బాబో రావు గారు వంటి పెద్దక్లు వస్తున్నారు అని తెలియ జేశాం .కానీ ఆయన ప్రతిష్ట రోజూ న రాలేదు .మర్నాడు ఉదయం నేను మా ఇంట్లో సంధ్యా వందనం ,పూజ లో ఉండగా వీరభద్ర రావు గారు నడిచి మా ఇంటికి వచ్చి నేను బయటికి వచ్చేదాకా వాకిట్లో కుర్చీలో కూర్చున్నారట .నేను వెళ్లి పలకరించాను .ఆయన అన్న మొదటి మాట ”ప్రసాద్ గారూ ! నేను అనుకున్న డబ్బు అంటే రెండు వేల రూపాయలు అనుకొన్న సమయానికి ఇవ్వ లేక పోయాను .ఏమీ అనుకో వద్దు .సరిగ్గా అక్టోబర్ మొదటి వారం లో  మీకు ఆ డబ్బు అంద జేస్తాను ..”అన్నారు .” సరే నండీ మా స్వామి  ఆయనే తెచ్చు కొంటారు ”అన్నాను .కాఫీ ఇచ్చి పంపాను .అంతే సరిగ్గా ఆయన అన్నరోజు ఆయనే ఫోన్ చేసి మమ్మల్ని రమ్మన్నారు .వెళ్ళగానే కాష్ ఇచ్చేశారు .దాన్ని ఆయన వాగ్దానం చేసిన అయిదు నెలలకు ఇచ్చారు .అందరు ఆయన డబ్బు ఇచ్చారు అంటే ఆశ్చర్య పోయారు ”.ఎనిమిదో వింత ”అన్నారందరూ  నవ్వు కొన్నాం .మా ఆంజనేయ స్వామి మహాత్మ్యం అది .ఆ డబ్బు ఆయనకు ఒక లెక్క లోది కాదు ..కానీ ఎందుకు అంతా తాత్సారం చేశారో అర్ధం కాదు .పోనీ ఆయన కు దేవుడి మీద భక్తీ లేదా అంటే అదేమీ కాదని తెలిసింది .భార్య మహాయోగ్యురాలు .మేము వెళ్ళిన ప్రతిసారి కాఫీ ఇచ్చి పంపేది .వీరభద్ర రావు గారి తండ్రి గారు గోపాల రావు గారు .ఎప్పుడు వాలు కుర్చీలో వరండాలో కూర్చుని కని పించే వారు .తెల్లనిపొడవైన  గడ్డం ,లుంగి ,చొక్కా తో ఉండే వారు ..అంతటి ధన వంతుడు మా ఇంటికి వచ్చి ఈ చిన్న మొత్తం కోసం అంత సేపు మా వాకిట్లో కూర్చోవటం ఆశ్చర్యం .ఆయన బజార్లో కని పించి నప్పుడల్లా చక్కగా మపలకరించి మాట్లాడే సహృదయులు ..మా నాన్న గారంటే విపరీత మైన అభిమానం త వారికి .ఎప్పుడు నాన్న గారి గురించే జ్ఞాపకం చేసే వారు .దేశ ఆర్ధిక స్థితి పై మంచి అవగాహన ఉన్న వారు .షేర్లు ,పెట్టు బదులు ,లాభ నష్టాలూ బాగా తెలిసిన వారు .కాని ఆయన పిల్లలేవారు ఆయన కు అందు బాటు లో లేరు .భార్య ముందే చని పోయింది .ఇప్పుడు వీరి మరణం .
        మా వారధికి సారదులైన వారు శర్మ గారు ,వీరభద్ర రావు గారి మరణం కుతీవ్ర విచారం తెలియ జేస్తూ ,వారి కుటుంబాలకు సాను భూతి సంతాపాన్ని ప్రకటిస్తున్నాను .
                                మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —06 -06 -12 . -కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

1 Response to ఊసుల్లో ఉయ్యూరు –32 వారధి సారధులు

  1. Sunkara Koteswar Rao అంటున్నారు:

    శ్రీ వీరభద్ర రావు గారు గురించి మీరు రాసిన ‘వూసుల్లొ వుయ్యూరు ‘ చదివాను; ఆయన నా చదువుకు పునాదులు వేసిన వ్యక్తి; కొద్ది నెలలక్రితం హైదరాబాదులో ఆయన మనవదు రాజీవ్ ఇంట్లొ కలిసాను.
    ఆయన గురించి మీరు రాసిన విషయాలలో అతిశయొక్తులు లేవు.
    ఇంత చక్కగా, వివరంగా, వివిధ అంశాలపై రాస్తున్న మీకు అభినందనలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.