వింత ఆలయాలు –విచిత్ర విశేషాలు –13
అనంత పద్మ నాభ క్షేత్రం –తిరువనంత పురం
ఒరిస్సా లోని పూరీ క్షేత్రం లో జగన్నాధ ,బలభద్ర ,సుభద్ర ల మూర్తులు దారువు అంటే చెక్క తో నిర్మించ బడ్డాయి .అందుకే దాన్ని దారుకా వనం అని అంటారు .అలానే కేరళ లోని తిరువనంతపురం లోని అపురూప సుందర విగ్రహమైన శ్రీ అనంత పద్మ నాభ స్వామి దీ మొదట్లో దారు విగ్రహమే .ఇప్పుడు శిలా రూపం లో కన్పిస్తున్నాడు ..సాధారణం గా ఈ క్షేత్రాన్ని ‘’అనంత శయనం ‘’అంటారు ..ఇది చాలా ప్రాచీన దేవాలయం ..తిరుపతి శ్రీ శైలం లకు ఉన్న ప్రసిద్ధి దీనికీ ఉంది .
చరిత్ర
ఒకప్పుడు ఇది దట్టమైన అడవీ ప్రాంతం ..ఒక రైతు దంపతులు ఇక్కడ పొలం పని చేస్తుండే వారట ..వారికి ఒక రోజున ఒక చెట్టు కింద ఏడుస్తున్న పసి పిల్లాడు కన్పించాడు ..పాలిచ్చి ,నిద్ర పుచ్చి ,పొలం లోకి పని లోకి మళ్ళీ వెళ్ళిందిభార్య . ..తిరిగి వచ్చేసరికి ,ఆ బాలుడి తలపై అయిదు తలల నాగు పాము ,ఎండ తగలకుండా కాపలా కాస్తోంది .ఆ పిల్లాడు విష్ణు మూర్తే అని భావించి ,ఇంటికి తీసుకొని వెళ్లారు .ఆ దంపతులే అతడిని పెంచుతున్నారు .రాజు గారికి ఈ విషయం తెలిసి దేవాలయం నిర్మించారని చారిత్రిక కధనం .
స్థలమహాత్మ్యం
దివాకరుడు అనే ముని ఇక్కడ తపస్సు చేశాడు .విష్ణు మూర్తి చిన్న బాలుడి వేషం లో ఆయన దగ్గరకు వచ్చాడు ..బాలుడు ఆయన వద్దే ఉండటానికి ఇష్ట పడ్డాడట .ఆ బాలుడు తను ఏమి చేసినా ఏమీ అనకూడదని షరతు పెట్టాడు బాలుడు .సరే అన్నాడు మహర్షి ..పూజా ద్రవ్యాలను ,సాలగ్రామాన్ని విసిరి పారేస్తున్నా ముని కిమ్మనకుండా ఊరు కొంటున్నాడు ..అల్లరి పెరిగి పోయింది ..భరించ లేక ఒక దెబ్బ వేశాడు ముని ..వెంటనే ఆ పిల్లాడు ‘’అనంత అడవులు ‘’లోకి పోతున్నానని చెప్పి మాయమై పోయాడు .ముని ఆ పిల్లాడి కోసం వేదుకు తుంటే ఒక చోట ‘’అల్లరి చేస్తే నిన్ను అనంత అడవుల్లో వదిలేస్తా ‘’అనే కొడుకును గడమాయించే ఒక స్త్రీ గొంతు విని పించింది ..ముని ఆమె వల్ల అనంత అడవి ఎక్కడుందో తెలుసు కొని ,వెదకటం ప్రారంభించాడు ..చివరికి పిల్లాడు కని పించాడు ..పట్టు కొ బోతే ఒక పెద్ద మామిడి చెట్టు లోకి దూరి కనిపించకుండా పోయాడు ..అప్పుడా చెట్టు రెండుగా చీలి పడి పోయింది ..అందు లోంచి ఆది శేషుని పై శయనిస్తున్న శ్రీ మహా విష్ణువు దర్శనం ఇచ్చాడు ..అనంతుడే ఆదిశేషువు ..అదే అనంత శయనం అయింది ..ఆ రూపం తొమ్మిది యోజనాల పొడవు ఉంది ..తాను ఆ రూపాన్ని చూడ లేనని దివాకర ముని ప్రార్ధిస్తే ,ఆయన దండానికి మూడు రెట్లు మాత్రమే పొడవు ఉన్న ఆకారం లో అనంత శయనుడు గా మారి పోయాడు .కొబ్బరి చిప్ప లో ఉప్పునీరు ,,కాయ కసరులు వేసి ముని నైవేద్యం పెట్టాడు. దివాకర మహర్షి ‘’తుళువ ‘’వంశీకుడు ..అప్పటి నుంచి ,ఆ వంశీకులే ఇక్కడి అర్చకులు గా ఉన్నారు ..దివాకర మునియే ‘’బిల్వ మంగళుడు ‘’అంటారు ..బ్రాహ్మణ వంశీకుడు .వీరే స్వామికి ఉదయం పుష్పాన్జలిఅనే ప్రత్యెక పూజ చేస్తారు ..బలరాముడు ఈ క్షేత్ర దర్శనం చేశాడట ..శ్రీ వైష్ణ వులకు మహా దివ్య క్షేత్రం అనంత శయనం .
దారు విగ్రహం –శిలా విగ్రహం
బాలుడు అదృశ్యం అయిన మామిడి చెట్టు చెక్క తోనే మొదట్లో విగ్రహాన్ని చెక్కి ప్రతిష్టించారు ..అయితే 1686లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగి ,ఆలయం ,విగ్రహం తగలబడి పోయాయి ..కొచ్చిన్ ,తిరువాన్కూర్ మహారాజు మార్తాండ వర్మ నూతన ఆలయాన్ని నిర్మించి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు ..అత్యంత పవిత్రమైన 12000 సాలగ్రామాలను దేశం అన్ని వైపులా నుంచి తెప్పించి ,,పటిక బెల్లం జిగురుతో అంటించి ఇప్పుడున్న విగ్రహాన్ని మలచారు ..గర్భాలయం ఎదుట నల్ల రాతి సుందర మండపం ఉంది ..మార్తాండ వర్మ కు అనంత పద్మ నాభ స్వామి పై అంతులేని భక్తీ విశ్వాసం ఉండేవి .నిత్యం స్వామిని అర్చించి మాత్రమే రాజ కార్యాలు నిర్వహించే వాడు ..రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవటానికి కారణం స్వామి అనుగ్రహమే నని భావించాడు ..1750 లో తన రాజ్యాన్ని సర్వస్వాన్ని అనంత పద్మనాభునికి ధార పోసి ,తన ఖడ్గాన్ని స్వామి పాదాల చెంత ఉంచాడు ..ఇక నుంచి స్వామి సేవకుని గా నే ఉండి పోతానని తీర్మానించు కొన్నాడు .’’పద్మ నాభ దాసుడు ‘’గా పిలువ బడ్డాడు ..అప్పటి నుంచి రాజ్యానికి కొత్తగా వచ్చిన ప్రతి రాజు ,తన ఖడ్గాన్ని స్వామి సన్నిధి లో ఉంచి ,స్వామి దాసులు గా పని చేస్తామని శపథం చేసి ,రాజ్య పాలన చేసేవారు .ఈ నాటికీ ప్రజా ప్రభుత్వం లో కూడా ఈ సంప్రదాయాన్నే పాలకులు పాటించటం కొనసాగిస్తున్నారు .
ఉత్సవాలు
శ్రావణ మాసం లో పది రోజులు ఉత్సవం జరుగుతుంది .లక్షలాది దీపాలు వెలిగిస్తారు .తర్వాతాఊరేగింపు చేస్తారు ..విగ్రహాలకు సముద్ర స్నానం చేయించి రాజ వంశీకులు వెంట రాగా మళ్ళీ ఆలయానికి తీసుకొని వస్తారు .ఆ రెండు రోజులు విమానాశ్రయాలు బందు చేస్తారు .ఆలయం మీద విమానం ఎగుర రాదనే పవిత్ర భావం ..శ్రావణ మాసం లోను ఉత్సవాలు నిర్వహిస్తారు .స్వామిని పంచె ,లుంగి తోనే దర్శించటం ఇక్కడ సంప్రదాయం .రాజ వంశీకులైనా అంతే .స్వాతి తిరుణాల్ మహా రాజ వంశీకులే ఇప్పటికీ వంశ పారం పర్య ధర్మ కర్తలు ..ఇక్కడున్న కోవలం బీచ్ చాలా అందం గా ,ఆహ్లాదం గా ఉంటుంది .
ఇక్కడ జ్యూ ,మ్యూజియం ,చూడదగిన ప్రదేశాలు ..కేరళ సంస్కృతి నాగరకత ,జీవన విధానం ,ప్రతిబింబించే అనేక విధానాలు చూడ వచ్చు .మ్యూజియం అంతా చెక్క తోనే చేసి ఉండటం ఒక వింత .ఇక్కడి ఇల్లు ,ఆలయాలు భవనాలు అన్నీ దాదాపు దారు నిర్మితాలే .అదీ విచిత్రం .దట్టమైన అడవి ఉండటం తో అటవీ సంపదకు నిలయం .రబ్బరు తోటలకు ప్రత్యేకత .అన్నత పద్మ నాభుని నేల మాలిగ లలో అనంత మైన సంపదను పూర్వపు రాజులు భక్తులు ఇచ్చినవాటిని నిక్షిప్తం చేశారు .ఆ సంపద విలువ ఎంతో లెక్క కట్టే షరాబు లేడు .పేరుకు తగ్గట్టే సంపదా అనంతమే ..అనంత పద్మ నాభుని దర్శనం అనంతానందం శుభకరం ,మోక్ష దాయకం .
మరో ఆలయం –మరోసారి
సశేషం —మీ గబ్బిట దుర్గా ప్రసాద్ – 6-6-12 కాంప్—అమెరికా
>>ఆ పిల్లాడు విష్ణు మూర్తే అని భావించి ,ఇంటికి తీసుకొని వెళ్లారు .ఆ దంపతులే అతడిని పెంచుతున్నారు .
తర్వాత పిల్లవాడు ఏం అయ్యాడు.
Challa bagundi- manchi vashayam andachesinaaru