వింత ఆలయాలు –విచిత్ర విశేషాలు — 14
మూడు సముద్రాల తీరం –కన్యా కుమారి
భారత దేశానికి ఉత్తరాగ్రం హిమాలయాలు అయితే దక్షిణ అగ్రం కన్యా కుమారి ..తూర్పున బంగాళాఖాతం ,దక్షిణాన హిందూ మహా సముద్రం ,పడమర అరేబియా సముద్రం చేత ఆవరింప బడిన చిన్న గ్రామం ..తమిళ నాడు లో కన్యాకుమారి ఉంది ..సూర్యుడు తూర్పున బంగాళాఖాతం లో నుంచి ,క్షితిజ రేఖ లో సముద్ర గర్భం లో నుంచి ,నెమ్మది నెమ్మది గా ఉదయించి తన్మయులను చేస్తాడు ..అల్లాగే సాయంత్రం అస్తమయ బింబం ఎర్రగా ,నెమ్మది నెమ్మదిగా ,అరేబియా సముద్రం లోకి దిగి పోతున్నట్లు కన్పిస్తూ మళ్ళీ పరవశులను చేస్తుంది . ..ఒకే ఊరి లో ఈ రెండు దృశ్యాలు కన్పించటం కన్యాకుమారి ప్రత్యేకత .మిగతా తూర్పు తీరం లో యే ప్రదేశం లో నైనా సముద్రం ఉంటె ,సూర్యోదయాన్ని కనుల పండువు గా చూడ వచ్చు ..అలాగే పశ్చిమ సముద్ర తీర ప్రజలు కూడా సూర్యాస్తమయాన్ని చూసి పరమానందం పొంద వచ్చు ..ఈ రెండు దృశ్యాలు ఇక్కడే కన్పించటం వింతల్లో వింత .పరమాద్భుతం .అయితే సంవత్సరం లో తొమ్మిది నెలలు వర్షాలు ఉన్న ప్రదేశం కనుక ,వారానికి ఒక్క రోజు ఈ రెండు దృశ్యాలు కని పిస్తే గొప్ప .ఆకాశం ఎప్పుడు మేఘావృత మై ఉంటుంది ..అందుకని యాత్రికులకు నిరాశ కల్పించే రోజులే ఎక్కువ గా ఉంటాయి ..ఇక్కడ రంగు రంగుల ఇసుక ,మట్టి కన్పించటం మరో వింత ..వాటిని సేకరించి యాత్రికులు తమ తో తీసుకొని వెళ్తారు .
వివేకానంద కేంద్రం
స్వామి వివేకానంద 1892 లో చికాగో లో జరిగిన అఖిల మత సమావేశానికి కన్యాకుమారి నుండే బయల్దేరి వెళ్లాడు ..తీరానికి నాలుగు ఫర్లాంగుల దూరం లో ,సముద్రం లో ఉన్న ఎత్తైన రాతి గట్టు మీద ఆయన తపస్సు చేశాడు .1963 లో ఆయన శత జయంతికి ,ఈ రాతి పై చిరస్మరణీయ స్మృతి మందిరం ను వివేకా నంద స్మారక ట్రస్ట్ వారు నిర్మించి ,ఆయనకు ఘన నివాలులనర్పించారు ..బయట అంతా యెర్ర రాయి ,లోపల గ్రానైటు .తో భవన నిర్మాణం చేశారు .తీరం నుంచి లాంచి లో మందిరం చేరి వివేకానంద విగ్రహం ,ధ్యాన మందిరం మొద లైన వి చూడ వచ్చు ..ఈ రాక్ మెమోరియల్ లేక పోతే ఈ ప్రాంతం లో హిందూ ధర్మం లుప్తమై పోయి ఉండేది అని విశ్లేషకుల భావన .
అతి పెద్ద తిరువల్లువార్ విగ్రహం
తమిళనాడు ప్రభుత్వం ఇక్కడే వేరొక సముద్ర గర్భం లో ఉన్న కొండ రాతి పై ,మూడు సముద్రాలు కలిసిన ప్రాంతం లో 133 అడుగుల భారీ తిరువళ్ళు వార్ విగ్రహాన్ని నేల కోల్పింది . 38 అడుగుల ఆ రాతి విగ్రహ చట్రం ఆయన రాసిన ‘’కూరల్ ‘’లోని 38అధ్యాయాలకు ప్రతీక .95 అడుగుల విగ్రహం మిగిలిన భాగాలను సూచిస్తుంది .సంపద ,ప్రేమ లకు ఆధారం సుగుణ మే అని ఈ శిల్పం తాత్పర్యం .140మెట్లు ఎక్కి విగ్రహం పైభాగాన్ని చూడ వచ్చు ..అదో దివ్య అనుభూతి నిస్తుంది .ఈ విగ్రహాన్ని 1-1-2000 న తమిళనాడు ముఖ్య మంత్రి కరుణానిధి ఆవిష్కరించారు ..గణపతి స్తపతి ఈ విగ్రహ రూప శిల్పి ..తిరువల్లువార్ తమిళుల ఆరాధ్య కవి .ఆయన సూక్తులను బస్సుల్లో రాసి ఉంటాయి .
గాంధీ స్మారక మందిరం
గాంధీ మహాత్ముడు ఇక్కడికి వచ్చి ,ప్రకృతి సౌందర్యానికి పులకించి సముద్ర తీరం లో తన్మయులై కూర్చున్న చోట గాంధి స్మారక మందిరం కత్తి ,జాతికి అంకితమిచ్చారు .
కన్యా కుమారి ఆలయం
ఇక్కడి అమ్మవారు ‘’కన్యా కుమారి ‘’పార్వతీ దేవి అవతారం ..ఈ ప్రాంతపు రాజు కుమార్తె గా జన్మించన ‘’కన్య ‘’శివున్ని మాత్రమే వివాహం చేసుకుంటానని పంతం పట్టింది ..తండ్రి ఈ విషయాన్ని శివునికి నివేదించాడు ..ఆయన పెళ్ళికి ఒప్పుకొన్నాడు .బృహస్పతి ముహూర్తం పెట్టాడు .లగ్న సమయానికి పరమేశ్వరుడు రాక పోయే సరికి ,కన్య ఆయన్ను వెదుక్కొంటూ బయల్దేరింది ..శివుడు బయల్దేరి తెల్లారే సరికి ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్ల దూరం లో ఉన్న ‘’శుచీన్ద్రం ‘’వద్ద నిలిచి పోయాడు .దేవతలకు పగలు ప్రయాణం నిషిద్ధం ..కన్యా కుమారికి విషయం తెలిసి వెనక్కి వెళ్లి పోయింది .ముహూర్తం మించి పోయింది కనుక ఆమె ‘’కన్య ‘’గానే ఉండి పోయింది .పెండ్లి కోసం చేసిన పిండి వంట లన్ని చిన్న రాళ్ళు ,గవ్వలుగా మారి పోయాయట .అందుకే యాత్రికులు వీటిని కొనుక్కొని భద్రం చేసుకొంటారు ..చిన్న ఆలయం లో నిలుచుని ఉన్న అమ్మ వారి విగ్రహం ఆకర్షణీయం గా ఉంటుంది ..ఆమె ముక్కు పుడక విపరీత మైన కాంతి తో ఆకర్షించి ,మెరుస్తూ మురిపిస్తుంది ..ఇక్కడ నవ రాత్రి ఉత్సవాలు ఘనం గా జరుపుతారు ..తెప్పోత్సవం కన్నుల పండువు గా ఉంటుంది .
సునామీ స్మారకం
సునామీ వచ్చి ప్రపంచ దేశాలను ఈ మద్య అల్లా కల్లోలం చేసి ,ఎంతో జన నష్టాన్ని కల్గించింది .ఆ సమయం లో మరణించిన వారి కోసం స్మృతి చిహ్నాన్ని ఇక్కడ నేల కొల్పి వారందరికి అంజలి ఘటించారు
కన్యా కుమారి లో క్రైస్తవ చర్చిలు చాలా ఉన్నాయి ..అందుకే కన్యా కుమారి అమ్మ వారిని దాదాపు అందరు ‘’కన్య మేరి ‘’గా పిలుస్తారు ..కన్యా కుమారికి ఎనిమిది మైళ్ళ దూరం లో ‘’శుచీన్ద్రం ‘’ఉంది ..ఇక్కడే త్రిమూర్తులను శిశువులను చేసి అనసూయా దేవి పాతివ్రత్యాన్ని నిరూపించు కొన్నది .ఇక్కడే దేవేంద్రుడు తను చేసిన పాపాలను ప్రక్షాళనం చేసుకోవ టానికి శివున్ని ఆరాధించాడు .ఇఆయన అనుగ్రహం తో ఒళ్లంతా ఉన్న కళ్ళు పోయాయి .ఇంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుక శుచీన్ద్రం అయింది
మరో ఆలయం గురించి ఇంకో సారి –
సశేషం —గబ్బిట దుర్గా ప్రసాద్ —7-6-12 —కాంప్—అమెరికా