సిద్ధ యోగి పుంగవులు –5 స్వర్ణ సిద్ధ యోగి వాసిష్ఠ గణపతి ముని

    సిద్ధ యోగి పుంగవులు –5

                                                          స్వర్ణ సిద్ధ యోగి వాసిష్ఠ గణపతి ముని

     ఆయన చదవని శాస్త్రం లేదు ,రాయని కావ్యం లేదు ,దర్శించని క్షేత్రం లేదు ,తపస్సు చేయని ప్రదేశం లేదు ,చూపని మహిమలు లేవు,,ప్రసన్నం చేసుకొని దేవత లేదు  అన్నిటికి మించి అస్ప్రుస్యతనుయేవగించుకొన్న సదాచార సంపన్నుడు ,భారత జాతీయ స్వాతంత్ర ఉద్యమం లో ముందు నిలిచినకర్మిష్టి ,భగవాన్ రమణ మహర్షి చేతనే ‘’నాయనా ‘’అని పించుకొన్న అద్భుత మూర్తి .సాక్షాత్తు గణపతి అవతారమే  శ్రీ వాసిష్ఠ గణ పతి ముని .వారి జీవితం అంతా పరోప కారమే .కారణ జన్ములాయన .ఆ పేరు స్మరిస్తే చాలు సర్వ పాప హారం .

                                   జననం –విద్యా భ్యాసం –వివాహం

    అసలు పేరు అయ్యల సోమయాజుల సూర్య గణపతి శాస్త్రి .తండ్రి నరసింహ శాస్త్రి-గణపతి ఉపాసకుడు .తల్లి నరసమ్మ సూర్య ఉపాసకురాలు .వీరి సంతానమే గణపతి శాస్త్రి .శ్రీ కాకుళం జిల్లా బొబ్బిలి  దగ్గర ‘’కలువ రాయి ‘’గ్రామం లో 17-11-1878 న జన్మించారు .ఆరామద్రావిడ కుటుంబం .తండ్రికి గణపతి తన దగ్గరకు వస్తున్నట్లు కని పించింది .తల్లికి సూర్యుని శక్తి అయిన అగ్ని పూర్ణ స్వర్ణ కలశం కల లో కన్పించింది ..బిడ్డ జన్మించినప్పుడు అతన్ని ఒక దివ్య తేజస్సు ఆవరించి ఉన్నట్లు చూసింది .పదేళ్ళకే తల్లిని పోగొట్టు కొన్నదురదృష్ట వంతుడు గణ పతి .ఈయన దైవాంశ సంభూతుడు అని భావిస్తున్నారు తల్లీ ,తండ్రీ .కాని మన వాడికి ఆరేళ్ళ దాకా మాటలే రాలేదు ..తండ్రి కాల్చిన లోహపు ముల్లును కొడుకు నాడిలో గుచ్చాడు .వెంటనే జలపాతం లాగా మాటలు జారి వచ్చాయి .

                 పిన తండ్రి  ప్రకాశ  శాస్త్రి దగ్గర కావ్యాలు చదివటమే కాక పంచాంగ గణనం లోను దిట్ట అని పించుకొన్నాడు .పన్నెండవ ఏట విశాలక్షమ్మ తో వివాహం జరిగింది .కాళిదాసు గారి మేఘ దూతం లాగా ‘’భ్రున్గా దూతం ‘’అనే రెండు సర్గల కావ్యం రాశాడు ..పద్దెనిమిదేళ్ళు వచ్చే సరికి వ్యాకరణ ,అలంకార ,సాహత్యా లనుకరతలా మలకం చేసుకొన్నాడు .పురాణ ,ఇతి హాసాల లోతులు తరచాడు .పదమూడవ ఏటి నుండి తండ్రి వద్దే మేధా దక్షిణా మూర్తి ,నారాయనాక్షరి ,సౌరాస్త్రాక్షరి ,చండి నవాక్షరి ,మాతంగి ,బాల ,వారాహి ,భువనేశ్వరి ,మహాగణపతి ,పంచ దశి ,షోడశి అనే పన్నెండు మహా మంత్రాలను సాధన చేసి వశం చేసుకొన్నాడు .తపస్సు చేసుకోవాలనే కోరిక బల మైంది .ఆరు నెలలు ఇంటి దగ్గర ,ఆరు నెలలు తపస్సు చేసుకోవటానికి భార్య అనుమతి పొందాడు .ఇద్దరు పిల్లలు కన్న తర్వాతతనకు కూడా తపస్సు చేసుకొనే అవకాశం ఇమ్మని భార్య కోరితే సరే నన్నాడు .వెంటనే భార్యకు మహాగణపతి మంత్రం ,శ్రీ దీక్ష ఇచ్చాడు .

                                         దేశ సంచారం –శాస్త్ర చర్చలు –తపస్సు

              1896లో అంటే పదహారేల్లప్పుడు కౌశికీ నదీ తీరాన పేరమ్మ అగ్రహారం లో రెండు నెలలు తీవ్ర తపస్సు చేశాడు ..కాశీ కి బయల్దేరి నంది గ్రామం లో ధర్మ శాలాధి కారిచే సన్మానం పొంది ఇంటికి వచ్చాడు .కలువ రాయి లో ధ్యానం లో ఉండగా భద్రకుడు అనే అనే ఆయన  కన్పించిగణపతి  గణకుడు అని జ్ఞాపకం చేశాడు .తండ్రి అనుమతి తో ప్రయాగ వెళ్లి హంస తీర్ధం లో కొంత కాలం తపస్సు చేసి ,కాశీ చేరి తండ్రి మేన మామ భవాని   శంకరం ఇంట్లో ఉండి దర్భాంగా సంస్థానం లో ఉండే ‘’శివ కుమార పండితుడి ‘’ని తన కవిత్వం తో మెప్పించాడు .నవద్వీపం లో జరిగే విద్వత్ పరీక్ష కు హాజరవమని పరిచయ పత్రం పొందాడు .ఒక రోజు ఆయనకు అయ్యల సోమయాజుల సూర్య నారాయణ యోగి కని పించి భద్రకుడు మొదలైన తాము పదహారు మంది లోక కళ్యాణం కోసం జన్మించామని తాను’’ సుకేతుడని’’ ,అతను గణపతి అని ,యే పని చేయాలో’’ స్తూల శిరస్సు’’ అనే వాడు తెలుపుతా డని చెప్పాడు .నాసిక్ లో తపస్సు  చేయాలని స్వప్నం లో తెలియ జేయ బడటం తో అక్కడికి చేరి  నీలామ్బికా ఆలయం లో తపస్సు చేశాడు .అక్కడే మొదటి అష్టావదానమూ చేశాడు .అక్కడ తనను అవమానించిన పూజారిని శపించి ,పాప పరిహారం కోసం ‘’నవ చూతి ‘’లో 72 రోజులు ఘోర తపస్సు చేశాడు .అప్పుడే’’ తెల్లని దిగంబరుడు’’ కల్లో కనిపించి ఇంటికి వెళ్ళమని ఆదేశించాడు ..ఒరిస్సా చేరి భువనేశ్వర్ లోతోమ్మిది రోజులు తపస్సు చేశాడు . భువనేశ్వరి దేవి సాక్షాత్కారించి బంగారు గిన్నె లోని తేనె ను అతనితో తాగించింది ..దానితో కవితా మాధుర్యం పెరిగింది .బుద్ధి సూక్ష్మత రెట్టింపైంది .ఇంటికి వస్తే భార్య కొడుకుని కన్నది .మహాదేవుడనే పేరు పెట్టాడు .కేశ న కుర్రు లో తర్క వేదాంత ,వ్యాకరణ మహా భాష్యాలను ,నీతి శాస్త్రాన్ని ఆపోసన పట్టాడు .1900  లో మదసా సంస్థానం లో రాజ గురువును ఓడించి ,అష్టావధానం చేసి ,రాజకుమారుడికి శివ పంచాక్షరి ఉపదేశించి రాజు ప్రోత్సాహం టో నవద్వీపం చేరాడు .అక్కడ ‘’సితి కంథ    వాచస్పతి ఆదరం పొందాడు .పరీక్షాధికారి అయిన ‘’అంబికా దత్తుఆయన అంబికకు దత్తుడు అయితే తాను సాక్షాత్తు అంబిక కు ఔరస పుత్రుడిని గణపతిని  అనే  ‘’శ్లోకం తో మెప్పించి ,ఆయన మెప్పు పొంది పరీక్ష లో పాల్గొన్నాడు .నవద్వీప పండితులను మెప్పించటం మహా కష్టం .కాని మన గణపతి అక్కడి పండిత పరిషత్తు పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గి ,తన పాండిత్యం ,కవిత్వాలతో అందర్ని మెప్పించి ‘’కావ్య కంథ గణపతి  ‘’బిరుదును 20-6-1900 న పొందాడు .అప్పటి నుంచి ఆపేరు తో నే సార్ధక నామదేయుడైనాడు .

                    వైద్యనాద్ వెళ్లి తపస్సు చేసి సురేష మిత్రుని వద్ద ‘’తారా’’మంత్రోపదేశం పొందాడు .గణపతి గారి వల్లే ఉత్తరాదికే పరిమిత మైన ఈ మంత్రం దక్షిణాదికి చేరింది .పదవ రోజు రాత్రి శివుడు కలలో కన్పించి నిర్విషయ ధ్యాన రూపం అయిన ‘’స్మృతి మార్గం ;;చూపించి ,విభూతి చల్లి అదృశ్యమైనాడు .గద్వాల్ చేరి మహారాజుకు ఆప్తుడై ,కాన్పూర్ వెళ్లి మూడు నెలలు తపస్సు చేసి ,మళ్ళీ ఇంటికి వెళ్లి తండ్రికి నేత్ర చికిత్స చేయించాడు .1902 లో భార్య తో  సహా మంద సా వెళ్లి రాజు గారి ఆతిధ్యం పొంది ,భార్యను పుట్టింటికి పంపి ,తమ్ముడు శివ రామ శాస్త్రి తో  కలిసి భువనేశ్వర్ లో మళ్ళీ తపస్సు  చేసి కలకత్తా చేరాడు .అక్కడినుంచి దక్షిణ దేశం చేరి క్షీరవతీ ,వేగావతీ నాడు మద్య శివ పంచాక్షరి జపించి ,,అరుణాచలం  చేరి తన తపో సాధనకు అదే సరైన ప్రదేశం గా భావించి అక్కడే ఉందామని నిర్ణ ఇంచుకొన్నాడు .

          కానీ అన్నదమ్ములిద్దరికి పిడికెడు అన్నం పెట్టె వారే కరువైనారు .గణతి కి ఆ క్షేత్ర దేవత పై కోపం వచ్చింది .ఆకలి దహిస్తోంది .వెంటనే ఒక బ్రాహ్మణుడు వచ్చి తన భార్య వ్రతం చేసి పారణ ను బ్రాహ్మణులకు ఇవ్వాలని అనుకుంటున్నది భోజ నానికి రమ్మని చెప్పి తీసుకొని వెళ్లాడు .అక్కడ ఆమె మృష్టాన్న భోజనం పెట్టింది .సంతృప్తిగా తిన్నారు ..ఆ ఇంట్లోనే విశ్రాంతి తీసుకొన్నారు .తెల్ల వారి లేచి చూస్తె అక్కడ ఇల్లే లేదు .అరుణా చలేశ్వరుడే తమల్ని పిలుచుకొని వెళ్ళాడని అమ్మ వారు’’ ఆపీత కుచామ్బే’’ తమకు భోజనం పెట్టిందని గ్రహించాడు .కాని నోట్లో తాంబూలం అట్లాగే ఉండటం ఆశ్చర్యం వేసింది .అది కల కాదు నిజం అని తెలుసు కొన్నాడు .అప్పటికి గణపతి అయిదు కోట్ల శివ పంచాక్షరి ని జపించి నందుకు అమ్మవారే స్వయం గా కన్పించి ఆతిధ్యం ఇచ్చిందని అర్ధ మయింది .ఇక మానవ మాత్రులేవారిని దేహీ అని అర్ధించ రాదనీ నిశ్చయించు కొన్నాడు .రోజు అరుణాచల నందీశ్వరుని  ముందు నిలిచి శ్లోకాలను అరుణా చలేశ్వరునికి విని పిస్తూ ‘’హరస్తుతి ‘’కావ్యం రచించాడు .చివరి రోజు న అరుణాచల యోగులు శేషాద్రి స్వామి ,బ్రాహ్మణ స్వామి (రమణ మహర్షి )ఆ కావ్యం విని ఆనదించారు .అక్కడి విద్యాలయం లో ఈయనకు సంస్కృత అధ్యాపక పదవి లభించింది .పది రోజుల్లో తమిళం నేర్చి ,ఆ భాష లో బోధించటం ప్రారంభించి మెప్పు పొందాడు .1903 లో రమణ మహర్షిని దర్శించాడు .ఆయనేదుర్గా మందిర యోగి చెప్పిన ‘’స్థూల శిరస్సు ‘’అని గుర్తించి నమస్కరించాడు .అప్పుడు రమణుల వయస్సు ఇరవై రెండు .గణపతి వయస్సు ఇరవై అయిదు .అలా చారిత్రాత్మకం గా కలిసిన వారిద్దరూ జీవికా జీవులు గా ఉండి పోయారు .

సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్—07 -06 -12   –కాంప్ –అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

2 Responses to సిద్ధ యోగి పుంగవులు –5 స్వర్ణ సిద్ధ యోగి వాసిష్ఠ గణపతి ముని

  1. A.Sridhar అంటున్నారు:

    గౌరవనీయులైన గబ్బిట ప్రసాద్ గారికి, అయల సోమయాజుల శ్రీధర్ నమస్కరించి వ్రాయునది.
    మీరు వ్రాస్తున్న సిధ్ధ యోగీంద్రుల చరిత్రలు చాల ఆసక్తి కరంగా ఉన్నాయి. ప్రత్యుత్తరం ఇద్దమని అనుకొంటూనే బధ్ధకం వల్ల ఇవ్వలేదు, ఈ రోజు మా తాతగారైన (అంటే స్వయంగా పితామహులైన) కీ.శే. కావ్యకంఠ గణపతి ముని గారి చరిత్ర చదివాక ఈ ప్రత్యుత్తరం వ్రాస్తున్నాను. నా బ్లాగు క్షీరగంగ ద్వారా నేను మీకు పరిచితుడనే ! మా నాన్నగారు కీ.శే. అయలసోమయాజుల మహాదేవ శాస్త్రిగారు ( వాశిష్ఠ ) వ్రాసిన వేదంలో కథలని నా బ్లాగు క్షీరగంగలో ప్రచురిస్తున్నాను. మా నాన్నగారి సాహిత్య సౌరభాలు కూడా గుబాళీంపుగానే ఉంటాయండి ! కాస్తంత వీలు చూసుకొని పరిశీలించండి. మీకు ధన్యవాదాలు — ఎ.శ్రీధర్.

  2. సురేష్ బాబు అంటున్నారు:

    మహామహితాత్ముల ,యోగిపుంగవుల పరిచయభాగ్యాన్ని మాకు కల్గిస్తూ మీరు తరిస్తూ మమ్మల్ని కూడా తరింపజేయడానికి నడుంకట్టిన మీకు చాలా చాలా ధన్యవాదాలండీ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.