సిద్ధ యోగి పుంగవులు –6 గణపతి ముని –2

సిద్ధ యోగి పుంగవులు –6                                గణపతి ముని  –2                    
    గణపతి ముని ఒక సంవత్సరం వేదాధ్యయనం చేసి సాయన భాష్యం చదివారు .అప్పటికే ఆయన కీర్తి తమిళ దేశమంత వ్యాప్తి చెందింది .ఒక రోజు దొరస్వామి అనే శిష్యుడు షేక్స్పియర్ నాటకం మేక్బెత్ ను కధ గా విని పిస్తే ,ఆశువు గా సంస్కృత కావ్యం గా చెప్పేశారు ..వేరొక శిష్యుడు ఇంగ్లీష పేపర్ చదివి విని పిస్తే దాన్ని కింది నుంచి పైకి ,పైనుంచి కిందికి చెప్పిన ఏక సంధా గ్రాహి ..వేదం వెంకట శాస్త్రి గారి సమక్షం లో గొప్ప సన్మానం జరిగింది భట్తశ్రీ  ,బాల సరస్వతి బిరుదులూ పొందిన ఒక పండితుడిని ఓడించి బంగారు తోడా బహుమానం గా పొందారు .ఇలా ఎక్కడికి వెళ్ళినా విజయ పరం పర తో  సాగి పోతున్నారు .

                     భారత దేశోద్ద్ధరణ —శ్రీ రమణుల సందర్శనం –జన్మరహస్యం

   పూర్వ జన్మ లో తనకు శిష్యులైన విద్యార్ధులను గుర్తించి ,వారిని పిలి పించి మద్రాస్ సముద్ర తీరం లో దేశోద్ధారణ కోసం ఉపాయాలు చర్చించారు .నాలుగు ముఖ్య ఆశయాలతో పని చేయాలని నిర్ణ యించారు .ఒకటి కర్మ యోగం ,రెండు –వేదకాల రుషి జీవన విధానం ,మూడు –స్త్రీ పురుష వివక్ష–వర్ణ వివక్ష ను దూరం చేయటం,నాలుగు –ప్రతి ఇల్లు మంత్రాలతో నినదించటం .ఇవి చాలా గొప్ప నిర్ణయాలు .సాహసో పెతమైనవి .ఆయన ‘’దశాం దేశ స్యైతాం ప్రతి పద మయం –ధ్యాయతి జనః’’అంటే –‘’భారత దేశ దశను గురించే నేనెప్పుడు ధ్యానిస్తున్నాను ‘’.ఇంత గొప్ప ఉదార ఆశయం ఆ నాడు యే మహర్షికీ లేదు .ఆ నాటి సమర్ధ సద్గురు రామ దాసుగా ,విద్యా రన్య  మహర్షి గా ఈ నాటి వివేకానంద ,అరవిందులు గా గణపతి స్వామి కనిపిస్తారు .

              రాయవేలూర్ క్రిస్టియన్ కాలేజి లో తెలుగు పండితులు గ  పని చేస్తూ అక్కడే ఉండి పోయారు ..ఎందరో స్త్రీ ,పురుషులకు మంత్ర దీక్ష ఇచ్చారు .సర్వేపల్లి రాదా కృష్ణన్ పిన తండ్రి నరసింహం కూడా దీక్ష పొంది ,సన్య సించి ‘’ప్రణవా నందులు ’అయారు .బహిరంగ సభల్లో వేద ప్రాశస్త్యాన్ని నొక్కి చెప్పటం తో ఇతర మతాల వారు వెనక్కు తగ్గారు .’’ఇంద్ర సంఘం ‘’స్థాపించి ‘ఉమాం వందే మాతరం ‘’అనే మంత్రాన్ని అందరికి బోధించారు .17-2-1907 లో కలలో ‘’భద్రకుడు ‘’కన్పించి తన దేహ యాత్ర ముగి సిందని ,గణపతి బోధనలతో సంఘం త్వరలో స్పందిస్తుందని చెప్పాడు .తన సోదరుడు చని పోయి నంత గా దుఃఖించి స్నానం చేసి తర్పణం వదిలారు .ఆ మర్నాటి పేపర్ లో ఆల్కాట్ గారే భద్రకుడు అని రాశారు .ఇంటికి వెళ్లి తండ్రి ని కాశీ యాత్ర చేయించి  వేలూరు లో కొడుక్కి మశూచికం వస్తే ‘’ఉగ్రమారీచి ‘’ని ప్రార్ధించి దాన్ని పోగొట్టారు .దసరా ఉత్సవాలకు ‘’పడై వీడు ‘’కు వెళ్లి ‘’రేణుకా దేవి ‘’ని దర్శించి ,తపస్సు మీది విపరీతమైన కోరికతో ఉద్యోగం వదిలేశారు .

               అరుణా చలం చేరి ‘’మరకత శ్యామలా దేవి (పచ్చై యమ్మన్ )దేవాలయం లో కొంత కాలం ,నైరుత లింగం లో కొన్ని నాళ్ళు తపస్సు చేశారు ..అరుణా చలేశ్వరుని కృత్తి కోత్త్ష వాలు జరుగుతున్నాయి .ఏడవ నాడు రధోత్సవం .దారిలో రధం ఆగి పోయి కదలలేదు .గణ పతి స్వామి రధం దగ్గరకు వచ్చి ప్రార్ధించగానే కది  లింది .ఆ మహాత్ముని కోసం అందరు వెతుకు తుంటే అదృశ్యమై పోయాడు .విరూపాక్ష గుహ లో బ్రాహ్మణ స్వామి ని దర్శించాడు గణపతి ఆయనకు సాష్టాంగ పడి తనకు తపోసాధన కుదరటం లేదని ,మార్గ నిర్దేశం చేయమని ప్రార్ధించాడు .అప్పటి దాకా ఎన్నో ఏళ్లుగా మౌన వ్రతం పాటిస్తున్న రమణ మహర్షి ‘’నేను అనే స్పురణ ఎక్కడి నుండి వస్తోందో విచారిస్తే మనస్సు దానిలోనే లీనం అవుతుంది .అదే తపస్సు ‘’అని చెప్పి మౌనాన్ని విడిచారు 18-11-1906 న.తన మౌనాన్ని చేదించిన వాడు మహా మహిమాన్వితుడు అని గ్రహించాడు బ్రాహ్మణ స్వామి .తనకు తపో విధానం తెలిపి గురుస్తానాన్ని పొందారు బ్రాహ్మణ మహర్షి అని గణపతి స్వామి భావించాడు .ఆయనకు భగవాన్ ‘’రమణ మహర్షి ‘’అనే పేరు గణపతి స్వామి పెట్టారు .రమణ మహర్షి ఈయనను ‘’నాయనా ‘’ అని సంబోధించారు .శ్రీ రమణులకు,గణపతి కి పురజనులు  సాష్టాంగ పడ్డారు ..తరువాత తాను ‘’మరుద్గణ పతి అయిన వృషా కపి యొక్క ఏడవ అవతారం ‘’అని నాయన ప్రకటించు కొన్నారు .

                       ఇక్కడి నుండి నాయనకు మరో జన్మ ప్రారంభ మైంది .అనేక గ్రంధాలు రచించారు .తపస్సు తీవ్రతరం చేశారు .తీర్ధ యాత్రలెన్నో చేశారు .ఉపన్యాసాలిచ్చారు .పండితుల్ని జయించి విజయ పత్రికలన్డుకొన్నారు .భార్య విశాలాక్షమ్మ దీపోత్స వానికి ముప్ఫై మంది శిష్యులతో వచ్చింది ..శ్రీ రమణులు ఆమె ను చూసి ‘’అమ్మ వచ్చింది ‘’అన్నారు .నాయన కూడా అప్పటి నుండి భార్యను ‘’అమ్మా ‘’అని పిలవటం ప్రారంభించారు .ఆమె కూడా భర్తను ‘’నాయనా ‘’అని పిలవటం మొదలు పెట్టింది .ఆ రోజు నుండి భార్యా భర్తలు వాన ప్రస్తాశ్రమం స్వీకరించారు .నాయన ఆమె కు ‘’తారా మంత్రం ‘’ఉపదేశించారు .నాయన ‘’చూత గుహ ‘’ లో తపస్సు చేస్తూ ఇరవై రోజుల్లో ‘’ఉమా సహస్రం ‘’రాయటానికి పూను కొన్నారు .అయిదుగురు రాసే వాళ్లకు ఒక్కక్కరికి యాభై శ్లోకాలు చెప్తూ 250 శ్లోకాలు అవ్యవదానం గా చెప్పారు .దీని వెనక రమణ మహర్షి సూక్ష్మ రూపం లో హృదయం లో కూర్చుని రాయించారని నాయన భావం ..ఆ వాక్ ప్రవాహం రమణుల హృదయం లో ఊరి ,నాయన ముఖతా వెలువడింది .రమణుల ఆదేశం తో కొండ శిఖరం ‘’సప్త ఝరి ‘’లో ఉండి ‘’దూర దృష్టి ,దూర శ్రవణం ‘’అనే సిద్ధులను పొందారు .చిరుపాకం కొండయ్య అనే గణ పతి ఉపాసకునికి హోమ జ్వాలలో ‘’నాయన దివ్యాక్రుతి ‘’కన్పించింది .శ్రీ రమణులు ‘’షణ్ముఖుని ‘’అవతారం గా నాయన లోకానికి చాటి చెప్పారు .కాశీ లోసుకేతుడు చెప్పిన’’ స్తూల శిరస్సు రమణులే’’అని నాయన గుర్తించారు ..అప్పటి నుంచి రమణుల అ నుచరుని గా ఉన్నారు .పడై వీడు కు వెళ్లి రేణుకా దర్శనం చేసి ,దేశ భక్తు లైన యువకుల్ని సమీకరించారు .ఇక్కడే ‘’కపాలి శాస్త్రి ‘’అనే మహా విద్వాంసుడు నాయన శిష్యుడైనాడు .నాయన పై పోలీసులు నిఘా పెంచారు .దేశ ద్రోహం చేస్తున్నాడని ఆరోపణ ..వారి కంట పద కుండా తప్పించు కొంటున్నాడు నాయన ..శిష్యులు ‘’ఉమా సహస్రం ‘’ను పోలీసుల కంటికి కనపడకుండా కుండలినీ నదీ తీరం లో ఇసుకలో పూడ్చి పెట్టారు ..అను కోకుండా ఆ రాత్రి నదికి వరద వచ్చి గ్రంధం కొట్టు కు పోయింది .ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళమని నాయనకు పోలీసులు ఆదేశించారు .వేలూరు వెళ్లి భార్య ప్రసవించిన ఆడపిల్లకు ‘’వజ్రేశ్వారి అని పేరు పెట్టాడు .మళ్ళీ రేణుకా క్షేత్రం చేరి నలభై రోజులు తపస్సు చేశాడు .దీక్ష చివరి రోజున రేణుకా దేవి 200 మంది పరి చారికలతో ప్రత్యక్షమై నాయన శరీరం లోకి శక్తిని ప్రసరింప జేసింది .శక్తి ఆయుధం లభించిన అనుభూతి పొందారు నాయన .ఋగ్వేదం లోని ‘’అస్త్ర మహా విద్యా మంత్రం ‘’నాయన కు గోచరించింది ..వేలూరు వెళ్లి ‘’ఇంద్ర సభ ‘’పెట్టి ఆ అస్త్ర మంత్రం వారికి బోధించారు .బ్రిటీష ప్రభుత్వం దీన్ని ‘’విప్లవ చర్య ‘’గా భావించి అరెస్ట్ వారంట్ జారీ చేసింది .రహస్య మార్గం లో హంపీ కి బయల్దేరి హాస్పేట లో ఒక మోసగాని వల్ల ఒక రోజు జైల్లో ఉండాల్సి వచ్చింది ..మర్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్ నాయన దివ్యత్వం తెలుసు కొని విడిచి పెట్టి మంత్ర దీక్ష పొంది శిష్యుడైనాడు .నాయన ‘’మా ఉలి ‘’అనే చోట తపస్సు చేసి ఆ గ్రామ దేవతను ప్రత్యక్షీకరించుకొన్నారు .ఆమె అస్త్ర సిద్ధి కి ఇంకా సమయం రాలేదని వేచి ఉండమని బోధించింది .

        రమణుల వద్ద సెలవు పొంది దక్షిణ యాత్రలు చేస్తూ ;;జంబుకేశ్వరం ‘’చేరి అక్కడి ‘’అఖిలాండేశ్వరి ‘’ని కొలుస్తూ నష్ట పోయిన ఉమా సహస్రాన్ని పూర్తీ చేశారు .దాదాపు ఏడు వందల శ్లోకాలు పది రోజుల్లో రాశారు .మళ్ళీ వేలురుకు వచ్చి కొడుకు మహాదేవుడికి ఒడుగు చేసి ,అందరితో అరుణా చలం చేరారు ..ఆ తర్వాతా రెండేళ్లు మద్రాస్ లో ఉన్నారు ..ఉడిపి బలరామ క్షేత్రం ,లో తపమాచరించి పీతాది  పతి టో సత్కరింప బడి ,ఆ సభ లో మతత్రయ సిద్ధాంత సారాన్ని ‘’తత్వ ఘంటా శతకం ‘’గా ఆశువు గా చెప్పారు నాయన ..గోకర్ణం చేరి తాపం చేసి అనంత శాస్త్రి అనే పండితుణ్ణి ఓడించి ,’’ఇంద్ర మత ప్రాశస్త్యం ‘’స్థాపించాడు .అక్కడి పండితులకు పరాశర సంహిత లో కల్గిన సందేహాలను తీర్చి ‘’లఘు సంహిత ‘’రచించాడు .గోకర్ణ ప్రాంతం లో ఉన్న వేద శాఖను పదిహేను రోజుల్లో కన్తస్తం చేశారు .ఉమా మహేశ్వర పర్వతం పై నాయనా ,అమ్మా తపస్సు చేస్తుండగా వారిని సేవించిన గణేశ శర్మ తర్వాతా ‘’దేవరాతుడు ‘’గా ప్రసిద్ధి పొందాడు .నాయన వద్ద ఆయన అనేక దివ్యానుభూతులను పొందాడు .పౌరాణిక కధలను బట్టి వేదార్ధాలను ,వేదార్ధాలను బట్టి పురాణ కధలను సమన్వ యించే పనికి పూను కొన్నారు .

               1912 లో స్వగ్రామం కలువ రాయి చేరి తండ్రి అవసాన కాలం లో దగ్గరుండి అంత్యక్రియలు చేసి ,అరుణాచలం చేరి రమణ దర్శనం చేసి గోకర్ణ ములో ‘’నాన్న బేలా ఆశ్రమం ‘’లో జరిగిన ‘’జ్యోతిష్టోమం ‘’కు బృహస్పతి గా ఉండి యజ్న కర్మలను మంత్రార్ధాలను సంస్కృతం లో సుబోధకం గా వివ రించారు .కన్నడం లో అనర్గళం గా ఉపన్య సించి అందర్నీ ఆశ్చర్య పరవశులను చేశారు నాయన ..తర్వాతా సికందరాబాద్ వచ్చిజంత నగర వాసులు చాలా మందికి మంత్ర దీక్షనిచ్చారు .అక్కడికి దగ్గర్లో ఉన్న ‘’కర్కేలి ‘’లో నాలుగు నెలలు తపోదీక్ష లో ఉన్నారు .అమ్మ తో ఉత్తర దేశ యాత్రలు చేసి ,ఆమె భువనేశ్వరం లో పాక మహిమ ,అక్షయ సిద్ధి పొందింది ..మండసా చేరి తల్లి తద్దినం పెట్టి ,రాజా వారి కోర్కె పై ఇద్దరు అక్కడే చాలా కాలం ఉండి పోయారు .అక్కడి కొండపై ఉన్న శివ లింగానికి ‘’దాహార గోకర్నేశ్వరుడు ‘’అని నాయన పేరు పెట్టారు ..తనలో పరశు రాముని తేజం ప్రవేశించి నట్లు గుర్తించారు .

             1917 లో అరుణా చలం చేరి విరూపాక్ష గుహలో రమణుల అనుమతి టో ఉండ టానికి అనుమతి పొంది గుహకు వస్తే కాపలా వాడు తాళం చెవి ఇవ్వక పోతే క్రోధాగ్ని ప్రజ్వలింప జేషారు .తర్వాతా పశ్చాత్తాపపడి ‘’ఇంద్ర స్తుతి ‘’చేస్తే విపరీతం గా వర్షం పది దేవాలయ రధం పై పిడుగు పది గండం తప్పింది ..రమణులు నాయన టో ఇంకా కోపం ఎవరి మీద చూప్నని శపథం చేయించి ,స్వహస్తాలతో పెరుగు అన్నం టిని పించారు నాయనకు ..రమణుల తో పాటు స్కందాశ్రమం లో ఉంటూ ‘’దశ మహా విద్యా సారం ‘’ను 475 సూత్రాలను మూడు రోజుల్లో రాశారు .’’రమణ గీత ‘’ను రాసి ,పది వీడు వెళ్లి నలభై రోజులు తపం చేశారు ..శ్రీ రమణుల తమ్ముడికి ,తల్లికి సన్యాస దీక్ష నిచ్చి మళ్ళీ స్వగ్రామం కలువ రాయి వెళ్లారు .కొడుకు మహాదేవుడి వివాహం చేసి సికందరాబాద్ చేరి 1919 డిసెంబర్ దాకా ఉండి స్వరాజ్య ఉద్యమ సంనాహాని చూసి సంబర పడ్డారు .గాంధీ ని ‘’మైత్రేయ రుషి ‘’గా నాయన గుర్తించారు ..అమ్మ తో మద్రాస్ వెళ్లి ‘’రాజ యోగా సారం ‘’రాశారు .

                  1922 లో అరుణా చలం చేరి ‘’ఉమా సహస్రం ‘’సంస్కరించి ,’’ఇంద్రాణీ సప్తశతి ‘’రచన మొదలెట్టారు .వెన్నెముక లో విపరీత మైన నొప్పి శిరో వేదన తో బాధ పడ్డారు .రమణ మహర్షికి చీటీ ద్వారా తెలియ జేసినా సమాధానం రాలేదు .అర్ధ రాత్రి గుహలో నాయన శిరస్సు నుంచి ‘’తప్ ‘’అనే ధ్వని తో పెద్ద శబ్దం గుహ బయటి వారికి కూడా విని పించింది .చంద్ర కాంతి వంటి జ్యోతి గుహ పైకప్పు ను తాకింది .నాయన శరీరం నుండి దత్త మైన పొగలు బయటికి వచ్చాయి .శీర్ష కపాల భేదనం జరిగి అమ్రుతప్రాప్తి లభించింది .బాధ అంతా మాయ మైంది .రమణులు వచ్చి తనతో తీసుకొని వెళ్లి పాలు తాగించారు .నాయన నెట్టి మీద అరచెయ్యి వెడల్పున వెంట్రుకలు ఊది పోయాయి .రమణ మహర్షి నాయన కు సపర్యలు చేయించారు .ఇంద్రాణీ సప్త శతి పూర్తీ చేసి పది వీడు వెళ్లి అక్కడ దాన్ని పతించారు .రేణుకా దేవి ప్రత్యక్షమై ఆశీర్వా దించింది

                      నాయన –స్త్రీల స్వాతంత్ర్యానికి ,పంచముల దీన స్తితి తొలగించటానికి ,వేదార్దాల సందేహాలు తీర్చటానికి ,వర్ణ భేదాలు తొలగి పోవటానికి ఇంద్రాణి ని ప్రార్ధించారు .దేశ వైభవం కోసం ఆయన చేసిన శ్లోకాలు చిర స్తాయి గా నిలిచి పోయాయి .1922 లో రమణుల తల్లి అలఘమ్మ మరణిస్తే .సమాధి కట్టించి దానిపై రమణులు స్తాపించిన శివ లింగానికి ‘’మాత్రు భూతేశ్వర లింగం ‘’అని నాయన పేరు పెట్టారు .1923 లో ‘’ఉమా సహస్రం ‘’ను శ్రీ రమణులకు సమర్పించారు .అది 1942  లో అచ్చయింది .

      చివరి భాగం తరువాత రాస్తాను .

సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —8-6-12-కాంప్—అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.