అమెరికా ఊసులు –1
అమెరికాపన్నెండవ ప్రెసిడెంట్ గా ఫ్రాంక్లిన్ పిఎర్స్ ఉన్న కాలం లో అమెరికా లో ప్రఖ్యాత రచయితలు ,తత్వ వేత్తలు కవులు ఉండే వారు ..వారి లో నతానియాల్ హతారన్ ,,లాంగ్ ఫెలో ,మెల్విల్లే ,ఎమేర్సన్ ,హెన్రీ డేవిడ్ తోరో లతో పాటు అమెరికా కు చెందినా అసలైన కవిత్వాన్ని సృష్టించిన వాడు ,అమెరికా ఆత్మను తట్టి లేపిన వాడు ,అగ్గి పిల్లా కుక్క పిల్లా కాదేది కవిత కనర్హం అని శ్రీ శ్రీ కి ప్రేరణ నిచ్చి సమస్త వృత్తుల వారికి కవిత్వం లో స్థానం కల్పించి ,అమెరికా జాతీయ కవి అని పించు కొన్న వాడు ‘’గడ్డి పరకలు ‘’అనే దీర్ఘ కవిత రాసిన వాడు వాల్ట్ విట్మన్ కూడా ఉన్నాడు .ఇందులో తోరో గారు గాంధీని ప్రభావితం చేసిన వాడు .ఆయన ఎక్కడో అడవి లో జనాలకు దూరం గా వాల్డెన్ పాండ్ దగ్గర ఉండే వాడు .రుషి జీవితం గడి పాడు .అమెరిక న్ రుషి అని పించుకొన్నాడు .అడవి లోని ప్రక్రుతి తనకు ఒంటరిగా ఉన్నప్పుడు అనేకం బా బో ధించిందని చెప్పాడు .సాధారణ జీవితం గడి పాడు అన్నీ ఉన్నా ,అంత రంగ సంగీతాన్ని విన మని ప్రబోధించాడు .
వాల్ట్ విట్మన్ గొప్ప కవిత్వం ర్రాసినా ,ఆయన రాసిన’’ లీవెస్ ఆఫ్ గ్రాస్స్ ‘’ కవిత ను ఎవ్వరు ముద్రించటానికి ముందుకు రాలేదు .ఆయన కవిత్వం అతి సాధారణం గా ఉందన్నారు .విప్లవాత్మకం గా ఉందన్నారు .అప్పటి దాకా ఇంగ్లాండ్ ప్రభావం తో అమెరికా కవులు రాస్తున్నారు .దీన్ని వదిలి కొత్త మార్గం తొక్కాడు విట్మన్ ‘’.అందరి మాన్ ‘’ అయాడు .విసుగెత్తి తన పుస్తకాన్ని స్వంత చమురు వదిలించుకొని అచ్చేసి వదిలాడు .అది సూపర్ డూపర్ హిట్ అయింది .అప్పుడు తెలిసింది అసలు కవిత్వం అంటే ఏమిటో /తమ ఆత్మను తట్టి లేపాడు విట్మన అని భావించారు .అదే పని ని వచనం లో మార్క్ ట్వేన్ చేసి చూపించాడు .అసలు అమెరికన్ వచనానికి పదును పెట్టాడు .సజీవమైన పాత్రల్ని సృష్టించాడు .వాడుక భాష ను రాశాడు .పాత్రలలో పరకాయ ప్రవేశం చేశాడు .విస్తృతం గా పర్యటించాడు .ఇదీ అమెరికన్ భాష అని రాసి చూపించి మెప్పు పొందాడు నిద్రిస్తున్న అమెరికా జాతిని జాగృతం చేశాడు .భాష లో భావం లో ఎన్నో మార్పులు తెచ్చాడు .అతను రాసినవీ హిట్టు పై హిట్టులే ..విట్మన్ ,మార్క్ ట్వేన్ లకు అమెరికన్ జాతి సర్వదా రుణ పడి ఉంటుంది .విట్మన్ కవితా పుస్తకాన్ని జాన్ విత్తర్ అనే కవి ‘’ఇదేమి కవిత్వం ?’’అని తగల బెట్టాడు .కాని దీన్నే ఎమర్సన్ తాత్వికుడు విల్త్మన్ కవిత్వాన్ని మెచ్చుకొని వెన్ను తట్టాడు .అది ‘’free and great thought ‘’అన్నాడు ఆ మహా రచయిత .అయితే విట్మన్ గొప్పతనం ఆయన చని పోయిన తర్వాతే ప్రపంచం బాగా అర్ధం చేసుకొన్నది .
i celebrate my self ,and sing my self –and what i assume you shall aassume –for every atom belonging to –as good belongs to you ‘’అన్నాడు విట్మన్ leaves of grass లో .
అమెరికా లో నల్ల జాతి అస్తిత్వాన్ని నిలబెట్ట టానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి మార్క్ ట్వేన్ నవలల్లో వాళ్లకు స్తానం కల్పించి వారి భాష మాట్లాడించాడు .harriet Beacher Stowe అనే రచయిత్రి uncle tom’s cabin ‘’ అనే నవలలో బానిసత్వం పై తిరుగు బాటు బోధించింది .దక్షిణ రాష్ట్రాలలో ఈ నవల సంచలనం రేకెత్తించింది .1852లో ఇది ప్ర చురిత మై బానిసల కడగండ్ల ను కళ్ళకు కట్టించింది .బానిసల తిరుగు బాటు కు మార్గ దర్శకత్వం వహించింది .ఆ పుస్తకం అంత ర్జతీయం గా బెస్ట్ సెల్లార్ అని పించు కొంది .ఒక మిలియన్ కాపీలు అన్ని భాషల్లో అమ్ముడు అయాయి .దీని ప్రభావాన్ని చూసి ఎమర్సన్ మహాశయుడు ‘’ఇది విశ్వ హృదయాన్ని తెలియ జేసింది .అందరు అదే ఉత్కంత తో చదివారు .వంటింట్లో కారిడార్లో క్లాసుల్లో ఎక్కడ చూసినా దాన్ని చదివే వారిని చూశాను ‘’అన్నాడు .ఎమర్సన్ గారి ముద్ర పడింది అంటే ఆ కాలం లో ‘’తాతా చార్యుల ముద్ర ‘’పడిందన్న మాట .అంత గౌరవం .ఎమర్సన్ అంటే .మన ప్రాచీన మహర్షుల స్థానమే .ఆయన్ను ఎక్కువ గా ఉదాహరిస్తుంటారు మన వాళ్ళు .ఆయనకూ ఇండియా అంటే పరమ గౌరవం ,ఆదరం .మన క్లాసిక్స్ అన్నీ ఆయనకు కరతలా మలకాలే .ఇలా ఎమర్సన్ ,విట్మన్ మార్క్ ట్వేన్ ,స్టీవ్ లు సాధారణ జన ఘోష ను ,వారి అనుభవాలను గురించి రాసి ,వారి హృదయాలను ,పాథకుల హృదయాలను స్పందింప జేశారు .
మాములుగా అందరు అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ తన కొడుకు చదివే స్కూల్ ఉపాధ్యాయుడికి రాసిన ఉత్తరాన్ని ఉదాహరిస్తుంటారు .కాని అమెరికా ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ పేయర్స్ లింకన్ గారి అబ్బాయి చని పోతే రాసిన ఉత్తరాన్ని ఎవరు గుర్తుంచు కోరు .అదే ఇది –
‘’the impulse to write you ,,the moment i heard of your great domestic affliction was very strong ,but it brought back the crushing sorrow which be fell me just before i went to washington ,in 1853 ,with such power that i feel your grief to be too sacred for instruction .even in this hour ,so full of danger to our country ,and of trial and anxietyto all good men ,your thoughts will be ,of your cherished boy ,who will nestle in your heart ,until you meet in that new life ,where tears and toils and conflicts will be unknown ‘’
ఈ ఉత్తరాన్ని one of the most moving letters గా సాహిత్య కారులు భావిస్తారు .ఒక ప్రెసిడెంట్ కు ఇంకో పదవీ విరమణ చేసిన ప్రెసిడెంట్ రాసిన జాబు ఇది .ఇక్కడ ఇంకో విషాదం ఏమి టంటే పియర్స్ సంతానం అంతా చిన్నతనాలలోనే చని పోయారు .అంతే కాదు ఆయన ప్రెసిడెంట్ గా ఎన్నికై పదవీ బాధ్యతలు చేబట్ట టానికి కొన్ని రోజుల ముందు రైల లో ప్రయాణం చేస్తుండగా ఒకరైలు దుర్ఘటన లో ఉన్న ఒక్క గానోక్క కొడుకు మరణించాడు .కనుక పుత్రశోకం అంటే ఏమిటో పూర్తిగా ఫ్రాంక్లిన్ కు తెలుసు .అందుకే అంత గొప్పగా స్పందిన్చాదాయన . పియర్స్ కోక్కగానోక్క కొడుకు పోయినప్పుడు ఆయన ‘’ i have lost the center of my hopes ‘’ అని దుఃఖ పడ్డాడు .ఆ బాధ తోనే వైట్ హౌస్ లో కాలు పెట్టాడు పాపం విధి వంచితుడు .
ఫ్రాంక్లిన్ న్యుహాంప్ షైర్ వాడు .అమెరికా లో ముందు నుంచి ఉన్న పదమూడు కాలనీ లలో అది ఒకటి .కెప్టెన్ మార్టిన్ ప్రింగ్ 1603లో అక్కడ కాలు పెట్టిన మొదటి ఆంగ్లేయ పరిశోధకుడు .తర్వాతా రెండేళ్లకు సామ్యుయాల్ డే చాంపియన్ అనే ఫ్రెంచ్ వాడు అక్కడికి వెళ్లాడు .అంతే కాదు ఆ రాష్ట్రం బ్రిటీష వారి నుండి మొదటిగా స్వాతంత్రాన్న5-1-1 776 లో ప్రకటించుకొన్న రాష్ట్రం కూడా .అయితే పూర్తీ స్వాతంత్రం రెండేళ్ళ తర్వాతా పొందింది .ఆ రాష్ట్రం విధానం అప్పుడు ‘’live free or die ‘’.న్యు ఇంగ్లాండ్ రాష్ట్రాల్లో అదొకటి .అక్కడ చాలా సరస్సులు జల ప్రవాహాలు చేపలు పట్టటానికి అనుకూలం గా ఉంటాయి .అక్కడి ఆదివాసులను ‘అబెనాకి ఇండియన్స్ ‘’అంటారు .అక్కడి గొప్ప వైన white mountains ఉన్నాయి .వాటిలో ఎత్తైన శిఖరం 6,288అడుగుల ఎత్తున్న మోంట్ వాషింగ్తన్’’ ఈ రాష్ట్రం అనేక వస్తువుల ఉత్పత్తి కేంద్రం .ప్రత్తి మిల్లులు ,పేపర్ మిల్లులు యంత్ర సామగ్రికి పేరు .అట్లాంటిక్ సముద్ర తీరం లో ,మేర్రిమాక్ ,కనెక్టికట్ నదీ తీరాల్లో లెక్కలేనన్నిఫాక్టరీలున్నాయి .
సశేషం —మీ గబ్బిట దుర్గా ప్రసాద్ —10-6-12—కాంప్—అమెరికా .