సిద్ధ యోగి పుంగవులు –6
ఆత్మారామధన యోగి –జగన్నాధ స్వామి
సవరింపు –గణపతి ముని గారి వ్యాసం-5-అందులో మూడు భాగాలు అందులోవే .కనుక అదంతా అయిదు కిందే లెక్క .ఇప్పుడు 6 –జగన్నాధ స్వామి గారిది అని గమనించగలరు
వైశ్య కులం లో జన్మించి ,భగవదాదేశం గా అనేక పెద్ద దేవాలయాలను నిర్మించి ,తనకు జయన్తులక్కర్లేదని ఆరాధన చాలు నని ఆరాధన అంటే ఆత్మా అనే రామ ధనాన్ని సంపాదించటమే నని గొప్ప అర్ధం చెప్పిన యోగి జగన్నాధ స్వామి .
ఒంగోలు లో కోట సుబ్బయ్య ,కావమ్మ , దంపతులకు11-8-1885న జగన్నాధ స్వామి జన్మించారు ..పసివాడుగా ఉన్నప్పుడే ఉయ్యాలలో యోగాసనాలు వేసే వాడు ..మహర్షులు సూక్షమ రూపం లో వచ్చి మాట్లాడి వెళ్ళే వారట ..మిథాయి దుకాణం లో కొంత కాలం పని చేశాడు .ఒక సారి కోతి కొమ్మచ్చి ఆడుతుంటే కేశవా రాజ యోగీంద్రులు వచ్చి ఆకాశ మార్గం లో తీసుకొని పోయి శ్రీ శైల గుహల్లో దింపాడు .అక్కడి మహర్షులు పరకాయ ప్రవేశం వంటి మహా సిఇద్ధులు నేర్పారు .త్రిమూర్తులు ప్రత్యక్షమై మానవ లోకం లో దేవాలయాలను నిర్మించి భక్తిని ప్రచారం చేయమని ఆదేశించారు .ఆయనతో ఆడు కొంటున్న పిల్లలు ఇతడు కని పించక పోయే సరికి కంగారు పడ్డారు .కొన్ని రోజుల తర్వాతా ఆయన ఇంటికి వచ్చి ,జరిగినవి అందరికి చెప్పాడు .ఒక సారి పొరలు దండాలు పెట్టు కొంటు ఒక చోట ఆగి అక్కడ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించమని గురువైన లక్ష్మీ కాంత యోగికి చెప్పాడు .వెంటనే అక్కడ దేవాలయం నిర్మించారు .నల్లపాడు లో నరసింహ స్వామి కొండ పై శివ కేశవులు ప్రత్యక్షమై యోగావిద్యను ,మంత్ర ఉపదేశాలు చేసి ధార్మిక ప్రవృత్తిని ప్రజల్లో ప్రచారం చేయమని కోరారు .దాని ప్రకారం ఎల్లలూరు ,మంచాల ,చేబ్రోలు ,బ్రాహ్మణ కోడూరు లలో భక్తినీ ,యోగాన్ని విస్తృతం గా ప్రచారం చేశారు .
జగన్నాదునికి చెంచంమ తో వివాహం జరిగింది .ఆమె కొద్ది కాలానికే మరణిస్తే కోటి రత్నమ్మ తో మళ్ళీ పెళ్లి జరిగింది .సీతమ్మ అనే ఆడ పిల్ల పుట్టింది .భార్యకు రోజు ఇరవై ఒక్క ఇళ్ళల్లో భిక్ష చేసుకొని బ్రతకమని చెప్పి ,ఆనదాశ్రమం చేరాడు .భార్య మరణిస్తే ,పిల్లను బాపట్లకు తీసుకొని వచ్చాడు .అక్కడ బొమ్మి సెట్టి సుబ్రహ్మణ్యం ,శేషారత్నం దంపతులు స్వామికి భిక్షనిచ్చే వారు .ఒకసారి భక్తులందరూ కలిసి కలశ పూజ పెద్ద ఎత్తున చేసి అన్నదానం చేశారు .అప్పుడు ఆకాశం మేఘావృత మై విపరీతం గా వర్షం కురిసేట్లుంది .చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపెయే ప్రమాదం వచ్చింది .స్వామిమేఘాలను తొలగి పొమ్మని ఆదేశిస్తే అవి ఎక్కడికో వెళ్లి పోయాయి .చుక్క వర్షం కూడా పద కుండా సంతర్పణ జరిగి స్వామి మహిమ బయట పడింది .
జగన్నాధ స్వామి ఉత్తర ,దక్షిణ యాత్రలు చేశాడు ..కాశీలో భక్తులతో గంగలో పవిత్ర స్నాలాను చేయిస్తుండగా వారు ‘’స్వామీ ! మా పాపాలు పోయాయి అనటానికి రుజువేమిటి ?’’అని అడిగారు .స్వామి వారితో ప్రార్ధన చేయించి తమ చేతి లో గంగా జలాన్ని విడువమని చెప్పాడు ..అప్పుడు కొన్ని పీపాల నూనె పోసినట్లు గంగ నీటి పై నూనె తెట్టు వ్యాపించింది .అంటే వారి పాపాలన్నీ పంకిలమై బయటికి తెట్టు లాగా కొట్టుకు పోయాయన్న మాట .
నల్లపాడు లో ఉండగా కేశవా రాజ యోగి ఆయన్ను ఆవేశించి ఒక పుడకతో ఇసుక మీద ఆలయ నిర్మాణానికి ప్లాన్ గీసి .కకోమ్మమూరు నరసింహం అనే కారణం దాన్ని కాగితం మీద కాపీ చేశాడు .దేవాలయ నిర్మాణం కోసం తగిన స్థలం కోసం వేడుకు తున్నాడు స్వామి ..చీరాల నుండి పొన్నూరు దాకా పొరలు దండాలు పెట్టు కుంటూ అక్కడి బస స్టాండ్ ఎదురుగా ఆగిపోయాడు .అది మహర్షులు పూర్వం తపస్సు చేసిన భూమి అని గుర్తించి అక్కడే దేవాలయాన్ని కట్టాలని సూచించాడు .విరామం లేకుండా చుట్టూ ప్రక్కల గ్రామాలన్నీ తిరిగి చందాలు వసూలు చేసి 1108 మందిడంపతులతో ‘’సహస్ర లింగేశ్వర స్వామి ఆలయం ‘’కట్టించారు .స్వామి ఆదేశం ప్రకారం ఎడ్ల పాడు కొండ దగ్గర రెండేళ్లు నిష్టగా ఉండి కనిగాల్పుల ఆంజనేయులు ,జాలమ్మ దంపతులు రెండు తాడి చెట్ల ఎత్తున వుండే రాయిని తీయించి చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నెలకొల్పారు ..ఆ కొండమీద ఉండే చిరుత పులులు ఈ దంపతుల జోలికి రాకుండా స్వామి కట్టడి చేశాడు .కొన్ని వేల మందికి దీక్షలనిచ్చి జపాలు చేయించారు .బొంబాయి నుంచి పెద్ద ట్రాలీలు తెప్పించి దానిపై ఆ భారీ విగ్రహాన్ని చేర్చి 100 జతల ఎడ్ల తో దాన్ని లాగించి చేబ్రోలు వంతెన దాకా తెప్పించారు .వంతెన కూలి పోతుందని ప్రభుత్వం అనుమతించలేదు .స్వామీ తాను పూచీ వహించ ,యే ప్రమాదం లేకుండా వంతెన దాటించి యోగాబలం తో పొన్నూరు దేవాలయ ప్రాంగణానికి తెప్పించారు .ఆంజనేయ గరుడ విగ్రహాల ప్రతిష్ట అత్యంత వైభవో పేతం గా జారి పించారు .ఆంజనేయులు దంపతులకు ఒక పిల్లాడున్నాడు .దంపతులను వైకుంఠానికి పంపుతాను వెళ్తారా అని అడిగారు స్వామి వారు వద్దు అన్నారు .అప్పుడు వారి పుణ్య ఫలాన్ని కొడుక్కు ధారా పోయించి ,అతన్ని వైకుంఠం పంపారు జగన్నాధ స్వామి .అతని సూక్ష్మ శరీరం ఆంజనేయ ఆలయం లో ఉండేట్లు చేసి ,ఆ దేవాలయానికి గొప్ప ప్రచారం కల్పించారు .జాలమ్మ చేత 108ఏకాదశీ వ్రతాలు స్వామి చేయించారు .
ఒక సారి శ్రీశైల యాత్ర చేస్తూ కాలినడకన భక్తులతో వెళ్తూ కొండమీద నుంచి లోయ లోకి జారి పడ్డాడు .ఒక మహర్షి ఆయన పది పోకుండా ఒళ్ళోకి తీసుకొని స్వామి నాలుక పై బీజాక్షరాలు రాశాడు .వేరొక సారి కేశవా రాజ స్వామి జగద నాధస్వామి ని జీవుడిని పర లోకాలకు తీసుకొని వెళ్లి ,త్రిమూర్తుల లోకాలు చూపించి నాలుగు గంటల తర్వాతా మళ్ళీ ఆనందాశ్రమం లో చేర్చాడు .స్వామి నల్లపాడు నరసింహ స్వామి కొండ పై తిరుగుతూ ఉంటె కేశవ స్కామి వచ్చి ఆయన పొట్ట ను గొల్ల తో చీల్చి ,ఒక గొట్టం లాంటి నరం పెట్టి మూసేశాడు ..అప్పటి నుడి పరక్సాయప్రవేశ విద్య అలవడింది .కేశవస్వామి చెప్పి చూపించిన చెట్టు ఆకులు తిని రెండు నెలలు ఆకలి దప్పులు లేకుండా గడిపాడు .చెట్లు ఎక్కి దూకటం ఆయనకు అలవాటు .కొమ్మ నుంచి కొమ్మకు దూకటం తో పూరకం ,చిటారు కొమ్మ కు ఎగరటం టో కుంభకం ,,కింది కొమ్మ మీదికి దూకటం లో రేచకం కేశవ స్వామే నేర్పారు .ఆయనకేమీ దెబ్బలు తగిలేవి కావు .
కాల భైరవ ఆలయాన్ని అమరా రాదా కృష్ణ మూర్తి దంపతులచే కాల భైరవ ఆలయాన్ని కట్టించారు .ఆపరేషన్ లేకుండా మద్దుల వెంకట రత్నమ్మ కు బల్ల వ్యాధిని పోగొట్టారు .నొసట బొటన వ్రేలితో నొక్కి సుబ్రహ్మణ్యం అనే భక్తుడి జ్వరం తీశేసి తాను పొందాడు .స్వామి ఒక సారి అరకాయ ప్రవేశం చేస్తున్నాడు .దాన్ని ఎవరు చూడ కుండా ఒక గదిలో చేయాలి .ఎమ్జరుగు తుందో చూద్దామని ఒకడు ఆ గడి లో ఆటక ఎక్కి కూర్చున్నాడు .స్వామి హంసను వదిలాడు .అప్పుదేర్పడిన ప్రకాశానికి అటకెక్కిన తుంటరి రెండు కళ్ళు పోయాయి .మాటలు రాణి వాడికి మాటలు నేర్పాడు .ఒక సారి చందోలు వెళ్లి వెంకటేశ్వర్ల అనే ఆయన ఇంటి అరుగు మీద కూచున్నాడు .ఎవరు పలకరించలేదు .అప్పుడు ఆ వూరి బ్రాహ్మీ మూర్తి అమ్మ అనుగ్రహానికి పాత్రులై ఏది పలికితే అది జరిగే తాడే పల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు చూసి వెంకటేశ్వర్లకు కబురు చేసి ఆడరించేట్లు చేశారు .భగవద్గీత నేర్పమని బొమ్మి శెట్టి సుబ్రహ్మణ్యం అనే అతను కోరితే చెంబు లోని నీళ్ళు మూడు దోసిళ్ళు ఇచ్చి తాగించాడు ,తెల్లారేసరికి భగవద్గీత వచ్చేసింది ఆయనకు .ఇలాంటి వెన్నో మహిమలు చూపాడు స్వామి .
భక్తులు జగన్నాధ స్వామికి ఏటేటా ఆరాధనోత్సవాలు జరిపే వారు .జయన్తులను జరుపుకొనే వారు కాదు .దీనికి కారణం ఏమిటని ఆరాధన అంటే ఏమిటని ప్రశ్నిస్తే ‘’ఆ అంటే ఆత్మా అని ,రా అంటే రాముడని ,ధన అంటే ధనం అనీ చెప్పారు అంటే ‘’ఆత్మా రాముడు అనే ధనం సంపాదించాను .కనుక నాకు ఆరాధనే సరి అయినది ‘’అని విస్పష్టం గా చెప్పాడు 10-9-1974 లో జగన్నాధ స్వామి శరీరం చాలించారు .భాద్ర పద నవమి నాడు స్వామి ఆరాధనోత్సవాన్ని భక్తులు వైభవం గా నిర్వ హిస్తున్నారు .
మరో యోగికద మరో సారి
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10-6-12.—కాంప్ –అమెరికా .