అమెరికా డైరీ ఈల లీలామృత వర్షిణి వారం

      అమెరికా డైరీ

                                                          ఈల లీలామృత వర్షిణి వారం

       ఈల లీలాలోలుడు ,ముఖ వంశీ ,గళ మురళి శ్రీ కొమర వోలు శివ ప్రసాద్ గారు కిందటి వారం లో మొదటి రెండు రోజులు అంటే నాలుగు ,అయిదు తేదీలు –సోమ ,మంగళ వారాలు శార్లేట్ నగరం లో ఉండి రసజ్నులకు ఈలా వినోదాన్ని పంచారు .సోమవారం సాయంత్రం శ్రీ చక్ర వర్తి ,అనిలా దేవి దంపతుల ఇంట్లో సాయి భజన లో పాల్గొన్నారు .సాయి బృందం లో ని సభ్యులు బెల్లం కొండ రవి ,ఉషా దమతులు ఇండియా వెళ్లి పోతున్న సందర్భం గా ఆత్మీయ సమావేశం జరిగింది .వారిద్దరికిహృదయభారం తో వీడ్కోలు చెప్పాము .కేక్ కూడా కట్ చేయించారు .దాదాపు గంట సేపు శివప్రసాద్ తమ ఈల లీల ను అన్ని రకాలుగా ప్రదర్శించి ,అన్ని రకాల భజన కీర్తనలను పాడి ,జనంతో పాడించి భక్తీ ని రాశీ భూతం చేశారు .ఆయన మిషన్ చాలా అద్భుతం గా పండింది .ఆ తర్వాతా విందు ఏర్పరిచారు .నలభై మంది కి పైగా హాజరై,ఆసాంతం విని తరించారు .చపాతి కూర ,బిర్యాని ,సాంబారు ,పెరుగన్నం ,మామిడి పల్ల ముక్కలు ,పుచ్చముక్కలు ,పరవాన్నం తో విందు ఇందించారు .ఒక రకం గా రెండు విన్డులందు కొన్నాం .ఒకటి ఈల విందు ,రెండు భోజన విందు .ఆ దంపతుల ఆత్మీయత చాలా బాగా ఆకర్షించింది .అందరు ఒక కుటుంబ సభ్యుల్లా కలిసి పోయారు .రవి వాళ్లకు మన వాళ్ళందరూ గిఫ్ట్ అంద జేషి ,గ్రూప్ ఫోటో తీయించు కొన్నారు .

            మర్నాడు మంగళ వారం మధ్యాహ్నం శివ ప్రసాద్ గారు భోజనానికి మా ఇంటికి వచ్చారు .కారట్ హలవా ,మామిడికాయ పప్పు ,వంకాయ కూర ,కొబ్బరి చట్ని ,అన్నం ,సాంబారు ,పెరుగు ,ఒడియాలు ,ఆవకాయ తో విజ్జి భోజనం వడ్డించింది .మేమిద్దరం కలిసి భోజనం చేశాం .ఆయన ఈ వంటా ,వాతా వరణం చాలా బాగా ఉన్నాయని మెచ్చు కొన్నారు .నాకు వారి సిడి లు రెండు కానుక గా ఇచ్చారు ,మా అమ్మాయింకి ఒకటి ఇచ్చారు .మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు ‘’టోరి’’లైవ్ రేడియో ప్రోగ్రాం చేశారు ఇక్కడే ఉండి .శ్రీమతి నాగ మణి గారు చాలా హుందాగా ,విశ్వాసం గా నిర్వహించారు .చాలా నిదానం గా తన జీవితాన్ని ,చదువు ,దీనిలోకి ప్రవేశించిన విధానం ,ఎదిగిన పద్ధతి  తనకు వెన్నెముక గా నిలిచినా వ్యక్తులు గురించి రెండు గంటలు అనర్గళం గా వివ రించి శ్రోతలను ఆకట్టు కొన్నారు .నేను ప్రక్కనే ఉండి ,కొన్ని ప్రశ్నలడిగి సమాధానం రాబట్టాను .ఆ రాత్రి మా ఇంట్లో భజన జరిగింది .శివ ప్రసాద్ గారు ‘’ఆంజనేయ వీర ,హను మంత శూరా ‘’అనే కీర్తన తో పాటు ఇంకా కొన్ని పాడి మంచి అనుభూతి కల్గించారు .హిందీలో ‘’చౌదవీక చాంద్ హో ‘’తెలుగు లో ‘’నా హృదయం లో నిదురించే చెలీ ‘’,’’లాహిరి లాహిరి లాహిరి లో ‘’పాడి విని పించి ఎక్కడికో తీసుకొని వెళ్లారు .ప్రతి పాటకు చప్పట్లు చరచి భిమానాన్ని చాటాం .నేను ‘’సరసభారతి’’ తరఫున ‘’శ్రీ హనుమత్కదా సుధా   ‘’ను వారికి అందరి సమక్షం లో కానుక గా ఇచ్చాను .ఇండియా వెళ్లి నప్పుడు విజయ వాడ వైపుకు వస్తే తప్పక ఉయ్యూరు రమ్మని కోరాం .తప్పకుండా వస్తామని హామీ ఇచ్చారు .నలభై మంది హాజరైన డిన్నర్ లో మా అమ్మాయి అల్లుడు మంచి పదార్ధాలు వడ్డించారు .నాగమణి ,గాయత్రి గార్లు సహాయం చేశారు .హల్వా ఇడ్లి సాంబారు ఉప్మా ,ఆవకాయ ,అన్నం పెరుగు ,పుచ్చముక్కలు తో పసందుగా విందు .అందరు ఆత్మీయం గా వచ్చి ఆనందం గా విని ఆనందించారు .ప్రక్కనున్న అమెరికన్స్ కూడా వచ్చి ఎంజ్జాయ్ చేయటం చాలా గొప్ప విషయం .ఇప్పుడు రేడియో లో శివ ప్రసాద్ గారు చెప్పిన సారాంశం తెలియ జేస్తాను

                                                             శివ ప్రసాదీయం

             తెలుగు వారికే ప్రత్యెక మైన రెండు ప్రక్రియలు ఉన్నాయి .అవి కవిత్వం లో అవధానం చేయటం .రెండు ఈల తో సంగీతాన్ని విని పించటం .ఈల పాటకు ఆద్యులు స్వర్గీయ కే.రఘు రామయ్య గారు .ఆయన పాడిన దానికి శివ ప్రసాద్ పాడిన దానికి తేడా ఉండి .ఆయన చూపుడు వ్రేలును మడిచి నోటిలో ఉంచి ,గాలి పీల్చి వదులుతూ ,ఈల వేస్తారు ,పద్యం పాడుతారు . ఆగాలి అయి పోగానే మళ్ళీ పీలుస్తారు .కనుక మధ్యలో విరామమ ఉంటుంది .ఆయన ఎక్కువగా పద్యాలే ఈల తో పాడే వారు .అది ఆయన ధోరణి .ఆయన పౌరాణిక నాటకాలు ,సిని మాలలో నారదుడు శ్రీ కృష్ణ పాత్రలు ధరించి బాగా ప్రఖ్యాతి పొందారు .ఆయనకు ఈల పాట ఒక హాబీ .కాని శివ ప్రసాద్ గారికి అది జీవన వేదం .ఉచ్వాస ,నిస్స్వాసాలలో రెండిటి లోను వీరు ఈలను పలికిస్తారు .కనుక గాప్ అనేది ఉండదు .ఒక మహా ప్రవాహం గా సాగి పోతుంది .ఆయన ఈల పాట పాడటానికి కొంచెం కష్ట పడి నట్లున్తుంది .వీరి పాట అలవోక గా ,సెలయేరు లా సాగి పోతుంది .కూర్చుంటే ఎన్ని గంట లైనా అలా పాడేస్తూనే ఉంటారు .విశ్రాంతి అక్కర్లేదు ..ఈల వీరికి ‘’శ్వాసావధానం ‘’అని పిస్తుంది .ఆయన మొదట దాన్ని స్టేజి గౌరవం కల్పిస్తే ,ప్రసాద్ గారు అంతర్జాతీయ వేదిక ను ఈల కు నిర్మించి ,అదొక గొప్ప కళ గా’’ ఆర్ట్ ఫాం ‘’గా ప్రచారం చేసి ,యేన లేని కీర్తి తాను పొంది ,ఈల కూ సంపాదించారు .

         ఈలలో అన్ని స్థాయిల్లో ను పాడగల సత్తా శివ  ప్రసాద్ గారిది .యే స్థాయిలోను ఎక్కడా పలకటం లో తేడా రాదు .అన్ని రకాలైన పాటలు ,అన్ని భాషల్లో పాడుతున్నారు .ఎవరికి వారు శివ ప్రసాద్ తమ వాడే అని పిస్తుంది .అంత బాగా మనస్సుల్ని రంజింప జేస్తారు .బయటకు వెడితే ఎప్పుడు పడితే అప్పుడు పాడ టానికి వీలుగా ‘’ట్రాక్ ‘’తయారు చేసుకొన్నారు .అది లక్ష రూపాయలకు పైనే ఖర్చు అయింది .అది ఉండటం చాలా హాపీ గా పా డ టానికి వీలవు తోంది .ఇంత అంతర్జాతీయ కళా కారుడు మామూలు ఇళ్ళల్లో కూర్చుని పాడటం అంటే ,ఆయన ఎంత ఉదార హృదయం గల వారో అర్ధం అవుతుంది .ఆయన అతి సాధారణం గా ఉంటారు .వేడి నీరే తాగుతారు .పెరుగు వేసుకోరు .ఆరోగ్య సూత్రాలను బాగా పాటిస్తారు .కళా  కారులు వ్యసనాలకు బలి పోవటం తనకు బాధ కలిగిస్తుందని ,అలాంటి వారి జీవితాలు తన కు గుణ పాథం అని  చెప్పారు .

                                                                   బాలమురళి ప్రభావం

            తనను బాగా ప్రోత్స హించిన వారు ముగ్గురు సంగీత కళా కారులు అన్నారు .ఒకరు వాగ్గేయ కారులు ,పద్మ విభూషణ్ శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ గారు .ఈల ఏమిటి ? వదిలెయ్యి .అది దేనికీ పనికి రాదు అని నిరుత్సాహ పరిచారు మహా మహా విద్వాంసులు .అప్పుడు బాల మురళి ఆదరించి మద్రాస్ లో తన ఇంట్లో ఉంచుకొని ,తన కుమారుడిగా చూసి శాస్త్రీయ సంగీతపు మెళకువలు నేర్పారు .తాను పాడి  ,ఈయనను అలాగే ఈల తో పలక మని ,దగ్గరుండి అమిత వాత్సల్యం తో నేర్పి ఈల కు శాస్త్రీయత కలగటానికి ,తన అభి వృద్ధికి ఎంతో తోడ్పద్దారని శివ ప్రసాద్ మురిసి పోతారు .బాల మురళి గారి భార్య అన్న పూర్ణ గారు నిజం గానే అన్న పూర్ణ .రోజు వారింట్లో ఎంత మంది వచ్చి ఆతిధ్యం తీసు కొంటారో లెక్కలేదు . .అందరికి వండి వడ్డించే ఇల్లాలు ఆమె అని రెండు చేతులు ఎత్తి నమస్కరించారు .పేరు సార్ధకం చేసుకోన్నారామే .మను చరిత్ర లో పెద్దన గారు ప్త్రవరాఖ్యుని ఇల్లాలిని ‘’వడ  నలయదు వేవురు వచ్చి రేని ,నడి కి రెయైన ‘’అన్న పద్యం జ్ఞాపకం వస్తుంది .అంతే కాదు బాల మురళి కుమారులు తనను ఒక సోదరునిగా కుమార్తెలు తమ్మునిగా చూశారని అంటారు .అల్లుళ్ళు ,కోడళ్ళు బాల మురళి గారిని ‘’నాన్న గారు ‘’అనే పిలుస్తారాట .’’మామ గారు ‘’అనరట .అంతటి సంస్కారం వారిది .మామ గార్ని తండ్రి లా భావించటం బాల మురళికి అరుదైన గౌరవం .అంతే కాదు రాత్రి బాలమురళి నిద్రించ టానికి ముందు అల్లుళ్ళు ఆయన కాళ్ళను ,పాదాలను ఒత్తి భక్తీ ని ప్రదర్శించటం తనకు ఆశ్చర్యమేసింది అంటారు శివ ప్రసాద్ .

            ఎందరెందరో సంగీత విద్వాంసులకు పరిచయం చేసి వారి ద్వారా నేర్చుకో దగింది నేర్పించారట బాల మురళి .తనకు తెలీకుండా నే తన తో ఈల పాటల కేసట్టు రికార్డ్ చేయించే పని చేబట్టి ఒక్క రోజు ముందు మాత్రమే చెప్పి చేయించారట .అంత ముందు చూపు ,ప్లాన్ బాలమురలికి ఉండేదట .తనకు తెలీకుండా రికార్డింగ్ సమయం లో బాల మురళి ,తన పాటలకు కంజీర  వాయించి మరీ ఆశ్చర్య పరిచారట .మిగిలిన కళా కారుల్లా తాను కింద కూర్చుని ,శివ ప్రసాద్ ను కుర్చీలో కూచో బెట్టి ఫోటో తీయిన్చుకున్నారట పద్మ విభూషణుడు .అదీ ఆయన గొప్ప తనం అన్నారు .బాల మురళి  దగ్గరే సంగీతం నేర్చిన అపర బాల మురళి అని పించుకొన్న డి .వి.మోహన కృష్ణ శివప్రసాద్ గారికి సహాధ్యాయి .తనే సీనియర్ అంటారు ప్రసాద్ .మోహన కృష్ణ వివాహం చేయించింది ,ఉద్యగం ఇప్పించిండీ గురువు గారే .

                                                                      బిస్మిల్లా ఖాన్ ,శ్రీనివాసన్ గార్ల ప్రేరణ  

            ప్రముఖ శ హనాయ్ విద్వాంసులు ,భారత రత్న బిస్మిల్లా ఖాన్ గారు శివ ప్రసాద్ గారి ఈల పాట విని ఎంతో మెచ్చుకొని ,ప్రోత్స హించారట .తన శాహనాయినీ ముందుగా ఎవరు ఆదరించలేదని ,ఆ తర్వా దానికి తాను స్టేజి గౌరవాన్ని తెచ్చిన తర్వాతే గుర్ర్టింపు లభించిందని ,ఇది మామూలే నని ,నిరాశ చెండ వద్దని బోధించారు .అలాగే శ్రీనివాసన్ గారు వయోలిన్ వాయిస్తూ శాస్త్రీయ విషయాలను దగ్గర కూర్చో బెట్టుకొని నేర్పి తన ఉత్సాహానికి ఉద్దీపన కల్గించారు .ఈ ముగ్గురు ప్రోత్సహించక పోతే తనకు శాస్త్రీయ సంగీతం లో అవగాహన వచ్చేది కాదని ,అది అలవడి నందు వల్లే తాను రాణిస్తున్నానని వినయం గా చెప్పారు .

                                                        కోన ప్రభాకర రావు ప్రభావం

          తానూ రఘు రామయ్య గారు గుంటూరు  జిల్లా నుంచి వచ్చిన ఈల కళా కారులం అని గర్వం గా చెప్తారు శివ ప్రసాద్ .తన’’ మెంటార్’’ కొన ప్రభాకర రావు గారని చెప్పారు .ఇద్దరిది బాపట్ల .తన తండ్రి , తాత గార్ల దగ్గర ఆయనకు బాగా పరిచయం వారంటే విపరీత మైన గౌరవం కొన గారికి ఉండే వనిఅందుకే తనను వీలైన చోట్ల కల్లా తీసుకొని వెళ్లి పరిచయం చేసి తనతో ఈల పాట పాడించే వారని .అంతగా ప్రోత్సహించే వారు అరుదు అని ప్రభాకర రావు గారు ఆంద్ర ప్రదేశ్ స్పీకర్ గా ,మహారాష్ట్ర గవర్నర్ గా పని చేయటం తనకు మంచి అవకాశాలు రావటానికి తోడ్పడ్డాయని బిస్మిల్లా ఖాన్ గారి వద్ద పాడే అదృష్టం బాల మురళి గారి ముందు పాడే అవకాశం అలానే కల్గాయని అన్నారు .ఆ నాటి ప్రధాని ఇందిరా గాంధి గారికి పది నిమిషాలు ఈల పాట విని పించే పర్మిషన్ కోన గారు పొంది ,తనను తోటి సహవాద్య కారులను తీసుకొని వెళ్లారట .ఈల మొదలైంది .ఆమె అన్ని కార్య క్రమాలను వాయిదా వేసుకొంటూ గంఅ సేపు అలానే కూర్చుండి పోయారట .అది మరపు రాని  సంఘటన అన్నారు .ఘన సన్మానం చేసి పంపారట .

           ఒక సారి బాపట్ల లోప్రముఖ హరికధకులు ,శాస్రీయ సంగీత విద్వాంసులు  ములుకుట్ల సదాశివ శాస్త్రి గారి హరికదను రామ నవమి పందిరి లో ఏర్పాటు చేశారట .ఆయన తెనాలి నుండి రావాలి .ట్రైన్ఒక గంట  లేటు .అందుకని తనను ఆయన వచ్చే దాకా ఈల పాట పాడ  మన్నారట .అలా ‘’అరంగేట్రం చేశాను’’ అంటారు శివ ప్రసాద్ .తన కుమారుడు ఫ్లూట్ వాయిస్తాడని మాన్దలీన్ ఈల కూడా బాగా చేస్తాడని ,కుమార్తె సంగీతం బానే నేర్చిందని ,తన భార్య సాధారణ గృహిణి అని తెలియ జేశారు .

          మీరు ఏమి సాధించారు ?ఇంకా ఏమైనా సాధించాలని అనుకొంటున్నారా /అని నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం గా ,ఈల కు శాస్త్రీయ స్థాయి కల్పించే తపన ఉందని ,ఈల కు విద్యా కోర్సు ను ఏర్పరచి యునివేర్సిటి స్థాయిలో ఒక సబ్జెక్ట్ గా చేయాలని ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని అను కొంటు న్నానని చెప్పారు .తనకు సంతృప్తి గా ఉందని ,సత్య సాయి బాబా అనుగ్రహం తనను  ఎంతో ముందుకు తీసుకొని వెళ్తోందని అందరికి ఈల ద్వారా ఆనందం పంచటం సేవ ,ప్రేమ లను ప్రపంచం అంతటా చాటి చెప్పటం తన బాధ్యత గా భావించి పని చేస్తున్నానని తెలియ జేశారు . నేను శివ ప్రసాద్ గారికోరిక తీరాలని చెబుతూ వారి ఈల కళ ను ప్రభుత్వం గుర్తించి అత్యంత ప్రతిష్టాకరమైన ‘’పద్మ పురస్కారం ‘’వారికి లభించాలని అందరి తరఫునా కోరాను .శివ ప్రసాద్ పాడ  టానికి కూర్చుంటే ,తాళం వేయటం ఊగి పోవటం ,తల అష్ట వంకర్లు తిప్పటం వంటి ఆర్భాటా లేమీ ఉండవు .ఒక మహర్షి ధ్యాన సమాధి లో ఉండి అనాయాసం గా ,అసంకల్పితం గా సంగీత శ్రోతస్విని జాలు వారుస్తున్నట్లు  ఉంటుంది .అది మాత్రం శివ ప్రసాద్ గారి ప్రత్యేకత .తాను తన్మయం అయి మనల్ని తన్మయులను చేస్తారాయన .కారణ జన్ములు . ఆయన నోట్లో మురళి ఉందా అన్నంత ఆశ్చర్యం వేస్తుంది .పదాలు తెలుస్తాయి .దాటివేయటం లేదు .ప్రతి పదం మనకు వినపడుతుంది .అక్షరం తెలీదు కాని అక్షర ధ్వని స్పర్శ ఫీల్ అవుతాం .ఆయనకు అన్ని వేళలా విజయ పరంపర లభించాలని కోరు కుంటున్నాం .శార్లేట్ నిజం గా ఈలామ్రుత వర్షిణి లో పునీత మైంది .

                                                           యాభై వసంతాల వివాహ వేడుక

                                   పదవ తేది శని వారం రేణు అనే విజ్జికి తెలిసిన అమ్మాయి వాళ్ల నాన్న గారి ,అమ్మగారి ‘’యాభై వసంతాల వివాహ వేడుక ‘’కు ఆహ్వానిస్తే వెళ్ళాం .తండ్రి గారు ప్రముఖ నాటక ,సినీ నటుడు వల్లం  నర సింహా రావు గారి అన్న కుమారుడు .ఈయన పేరు నరసింహారావు .భార్య సత్య వతి .కమ్యునిటి హాల్ హో ,రేణు కుమారుడు రిశభ్ పుట్టిన రోజు ఆమె మేనల్లుడి గ్రాడ్యుయేషన్ ,ఇదీ మూడు కలిపి చేశారు .మంచి కుటుంబం .ఆయనది కృష్ణా జిల్లా తిరువూరు .హిందుస్తాన్ ఏరో నాటిక్స్ లో పని చేసి రిటైర్ అయారు ..హైదరాబాద్ లో ఉంటున్నారు .అనుకో కుండా ఆయన తో పని చేసిన వడ్లమన్నాటి టి శర్మ గారు వచ్చారు. శర్మ గారు మా తమ్ముడు కృష్ణ మోహన్ కు బి.డి .ఎల్ .లో సహా ఉద్యోగి .అంతే కాక విజ్జి ఆడపడుచు బుల్లి మామ గారు బాగా తెలిసిన వాడు .అనుకోకుండా తమాషా పరిచయాలు ఇలా జరుగు తుంటాయి .విందు ఇచ్చారు .పది పైగాఐటమ్స్  వున్నా తిన్నాది పెరుగన్నమే . ఈ విధం గా ఈ వారం అంతా ఈలా వినోదం తో   విందులతో సరదా గా గడిచింది .

                 మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –12-6-  12 .  కాంప్–అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.