సిద్ధ యోగి పుంగవులు –10 యోగా ధ్య బలి – – కేశవ స్వామి భాగా నగర్కర్

       సిద్ధ యోగి పుంగవులు –10

                                                                యోగా ధ్య బలి – – కేశవ స్వామి భాగా నగర్కర్

           మహారాష్ట్ర నుంచి కొందరు యోగి పుంగవులు హైదరాబాద్ వచ్చి సిద్ధి పొంది ఇక్కడి మత మౌధ్యాన్ని న్ని పెకలించి ,సామాజిక ధార్మిక రంగాలలో చైతన్యం తెచ్చారు .అలాంటి వారిలో కేశవా స్వామి ప్రముఖులు .ఆయన భాగ్య నగర వాసి అని తెలియ జేయటానికి కేశవా స్వామి భావ నాగర్కర్ అంటారు .

    చత్రపతి శివాజీ మహా రాజు కు గురువు లైన అయిదుగురు మహాత్ములున్నారు .వారే సమర్ధ రామ దాస స్వామి ,జయరామ స్వామి వరగాన్కర్ ,రంగ నాద స్వామి నిగిదీ కర ,కేశవా స్వామి భాగా నాగర్కర్ ,ఆనంద మూర్తి బ్రహ్మ నాలాకర్ –వీరిని సమర్ధ పంచాయతనం అంటారు .

     కేశవా స్వామి మహారాష్ట్ర లో నీలంగా దగ్గర కళ్యాణీ నగరం .ఇప్పుడు అది కర్నాటక లోని బీదర్ లో ఉంది .అక్కడ రుగ్ శాఖ కు చెందినా గంగా బాయి ,ఆత్మా రామ్ దంపతు లకు గంగా బాయి 80 వ ఏట పండరి నాధుని అనుగ్రహం తో కేశవా స్వామి జన్మించారు .అయిదేళ్ళ వరకు మాటలు రాలేదు .అప్పుడు జగద్గురు శంకరాచార్యుల వారు  బాలుడి చెవిలో  మంత్రం చదివి, శిరస్సు పై చేతి ని ఉంచారు . బాలుడి వైఖరీ వాక్కు బయట పడింది .మాటలు ఊతల్లాగా ప్రవహించాయి .ఉపనయనం చేశారు .వివాహము జరిగింది .కానీ విరక్తుడు గానే ఉండే వాడు .కాశీ రాజ స్వామి అనే గురువు వద్ద దీక్ష తీసుకొని ,భక్తీ ,వేదాంత ప్రచారం చేశాడు .దేశాటనం చేస్తూ చివరికి భాగ్య నగరం అనబడే మన హైదరాబాద్ కు వచ్చాడు .ఆయన బోధనలకు ముస్లిం లు కూడా ఆకర్షితు లై భక్తులయ్యారు .

             ప్రపంచ జీవితం గడుపుతూ కూడా ,పారమార్ధికం గా జీవించిన సత్పురుషుడు కేశవ స్వామి .సమర్ధ రామ దాస స్వామిని కలిశాడు .సమర్దునితో కేశవ స్వామి ‘’నువ్వు సాధువై ఉంది కూడా స్త్రీ కి భయ పది పారి పోయావా ? మాయకు సంసారానికి భయ పడ్డావా ?’అని ప్రశ్నించాడు .అంటే సంసార జీవితం గడుపుతూ నిస్సంగం గా ఉండాలని భావం .వేదాంత విషయాలను సు స్పష్టం గా జనాలకు అర్ధ మయ్యే భాషలో చెప్పటం కేశవ స్వామి ప్రత్యేకత .’’శరీరం రోలు .మనస్సు రోకలి .ఆ రోకలి తో జీవ భావాన్ని దంచి ,పిండి కొట్టాలి .జ్ఞానం అజ్ఞానం అనే ఊకను తొలగించి ,శుద్ధ రూపం అయిన పిండి ని  గ్రహించాలి ‘’అని బోధించే వారు .

           ఆ రోజుల్లో హైదరాబాద్ లో హిందువులను ‘’కాఫిర్లు ‘’అనే వారు .అడుగడుగునా హిందువులకు అవమానం జరిగేది .స్వామి ముస్లిముల ను బాగా ఆకర్షించటం వల్ల స్వామి ధర్మ ప్రతిష్ట బలం పుంజు కొన్నది .హిందువులు కాని వారిలో హిందూ ధర్మం పట్ల ఆదరాన్ని కల్గించటం ,హిందువులకు తాము పాటిస్తున్న దానిలో సత్య స్వరూపం ఏమిటో తెలియ జేసి అందర్నీ ఆకట్టు కొన్నారు .పాండురంగని భక్తీ ఆయన కు సర్వ విధాలా తోడ్పడింది .షాహ తురాబ్ అనే సూఫీ కవి స్వామి ప్రభావానికి గురై శిష్యుడైనాడు .’’రామ దాసును ,కేశవా స్వామిని ఎప్పుడు చూస్తానో ,ణా దుఖాన్ని ఎప్పుడు పోగొట్టు కొంతానో ‘’అని వాపోయాడు .ఈ సూఫీ కవి సమర్ధ రామ దాస స్వామి రాసిన ‘’మనాచే శ్లోక ‘’అనే భుజంగ ప్రయాత శ్లోకాలను ‘’మాన్ సంజ్హావన్ ‘’పేరు తో అనువాదం చేశాడు .

 

         కేశవ స్వామి హిందువులకు అనుష్టాన వేదాంతాని బోధించాడు .సమర్ధులు మహారాష్ట్ర లో చేసినట్లు కేశవులు హైదరాబాద్ లో ప్రేరణ కల్గించారు .భక్తీ మార్గాన్ని లోక కళ్యాణం కోసం ప్రచారం చేశారిద్దరూ .పండిత సదా శివ ఖండో ఆల్తేకర్ ‘’సమర్ధ రామదాస చరిత్ర ‘’రాశాడు .అందు లో స్వ్మికి కేశవునికి జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల విషయం చక్కగా వివరించాడు .ఆత్మారాం మహా రాజు కేశవా స్వామిని ‘’యోగాధ్య బాలీ’’అని తన ‘’దాస విశ్రామ ధామ ‘’అనే గ్రంధం లో పేర్కొన్నాడు .కేశవా స్వామి ముకుంద రాజ సంప్రదాయానికి చెందినా వారు గా చెప్పు కొంటారు కాని స్వామి ఎక్కడా చెప్పు కొ లేదు .కాని ఆయన ముకుంద రాజ సంప్రదాయం ,వార్కరీ సంప్రదాయం ,సమర్ధ సంప్రదాయాలను మూదిటినీ మేళవించి ప్రచారం చేశాడు ఈ మూడు సంప్రదాయాల త్రివేణీ సంగమమే కేశవ స్వామి .జ్ఞాన దేవుని వంటి గొప్ప యోగి అయినా కేశవా స్వామి భాక్తి మార్గం లో నే నడిచాడు .ఆత్మా సాక్షాత్కారం పొందిన మహా యోగి కేశవా స్వామి .

               కేశవా స్వామి మరాఠీ ,హిందీ భాషల్లో అనేక అభంగాలు ,పదాలు  రచనలు రచించాడు .రాగ నిర్దేశం చేసి రాసిన 850పదాలు అచ్చైనాయి .’’శ్రీ కేశవ స్వామి ఛీ కవితా ‘’అనే ఆధ్యాత్మిక శ్రుంగార గేయాలు జయదేవుని గీత గోవిందాన్ని తలపిస్తాయి అన్నారు .అనేక ప్రహేళికలు రాశాడు .వీటికి అద్భుత మైన అంతరార్ధం ఉంటుంది .మహా రాష్ట్రలో వాటిని ‘’కూట  రచనలు ‘’అంటారు .కేశవుడు రచించిన 2700శ్లోకాలు ,231పదాలు ‘’దులియా’’లో శంకర కృష్ణ దేవ్ గారి ‘’సమర్ధ వాగ్దేవతా మందిరం ‘’లో అముద్రితం గా ఉండటం శోచనీయ మైన విషయమే .

          ఒక సారి సమర్ధ పంచాయతనం కృష్ణా నది దాటటానికి వచ్చారు .వరద ఉధృతం గా ఉంది .యోగా శక్తి తో దాటాలని భావించారు .సమర్ధ రామ దాస స్వామి హనుమత్ స్తోత్రం చేసి ఆయన్ను ప్రత్యక్షం చేసుకొని కృష్ణ ను దాటారు .మిగిలిన ముగ్గ్గురు తమ ఇష్ట దైవాలను ప్రసన్నం చేసుకొని దాటే షారు .కాని కేశవ స్వామి అక్కడ ఉన్న పదవ వాడికి పావలా డబ్బు లిచ్చి నదిని దాటాడు .ఆయన్ను చూసి మిగిలిన నవ్వురు నవ్వారు .అప్పుడు కేశవా స్వామి ‘’చిన్న చిన్న పనుల కోసం ఉపాసించే దేవుళ్ళను కష్ట పెట్టటం మంచిది కాదు .మీరు మీ యోగా శక్తులతో నదిని దాటారు .నేను పావలా ఇచ్చి నదిని దాటాను .ణా దృష్టి లో మీ యోగా శక్తి ణా పావలా కంటే ఎక్కువేమీ కాదు .భక్తుని ముక్ష్య లక్షణం స్వాత్మానుభావం ,నిష్కామ భక్తీ ‘’అని తెలిపి వారిని ఆలోచన లో పడేశారు .

    హైదరాబాద్ లో స్వామి ఒక సారి హరికధ చెప్తున్నారు .భక్తీ పారవశ్యం లో తాను మునిగి ,శ్రోతలకూ ఆ అనుభూతి కలిగిస్తున్నారు .ఒక ముస్లిన్ వస్తాద్ కూడా వచ్చాడు .అక్కడే గోడకు రాదా కృష్ణుల పాఠం ఉంది ..అందులో రాధ చేతి లో తమల పాకు ఖిల్లీ ఉంది .వాడు పిచ్చి గా ఊగి పోతు ‘’ఆ చిత్రం లోని రాధ కృష్ణుని చేత ఖిల్లీ టిని పిస్తే నువ్వు చెప్పెహరికద నమ్ముతా .లేక పోతే ఇక్కడున్న వారందరి దగ్గరా తలో వంద రూపాయలు వసూలు చేస్తాను ‘’అని స్వామితో చెప్పి తలుపులు మూసి రుబాబు చేశాడు .అందరు భయ పది పోయారు .స్వామి మనసారా శ్రీ కృష్ణుని ధ్యానించి ‘’యది ఆప్కో హో కదావోం మె ప్రీతీ –బతాలో చమత్కార్ దిఖావో ప్రచీతి ‘’అన్నారు అంటే ‘’కృష్ణా ౧ నీ కధల్లో నీకు ఇష్టం ఉంటె సాక్షాత్కరించి ,చమత్కారం చెయ్యి ‘’అని అర్ధం కృష్ణ నామ స్మరణ చేశారు,చేయించారు .ఒక్క సారిగా మెరుపు మెరిసింది .శ్రీ కృష్ణుని నోటిలో రాధ ఇచ్చిన కిల్లీ కణ పడింది ‘’ఈ అద్భుతం చూసి పఠాన్ కాళ్ళ మీద పది క్షమా భిక్ష వేడాడు .స్వామి అనుగ్రహించారు .స్వామి శిష్యుడైపోయాడు వాడు .

        ఒక సారి సుల్తాన్ కేశవ స్వామి ని  అందరి తో బాటు విందుకు ఆహ్వానించి అందరికి మాంసం వడ్డించే ఏర్పాటు చేశాడు ‘’అందరి లో ఉన్న ఆత్మా ఒక్కటే నంతారుగా మీరు .మరి  ద్వంద్వ భావం లేకుండా ఈ భోజనం ఆరగించండి ‘’అని పరీక్ష పెట్టాడు .కేశవా స్వామి సందేహం లో పడ్డాడు .వరాహావ తారాన్ని ధ్యానించారు .వెంటనే చిన్న పండి పిల్ల అక్కడ ప్రత్యక్ష మై ఆయన పళ్ళెం లో ఉన్న మాంసాన్ని తినేసింది .తురకలకు పండి అంటే అసహ్యం .సుల్తాన్ స్వామితో’’ ఇదేమిటి ఇలా చేశారు ?’’అని అడిగితే ఆయన ‘’ఆత్మా భేదానికిఅతీత మైంది .మీకూ మాకూ భోజనం చేయటం లో ఎలాంటి సంకోచం ఉండ రాదు ‘’అని సమాధానం చెప్ప్పారు .సుల్తాన్ కు శ్రుంగా భంగమై తల దిన్చుకొన్నాడు .

      మరో సారి కేశవా స్వామి భజన చేస్తుంటే ,దేవుడి మేడ లో ఉన్న పూల దండ ఈయన మేడ లో పడింది .ఇంకోసారి స్వామికిచ్చే ప్రసాదం లో ‘’వస నాభి ‘’కలిపారు దుష్టులు .అనడరు తిన్నారు .ఎవరికి ఏమీ కాలేదు .కాని దేవుడి విగ్రహం నీలం రంగు గా మారింది .మరోసారి స్వామి భజన చేస్తుంటే ఆయన భుజం మీద బాల కృష్ణుడు ఉన్నట్లు ఒక ముస్లిం భక్తుడికి కన్పించింది .అంటే సర్వ కాల సర్వావస్థలాలో శ్రీ కృష్ణుడు కేశవ స్వామి వెంట ఉన్నాడని అర్ధం అవుతోంది .కేశవా స్వామి1610 లో జన్మించారని భావిస్తారు . 1-1-1683 దుందుభి నామ సంవత్సర పుష్య శుద్ధ త్రయోదశి సోమ వారం హైదరా బాద్ లో’’ ము చికుండా నది’’అయిన  మూసీ నది ఒడ్డున మహా  సమాధి చెందారు ఇప్పుడిదికేశవా నగర ,జియాజి గుడా –హైదరాబాద్ లో  మహా భక్తీ కేంద్రం గా వర్ధిల్లు తోంది  .

 మరో యోగి కధ మరో సారి —

    సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –15-6-12.—కాంప్—అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.