సిద్ధ యోగి పుంగవులు –9
జన్మ జన్మల సంస్కారం సాధన ,ఉత్తమ గురు శిష్యరికం ,తపస్సు ఒక పశువుల కాపరి ని బ్రహ్మ జ్ఞాని గా రూపొందించాయి .ఆయనే లింగాల దిన్నె బ్రహ్మ స్వామి .
తమిళ నాడు లో సేలం లో నుదురు పాటి లక్ష్మీ నరసయ్య కు 1820 లో జన్మించారు .అసలు పేరు నరసయ్య . చిన్నప్పుడే గున్నమ్మ తో వివాహమైంది .బర్రెల కాపరి గా బతికారు .పదిహేనేళ్ళ వయసు లో సేలం కొండ పై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్స వాలకు వెళ్లి ఒక గుహలో యోగుల దర్శనాన్ని పొంది ,శ్రీ లక్ష్మీ నృసింహ మహా మంత్రాన్ని ఉపదేశం పొంది ,ఆయన అనుగ్రహం తో కళ్ళు మూసి తెరిచే లోపు కాశీ వెళ్లాడు నరసయ్య .ఎంత వెదికినా నరసయ్య కని పించక పోయే సరికి చని పోయాడని అనుకోన్నారంతా .కాశీ లో కడప జిల్లా కంబాల దిన్నె వాసి అచ్చన సోమయాజి కని పించి ,చదువు నేర్పిస్తానని తీసుకొని వెళ్లి గోడ్లకాపరిగా ,కూలీ గా ,మంచి నీళ్ళు మోసే వాడిగా అరవ చాకిరీ చేయించాడు కాని చదువు నేర్పించనే లేదు .ఏదైనా పెడితే తినటం .లేక పోతే పస్తు గా గడిపాడు నరసయ్య .పిచ్చి నరసయ్య అని అందరు పిలిచే వారు ..ఒక రోజు మిద్దె మీదఅం అందరి తో బాటు పడు కొన్నాడు .కుంభవృష్టి కురిసింది .అందరు కిందకి దిగి వెళ్లి పోయారు .నరసయ్యను మర్చి పోయారు .తెల్ల వారి వచ్చి చూస్తె అతను పడుకొన్న భాగం లో చుక్క నీరు కూడా పడక పోవటం గమనించి అందరు ఆశ్చర్య పోయారు .పిచ్చి నరసయ్య ను మహాయోగి గా గుర్తించి మర్యాద చేశాడు యజమాని .
ఎవరికి చెప్ప కుండా బెస్త వారప్పేట చేరి త్రిపురారి భట్ల బుచ్చి వెంకట దీక్షితుల వద్ద విద్యార్ధి గా చేరి ఏదో కొంత నేర్చాడు .మంచి గొంతు తో అలోకగా పాడే వాడు .తన తండ్రి ఆబ్దికం అని చెబితే దీక్షితులు పట్టించు కొ లేదు .కోమటి గురుమూర్తి తద్దినానికి కావలసిన పదార్ధాలన్నీ అంద జేశాడు .అప్పట్నించి రోజు నరసయ్యకు కావాల్సిన అన్ని పదార్ధాలు దీక్షితుల ఇంటికి పంపుతూ ,ఆయన వద్ద రామాయణాదులు చెప్పించుకొని వినే వాడు ..పిచ్చి నరసయ్య గా ముద్ర పడింది .ఒక సారి ఒక వేశ్యను ఉసి గొల్పి నరసయ్య వద్దకు పంపారు .అతని జితెన్ద్రియత్వానికి జోహారు చెప్పి పాదాక్రాంతు రాలైన్దామే .మ్మరో సారి కంబం తీసుకొని వెళ్లారు .వేశ్యల ఇళ్ళ ల్లో వదిలారు .ఆయన ముసుగు తనని పడుకొంటే ఆయన్ను బలాత్కారించాతానికి వచ్చిన వేశ్యలకు ,ఆయన ముసుగు ను తొలగిస్తే అయిదు తలల నాగు పాము కనిపించి భయ పది పోయారు .కాళ్ళ మీద పది క్షమా భిక్ష వేడుకొన్నారు .అప్పటి నుంచి నరసయ్య బ్రహ్మ స్వామి గా ప్రసిద్దుదయాడు .
భీమ గుండం చేరి సూర్య గ్రహణం రోజున గుండా స్నానం చేయటానికి వెళ్లి అందులో మునిగి పోయాడు .నరసయ్య ఎంతకూ రాక పోయేసరికి మునిగి చని పోయాడని అనుకొన్నారు ..మరుసటి ఏడాది సూర్య గ్రహణం నాడు అందరు గుండానికి స్నానానికి వెళ్తే నీటి పై పద్మా సనం లో బ్రహ్మ స్వామి కని పించి ,ఆశ్చర్య పడేశాడు .అప్పటి నుంచి ఆయన భక్తులు పెరిగి అడుగులక్కు మడుగు లోట్టారు .విందు భోజనాలు ఏర్పాటు చేసే వారు .పెండ్లి లో లాగా నలుగు పాటలు ,బువ్వం బంతి పాటలు ,శోభనపు పాటలు మొదలైనవి పాడే వారు ..ఆ పాటల్లో ఆయన్ను ‘’సత్య పూరి వాసి ‘’అని పొగిడే వారు .మార్కాపురం తాసీల్దారు ఆయన్ను మేనా లో తీసుకొని వెళ్తుండగా ,మద్య లో మాయమై ,గుండ్ల కమ్మ నది లో స్నానం చేస్తూ కన్పించాడు .అక్కడికి వెళ్లి ఇంటికి తెసుకు వెళ్లారు .
ఒక శివ రాత్రికి భక్తులు కొందరు తమతో శ్రీశైలానికి ,కొందరు మహా నందికి ,కొందరు కాల హస్తి కి రమ్మని ఆహ్వానించారు .అలానే అని చెప్పి ఆయా క్షేత్రాలలో వారితో స్నానం చేసి నట్లు కని పించి అందర్ని సంతృప్తి పరిచారు .స్వామికి ముప్ఫై ఏళ్లు వచ్చాయి .ఒక సారి వత్తు మడుగు నుండి ,తిమ్మ రాజు పల్లె కు శిష్యులతో బయల్దేరారు ..మార్గ మాధ్యమ లో కుమ్భావ్రుస్తి కురుస్తోంది .అందరు భయ పడ్డారు .తన వెన కాలే నడవమని చెప్పారు .వారికి ఫర్లాంగు దూరం అవతలే వర్షం పడింది కాని వీరి మీద ఒక్క చినుకు కూడా పడలేదు .బెస్త వాణి పేట లోని సుందరమ్మ అనే ఆమెకు వైకుంఠ ఏకాదశి నాడు శ్రీ రంగం వెళ్లాలని కోరిక పుట్టి స్వామికి తెలియ జేసింది .ఆయన తన అంగ వస్త్రాన్ని పరచి ,ఆమె ను అందులో కూర్చోమని చ,కండ్లు మూసు కోమని చెప్పి ,మరుక్షణం శ్రీ రంగం చేర్చాడు .అక్కడ తన తోటి వారందరి తో రంగ నాదున్ని దర్శించి ,ద్వాదశి పారణకు స్వస్థలం చేర్చి మహిమ ప్రకటించారు స్వామి .
బ్రహ్మ స్వామి భక్తుడు కరి బసప్ప లింగ దారి .స్వామిని తన గ్రామం లో స్వామిని ఊరేగించాలని ఆశ పడ్డాడు .అలానే పల్లకి లో తీసుకొని వెళ్లి ఊరి బయట విడిది చేయించి ,మేళ తాళాలతో ఊర్లోకి తీసుకు వెళ్ళ టానికి తోడి లింగ దారులన్దర్నీ రమ్మన్నాడు .వారెవరికి ఇష్టం లేదు లింగ దారి కాని వాడికి ఈ సత్కారాలేమట ని విసుక్కొని ,అలా చేస్తే వెలి వేస్తామని బెదిరించారు .స్వామి తన శిష్యుడికి వచ్చిన కష్టం తెలిసింది .వెల్దుర్తి లోని లింగ దారు లంతా భోజనాలకు ముందు తమ లింగ కాయలు తెరిస్తే అందులో లింగాలు కనపడ లేదు ..అప్పుడు స్వామి మహిమ తెలుసు కొని కాళ్ళ మీద ప డి ,బ్రహ్మాండం గా ఊరేగించి సత్కరించారు .ఆ ఊర్లో ప్రచండ శాక్తేయుడు మంత్రగాడు యాదాటి పాపయ్య ఉండే వాడు .సన్మాన సభకు వచ్చాడాయన .మనస్వామి ఆయన కు నమస్కరించ నందుకు కోపం వచ్చి స్వామి పై అనేక దుష్ట ప్రయోగాలు చ్చేశాడు .అతి క్రూర మైన ‘’దూమావతి ‘’ని కూడా ప్రయోగించి విఫలుడైనాడు .మర్నాడు ఉదయం పాపయ్య స్వామి కాళ్ళ మీద పది క్షమించమని కోరాడు .తనకూ తుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు .స్వామి దగ్గరుండి ,ఆ అమ్మాయికి మేనరిక వివాహం జరిపించారు .
స్వామి గొప్ప తనం విన్న పుష్ప గిరి పీతాది పతి శ్రీ శంకర భారతీ స్వాములు ,తమ ఆస్థానానికి రప్పించు కొని ‘’తూగుటుయ్యాల ‘’పై ఊరేగించి సంభాషణం చేశారు .నంద్యాలలో ఖాదర్బాదరు వెంకట్రావు ఇంట్లో కొన్నాళ్ళుండి ,వారి బాధలు పోగొట్టి బంగారు పాదుకలు అనుగ్రహించారు .తొడుగు పల్లె అగ్రహారం లో బ్రహ్మ సత్రం చేశారు .అక్కడ ఒక బావి ని తవ్వించి ఆబావి నీటి ని ‘’కాశీ గంగ ‘’అన్నారు .ఇప్పటికి ఆజలాన్ని గంగ గా భావిస్తారు జనం .రాయ ప్రోలు సుబ్బయ్య ఇంటికి ఒక సారి వెళ్లగా భక్తుల కోరిక పై గాలిలో తేలుతూ ఇల్లంతా తిరిగి అం దారని ఆశ్చర్య పరిచారు .నూక రాజు పుల్లయ్య సంతానార్ధం స్వామిని వేడు కొన్నాడు .పుల్లయ్య పై గిట్టని వాళ్ళు సర్ప ప్రయోగం చేయించారు .పెద్ద కొండ చిలువ అంత నాగు పాము వచ్చి స్వామి సన్నిధి లో వాకిట్లో ఏమీ చేయలేక వాకిలికి అడ్డం గా పడు కొంది .స్వామి గడ్డి పరక ను మంత్రించి దాని పైన వేస్తె చచ్చ్చి పోయింది
అచ్చమ్మ అనే భక్తురాలు స్వామిని ద్వాదశ పారణకు చాలా సార్లు ఆహ్వానిస్తే వస్తాను ,వస్తాను అని దాత వేస్తుండే వారు .మరోసారి ఆమె ప్రార్ధిస్తే ఒక సారి పారణ రోజున నల్లని వ్యక్తిగా వచ్చి భోజనం చేసింది తానే నని చెప్పారు .ఆమె కంచి గరుడ సేవ చూడా లని కోరితే ఉత్తరీయం లో మూట గట్టి చూపించి తీసుకొని వచ్చారు .దేవతార్చన లో పెట్టు కోవటా నికి భక్తులకు అనేక పాదుకలు ఇచ్చారు .ఆయన అనేక భాషల్లో సంభాషించే వారు .కనిగిరి తాలూకా రామ పురం నివాసి పద్మ నాభుడు స్వామికి అనన్య భక్తుడు .సేవ బాగా చేసే వాడు .కాని మూగ .అతనితో’’ రామ’’ అ ని పించి ,తరువాత’’ రామ రామ’’ అని పించి మాటలు వచ్చేట్లు చేశాడు .ఒకసారిస్వామికి కడుపు నొప్పి విపరీతం గా ఉన్నప్పుడు శిష్యులు విందు భోజనానికి బలవంతం చేశారు ..తమ యోగా దండాన్ని కడుపు కు తగిలి ఉండేట్లు చేసి భోజనం చేశారు .ఆ బాధ అంతా దండం అను భావిన్చేట్లు చేశారన్న మాట .
పుష్ప గిరి అధిపతులు భారతీ స్వాముల నిర్యాణం తర్వాతా శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి పీథాది పతి అయారు .ఆయన్ను బ్రహ్మ స్వామి మీద చర్య తీసుకోమని ఒత్తిడి తెచ్చారు .బహిష్కార పత్రం పంపారు .బ్రాహ్మణ్యం బహిష్కారాన్ని సమర్ధించలేదు .బ్రాహ్మణుల గురు ధిక్కారానికి అలిగి కోపించి ప్రాయశ్చిత్తం జరిగే దాకా చంద్ర మౌళీశ్వర స్వామికి నివేదన చేయను అని పట్టు బట్టారు .స్వామికి ఇది తెలిసి తన వల్ల బ్రాహ్మణులు ఇబ్బంది పడటం ఇష్టం లేక ఔకు ను వదిలి జమ్మల మడుగు వెళ్లారు .అడిగిన వారందరికి దగ్గరుండి ఒడుగులు ,పెళ్ళిళ్ళు ,ప్రతిష్టలు స్వామి జరి పించే వారు .ఒక సారి కట్టిన ధోవతి మళ్ళీ కట్టు కునే వారు కాదు .మైల వరపు నరసింహా రావు అనే ఆయన తిరుపతి వెళ్తూ కడప లో స్వామిని దర్శించటానికి వెళ్లాడు .’’నిన్ననే నీ మొక్కు వెంకటేశ్వర స్వామికి చెల్లించారు ‘’ అని స్వామి చెప్పగా ఆశ్చర్య పడి తన ముడుపును స్వామి సన్నిధి లోనే ఉన్న అగ్ని హోత్రం కృష్ణ మాచార్యుల వారికి సమర్పించి తిరుపతి వెళ్లాడు .తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆయన కు కలలో కన్పించి ‘’నీ మొక్కు కడప లోనే నిన్న తీరి పోయింది ‘’అని చెప్పాడు .అప్పటి నుంచి తిరుపతి మొక్కులు స్వామి సన్నిధి లోనే సమర్పించు కొనే సంప్రదాయం ఏర్పడింది .’బ్రహ్మ స్వామి 32లక్ష్మీ నృసింహ బంగారు కప్పు తో ఉన్న సాలగ్రామ మాలను ధరించే వారు .కనుక అవిచ్చిన్నం గా అన్నదానం జరిపే వారు తమ సాలగ్రామాలను తమ తర్వాతా ధరించే యోగ్యుని కోసం వెతుకుతూమహా దేవ పురం లో నిరతాన్న దానం జరుపు తున్న అనుముల వెంకయ్యకు ఇచ్చారు ..ఆయన బంగారు కప్పులు స్వామి కే ఇచ్చి ,రాగి కప్పులు వేయించి అర్చన చేసే వాడు . ఒక రోజు మంగళ హారతి సమయాన సాలగ్రామాలన్ని పట ,పటా పగిలి పోయాయి .వాటిని మహానందిలో కలిపేశాడు వెంకయ్య ..అనేక మంది కవులు ,రచయితలు ,పండితులు రచనలు చేసి స్వామికి అంకిత మిచ్చారు .
తాను దేబ్భై అయిదేళ్లకు దేహం చాలిస్తానని తెలియ జేశారు స్వామి .ఎవరికి వారు తమ గ్రామం లో దేహం చాలించమని కోరుకున్నారు .కాని ఆయన లింగాల దిన్నె చేరి సన్య సించి ‘’సదాశివ సిద్ధ యోగేశ్వర స్వామి ‘’పేరు తో ‘’పరివ్రాట్టు లు ‘’అయి ,.13-10-1889 అమావాస్య నాడు’’ బ్రహ్మ రంధ్రం చేదించుకొని’’ పరమాత్మ లో కలిసి పోయారు .ఇప్పటికీ ఆ ప్రాంతం లో స్వామి భక్తుల మనో భీష్టాలను నేర వేరుస్తూనే ఉన్నారు .11-2-1926 మహాశివ రాత్రికి స్వామి జీవిత చరిత్ర రాసిన మద్దుల పల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహానందికి వెళ్ళ దలచి డబ్బు లేక ఉండి పోయారు .గారడీ వాడి వేషం లో స్వామి స్వప్నం లో కని పించి కావాల్సినంత ధనం ఇచ్చి యాత్ర చేయించారు .అందుకే బ్రహ్మ స్వామిని ‘’భక్త కల్పద్రుమం ‘’అంటారు .
మరొకద మరో సారి
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-6-12—కాం
How can anyone believe such stories ?. He might have some good yoga practices so that he can show some great siddhis, but not even becoming wet in rain. ?. and if you write like you are his slave. Teachers are those who teach jnana. People like you who believe any stupid idea without experiencing is a fool, who makes earth a hell.