స్వాతంత్ర పోరాటం లో నార్త్ కరోలినా
బ్రిటీష వారి కబంధ హస్తాల నుంచి బయట పదాలని మొదట తీర్మానం చేసి ,మిగిలిన వారికి ఆదర్శం గా నిలిచినమొట్ట మొదటి కాలని నార్త్ కరోలిన .ఆ వివరాలే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .
1771ప్రాంతం లో అమెరికా లో 13బ్రిటీష కాలనీలున్దేవి .అందులో నార్త్ కరోలిన ఒకటి .బ్రిటీష రాజు ఇక్కడ ఫ్రెంచ్ వారితోను ,అక్కడ మిగిలిన వారి తో పోరాటానికి కావలసిన డబ్బు ను అమెరికా లోని కాలనీ ల నుండి పిండుకొందామను కొన్నాడు .పార్లమెంట్ లో కొన్ని పన్నులు విధించే చట్టా న్ని చేశాడు .నార్త్ కరోలిన అసెంబ్లి దాన్ని తిరస్కరించింది .పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేని తమపై పన్నులు వేయటం సరికాదని చెప్పింది ..మిగిలిన కాలనీలు అలానే పోరాడితే వెనక్కు తీసుకొన్నారు .అప్పుడు దొడ్డి దారిన స్టాంప్ చట్టం చేసింది .అమ్మకం ,కొను బడు ల కు స్టాంప్ లు కొని అంటించాలని దీని భావం .దీన్నీ వ్యతి రేకించారు .స్టాంపులను బయటికి రాకుండా కాపలా కాశారు .ఆ నావ లన్నిటి ని వెనక్కి పంపించే టట్లు తీవ్రం గా అన్ని కాలనీలు పోరాటం చేశాయి .దిగి వచ్చింది బ్రిటీష ప్రభుత్వం .ఆ తర్వాత ఎత్తు డ గా కొత్త పన్నులు వేసే పద్ధతి తెచ్చింది .మళ్ళీ తిరుబాటు బావుటా ఎగరేశారు .no taxation without representation ‘’అని నినదించారు .ఇక్కడి కాలనీ వాసులేవరికీ బ్రిటీష పార్ల మెంట్ లో సభ్యత్వం లేదు .బ్రిటీష వస్తువులను కొనడం ,అమ్మడం కూడా కాలనీలు బహిష్కరించాయి .మళ్ళీ దిగి వచ్చి తేయాకు తప్ప అన్నిటి మీదా పన్ను తీసేసింది ప్రభుత్వం .
సమష్టి పోరాటం చేయాలని కాలనీలన్ని ఒక నిర్ణ యానికి వచ్చాయి .తమలో తాము సంప్రదిన్చుకోవటం ప్రారంభించాయి .committees of correspondence ఏర్పడ్డాయి .అప్పటికి అమెరికా లో కేంద్రీయ ప్రభుత్వం అనేది లేదు .అక్కడ బ్రిటన్ లో తేయాకు విప రిథం గా పండి ,మార్కెట్ లేక అమెరికా తెచ్చి అమ్మాలను కొంది .షిప్పు నిండా తేయాకు వచ్చింది మాసాచుసేత్స్ లో ని బోస్టన్ రేవుకు .1773లో బోస్టన్ పౌరులు ,mohawkఇండియన్లు కలిసి నావను రాత్రి పూట రహస్యం గా ఎక్కి 342పెట్టెల తేయాకు ను సముద్రం లో విసిరేశారు .దీన్నే ‘’బోస్టన్ టీ పార్టి ‘’అన్నారు .ఇలాగే మిగిలిన కాలనీ లలో ను చేసి బ్రిటీష వారికి శ్రుంగ భంగం కల్గించారు .దీనితో ప్రభుత్వం ప్రతీకార చర్యలు చేబట్టి బోస్టన్ రేవు నుంచి వ్యాపారం చేయటాన్ని నిషేధించింది .
కాలనీ వాసులలో ఏకాభి ప్రాయం సాధించి సంయుక్తం గా బ్రిటీష వారి పై పోరాడాలని సంకల్పించారు .దీని కోసం conti nental congres ను ఏర్పరచు కొన్నారు .అప్పుడు నార్త్ కరోలిన లో బ్రిటీష గవర్నర్ మార్టిన్ అనే వాడున్నాడు .నార్త్ కరోలిన ఆసెంబ్లీ ని సమావేశ పరచమని వాడిని కోరితేతిరస్కరించాడు .నార్త్ కరోలిన అసెంబ్లి కి మాత్రమే పన్ను విధించే హక్కు ఉంది కాని ,పార్లమెంట్ కు లేదు అని నిర్ద్వందం గా తెలిపారు వాడికి .ప్రతి కాలనీ కి ప్రతినిధులను ఎన్ను కొన్నారు .విలియం హూపర్ ,కస్వేల్ ,జోసెఫ్ హ్యూస్ లు నార్త కరోలినా ప్రతినిధులు .ఇక్కడి విషయాలను ఎప్పటి కప్పుడు రాజుకు గవర్నర్ తెలియ జేస్తున్నాడు .ప్రోవిన్సియాల్ కాంగ్రెస్ వాళ్ళు అప్పటికే రెండు సార్లు సమావేశమైనారు .సమావేశం జరుపు కొనే హక్కు తమకు ఉందని తెలియ జేశారు .రాజుకు విదేయులమే కాని ,అధికారము తమకివాలని స్వాతంత్రమే తమ లక్ష్యమని చెప్పారు .నార్త్ కరోలిన అసెంబ్లీ ని సమావేశ పరచుకొని తమ కోరిక ను బలం గా చాటారు .వీళ్ళను దారిలోకి తెద్దాం అన్న అతని ప్రయత్నాలు ఫలించ లేదు .మసాచుసెట్స్ లో ప్రజలు రహస్యం గా ఆయుధాలు ,మందుగుండు సామాను సేకరించి భద్ర పరచారు .దీన్ని స్వాధీనం చేసుకోవటానికి ప్రభుత్వం సిద్ధ పడింది .కాపాడుకోవటానికి ప్రజలు సమాయత్తమైనారు .1775 april 18 న ఇరు వైపులా మోహరింపు జరిగింది .జనాన్ని చూసి పోలీసులు వారి పై కాల్పులు జరిపారు .ఇదిగో ఇప్పుడే బ్రిటీష వారితో యుద్ధం ప్రారంభమయింది .ముందు కాలు దువ్వింది బ్రిటీష సైన్యమే ..దీన్నే ఎమర్సన్ మహా కవి ‘’ the shot heard –round the world ‘’అని కవిత్వీక రించాడు .ఈ వార్త నార్త్ కరోలినా కు ఆలస్యం గా చేరింది .
1775 మే లో శార్లేట్ ,మేకేంస్ బర్గ్ వాసులు వీధుల్లోకి వచ్చి బ్రిటీష రాజుకు ఇంకా ఏమాత్రము అధికారం లేదని ,తమ దేశానికి బ్రిటన్ శత్రువు అని నినాదాలు చేశారు .అప్పుడు కాలనీ లలో మూడు వర్గాలున్దేవి .రాజుకు వ్యతి రేకుల్ని whigs అనీ ,అనుకూలుర్ని torees అనీ ఎటు తేల్చుకో లేని వారిని neautrals అన్నారు .ఇక్కడి గవర్నర్ మార్టిన్ కు థారు పుట్టి పెళ్ళాం ,పిల్లల్ని న్యూయార్క్ కొ తోలేశాడు .న్యు బెరిన్ లో కొన్ని ఫిరంగులు కాల్చటానికి ఉంచాడు .జనం వచ్చి పడుతున్నారని తెలిసి వాటిని నిర్వీర్యం చేశాడు .ప్రజలను రక్షించు కోవాలని నాయకులు భావించి ‘’committee of safety లను ఏర్పాటు చేసుకొన్నారు .పోరాడటానికి సైన్యాన్ని సమకూర్చుకొన్నారు .హిల్స్ బరో లో సమా వేష మై శామ్యుల్ జాన్స్టన్ ను ప్రిసైడింగ్ ఆఫీసర్ ను చేసి అందరు శాపదాలు చేశారు .విభేదాలున్నా ఇంకా రాజుకు విదేయులమే నని ప్రకటించారు యుద్ధ సామాగ్రి కొనటానికి డబ్బు ను సమకూర్చుకొనే ప్రయత్నాలు చేశారు .
ఫిలడెల్ఫియా లో రెండో కాంటినెంటల్ కాంగ్రెస్ సభ జరిగింది .జార్జి వాషింగ్టన్ ను కమాదర్ చీఫ్ గా ఎన్ను కొన్నారు .కాంటినెంటల్ ఆర్మీ ఏర్పడింది .నార్త్ కరోలిన లో రెండు రిజి మెంట్లు జేమ్స్ మూర్ ,రోబర్ట్ హోవే నాయకత్వం లో ఏర్పడ్డాయి .సౌత్ కరోలిన లో ఉన్న చార్లేస్తాన్ గొప్ప ఓడ రేవు .దాన్ని స్వాధీనం చేసుకోవటానికి సైన్యాన్ని పంపమని గవర్నర్ మార్టిన్ రాజుకు రాశాడు .కారణ వాలీస్ తో ఒక దళాన్ని ,హెన్రీ క్లింటన్ తో ఒక దళాన్ని రాజు పంపాడు .వారిద్దరూ వచ్చి నార్త్ కరోలినా నే చాల సమస్య అని నిర్ణయించారు .ఇక్కడ హోలిఫాక్స్ లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రజలు ఏర్పరచు కొన్నారు .తమకు తాము స్వాతంత్రం పొంది నట్లుగా ప్రకటించుకొన్నారు .ఇలా నార్త్ కరోలిన మిగిలిన కాలనీలకు మార్గ దర్శక మై ముందు నిలి చింది .హాలి ఫాక్స్ లో కాంగ్రెస్ మళ్ళీ 1776 ఏప్రిల్ పన్నెండు న సమావేశమై స్వాతంత్రాన్ని ప్రకటించింది .తర్వాత వర్జీనియా ,ఆ తర్వాత మిగతా కాలనీలు ఆ పని చేసి తామంతా విముక్తులం అని ప్రకటించే శాయి .ఇక రాజు కు తమ పై పెత్తనం లేదని చెప్పే శాయి .అందరికి కలిసి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకొన్నారు .declaration of inde pendence ను 1776 july 4న ప్రకటించారు .ఆ తేదీ యే ఇప్పటి ఫార్మేషణ్ డే .
న్యూయార్క్ లో జార్జి వాషింగ్టన్ బ్రిటీష రాజు విగ్రహం తలను కిందికి లాగి పడేశాడు .బుల్లెట్లతో మసి చేశాడు .ఈ డిక్ల రేషన్ నార్త్ కరోలినా చేరటానికి రెండు వారాలు పట్టింది .హాలిఫాక్స్ లో సమావేశమై1776 august 1 న ఆ డిక్లరేషన్ ను ప్రజలందరికి చదివి విని పించారు .అలానే మిగిలిన చోట్లా చదివారు .అన్ని కాలనీలు ఆ పని చేసి స్వాతంత్రాన్ని ప్రకటించు కొన్నాయి .దీనికి ముందు దారి చూపింది మాత్రం నార్త్ కరోలినా అని నిస్సందేహం గా చెప్ప వచ్చు. ఆ తర్వాత బ్రిటీష ప్రభుత్వం యుద్ధం చేసి లొంగ దీసుకొనే ప్రయత్నాలు చేయటం కారన్ వాలీస్ అన్ని యుద్ధాల్లో పరాజితుదవటం చివరికి జార్జి వాషింగ్టన్ అనే కమాన్దరిన్ చీఫ్ కు లొంగి పోవటం వరుసగా జరిగి పోయాయి ఈ యుద్ధాలలో అనేక యువకులు సమర్ధులైన నాయకులు బలి పోయారు . ‘’. north carolina and most of the colanies won inde pendence by fighting a war against britan with practically with an empty treasury . ‘’ అంటే చేతిలో చిల్లి గవ్వ లేకుండా నార్త్ కరోలినా తో బాటు అనేక కాలనీలు బ్రిటీష వారి తో యుద్ధం చేసి తమ స్వాతంత్రాన్ని సంపాదించుకొన్నాయి. నార్త్ కరోలినా ప్రజలకు ,వారి త్యాగాలకు ,పోరాట పటిమకు స్వాతంత్ర కాంక్షకు బలిదానానికి జోహార్.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-6-12-కాంప్—అమెరికా