అమెరికా డైరీ –టోరీ భేరీ వారం

 అమెరికా డైరీ –టోరీ భేరీ వారం

      ఈ వారం అంతా సందడి గా ,సరదాగా గడిచింది .మంచి పుస్తకాలూ చదివాను .రెండు పుట్టిన రోజు పండుగలు ,ఒక రేడియో ప్రోగ్రాం ,ఒక భజన, ఫాదర్’స్ డే లతో ఈ వారం సాగింది .సోమవారం సందడే మీ లేదు .ట్విన్స్ ను జిమ్నాస్టిక్స్ లో సాయంత్రం చేర్చటానికి వెళ్ళాం .ఆశుతోష్ బాగా చేశాడు .పీయుష్ చేతి నెప్పితో ఉన్నా వాడు చేసిన వన్నీ బయటే చేశాడు .వచ్చే వారం వాడూ ఇందులో చేరతాడు .శ్రీ కెత్ క్లాస్ వీళ్ళ క్లాస్ అయిన తర్వాత .జి మార్ట్ కు వెళ్లి కూరలు కొన్నాం .పనస పండు కూడా . ఆ రోజు రాత్రి ‘’ఇదే మంటే ప్రేమంటా  ‘’సినిమా కు రాత్రి తొమ్మిదిన్నర ఆటకు వెళ్ళాం .కాని ఫిలిం’’ కీ’’రాలేదని ఆట వెయ్య లేదు .మర్నాడు మంగళ వారం రాత్రి కి వెళ్ళాం .సినిమా లో దమ్ము లేదు .అయితే సరదా గా కూర్చో బెట్టాడు డైరెక్టర్ .మాకుటుంబం కాక ఇద్దరే హాల్ లో ఉన్నారు .డబ్బా లేపెసేట ట్లుంది .శుక్ర వారం జగదీశ్ ,లక్ష్మి దంపతుల అబ్బాయి ఆదిత్య పుట్టిన రోజు .ఇంటి దగ్గరే చేశారు .అందరం వెళ్ళాం .మంచి దంపతులు .నలభై మందికి పైగా వచ్చారు .రాత్రి ఏడున్నర నుండి ఒక గంట భజన ,ఆ తర్వాతా బర్త్ డే పార్టీ .గులాబ్జాం పులిహోర ,మరిరెండు స్వీట్లు ,చపాతీ కూర అప్పడం అన్నం ,పెరుగు ,ఐస్క్రీం కేకు .వగైరా .అన్నీ బాగున్నాయి .లక్ష్మి మా మేనకోడలు పద్మ లాగా ఉంటుంది .ప్రభావతిని పొదివి పట్టు కొంటుంది .అంత అభిమానం .మేము రావటం అదృష్టం గా భావించే దంపతులు జగదీశ్ ,,లక్ష్మి .ఆదిత్య ను మాకు నమస్కరింప జేసి ఆశీస్సులు పొందే టట్లు  చేశారు .అందుకే వాళ్ళింటికి వెళ్లటం ఇష్టం గా ఉంటుంది .సుమారు నేల క్రితం ఆహోబాల స్వాములు వీరింట్లో చేసిన పూజకు వెళ్ళాం .మర్నాడు  శని వారం మా ఇంటికి దగ్గర్లో పిల్లల స్కూల్ కు వెళ్ళే దారిలో ఉన్న యై.ఏం.సి.యే.భవనం లో విజ్జివాల్లకు తెలిసిన కన్నడ కుటుంబం వాళ్ల అబ్బాయి బర్త్ డే .వెళ్ళాం .ప్రభావతి రాలేదు .ఒక క్లౌన్ వేషం లో అమ్మాయి  పిల్లలకు  సరదా గా బలూన్లు చేసి సరదా చేసింది .ఐటమ్స్ చాలా పెట్టారు కాని తిన్నది చపాతి ,పెరుగు వడ మాత్రమే .అక్కడి నుంచి లైబ్రరీ కి వెళ్లి ఇరవై రెండు పుస్తకాలు ఇచ్చేసి ,పద కొండు తెచ్చుకోన్నాను .బుధ వారం రాహుల్ ఇంట్లో భజన కు వెళ్ళాం అందరం .

                                                 

This slideshow requires JavaScript.

                      టోరీ భేరీ

        శార్లేట్ లో విజ్జి ఫ్రెండ్ నాగమణి గత నాలుగేళ్ళుగా టోరీ రేడియో ప్రోగ్రాం ను ప్రతి బుధ వారం చేస్తోంది .మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల వరకు .ఈ ప్రోగ్రాం లోనే మార్దంగిక విద్వాంసులు ఎల్లా వెంకటేశ్వర రావు గారిని ,ఈల లీలా వినోడదులు కొమర వోలు శివ ప్రసాద్ ను మా ఇంట్లోనుంచే ఇంటర్వ్యు చేశాం .ఆవిడ వాళ్ళింట్లో ఉండి  ఫోన్ లో ప్రశ్నలడిగితే ఇక్కడ ఫోన్ లో సమాధానం చెప్పటం .దీని లింక్ అంతా హైదరాబాద్ లో జరుగు తుంది .లైవ్ ప్రోగ్రాం  .మధ్యలో పాటలు శ్రోతల ప్రశ్నలు వాటికి సమాధానాలు ఉంటాయి .టోరీ అంటే’’టెలివిజన్ ఆన్ లైన్ రేడియో ఇంటర్ నేషనల్ ‘’అని అర్ధం .ప్రపంచ దేశాలన్నిటికీ చేరుతుంది లైవ్ లో .ఆ విద్వాంసులను నేనే మనింటి నుంచి పరిచయం చేసి ,ప్రశ్న లడిగి సమా చారం చెప్పించాను . నాగమణి  నేను వచ్చిన్దగ్గర నుంచి నన్ను ప్రోగ్రాం చేయ మని అడుగుతూనే ఉంది .నేను వాయిదా వేస్తూనే ఉన్నాను అది మొన్న బుధ వారం కుదిరింది .ప్రోగ్రాం నాగమణి గారింటి వద్దే చేశాం .విజ్జి నన్ను అక్కడ దింపింది .లింక్ కుదరక ఒక అరగంట ఆలస్యం గా అంటే పన్నెండున్నర కు ప్రారంభమైంది .గంటన్నర అంటే మధ్యాహ్నం రెండుకు పూర్తి అయింది .’’ ఊసుల్లో ఉయ్యూరు’’ గురించి మాట్లాడాను .

రేదియోలో పూర్తీ ప్రసంగం

                                                            ఊసుల్లో ఉయ్యూరు

            నేను ముందుగా నా పరిచయం చేసుకొన్నాను .ఉయ్యూరు ప్రాముఖ్యాన్ని ,అది బందరు ,బెజవాడ మద్య ఉందని చెరకు వరి ,కంద తమల పాకు ,పసుపు ,మొదలైన పంటలకు కేంద్రమని ,ఆసియా లోనే అతి పెద్ద షుగర్ ఫాక్టరి ఇక్కడ ఉందని ,ఇక్కడి పంచదార చాలా నాణ్యమైనది గా భావిస్తారని ,మొదలు పెట్టాను .గత యాభై ఏళ్లుగా సాహితీ రంగం లో ఉన్నానని .నా చదువు ఉయ్యూరు విజయ వాడ లలో సాగిందని రాజ మాండ్రి లో బి.ఎడ్ .పూర్తి చేశానని ,కృష్ణా జిల్లా పరిషద్ లో ఇరవై రెండేళ్లు ఫిజికల్ సైన్స్ టీచర్ గా పని చేసి ఆ తర్వాతా పద కొండే ళ్ళు  ప్రధానో పాద్యాయుడి గా చేసి 1998 జూన్ లో పదవీ విరమణ చేశానని చెప్పాను .’’విశ్వం లో ఉన్న తెలుగు వారి గుండె చప్పుళ్ళు విని పిస్తున్న టోరీ కి వందనం ,అభి వందనం అని ,శ్రోతలకు అభినందనం అన్నాను ‘’టోరి లో టి అనేది టెలివిజన్ అని మీరు భావిస్తే ‘’తెలుగు ‘’ని నేను భావిస్తానని ,కనుక తెలుగుకు చేస్తున్న సేవ గా టోరి  ని అభినదిస్తున్నానని అన్నాను .

                        ఉయ్యూరు ఊసులు ఎలా మొద లైనాయో చెప్పాను .మా ఊళ్ళో అన్నీ తెలిసిన వారు చాలా మంది ఉన్నారని వారిని గుర్తుంచు కోవటం కోసం మా తమ్ముడు కృష్ణ మోహన్ తో ముందు రాయిన్చానని ,ఆ తర్వాతా వాటిని పుస్తక రూపం లో తెచ్చి మా అబ్బాయి రమణ వివాహ రిసెప్షన్ లో ఏం .ఎల్.సి రాజేంద్ర ప్రసాద్ తో ఆవిష్కరింప జేశామని చెప్పాను ‘’.సరస భారతి’’ అనే సాహిత్య సాంస్కృతిక సంస్థ ను ఉయ్యూరు లో సుమారు మూడు ఏళ్ళ క్రితం ప్రారంభించి ప్రతి నేలా ఒక కార్య క్రమం చేస్తూ , ప్రతి ఏడూ ఉగాది కి కవి సమ్మె లనాలు నిర్వహిస్తున్నామని ,వాటిని పుస్తక రూపం లో తెచ్చి అంద జేస్తున్నామని ,ఇప్పటికి సరసభారతి తొమ్మిది ప్రచురణలను తెచ్చిందని అందులో నేను నాలుగు పుస్తకాలు –ఆంద్ర వేద శాస్త్ర విద్యాలన్కారులు ,జన వేమన ,దర్శనీయ దేవాలయాలు ,శ్రీ హనుమత్ కదానిది రాశానని చెప్పాను .ఉగాది పురస్కారాలను మా తలి దండ్రులు గబ్బిట భావానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి గార్ల పేరిట అంద జేస్తున్నామని తెలియ జేశాను .మా ఊరి వాడు కొలచల సీతా రామయ్య రష్యాలో పేరు మోసిన శాస్త్ర వేత్త అని ,సూరి భగవంతం నెహ్రు గారికి సైంటిఫిక్ అడ్వైజర్ అని గుర్తు చేశాను .అలాగే ఆరిక పూడి ప్రేమ చాంద్ ఎన్నో దేశాలకు ఆర్ధిక సలహా దారులని చెప్పను .

         మాకు రెండు బ్ల్లాగులున్నాయని వాటి వివరాలు చెప్పాను .అవి బాగా ప్రాచుర్యం పొందాయని వివ రించాను .నేను నాకు జ్ఞాపకం ఉన్న మా ఉయ్యూరు విషయాలను ‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’అనే పేర ‘’ నెట్లో’’ రాస్తున్నానని  ఇప్పటికి ముప్ఫై  రెండు ఎపిసోడులు రాశానని అన్నాను .ఇటీవల అందరికి తాము పుట్టి ,పెరిగిన గ్రామాలను గుర్తుకు చేసుకోవటం ,వాటికి సేవ చేయటం జరుగు తోందని ఆంధ్రజ్యోతి దిన పత్రిక లో ‘’మా ఊరు  ‘’అనే శీర్షిక లో ప్రముఖుల గ్రామాల విశేషాలను రాస్తున్నారని ,అలాగే ‘’ఉయ్యూరు ఊసులు ‘’శీర్షిక తో ఈనాడు దిన పత్రిక కృష్ణా జిల్లా ఎడిషన్ లో ఉయ్యూరు వార్తలనుప్రచురించటం గమనింప దాగిన విషయమని ,దాని ప్రభావం అంతగా ఉందని చెప్పాను .

          ఊసులు అంటే కబుర్లు ,లేక జ్ఞాపకాల దొంతరలు అని వాటికీ సాహిత్య గౌరవం కల్పించామని,అందరు గొప్ప వారే కానవసరం లేదని సంఘటనలు ,ప్రభావాలు ఆత్మీయతలు గుర్తు చేసుకోవటమే నని అన్నాను . మా ఊసుల్ని చదివి ప్రముఖ క ధకులు కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ ,విహారి అమెరికా లోని ప్రేమ్చంద్ ,గోపాల కృష్ణ గార్లు (వీరిద్దరూ ఉయ్యూరు వారే )మెచ్చారని మొదటి ఇద్దరూ ఇలాంటి ప్రయత్నం తామూ చేద్దామని ఆలోచిస్తున్నామని చెప్పారని చెప్పాను .ఆ తర్వాతా నా మొదటి ఎపిసోడ్ ‘’అమ్మ బోణీ –నాన్న కాణీ ‘’ తో ప్రారంభించాను .అమ్మ బోణీ చేస్తే కూరగాయలన్నీ అమ్ముడు అవుతాయని ముందు మా ఇంటికి వచ్చే వారని కొన్నా కొనక పోయిన బుట్ట మీద చేయి వేయించే వారని ,అలానే నాన్న కానీ డబ్బు ఇచ్చినా ఊరంతా బాగా డబ్బులు లభిస్తాయని వేద పండితులు ,కూచి పూడి భాగవతులు మొదటిగా మా ఇంటికి వచ్చి నాన్న దగ్గర డబ్బులు తీసుకొనే వారని చెప్పాను .ఆ తర్వాతా రవీంద్రుడు రాసిన ‘’కాబూలి వాలా ‘’ఆకారం లో ఉండే అత్తరు సాహేబు గారు ఉండే వాడని ఆయన అత్తర్లు సేన్ టు  మందార నూనె సురమా అగరు వత్తులు అమ్ముతూ మా ఇంటికి వచ్చే వాడని చూడ టానికి భయంకరం గా ఉండే వాడని  మనిషి మంచి వాడని ఆయన్ను ‘’మహాత్తర్ సాహెబ్ ‘’పేరుతో రాశానని చెప్పాను .నాకు రోజుకు కనీసం పది సార్లైనా ‘’అవు –పులి ‘’కధ చెప్పి నిద్ర పోయే ముందు మళ్ళీ చెప్పి నన్ను నిద్ర పుచ్చిన చిన్న మూతి ఉండే మా పాపాయి పిన్ని గురించి ‘’పాపాయి పిన్ని అనే బుల్లి మూతి పిన్ని ‘’రాశానని చెప్పాను .మా ఇళ్లకు ఇంజినీర్ గా సలహాలకు చాణక్యుడిగా ఉండే ‘’కొలచల శ్రీ రామ మూర్తి మామయ్యను కొలతల మామయ్యా గా రాశానని చెప్పాను .మా మామయ్యా గారింట్లో వేసవి కాలం లో వచ్చ్చే తద్దినాలను ‘’మామిడి పల్ల  తద్దినాలు ‘’అనే వాళ్లమని ,తిన్నన్ని  మామిడి పళ్ళు వేసే వారని విస్తళ్ళ పక్క అవి చిన్న గుట్టలుగా ఉండేవని ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు అయిదు రోజులు ,ఒడుగులు నాలుగు రోజులు జరిగే వని  ఊరిలో బంధువు లందరికి రెండు పూటలా భోజనాలని వంట పూర్తీ కా గానే ఇంటింటికీ వెళ్లి’’ భోజనాలు- సిద్ధం రండి ‘’అని వెళ్లి చెప్పే ఆచారం ఉండేదిఎవరి మంచినీళ చెంబు వాళ్ళు తీసుకొని వెళ్ళే వారని గుర్తు చేశాను .లక్ష్మి అనే ఆమె ఫోన్ చేసి’’ చాలా మంచి జ్ఞాపకాలు’’అని అభినందించారు .ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళు గురించి, అంతరించి పోయిన చేతి వృత్తుల గురించి ,వర్షం పడుతున్నా ,తుఫాను వచ్చినా రోజు రాత్రి ఎనిమిది గంటలకు శివాలయానికి వెళ్లి దేవుని దర్శనం చేసుకొనే చంద్ర మౌళి ,సర్వేశ్వర రావు గార్ల్ గురించి ఉయ్యుర్లో యే మంచి పని కైనా ముందుండే మా నా న్న ,మామయ్యా ,చంద్ర శేఖర రావు ,సదాశివ రావు గార్ల గురించి ,మా గృహ వైద్య నారాయణులు అని మా డాక్టర్ల గురించి  ,దసరా ల్లో ఇంటింటికీ తిరిగి ‘’అయ్య వారలకు చాలు అయిదు వరహాలు ‘’అంటూ పిల్లలతో వచ్చే మేష్టర్ల గురించి ,ఆప్యాయతలు ,ఆదరాభిమానాలు గురించి ,గరిక పర్తి కోటయ్య దేవర అనే ప్రముఖ సంగీత విద్వాంసుడు హైదరాబాద్ నవాబును సంగీతం తో మెప్పించి ఆస్థాన విద్వాంసుడై ఆ తర్వాతా బందరు వచ్చి సంగీత విద్యాలయం నెలకొల్పి ఎందరికో ఉచితం గా సంగీతం నేర్పించి భోజనాలు కూడా ఏర్పరచిన విషయం చెప్పాను .ఆయన కుమార్తె ఉయ్యూరు లో ఇంటింటికీ వెళ్లి సంగీతం నేర్పేదని మా అక్కయ్యలిద్దరు ఆమె వద్ద నేర్చుకోన్నారని జ్ఞాపకాల దొంతర ను దిన్చేశాను . ‘’ అమెరికా ఊసులు ‘’అని కూడా మొదలు పెట్టి రాస్తున్నానని అందులో నుంచి కూడా రెండు ఎపిసోడులను అమెరికా ప్రెసిడెంట్ పియర్స్ గురించి చెప్పా ను ,ఆనాటి అమెరికా జాతీయ కవి వాల్ట్ విట్మన్ రాసిన ‘’లీవెస్ ఆఫ్ గ్రాస్ ‘’అవిత ను ఎమర్సన్ మెచ్చిన విధానాన్ని ,తోరోగారు  గాంధీ గారికి గురువైన తీరు, శ్రీ శ్రీ కి ‘’అగ్గి పుల్లా ,సబ్బు బిల్లా కాదేది కవిత కనర్హం ‘’అని నేర్పింది విట్మన్  అని ఫ్రాంక్లిన్ గారు లింకన్ కొడుకు చని పోతే రాసిన ఉత్తరం మెమొరబుల్ లెటర్ గా ఉందని చెప్పాను ..టోరీ యువకులకు పిల్లలకు తగిన ప్రాతి నిధ్యం కల్పించాలని నాకు ఇంతటి మహత్తర ఆవ కాశం ఇచ్చి నందుకు కృతజ్ఞతలు తెలియ జేశాను .ఇదీ టోరీ భేరీ కధా ,కమామీషు              

          నిన్న అంటే పదిహేడవ తేదీ ‘’ఫాదర్స్ డే ‘’.మా అమ్మాయి విజ్జి ‘’హాపీలు ‘’చెప్పి హల్వా చేసి అందరికి పెట్టి డే ని మరింత మదురం చేసింది . 

                   ఈ వారం లో చదివిన ముఖ్య పుస్తకాలు –jim bowie ,brante’s jane eyre ,laura ignal wilder ,sylvia erlie ,franklin pierse ,the greatest minda and ideas of all times ,a view of the ocean ,wyatt earp ,malcomx ,ruben blades ,the cherokees ,roger williams ,the conquest of alexander the great ,tortured noble tolstoi ,

             మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18-6-12 –కాంప్—అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

1 Response to అమెరికా డైరీ –టోరీ భేరీ వారం

  1. Ravi says:

    నమస్కారం దుర్గాప్రసాద్ గారు , నేను మీ కృష్ణాజిల్లా వాడినే . నాది మా నాన్నగారిది అంగలూరు గుడివాడ దగ్గర ,అమ్మగారిది ముదినేపల్లి గుడివాడ దగ్గర .నేను చార్లోట్టే లోనే వుంటునాను.మీ బ్లాగ్
    చదువుతున్నా. చాల బాగా రాస్తున్నారు . ధన్యవాదములు
    రవి తిపిర్నేని

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.