సిద్ధ యోగి పుంగవులు –12 రాజ యోగి –దక్షిణా మూర్తి పరమ హంస స్వామి

    సిద్ధ యోగి పుంగవులు –12

                                                           రాజ యోగి –దక్షిణా మూర్తి పరమ హంస స్వామి

 ఒక మంగయ్య పరమ హంస గా ,రాజ యోగి గా మారటం అమిత ఆశ్చర్యం   కలిగించినా, అది నిజమే .అదే ఇప్పుడు మనం తెలుసుకొనే విషయమ .

    మంగయ్య గారు న్యాయ వాది అయిన సూర్య నారాయణ శాస్త్రి ,రత్నాలమ్మ దంపతులకు 9-10-1872 నాడు విజయ నగరం దగ్గర కూకల మెట్ట లో జన్మించారు .అయిదవ ఏట ఒక సిద్ధుడు తారస పడితే దక్షిణా మూర్తి మంత్రం కావాలని అడిగారు .ఆయన బలవంతం గా హయగ్రీవ మంత్రం ఇచ్చి వెళ్లి పోయాడు .దానితో మంచి వాక్సుద్ధి కలిగింది .ఎప్పుడూ ఊరవతల గుట్టల పై ఏకాంతం గా కూర్చునే వాడు .ఒక రోజు ఎవరో తమ నగ ఇంటి దగ్గర పోయింది అని ఆయనకు చెప్పారు .దానికి ఆయన కాసేపటికి ఆ నగ ఇక్కడికే వస్తుంది అన్నాడు మంగయ్య .ఇంతలో ఒక కాకి ఆ నగను తీసుకొని వచ్చి చెట్టు మీద నుంచి కిందికి జార విడచింది .ఊరంతా మంగయ్యమహత్యం గురించి పాకి పోయింది .ఎనిమిదో ఏట ఉపనయనం జరిగి ,పిన తండ్రి వెంకన్న పంతులు వద్ద సంస్కృతం ఆంధ్రం ,ఆంగ్లం నేర్చాడు .ఒక సారి బయటికి వెడితే ఒక గుళిక వచ్చి ఆయన పై పడింది .దానిలోని పదార్ధాన్ని ఒంటికి పూసు కొని ,ఆ కాయను బొడ్లో దాచుకొన్నాడు .దాన్ని గురించి ఆశువు గా రెండు శ్లోకాలు చెప్పాడు .విజయనగరం లో ఉన్నత పాత శాల  చదువు పూర్తీ చేసి ,తండ్రి వద్ద శైవ మంత్రాలను ఉపదేశం పొందాడు .

                     పదహారవ ఏట పెళ్లైంది .రైల్వే లో పని చేసే ఒకాయన ‘’రాజ యోగం ‘’క్షున్నం గా నేర్పాడు .ఆ యోగ ప్రభావాల్ని చూపించ మని  స్నేహితులు కోరారు .అప్పుడు ఒక బండి వస్తోంది .దమ్ముంటే దాన్ని వెనక్కి మరల్చమన్నారు .అనేక సార్లు దాన్ని వెనక్కి ముందుకు నడి పించి తన యోగ శక్తి ని నిరూపించాడు .కొంత కాలం తర్వాతా బాలానంద పరమ హంస అనే పేరుగల సిద్దేశ్వర బ్రహ్మ చారి అనే ఉత్తర దేశేయుని వద్ద రాజ ,హత యోగ రహస్యాలు ఆకలింపు చేసుకొన్నాడు .మద్రాస క్రిస్టియన్ కాలేజి లో లెక్కల్లో బి.యే.లో చేరాడు .ఒక డిబేటింగ్ లో ఇంగ్లీష వాడైన  గణిత ఉపన్యాసకుడు’’ సైకాలజీ లో ఆంగ్లేయులే ప్రపంచం లో నంబర్ వన్’’అని వాదిస్తే ,లెక్కలు వదిలేసి వేదాంత శాస్త్రాన్ని ఎంచుకొన్నాడు .బాబాయి వెంకు పంతులు రాసిన సంస్కృత కావ్యం లోని ‘’ఇరావతీ ఘట్టాన్ని పేరుతో ఉన్న పరమార్ధాన్ని సమర్ధించి సంస్కృత అధ్యాపకులైన వేదం వెంకట రాయ శాస్త్రి గారి అభిమానం పొందాడు .శిష్యుడైనాడు .గురు శిష్యు లిద్దరూ శాస్త్ర కావ్య గోష్టి నిరంతరం జరిపే వారు .ఒక సారి ప్రయోగం కోసం ఇద్దరు గంజాయి పీల్చారు .గురువు దిమ్మ తిరిగి పడి  పోతే శిష్యుడు నిమ్మ కాయ నీళ్ళు తాగించి పైత్యం పోగొట్టాడు .ఇద్దరు శకుంతల నాటకం చూడ టానికి వెళ్లి శకుంతలకు దుష్యంతుడు చేసిన దానికి అభ్యంతరం తెలిపి చూడ కుండా తిరిగి వచ్చారు .బి.యే.ఆయె సరికి మంగయ్య తర్క శక్తి ఎదురు లేకుండా ఉంది .

           నాడీ  శుద్ధి ,కుంభక ప్రాణాయామం సాధిస్తూ ఒంటి పూట భోజనం చేస్తుంటే క్షయ రోగం పట్టు కుంది .తండ్రి మహా విద్య దీక్ష పూని తగ్గించారు .కొడుక్కి మేధా దక్షిణా మూర్తి మంత్రం నేర్పారు .పర్లాకిమిడి లో పోలిస్ హెడ్ క్లార్క్ గా పని చేశాడు. ఉద్యోగం వదిలి కురుపాం రాజు వీర భద్ర రాజుకు కార్య దర్శి గా కొంత కాలం పని చేశాడు .ఒక సిద్ధుడు శ్రీ స్వప్నాన్జనేయ ,వీర దక్షిణా మూర్తి మంత్రాలను నేర్పి ,మంగయ్య పూర్వ జన్మ విశేషాలు తెల్పాడు ..

         మంగయ్య తన భార్య ,పిల్లలను మామ గారింట విడిచి మద్రాస వెళ్లి ఎల్ .టి.ట్రైనింగ్ లో చేరారు .ఈయన రాసిన ఆంగ్ల రచనలు చూసి ‘’ఈరాక్ ద్రు’’ అనే దొర గుండెలు బాదుకొన్నాడు .నిజం రాష్ట్ర విద్యా శాఖ లో ఉపాధ్యాయుడిగా చేరారు .ఆయన ప్రతిభ గుర్తించిన విద్యాది కారి బి .ఎడ్  .జిల్లా కేంద్రఉన్నతవిద్యాలయానికి హెడ్ మాస్టర్ ను చేశాడు .

             నిజామా బాద్ లో పని చేస్తున్నప్పుడు గోల్లా పిన్ని మల్లికార్జున శాస్త్రి గారు వచ్చి ‘’సమాధి భేదాలు ‘’వీరి వద్ద గ్రహించారు .రిగ్వేద ,యజుర్వేద ములను గురుముఖతః నేర్చారు .రామ స్వామి అయ్యర్ ‘’వాసుదేవ తత్త్వం ‘’ఉపదేశించారు .దానితో శ్రీకృష్ణ సాక్షాత్కారం పొందారు .హైదరాబాద్ లో గౌలిగూడా లో కాపురం ఉన్నారు .ఇద్దరు స్నేహితులకు వేరు చోట్ల కన్పించి వారిని ఆశ్చర్య పరచారు .హరిపత్ అనే దంపతులు శివ జపం చేస్తుంటే మంగయ్య గారు అనుకో కుండా ప్రత్యక్ష మై రుద్రాభి షేకం చేసి మై మర పించారు .ఒక శిష్యుడు ఒక సారి వచ్చి చూస్తె మంగయ్య గారు అగ్ని జ్వాలల మద్య కన్పించారు .భయ పడి పారి పోతుంటే మళ్ళీ యదా స్తితి లో కన్పించారు .పశు వైద్య శాఖ లో పని చేసే హనుమంత రావు కు ఒక శివలింగం ఇచ్చి ఆ తరువాత వరుసగా పదకొండు ఇచ్చారు .గృహస్తులైనా మంగయ్య గారు శ్రీరామ ,శ్రీ కృష్ణుల వలె బ్రహ్మ చారులు .విదేశీ డాక్టర్లే ఈ విషయమ  పరి శోధించి నిర్ధారణ చేశారు .

          పెద్ద కొడుకు పెళ్లి ముహూర్తాన్ని తానే పెట్టి శ్రీ కాకుళం జిల్లా రామ తీర్ధం దేవాలయం లో పెండ్లి చేయాలని నిశ్చయించారు .కాని అక్కడి పంచాంగ కర్తలు పండితులు  ఆ ముహూర్తానికి కేతు ,కుజవే  ధలున్నాయని ,ఆ పెళ్లి జరగదని చెప్పారు పెళ్లి జరుగు తుందని మంగయ్య వాదించారు ..దేవాలయానికి పెళ్లి కొడుకు ను తీసుకొని వెళ్తుంటే ఒక పాము అడ్డం వచ్చింది .వెళ్ళ టానికి వీల్లేదన్నారు పండితులు .ఇది కేతు వేద .అని చెప్పారు ఈయన .పాము మాయమై పోయింది .పెళ్లి పీట ల మీద పెళ్లి కొడుకును ,పెళ్లి కూతురును కూర్చో బెట్టి ముహూర్తం కోసం పండితులు గడియారాలను చూస్తున్నారు .ఒకళ్ళ టైం నాలుగు అని .ఒకల్ల ది ఏడు ,మరొకరిది ఆగి పోయిందని చెప్పారు .అదే కుజ వేద అని చెప్పి అక్షంతలు తాను తీసుకొని ,అందరికి ఇప్పించి అనుకొన్న ముహూర్తం రాగానే తాను వేసి అందరితో అక్షతలను వేయించారు .’’ఇప్పుడు గడియారాలు చూడండి ‘’అన్నారు .అందరి గడియారాలు అనుకొన్న ముహూర్త సమయాన్నే చూపించాయి .అందరు వారి మహా శక్తికి, అఘటన ఘటనా సమర్ధత కు నివ్వెర పోయారు .

            దేవీ దాసు అనే వాడికి యే.బి.సి.డి.లు కూడా రావు .అతని తో కొన్ని గంటల సేపు ఆంగ్లం లో గంభీర మైన ఉపన్యాసం ఇప్పించారు మంగయ్య గారు .తనకు షోడశీ మంత్రాన్ని దేవుజీ మహారాజే వచ్చి ఇస్తారని ముందే చెప్పారు .అందరు గణన్జయ మహా రాజు గారి తో ఇప్పించే ఏర్పాట్లు చేశారు .గణన్జయుడు రాలేదు .దేవుజీ వచ్చి మంత్ర దీక్ష నిచ్చారు .మంగయ్య గారి సంకల్ప బలం అంత గొప్పది .

      మంగయ్య గారి వైదుష్యం నిరుప మానమైంది .ఆంగ్లం లో అయిదు పద్య కావ్యాలు ,పదహారు ఆధ్యాత్మ గ్రంధాలు రాశారు .సంస్కృతం లో కామ ప్రబంధం ,దక్షిణ గీత ,సౌభాగ్య రత్నాకరం ,అద్వైత పారిజాతం ,వ్యావహారిక దర్పణం వంటి అలోకిక గ్రంధాలు రాశారు .ఇంకా యే న్నో స్తుతి స్తోత్రాలు రాశారు .ధర్మాష్టకం వంటి అష్టకాలు రాశారు .కాల చక్రాన్ని దాని నడకను ప్రత్యక్షం గా చూడాలని ఒక శిష్యుడు కోరితే ప్రత్యక్షం గా చూపించారు .గంటకు వెయ్యి సార్లువైఖరీ వాక్కు లో  జపించే  మంత్రాన్ని మంగయ్య గారు పశ్యంతీ వాక్కు తో ,మనో వేగం తో ఒకే నిమిషం లో చేసే వారు .ఒక సారి హైదరాబాద్ లో  మేడ దిగి కిందికి వస్తుంటే ఒక కుక్క వచ్చింది .దానికి ఆసనం వేయించి కూర్చో బెట్టి ,అది తన భాష లో తన జన్మ వృత్తాంతాన్ని చెబుతుంటే వెంకయ్య గారు వైఖరీ వాక్కు లో అనువాదం చేసి జగన్నాయకులు అనే ఆయనతో రాయించారు .అంటే ఆయన కు సమస్త జీవ జాల జన్మ వృత్తాంతాలు తెలుసునన్న మాట .

             మంగయ్య గారి శిష్యులైన  పెద్దలలో జర్మన్ విద్వాంసుడు స్పర్జ్ ,నిజాం కాలేజి ప్రిన్సిపాల్ బర్నేట్ ,విద్యా మంత్రి నవాబ్ ఆజమ్యార్జంగ్ ,ఇంజినీరింగ్ మంత్రి మెహిదీ నవాజ్ జంగ్ ,గణితా చార్యుడు సయ్యద్ సిరజుల్ హాసన్ మొదలైన వారెందరో జాతి మత ,కుల భేదాలు లేకుండా అభిమానులు ,శిష్యులు అయారు .మంగయ్య గారికి ఒక విచిత్ర మైన అలవాటు ఉండేది .ఎప్పుడూ చేతిలో అక్షతలనుంచుకొని ,తన నెత్తిన తానే వేసుకొంతుందే వారు .నడుస్తున్నా ,కూర్చున్నా ,తమ లో తాము మాట్లాడుకొంతుందే వారు .మంగయ్య గారు రాసిన ఒక ఆంగ్ల పుస్తకం పీఠిక రాసిన ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయం వారు ‘’ఇందు లోని అభి ప్రాయాలను గ్రహించ టానికి 300 ళ ఏళ్ళు పడుతుంది ‘’అని రాశారు

                       బాల బ్రహ్మ చారి అని పేరొందిన చిన్మయా నంద స్వామి మంగయ్య గారికి సన్యాస దీక్ష నిచ్చి ,’’దక్షిణా మూర్తి పరమ హంస స్వామి ‘’అని ఆశ్రమ నామకారణం చేశారు .ధవళేశ్వరం లో ఆశ్రమం ఏర్పాటు చేసుకొన్నారు .అది మంచి ఫలితం ఇవ్వలేదు .విశాఖ వెళ్లి ‘’లలితాశ్రమం ‘’ఏర్పాటు చేసి లలితా దేవిని ప్రతిష్టించారు .ఆ ప్రాంతానికి ‘’లలితా నగరం ‘’పేరు వచ్చింది .పరమ హంసలు 1954 లో సిద్ధి పొందారు .వీరి శిష్యులు వాల్వేకర్ ఆశ్రమాది పతి అయి అనేక అభివృద్ధి కార్యాలు నిర్వహించి1995 లో సిద్ధి పొందగా గురువు గారి సమాధి ప్రక్కనే సమాధి చేశారు .ఇప్పుడు లలితాశ్రమాన్ని కుర్తాళం పీతాది పతి శ్రీ శివ చిదానంద భారతీ స్వామి (పూర్వాశ్రమం లో ప్రసాద రాయ కుల పతి గారు )28-6-1998   న దత్తత తీసుకొని శ్రీ రామా నంద భారతీ స్వామి వారికి ఆశ్రమ బాధ్యతలను అప్ప గించారు .   సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-6-12.—కాంప్—అమెరికా

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

1 Response to సిద్ధ యోగి పుంగవులు –12 రాజ యోగి –దక్షిణా మూర్తి పరమ హంస స్వామి

  1. విశాఖపట్నం లలితనగర్ లోని లలితగుడి లలితాశ్రమము ఇది ఖచ్చితముగా చూడ తగ్గది.ఈ ఆశ్రమములో పూజలు,అమ్మ ఎంతో దైవి భావన వేదజల్లుతున్నట్లుగా వుంటుంది.సంక్రాంతికి అన్నాభిషేకం చేస్తారు కన్నులు చాలవు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.